జపాన్‌లో జరిగిన మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ ఫైనల్లో సంచలనం నమోదైంది. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు ఫోర్ టైమ్ ఛాంపియన్స్ దక్షిణ కొరియాకు షాకిచ్చారు. తుది పోరులో టీమిండియా.. 2-1 గోల్స్ తేడాతో సౌత్ కొరియాను ఖంగుతినిపించి, తొలిసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
The winning moments ✨️
— Hockey India (@TheHockeyIndia) June 11, 2023
Here a glimpse of the winning moments after the victory in the Final of Women's Junior Asia Cup 2023.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 pic.twitter.com/ZJSwVI80iH
అన్నూ 22వ నిమిషంలో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించగా.. ఆతర్వాత సౌత్ కొరియా తరఫున 25వ నిమిషంలో పార్క్ సియో ఇయోన్ గోల్ చేసి స్కోర్‌ను సమం చేసింది. అనంతరం రెండో అర్ధభాగం 41వ నిమిషంలో నీలమ్ డ్రాగ్ ఫ్లిక్ ద్వారా గోల్ చేసి మరోసారి భారత్‌కు ఆధిక్యం అందించింది. దీని తర్వాత సౌత్ కొరియా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, భారత అమ్మాయిలు అద్భుతమైన డిఫెన్స్‌తో వారిని అడ్డుకున్నారు.
🇮🇳 2-1 🇰🇷
— The Bridge (@the_bridge_in) June 11, 2023
Our girls create HISTORY💥
India defeats 4-time champions South Korea in an intriguing final to lift its first-ever Women's Junior Hockey Asia Cup title!#Hockey 🏑| #AsiaCup2023 pic.twitter.com/bSpdo2VB5N
రెండో అర్ధభాగం చివరి నిమిషం వరకు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అయినా సౌత్ కొరియా అమ్మాయిలకు ఫలితం దక్కలేదు. దీంతో జూనియర్ విభాగంలో భారత్ అమ్మాయిలు తొలిసారి ఆసియా ఛాంపియన్లుగా అవతరించారు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో భారత క్రికెట్ జట్టు ఓడిపోవడంతో దిగాలుగా ఉన్న అభిమానులకు ఈ విజయం ఊరటనిచ్చింది. భారత మహిళల జూనియర్ హాకీ టీమ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..!
Comments
Please login to add a commentAdd a comment