ఆసియా కప్ 5s హాకీ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 2) జరిగిన ఫైనల్లో భారత్ 6-4 గోల్స్ తేడాతో గెలుపొందింది. నిర్ణీత సమయంలో భారత్, పాక్‌లు చెరి 4 గోల్స్ చేయడంతో పెనాల్టీ షూటౌట్స్ ద్వారా ఫలితం తేలింది. షూటౌట్స్‌లో భారత్ రెండు అటెంప్ట్స్‌ను గోల్స్‌గా మలిచి, ఛాంపియన్‌గా అవతరించింది. 5s ఫార్మాట్‌లో భారత్ పాక్‌ను ఓడించడం మూడు సందర్భాల్లో ఇదే మొదటిసారి.
India beat Pakistan in Men's Hockey 5s Asia Cup Final. pic.twitter.com/VyKC6aG06S
— Azhutozh ⚕ (@azhutozh) September 2, 2023
సెకెండాఫ్‌లో 2-4 గోల్స్ తేడాతో వెనుకంజలో ఉండిన భారత్.. అనూహ్యంగా పుంజుకుని, షూటౌట్స్ వరకు వెళ్లి విజేతగా నిలిచింది. షూటౌట్స్‌లో పాక్ రెండు ప్రయత్నాల్లో విఫలం కాగా.. గుర్జోత్ సింగ్, మణిందర్ సింగ్‌లు తలో గోల్ చేసి, భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అంతకుముందు భారత్ 2-4 గోల్స్‌తో వెనుకపడి ఉన్నప్పుడు మొహమ్మద్ రహీల్ 2 గోల్స్ చేసి, మ్యాచ్ డ్రా అయ్యేందుకు దోహదపడ్డాడు.
Maninder Singh scores the second goal in shoot-out as India clinches Hockey 5s Asia Cup title defeating Pakistan.
— Pritish Raj (@befikramusafir) September 2, 2023
Both teams were 4-4 tied in normal time before India won the shootout 2-0.#Hockey5sAsiaCup #HockeyIndia pic.twitter.com/SWncUcVxnn
Comments
Please login to add a commentAdd a comment