
జకార్తా: లీగ్ దశలో జపాన్ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంటూ ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీ సూపర్–4 సెమీఫైనల్ లీగ్‌లో భారత్ శుభారంభం చేసింది. 2018 ఆసియా క్రీడల చాంపియన్ జపాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో డిఫెడింగ్ చాంపియన్ భారత్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది.
భారత్ తరఫున మంజీత్ (8వ ని.లో), పవన్ రాజ్‌భర్ (35వ ని.లో) ఒక్కో గోల్ సాధించగా... జపాన్ జట్టుకు టకుమా నివా (18వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. నేడు జరిగే సూపర్–4 రెండో మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment