
ఆసియా కప్ హాకీలో తొలి సూపర్ 4 లీగ్ మ్యాచ్‌లో జపాన్‌పై 2-1 తేడాతో భారత హాకీ పురుషుల జట్టు విజయం సాధించింది. పూల్ దశలో జపాన్‌పై ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత్ తరపున మంజీత్, పవన్ రాజ్‌భర్ చెరో గోల్ సాధించారు. ఇక మ్యాచ్ 18వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా జపాన్‌కు ఏకైక గోల్ వచ్చింది.
జపాన్ మొదట దూకుడుగా ఆడింది. మ్యాచ్ ప్రారంభ నిమిషంలోనే జపాన్ పెనాల్టీ కార్నర్ సాధించింది. అయితే పెనాల్టీ కార్నర్‌లో జపాన్ ఎటువంటి గోల్ సాధించలేకపోయింది. అనంతరం భారత్ మ్యాచ్‌పై పట్టుబిగించింది. ఇక భారత్ తన తదుపరి సూపర్ 4 దశ మ్యాచ్‌లో ఆదివారం మలేషియాతో తలపడనుంది.
చదవండి: Carlos Alzaraz: ఫ్రెంచ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల కుర్రాడు .. జొకోవిచ్ తర్వాత
Comments
Please login to add a commentAdd a comment