సెమీఫైనల్లో భారత యువ జట్టు
ఆసియాకప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నీ
మస్కట్: ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత జట్టు... శనివారం మూడో మ్యాచ్‌లో 16–0 గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును చిత్తు చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన పోరులో యువభారత్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది.
భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దిల్‌రాజ్ సింగ్ (17వ, 40వ, 45వ, 57వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో చెలరేగగా... రోషన్ కుజుర్ (23వ, 32వ, 42వ నిమిషాల్లో), సౌరభ్ ఆనంద్ కుషా్వహా (20వ, 29వ, 58వ నిమిషాల్లో) చెరో మూడు గోల్స్‌తో అదరగొట్టారు.
అర్ష్ దీప్ సింగ్ (37వ, 44వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... యోగేంబర్ రావత్ (7వ నిమిషంలో), ప్రియోబర్తా (31వ నిమిషంలో), శార్దానంద్ తివారి (39వ నిమిషంలో), అర్జీత్ సింగ్ హుండల్ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలో రావత్ తొలి గోల్ సాధించి జట్టుకు మంచి ఆరంభం ఇవ్వగా... ఇక అక్కడి నుంచి మనవాళ్లు వరుస గోల్స్‌తో విజృంభించారు.
ప్రత్యర్థి డిఫెన్స్‌ను కకావికలం చేస్తూ గోల్స్ వర్షం కురిపించారు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. నేడు జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‌లో కొరియాతో భారత్ తలపడుతుంది. మంగళవారం సెమీఫైనల్స్ జరగనున్నాయి. గతంలో ఆసియా జూనియర్ హాకీ టోరీ్నలో భారత్ నాలుగు సార్లు విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment