హాకీ ఆసియాకప్ 2022లో ఫైనల్ చేరడంలో విఫలమైన టీమిండియా పరుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక పోరులో భాగంగా బుధవారం జపాన్‌తో జరిగిన హై వోల్టేజీ మ్యాచ్‌లో 1-0తో భారత్ జయకేతనం ఎగురవేసింది. టీమిండియా తరపున ఆట ఏడో నిమిషంలో రాజ్‌కుమార్ పాల్ గోల్ చేశాడు. ఆ తర్వాత మూడు క్వార్టర్ల పాటు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. జపాన్ పలుమార్లు గోల్‌పోస్ట్ వైపు దాడులు చేసినప్పటికి టీమిండియా డిఫెన్స్ బలంగా ఉండడంతో నిర్ణీత సమయంలోగా జపాన్ గోల్ చేయడంలో చతికిలపడింది. దీంతో భారత్ ఖాతాలో విజయంతో పాటు కాంస్య పతకం వచ్చి చేరింది.
ఇక మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 4-4తో డ్రా చేసుకోవడంతో ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక హాకీ ఆసియా కప్ విజేతగా దక్షిణ కొరియా నిలిచింది. మలేషియాతో జరిగిన ఫైనల్‌లో 2-1తో విజయం అందుకొని స్వర్ణ పతకం సాధించింది.
చదవండి: బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా
Hockey Asia Cup 2022: టీమిండియా హాకీ జట్టును వెంటాడిన దురదృష్టం
Let us applaud the young Indian Team for their outstanding performance in the Hero Asia Cup 2022, Jakarta, Indonesia for winning a Bronze. 🥉
— Hockey India (@TheHockeyIndia) June 1, 2022
We are proud of this team 💙#IndiaKaGame #HockeyIndia #MatchDay #INDvsJPN @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/ptTFDJo7Y5
Comments
Please login to add a commentAdd a comment