సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ భారీ విజయంతో బోణీ కొట్టింది. చైనీస్ తైపీతో బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా గోల్స్ వర్షం కురిపించి 18–0తో గెలుపొందింది. భారత ఆటగాళ్ల ధాటికి చైనీస్ తైపీ ఆటగాళ్లు చేతులెత్తేశారు. భారత్ తరఫున అరైజీత్ సింగ్ హుండల్ (19వ, 19వ, 30వ, 59వ ని.లో) నాలుగు గోల్స్... అమన్‌దీప్ (38వ, 39వ, 41వ ని.లో) మూడు గోల్స్ సాధించారు.
బాబీ సింగ్ ధామి (10వ, 46వ ని.లో), ఆదిత్య అర్జున్ లలాగే (37వ, 37వ ని.లో), కెప్టెన్ ఉత్తమ్ సింగ్ (10వ, 59వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. శ్రద్ధానంద్ తివారి (11వ ని.లో), అంగద్‌బీర్ సింగ్ (37వ ని.లో), అమీర్ అలీ (51వ ని.లో), బాబీ పూవణ్ణ చంద్ర (54వ ని.లో), యోగాంబర్ (60వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. ఈ టోర్నీ విజేత జూనియర్ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment