
Men's Junior Asia Cup Hockey 2023 సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య శనివారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. భారత్ తరఫున శ్రద్ధానంద్ తివారి (24వ ని.లో), పాకిస్తాన్ తరఫున అలీ బషారత్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
ఈ టోర్నీలో వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్, పాకిస్తాన్ జట్లకు ఇదే తొలి ‘డ్రా’ కావడం గమనార్హం. మూడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత భారత్, పాక్ జట్లు 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌తో భారత్; జపాన్‌తో పాకిస్తాన్ తలపడతాయి. నేడు భారత్, పాక్ తమ మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.