
రాంచీ: మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీస్‌లో భారత్ 2–0 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. భారత్ తరఫున సలీమా టెటె 11వ నిమిషంలో ఫీల్డ్ గోల్ సాధించగా...19వ నిమిషంలో పెనాల్టీ ద్వారా వైష్ణవి విఠల్ ఫాల్కే గోల్ నమోదు చేసింది. ఆసియా క్రీడల రజతపతక విజేత కొరియా తీవ్రంగా పోరాడినా ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. మరో సెమీస్‌లో జపాన్ 2–1తో చైనాను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో చైనాతో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment