
మెన్స్ హాకీ ఆసియాకప్‌లో టీమిండియా పురుషుల హాకీ జట్టును దురదృష్టం వెంటాడింది. గోల్స్ తేడా కారణంగా టీమిండియా ఫైనల్ చేరకుండానే సూపర్-4లోనే నిష్క్రమించింది. సూపర్-4లో భాగంగా మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 4-4తో డ్రా చేసుకుంది. దీంతో భారత్, కొరియా ఖాతాలో చెరో ఐదు పాయింట్లు చేరాయి. అయితే జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మలేషియా విజయం సాధించడం భారత్ అవకాశాలను దెబ్బ తీసింది.
జపాన్‌పై విజయంతో మలేషియా ఖాతాలోనూ ఐదు పాయింట్లు చేరాయి. మూడు జట్లు ఐదు పాయింట్లతో సూపర్-4ను ముగించినప్పటికి మెరుగైన గోల్స్ ఉన్న కారణంగా మలేషియా, కొరియాలు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక మూడో స్థానం కోసం భారత్.. జపాన్‌తో జూన్ 1న తలపడనుంది. అదే రోజు మలేషియా, దక్షిణ కొరియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
A scintillating game ends in a DRAW!! 💙
— Hockey India (@TheHockeyIndia) May 31, 2022
IND 4:4 KOR #IndiaKaGame #HockeyIndia #HeroAsiaCup #MatchDay #INDvsKOR @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/eor7QdAZuB