
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ జట్టు చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రా ముగించింది. జకార్తా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అఖరి నిమిషం వరకు భారత్ పాక్‌పై ఆదిపత్యం చెలాయించింది. ఫస్ట్ హాఫ్ 8వ నిమిషంలో కార్తీ సెల్వం తొలి గోల్ చేసి భారత్‌ను అధిక్యంలోకి తీసుకువెళ్లాడు.
అయితే చివరి క్వార్టర్ అఖరి నిమిషంలో పాక్ ఆటగాడు అబ్దుల్ రానా గోల్ సాధించి మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు. మరోవైపు మలేషియా, దక్షిణ కొరియా తమ తొలి మ్యాచ్‌ల్లో ఒమన్, బంగ్లాదేశ్‌లపై విజమం సాధించాయి. మలేషియా 7-0తో ఒమన్‌ను ఓడించగా, కొరియా 6-1తో బంగ్లాదేశ్‌పై గెలిపొందింది. ఇక మంగళవారం(మే 24)న జపాన్‌తో భారత్ తలపడనుంది.
చదవండి: Nikhat Zareen: ఇది ప్రారంభం మాత్రమే.. అదే నా లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment