semi-final
-
సెమీస్‌లో మహారాష్ట్ర, కర్ణాటక
వడోదర: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర, కర్ణాటక జట్లు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో పంజాబ్‌పై మహారాష్ట్ర 70 పరుగుల తేడాతో విజయం సాధించగా... బరోడాపై కర్ణాటక 5 పరుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. యువ ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (137 బంతుల్లో 107; 14 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా... అంకిత్ బావ్నె (85 బంతుల్లో 60; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీ చేశాడు. ఆఖర్లో వికెట్ కీపర్ నిఖిల్ (29 బంతుల్లో 52 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకం సాధించడంతో మహారాష్ట్ర మంచి స్కోరు చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (5), సిద్ధేశ్ వీర్ (0), రాహుల్ త్రిపాఠి (15) విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో టీమిండియా పేసర్ అర్‡్షదీప్ సింగ్ 3, నమన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ జట్టు 44.4 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. తాజా సీజన్లో రికార్డు స్కోర్లు తిరగరాసిన పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (14), అభిõÙక్ శర్మ (19) ఎక్కువసేపు నిలవకపోవడంతో పంజాబ్‌కు మెరుగైన ఆరంభం లభించలేదు. అన్మోల్ప్రీత్ సింగ్ (77 బంతుల్లో 48; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా ఫలితం లేకపోయింది. రమణ్‌దీప్ సింగ్ (2), నేహల్ వధేర (6), విఫలమయ్యారు. చివర్లో అర్‡్షదీప్ సింగ్ (39 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేశ్ చౌధరీ 3 వికెట్లు, ప్రదీప్ రెండు వికెట్లు పడగొట్టారు. సెంచరీతో పాటు ఒక వికెట్ తీసిన అర్షిన్ కులకరి్ణకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కర్ణాటకను గెలిపించిన పడిక్కల్ విజయ్ హజారే టోర్నీలో నాలుగుసార్లు టైటిల్ గెలిచిన కర్ణాటక జట్టు... హోరాహోరీగా సాగిన నాలుగో క్వార్టర్ ఫైనల్లో బరోడాను మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. కెప్టన్ మయాంక్ అగర్వాల్ (6) విఫలం కాగా... దేవదత్ పడిక్కల్ (99 బంతుల్లో 102; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. అనీశ్ (64 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీతో మెరిశాడు. బరోడా బౌలర్లలో రాజ్ లింబానీ, అతిత్ సేత్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో తుదికంటా పోరాడిన బరోడా... చివరకు 49.5 ఓవర్లలో 276 పరుగులు చేసింది. ఓపెనర్ శాశ్వత్ రావత్ (126 బంతుల్లో 104; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా... అతిత్ సేత్ (56; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించాడు. కెప్టెన్ కృనాల్ పాండ్యా (30) ఫర్వాలేదనిపించాడు. బరోడా విజయానికి చివరి 5 ఓవర్లలో 44 పరుగులు అవసరం కాగా... ప్రధాన ఆటగాళ్లు క్రీజులో ఉండటంతో విజయం ఖాయమనిపించింది. అయితే టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ కట్టుదిట్టమైన బంతులతో బరోడా బ్యాటర్లను కట్టడి చేశాడు. 47వ ఓవర్లో సెంచరీ హీరో శాశ్వత్ రావత్‌తో పాటు మహేశ్ పిటియా (1)ను ఔట్ చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 12 పరుగులు అవసరం కాగా... బరోడా 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, వాసుకి కౌషిక్, అభిలాశ్, శ్రేయస్ గోపాల్ తలా 2 వికెట్లు పడగొట్టారు. పడిక్కల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆదివారం జరగనున్న క్వార్టర్ ఫైనల్స్‌లో గుజరాత్‌తో హర్యానా, విదర్భతో రాజస్థాన్ తలపడతాయి. -
సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
కౌలాలాంపూర్: కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలనుకున్న భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్–చిరాగ్ జంట సెమీ ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 10–21, 15–21తో కిమ్ వన్ హో–సియో సెయంగ్ జే (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓడింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. గత ఏడాది ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన భారత షట్లర్లు ఈ సారి సెమీస్‌తోనే ఇంటిదారి పట్టారు. ‘గత మూడు మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఈ మ్యాచ్‌ను మెరుగ్గా ఆరంభించలేకపోయాం. ఈ ఫలితం నుంచి పాఠాలు నేర్చుకుంటాం’ అని సాత్విక్ అన్నాడు. తొలి గేమ్‌లో 6–11తో వెనుకబడిన సాత్విక్ జంట ఆ తర్వాత కోలుకోలేకపోయింది. రెండో గేమ్ ఆరంభంలో మంచి ఆటతీరు కనబర్చిన భారత జోడీ 11–8తో ఆధిక్యం చాటినా... చివరి వరకు అదే తీవ్రత కొనసాగించడంలో విఫలమై పరాజయం పాలైంది. -
యూకీ–ఒలివెట్టి జోడీ సంచలనం
ఆక్లాండ్: ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ– 250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సంచలన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 3–6, 6–4, 12–10తో మూడో సీడ్ జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్) జంటను బోల్తా కొట్టించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో 9–10తో యూకీ–ఒలివెట్టి ద్వయం ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే పట్టుదల కోల్పోకుండా ఆడిన యూకీ–ఒలివెట్టి జంట వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో యూకీ–ఒలివెట్టి నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. నేడు జరిగే సెమీఫైనల్లో క్రిస్టియన్ హారిసన్–రాజీవ్ రామ్ (అమెరికా)లతో యూకీ–ఒలివెట్టి తలపడతారు. -
భారత్ 16... తైపీ 0
మస్కట్: ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత జట్టు... శనివారం మూడో మ్యాచ్‌లో 16–0 గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును చిత్తు చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన పోరులో యువభారత్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దిల్‌రాజ్ సింగ్ (17వ, 40వ, 45వ, 57వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో చెలరేగగా... రోషన్ కుజుర్ (23వ, 32వ, 42వ నిమిషాల్లో), సౌరభ్ ఆనంద్ కుషా్వహా (20వ, 29వ, 58వ నిమిషాల్లో) చెరో మూడు గోల్స్‌తో అదరగొట్టారు. అర్ష్ దీప్ సింగ్ (37వ, 44వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... యోగేంబర్ రావత్ (7వ నిమిషంలో), ప్రియోబర్తా (31వ నిమిషంలో), శార్దానంద్ తివారి (39వ నిమిషంలో), అర్జీత్ సింగ్ హుండల్ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలో రావత్ తొలి గోల్ సాధించి జట్టుకు మంచి ఆరంభం ఇవ్వగా... ఇక అక్కడి నుంచి మనవాళ్లు వరుస గోల్స్‌తో విజృంభించారు. ప్రత్యర్థి డిఫెన్స్‌ను కకావికలం చేస్తూ గోల్స్ వర్షం కురిపించారు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. నేడు జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‌లో కొరియాతో భారత్ తలపడుతుంది. మంగళవారం సెమీఫైనల్స్ జరగనున్నాయి. గతంలో ఆసియా జూనియర్ హాకీ టోరీ్నలో భారత్ నాలుగు సార్లు విజేతగా నిలిచింది. -
సెమీస్‌లో అనిరుద్–అర్జున్ ద్వయం
న్యూపోర్ట్ (అమెరికా): హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ లో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అనిరు«ద్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–4, 1–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో క్రిస్టియన్ హారిసన్–వాసిల్ కిర్కోవ్ (అమెరికా) జంటపై గెలిచింది. -
కోకో గాఫ్ తొలిసారి...
పారిస్: పట్టుదలతో పోరాడిన అమెరికా టెన్నిస్ యంగ్‌స్టార్ కోకో గాఫ్ వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ కోకో గాఫ్ 4–6, 6–2, 6–3తో ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీíÙయా)పై గెలిచింది. ఐదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న కోకో గాఫ్ తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించడం విశేషం. 2023 యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన కోకో ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లో నిష్క్రమించింది. జబర్‌తో గంటా 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కోకో ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. 21 విన్నర్స్ కొట్టిన ఆమె నెట్ వద్ద 11 పాయింట్లు గెలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–0, 6–2తో ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై అలవోకగా గెలిచి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 62 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.వైదొలిగిన జొకోవిచ్ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మోకాలి గాయంతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. సెరున్‌డొలో (అర్జెంటీనా)తో 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–1, 5–7, 3–6, 7–5, 6–3తో గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా జొకోవిచ్ జారిపడటంతో అతని మోకాలికి గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగకూడదని నిర్ణయం తీసుకొని టోర్నీ నుంచి వైదొలిగాడు. కొత్త నంబర్‌వన్ సినెర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ఇటలీ స్టార్ యానిక్ సినెర్ కొత్త ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించనున్నాడు. జొకోవిచ్ టోర్నీ నుంచి వైదొలగడం... సినెర్ సెమీఫైనల్ చేరుకోవడంతో ఈ ఇటలీ స్టార్ ఈనెల పదో తేదీన విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్ స్థానాన్ని అందుకుంటాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–2, 6–4, 7–6 (7/3)తో పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలిచి కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. -
సాత్విక్–చిరాగ్ జోరు
కౌలాలంపూర్: గత ఏడాది అద్భుతమైన ఫలితాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కొత్త సీజన్లో కూడా తమ జోరు కొనసాగిస్తోంది. ప్రతిష్టాత్మక మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్–చిరాగ్ 21–11, 21–8తో ప్రపంచ 32వ ర్యాంక్‌లో ఉన్న హి జి టింగ్–రెన్ జియాంగ్ యు (చైనా)లపై విజయం సాధించారు. కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించారు. తొలి గేమ్‌లో వరుసగా ఏడు పాయింట్లు గెలిచిన సాత్విక్–చిరాగ్ అదే ఊపులో గేమ్‌ను దక్కించుకున్నారు. రెండో గేమ్‌లోనూ భారత జంట దూకుడు కొనసాగించింది. స్కోరు 7–3 వద్ద సాత్విక్–చిరాగ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 14–3తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ జంట కాంగ్ మిన్ హైక్–సియో సెయుంగ్ జే (దక్షిణ కొరియా)తో సాత్విక్–చిరాగ్ జంట తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సాత్విక్–చిరాగ్ 3–1తో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో అశి్వని–తనీషా జంట 15–21, 13–21తో రిన్ ఇవనాగ–కీ నకనిషి (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. అశ్విని–తనీషా జోడీకి 8,125 డాలర్ల (రూ. 6 లక్షల 73 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం
ఆద్యంతం నిలకడగా ఆడిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ బోపన్న–ఎబ్డెన్ జోడీ 6–3, 6–2తో ఐదో సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంటను ఓడించింది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు మూడుసార్లు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేశారు. -
సెమీఫైనల్లో రోహన్ బోపన్న జోడీ
ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దోహాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 1–6, 6–4, 11–9తో భారత్‌కే చెందిన సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. సాకేత్–యూకీలకు 12,750 డాలర్ల (రూ. 10 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ATP Belgrade: సెమీ ఫైనల్లో జొకోవిచ్
సొంతగడ్డపై జరుగుతున్న ఏటీపీ 250 టోర్నీ బెల్గ్రేడ్ ఓపెన్‌లో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ దూసుకుపోతున్నాడు. ఈ టోర్నీలో సెర్బియా స్టార్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో జొకోవిచ్ 4–6, 6–3, 6–3 తేడాతో కెక్మనోవిక్ (సెర్బియా)ను ఓడించాడు. తన దేశానికే చెందిన ఆటగాడినుంచి పోటీ ఎదుర్కొని తొలి సెట్ కోల్పోయినా...2 గంటల 18 నిమిషాల ఈ పోరులో చివరకు జొకోవిచ్ తన అనుభవంతో ముందంజ వేశాడు. -
సెమీ ఫైనల్లో రామ్‌కుమార్–బోపన్న
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. సింగిల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. గురువారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/4)తో అలెగ్జాండర్ ఎర్లెర్ (ఆస్ట్రియా)–జిరి వెసెలీ (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా–చెక్ జోడీతో భారత జంటకు హోరాహోరీ పోరు ఎదురైంది. దీంతో రెండు సెట్లలోనూ టైబ్రేక్ తప్పలేదు. మరో భారత జోడీ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం కూడా సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో వీరి ప్రత్యర్థులు గియన్లుకా మగెర్ (ఇటలీ)–ఎమిల్ రుసువూరి (ఫిన్లాండ్) గాయంతో వైదొలగడంతో విష్ణు–శ్రీరామ్ జంట వాకోవర్‌తో సెమీస్ చేరింది. సెమీఫైనల్లో ఈ జోడీ... ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్ సవిల్లే–జాన్ ప్యాట్రిక్ స్మిత్ జంటతో, బోపన్న–రామ్‌కుమార్ జంట ఫ్రాన్స్‌కు చెందిన సాడియో డౌంబియా–ఫాబిన్ రెబొల్ ద్వయంతో తలపడతాయి. సాకేత్ మైనేని–ముకుంద్ శశికుమార్ జంట 6–3, 5–7, 3–10తో ల్యూక్ సవిల్లే– జాన్ ప్యాట్రిక్ జోడీ చేతిలో ఓడింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ 3–6, 2–6తో ఎనిమిదో సీడ్ స్టెఫానో ట్రవాగ్లియా (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. ప్రపంచ 93వ ర్యాంకర్ ధాటికి 29 ఏళ్ల యూకీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. వరుస సెట్లలోనే చేతులెత్తేశాడు. తొలి రౌండ్లో స్టెఫానో... భారత్‌కు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించాడు. తాజా విజయంతో ఇటలీ ప్లేయర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలిరౌండ్లోనే ప్రజ్నేశ్ గుణేశ్వరన్, అర్జున్ ఖడేలు కూడా ఓడిపోవడంతో ఈ టోర్నీ సింగిల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. ఇతర మ్యాచ్‌ల్లో స్వీడెన్కు చెందిన ఎలీస్ యెమెర్ టాప్ సీడ్ అస్లన్ కరత్సెవ (రష్యా)కు షాకిచ్చాడు. 163వ ర్యాంకులో ఉన్న యెమెర్ 6–2, 7–6 (7/3)తో ప్రపంచ 15వ ర్యాంకర్ కరత్సెవను కంగుతినిపించి క్వార్టర్స్ చేరాడు. సాకేత్ మైనేనికి వైల్డ్‌కార్డ్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేనికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. దీంతో ఈ నెల 7 (సోమవారం) నుంచి జరిగే ఈ టోర్నీలో 34 ఏళ్ల తెలుగు ఆటగాడు నేరుగా మెయిన్ డ్రాలో పోటీపడతాడు. -
ఆసీస్‌పై భారీ విజయం.. ఫైనల్లో టీమిండియా
కూలిడ్జ్ (ఆంటిగ్వా): అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా, ఆసీస్ 41. 5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత యువ బౌలర్లలో విక్టీ ఓస్టావల్ మూడు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీయగా, నిషాంత్ సింధు, రవి కుమార్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. కౌశల్ తాంబే, రఘువంశీలు చెరో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు యష్ ధుల్ (110 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (108 బంతుల్లో 94; 8 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించడంతో భారీ స్కోరును బోర్డుపై ఉంచారు. భారీ భాగస్వామ్యం... టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అంగ్కృష్ రఘువంశీ (6), హర్నూర్ సింగ్ (16) తడబడుతూ మొదలు పెట్టడంతో పరుగులు బాగా నెమ్మదిగా వచ్చాయి. తక్కువ వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి ఆసీస్ ఆధిక్యం ప్రదర్శించింది. ఈ స్థితిలో ధుల్, రషీద్ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా, నిలదొక్కుకున్న తర్వాత చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ధుల్ 64 బంతుల్లో, రషీద్ 78 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోగా, ఆ తర్వాత ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. ఈ జోడీని విడదీయడానికి ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. విట్నీ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన ధుల్ 106 బంతుల్లోనే శతకం మార్క్‌ను అందుకున్నాడు. పార్ట్నర్షిప్ 200 పరుగులు దాటిన తర్వాత 46వ ఓవర్లో వీరిద్దరు వరుస బంతుల్లో అవుటయ్యారు. విట్నీ వేసిన చివరి ఓవర్లో భారత్ వరుసగా 4, 6, 1, 6, 4, 6తో ఏకంగా 27 పరుగులు రాబట్టింది. దినేశ్ బానా ఆడిన 4 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టడం విశేషం. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ జట్టులో లాచ్లాన్ షా(51) మాత్రమే హాఫ్ సెంచరీ చేయగా, కోరీ మిల్లర్(38), క్యాంప్‌బెల్ కెల్లావే(30)లు మోస్తరుగా మెరిశారు. ఫైనల్లో భారత జట్టు.. ఇంగ్లండ్‌తో తలపడనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఫైనల్లో డొమినిక్ థీమ్
లండన్: ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) పైచేయి సాధించాడు. వరుసగా రెండో ఏడాది పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన తొలి సెమీఫైనల్లో గతేడాది రన్నరప్ థీమ్ 7–5, 6–7 (10/12), 7–6 (7/5)తో గెలుపొందాడు. రెండో సెట్లో నాలుగు మ్యాచ్ పాయింట్లు వదులుకున్న థీమ్... నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్‌లో ఒకదశలో 0–4తో వెనుకబడ్డాడు. కానీ వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన థీమ్ 6–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జొకోవిచ్ మరో పాయింట్ గెలిచినా... ఆ వెంటనే థీమ్ మరో పాయింట్ సాధించి 7–5తో టైబ్రేక్తోపాటు సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. థీమ్ కెరీర్లో ఇది 300వ విజయం కావడం విశేషం. రాఫెల్ నాదల్ (స్పెయిన్), మెద్వెదేవ్ (రష్యా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో థీమ్ ఆడతాడు. -
ప్రపంచకప్ సెమీ ఫైనల్‌కు రంగం సిద్ధం
-
ఫైనల్లో కాలికట్ హీరోస్
చెన్నై: తొలిసారి నిర్వహిస్తున్న ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో కాలికట్ హీరోస్ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో కాలికట్ 15–12, 15–9, 16–14 (3–0) స్కోరుతో యు ముంబా వాలీపై విజయం సాధించింది. కాలికట్ తరఫున కెప్టెన్ జెరోమ్ వినీత్ 12 పాయింట్లతో (10 స్పైక్స్, 2 సర్వ్) చెలరేగగా... ముంబా తరఫున వినీత్ కుమార్ అత్యధికంగా 7 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో చెన్నై స్పార్టన్స్ తలపడుతుంది. -
నాదల్ నిలిచాడు
ఎర్రమట్టిపై ఎదురు లేని రారాజు రాఫెల్ నాదల్ 2015 క్వార్టర్ ఫైనల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒక్క సెట్ కూడా ఓడిపోలేదు. వరుసగా 37 సెట్ల పాటు ప్రత్యర్థికి తలవంచకుండా వరుస విజయాలు సాధించాడు. అలాంటిది అర్జెంటీనా కుర్రాడు డీగో ష్వార్ట్‌జ్‌మన్ క్వార్టర్ ఫైనల్లో నాదల్‌పై తొలి సెట్ గెలిచి షాక్‌కు గురి చేశాడు. రెండో సెట్లో కూడా ఒక దశలో 3–2తో ముందంజ వేసి సంచలనం సృష్టిస్తాడా అనిపించాడు. కానీ స్పెయిన్ బుల్ తన అసలు సత్తాను ప్రదర్శించి ఆ తర్వాత చెలరేగిపోయాడు. 11వ టైటిల్ వేటలో సెమీస్‌లోకి అడుగు పెట్టాడు. పారిస్: వర్షం కారణంగా ఆగిపోయి గురువారం కొనసాగిన క్వార్టర్ ఫైనల్లో నాదల్ విజయం సాధించి ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో నాదల్ 4–6, 6–3, 6–2, 6–2తో ష్వార్ట్‌జ్‌మన్‌ను చిత్తు చేశాడు. బుధవారం రెండో సెట్లో 5–3తో ఆధిక్యంలో ఉన్న నాదల్ చకచకా రెండు గేమ్‌లు గెలుచుకొని సెట్ సాధించాడు. ఆ తర్వాత మూడో సెట్నుంచి అతనికి తిరుగు లేకుండా పోయింది. చక్కటి డ్రాప్ షాట్లతో రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ 4–1తో దూసుకుపోయాడు. ఆ తర్వాత ష్వార్ట్‌జ్‌మన్ తన సర్వీస్ నిలబెట్టుకున్నా... మరుసటి గేమ్ నాదల్ ఖాతాలో చేరింది. రెండో సెట్లో నాలుగు సార్లు బ్రేక్ పాయింట్ కాపాడుకున్న వరల్డ్ నంబర్‌వన్‌ను సుదీర్ఘంగా సాగిన ఎనిమిదో గేమ్‌లో అర్జెంటీనా కుర్రాడు నిలువరించలేకపోయాడు. చివరి సెట్లో కూడా ఒక దశలో ష్వార్ట్‌జ్‌మన్ తీవ్రంగా పోరాడినా నాదల్ దూకుడు ముందు అది సరిపోలేదు. పురుషుల విభాగంలో ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో కనీసం 11 సార్లు సెమీస్ చేరిన మూడో ఆటగాడు నాదల్. గతంలో ఫెడరర్, కానర్స్ ఈ ఘనత సాధించారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఐదో సీడ్ జువాన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 7–6, 5–7, 6–3, 7–5తో మూడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)ను ఓడించాడు. 2009 తర్వాత డెల్‌పొట్రో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. ‘వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోవడం నాకు కొంత వరకు కలిసొచ్చింది. నేను నా వ్యూహాలు మార్చుకునేందుకు అవకాశం కలిగింది. అయితే వర్షమో, సూర్యుడు రావడమో నా విజయానికి కారణం కాదు. నా ఆటను మార్చుకోవడం వల్లే ఈ మ్యాచ్ గెలవగలిగాననేది వాస్తవం. మీరు ఒత్తిడిని జయించలేకపోయారంటే ఆటను ఇష్టపడట్లేదనే అర్థం’ – నాదల్ నంబర్‌వన్ నిలబెట్టుకున్న హలెప్... మహిళల సింగిల్స్‌లో సిమోనా హలెప్ (రుమేనియా), స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) తుది పోరుకు సిద్ధమయ్యారు. వీరిద్దరు తమ సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో సునాయాస విజయాలు సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టారు. హలెప్ 6–1, 6–4 స్కోరుతో 2016 చాంపియన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)ను చిత్తు చేసింది. ఫలితంగా తన నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా నిలబెట్టుకుంది. హలెప్ జోరు ముందు ఏమాత్రం నిలవలేకపోయిన ముగురుజా, ఈ పరాజయంతో వరల్డ్ నంబర్‌వన్ అయ్యే అవకాశం కూడా చేజార్చుకుంది. హలెప్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గత ఏడాది కూడా ఆమె ఫైనల్లో ఓడింది. మరో సెమీస్‌లో స్టోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–4, 6–4తో సహచర అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్పై గెలుపొందింది. 77 నిమిషాల్లో సాగిన ఈ పోరులో స్టీఫెన్స్ చక్కటి షాట్లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. -
కుర్రాళ్లూ... కాస్త జాగ్రత్త!
అండర్–19 ప్రపంచకప్‌లో భారత జట్టు అసాధారణ ఫామ్‌లో ఉంది. గత రన్నరప్ అయిన యువ భారత్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఓటమన్నదే ఎరుగదు. తిరుగులేని విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కుర్రాళ్లు నేడు అసలు సిసలు సవాల్‌కు సిద్ధమయ్యారు. కీలకమైన సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీ కొనేందుకు సై అంటే సై అంటున్నారు. క్రైస్ట్‌చర్చ్: అసలే యువ భారత్ జోరుమీదుంది. టోర్నీ లో ఎదురులేని విజయాలందుకుంది. వరుసగా రెండో సారి ఫైనల్ చేరేందుకు తహతహలాడుతోంది. దీనికితోడు కుర్రాళ్లకు ఐపీఎల్ వేలం ఇచ్చిన కిక్కు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచేసి తమ జైత్రయాత్రను కొనసాగించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్తాన్ కూడా చెప్పుకోదగ్గ విజయాలతో సెమీఫైనల్ చేరింది. దీంతో మంగళవారం అండర్–19 ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరు జరగనుంది. ఇరు యువ జట్లు 2014 తర్వాత మళ్లీ ఇప్పుడే తలపడుతున్నాయి. ద్రవిడ్ మార్గదర్శనంలో... కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో యువ జట్టు అద్భుత విజయాలను సాధిస్తూ సెమీస్ చేరింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడను కనబరుస్తోంది. బ్యాటింగ్‌లో శుభ్‌మాన్ గిల్, కెప్టెన్ పృథ్వీ షా, మన్‌జ్యోత్ కల్రా చక్కని ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియాతో భారీ స్కోరుకు, భారీ విజయానికి ఈ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెనే కారణం. ఈ ముగ్గురితో పాటు విశేషంగా రాణిస్తోన్న బౌలర్లు నాగర్కోటి, శివమ్ మావిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. వీరిద్దరూ స్పిన్నర్ అనుకూల్ రాయ్‌తో కలిసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెడుతున్నారు. అర్షదీప్ కూడా అడపాదడపా రాణిస్తున్నాడు. పాక్ జట్టులో జైద్ అలమ్, అలీ జరియబ్, కెప్టెన్ హసన్ ఖాన్ ఫామ్‌లో ఉన్నారు. పేసర్ షహీన్ ఆఫ్రిది నిప్పులు చెరిగే బౌలింగ్‌తో జట్టును గెలిపిస్తున్నాడు. సులేమాన్‌తో పాటు హసన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. భారత్: పృథ్వీ షా (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, ఆర్యన్ జుయల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్, హార్విక్ దేశాయ్, మన్‌జ్యోత్ కల్రా, కమలేశ్ నాగర్కోటి, పంకజ్ యాదవ్, ఇషాన్ పోరెల్, హిమాన్షు రాణా, అనుకూల్ రాయ్, శివమ్ మావి, శివ సింగ్. పాకిస్తాన్: హసన్ ఖాన్ (కెప్టెన్), రొహైల్ నజీర్, మొహమ్మద్ అలీఖాన్, అలీ జరియబ్, అమద్ ఆలమ్, ఇక్బాల్, ఇమ్రాన్ షా, తాహ, మోసిన్ ఖాన్, మూసా, జైద్, రియాజ్, సాద్ ఖాన్, షహీన్ ఆఫ్రిది, సులేమాన్ షఫ్ఖత్. అంతిమ పోరుకు ఆసీస్ అఫ్గాన్ జోరుకు సెమీస్‌లో చెక్ క్రైస్ట్‌చర్చ్: అండర్–19 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ జోరుకు సెమీఫైనల్లో బ్రేక్ పడింది. సోమవారం జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 48 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌటైంది. టాపార్డర్ బ్యాట్స్‌మన్ ఇక్రామ్ (80; 8 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా... మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఆసీస్ పేసర్లలో మెర్లో 4, ఇవాన్స్ 2 వికెట్లు తీశారు. తర్వాత యువ ఆస్ట్రేలియా జట్టు 37.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ ఎడ్వర్డ్స్ (72; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. పరమ్ ఉప్పల్ (32 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. ఖయీస్ 2 వికెట్లు తీశాడు. నేడు భారత్, పాక్ జట్ల జరిగే రెండో సెమీస్ విజేతతో ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా తలపడుతుంది. -
రంజీ ట్రోఫీ సెమీస్‌లో ఢిల్లీ
సాక్షి, విజయవాడ: సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (129 బంతుల్లో 95; 9 ఫోర్లు, ఒక సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ జట్టును రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌కు చేర్చాడు. మధ్యప్రదేశ్‌తో సోమవారం ముగిసిన ఐదు రోజుల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 217 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 51.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్ కునాల్ చండేలా (57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో గంభీర్ రెండో వికెట్‌కు 98 పరుగులు... ధ్రువ్ (46 నాటౌట్; 6 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 95 పరుగులు జోడించాడు. 2009–2010 సీజన్ తర్వాత ఢిల్లీ జట్టు రంజీ ట్రోఫీలో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. గుజరాత్ ఇంటిముఖం... డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్, బెంగాల్ జట్ల మధ్య జైపూర్‌లో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా బెంగాల్ జట్టు సెమీస్ చేరింది. చివరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 483/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ మ్యాచ్ ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 695 పరుగులు చేసింది. తొలిసారి విదర్భ... కేరళతో సూరత్‌లో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో విదర్భ జట్టు 412 పరుగుల ఆధిక్యంతో గెలిచి తొలిసారి రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌కు చేరింది. 578 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ రెండో ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆదిత్య సర్వాతే (6/41) విదర్భ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 431/6తో బ్యాటింగ్ కొనసాగించిన విదర్భ జట్టు తొమ్మిది వికెట్లకు 507 పరుగులవద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈనెల 17న మొదలయ్యే సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో కర్ణాటకతో విదర్భ; బెంగాల్‌తో ఢిల్లీ తలపడతాయి. -
సెమీస్‌లో రాహుల్ ఓటమి
న్యూఢిల్లీ: రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ సంచలన ప్రదర్శన ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 19 ఏళ్ల రాహుల్ యాదవ్ 11–5, 10–12, 11–7, 6–11, 8–11తో రెండో సీడ్ వ్లాదిమిర్ మల్కోవ్ (రష్యా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ సెమీస్‌లో అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జంట 3–11, 2–11, 4–11తో ఇవనోవ్–సొజోనోవ్ (రష్యా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
భారత్ x మలేసియా
లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో గురువారం భారత జట్టు కీలకపోరుకు సిద్ధమైంది. మలేసియా జట్టుతో జరిగే క్వార్టర్ ఫైనల్లో టీమిండియా బరిలోకి దిగనుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 1–3తో ఓడిన భారత్ ఈ నాకౌట్ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా పోరాడనుంది. ఫామ్‌లో ఉన్న ఆకాశ్‌దీప్ సింగ్, సునీల్, రమణ్‌దీప్ సింగ్ మళ్లీ రాణిస్తే భారత్‌కు సెమీఫైనల్ బెర్త్ కష్టమేమీ కాదు. -
సెమీస్‌లో సింధు, శ్రీకాంత్
సయ్యద్ మోడి బ్యాడ్మింటన్ టోర్నీ లక్నో: అంచనాలను నిలబెట్టుకుంటూ భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మరో తెలుగు ఆటగాడు భమిడిపాడి సాయిప్రణీత్ కూడా సెమీస్‌కు చేరుకున్నాడు. పురుషుల విభాగంలో నలుగురు భారత ఆటగాళ్లే సెమీస్‌లో తలపడనుండటం విశేషం. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ శ్రీకాంత్ 21–12, 21–17 స్కోరుతో ఏడో సీడ్ జుల్ఫాద్‌లీ జుల్కిఫ్లీ (మలేసియా)ను చిత్తు చేశాడు. మరో క్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్ సాయిప్రణీత్ 21–19, 12–21, 21–10తో భారత ఆటగాడు సౌరభ వర్మపై గెలుపొందాడు. సెమీస్‌లో శ్రీకాంత్‌తో సాయిప్రణీత్ తలపడతాడు. మరో ఇద్దరు భారత షట్లర్లు క్వార్టర్స్‌లో సంచలన విజయాలు సాధించారు. ఎనిమిదో సీడ్, జాతీయ చాంపియన్ సమీర్ వర్మ 21–15, 21–13తో రెండో సీడ్ క్రిస్టియాన్ విటింగస్ (డెన్మార్క్)ను చిత్తుగా ఓడించాడు. మరో మ్యాచ్‌లో ముంబై ఆటగాడు, అండర్–19 మాజీ జాతీయ చాంపియన్ హర్షీల్ దానీ కూడా 21–16, 17–21, 21–11తో పన్నెండో సీడ్ ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్)ను ఓడించి సమీర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు 21–15, 21–11తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ వైదేహీ చౌదరిపై ఘన విజయం సాధించింది. రితూపర్ణదాస్ (భారత్)ను 21–17, 13–21, 23–21తో చిత్తు చేసిన నాలుగో సీడ్ ఫిత్రియాని (ఇండోనేసియా)ను సింధు సెమీస్‌లో ఎదుర్కొంటుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో బీట్రిజ్ కొరాల్స్ (స్పెయిన్ )ను 21–9, 21–11తో ఓడించి గ్రెగొరియా మరిస్కా (ఇండోనేసియా)... శ్రీకృష్ణ ప్రియ (భారత్)ను 21–17, 21–15తో ఓడించి హనా రమదీని (ఇండోనేసియా) కూడా సెమీస్‌లోకి అడుగు పెట్టారు. సెమీఫైనల్లో సిక్కి రెడ్డి హైదరాబాద్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో సెమీస్‌కు చేరుకుంది. మహిళల డబుల్స్‌లో సిక్కి–అశ్విని పొన్నప్ప జోడి 21–14, 21–18తో మలేసియా జంట మీ కువాన్ చౌ–లీ మెంగ్ యీన్ ను ఓడించింది. మిక్స్డ్ క్వార్టర్స్‌లో సిక్కి–ప్రణవ్ చోప్రా 21–16, 21–19తో యోగేంద్ర కృష్ణన్ –ప్రజక్తా సావంత్‌ను ఓడించగా, మరో క్వార్టర్స్‌లో యోంగ్ కై టెరీ–వీ హాన్ టాన్ పై సుమీత్ రెడ్డి–అశ్విని 21–18, 23–21తో నెగ్గారు. -
సెమీఫైనల్లో సైనా నెహ్వాల్
జయరామ్ ఇంటికి...మలేసియా మాస్టర్స్ టోర్నీ సారావక్ (మలేసియా): భారత బ్యాడ్మింటన్ స్టార్, మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్న లండన్ ఒలింపిక్స్ కాంస్యపతక విజేత సైనా, శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 21–15, 21–14తో ఎనిమిదో సీడ్ ఫిత్రిని ఫిత్రియాని (ఇండోనేసియా)పై విజయం సాధించింది. ఈ ప్రపంచ 40వ ర్యాంకర్‌పై హైదరాబాద్ క్రీడాకారిణికిది మూడో విజయం. 40 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సైనాకు ఆరంభంలో గట్టిపోటీ ఎదురైంది. ఒక దశలో తొలిగేమ్‌లో ఫిత్రియాని 4–0తో ముందంజలో ఉంది. ఇదే జోరులో ఆమె 11–6తో సైనాపై ఆధిక్యాన్ని చాటింది. అయితే సైనా పుంజుకొని స్కోరును 12–12తో సమం చేసింది. అనంతరం వరుస పాయింట్లతో గేమ్‌ను చేజిక్కించుకుంది. రెండో గేమ్‌లో మొదటి నుంచి ఆధిక్యంలోనే నిలిచి మ్యాచ్‌ను గెలుచుకుంది. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ పోరాటం ముగిసింది. ప్రపంచ 19వ ర్యాంకర్ జయరామ్ 13–21, 8–21తో ఆంథోని సినిసుక గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. అజయ్ జయ రామ్.. ఆంథోని చేతిలో ఓడిపోవడం ఇది మూడోసారి కాగా... ఈ మ్యాచ్‌లో ఏ గేమ్‌లోనూ ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయాడు. అదంతా సులభం కాదు... గతేడాది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా నియమితులైన సైనా, ఒక వైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూ మరో వైపు ఆ గురుతర బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించడం అంత సులభం కాదని చెప్పింది. అయితే ఈ అవకాశం రావడానికి ముందే దీనిపై చర్చించానని, కమిషన్ కు తనదైన పరిధిలో తగు సలహాలు ఇచ్చేందుకు ఎప్పుడైనా సిద్ధమేనని స్పష్టం చేసింది. -
సాకేత్ పరాజయం
పుణే: కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి భారత నంబర్‌వన్ ఆటగాడు సాకేత్ మైనేని నిష్క్రమించాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ 6-7, 6-2, 6-0తో మూడో సీడ్ సాకేత్‌పై విజయం సాధించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను టైబ్రేక్ ద్వారా గెలుచుకున్న అనంతరం సాకేత్ కుడి భుజం గాయంతో బాధపడుతూనే మ్యాచ్‌ను కొనసాగించాడు. పేస్ జంట నిష్క్రమణ మరో వైపు డబుల్స్‌లో లియాండర్ పేస్-రామ్‌కుమార్ జోడి క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. ఫ్రాన్సకు చెందిన స్విస్ ల్యూకా-హ్యూగో నైస్ ద్వయం 2-6, 6-3, 10-4 తేడాతో రెండో సీడ్ పేస్ జంటపై విజయం సాధించింది. ఈ పరాజయంతో పేస్ 2016 సీజన్‌ను ముగించాడు. భారత్‌కే చెందిన టాప్ సీడ్ పూరవ్ రాజా-దివిజ్ శరణ్ జోడి సెమీస్‌కి చేరింది. -
సెమీస్‌లో రుత్విక, సిరిల్
న్యూఢిల్లీ: రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన గద్దె రుత్విక శివాని, సిరిల్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక శివాని 13-21, 21-10, 21-17తో ఎలీనా కొమెన్డ్రోవ్స్కా (రష్యా)ను ఓడించగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సిరిల్ వర్మ 21-12, 21-18తో జుల్హెల్మీ జుల్కిఫి (మలేసియా)పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కిరెడ్డి తన భాగస్వామి ప్రణవ్ చోప్రాతో కలిసి సెమీస్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో సిక్కి-ప్రణవ్ ద్వయం 21-10, 21-8తో వాసిల్కిన్-క్రిస్టినా విర్విచ్ (రష్యా) జోడీపై గెలిచింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన తన్వీ లాడ్ 16-21, 19-21తో ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా) చేతి లో ఓడిపోయి0ది. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో అనతోలి యార్ట్‌సెవ్-ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా) జంటతో సిక్కి రెడ్డి-ప్రణవ్ జోడీ; సెనియా పొలికర్పోవా (రష్యా)తో రుత్విక శివాని; అనతోలి యార్ట్‌సెవ్ (రష్యా)తో సిరిల్ వర్మ తలపడతారు. -
రూ.5 కోట్ల క్రికెట్ బెట్టింగ్
♦ ఎంత పనిచేశావు ‘సిమన్స్’ ♦ గిద్దలూరు బెట్టింగ్ రాయుళ్లను ఊడ్చేసిన వెస్టిండీస్ మ్యాచ్ ♦ రూ.5 కోట్లకు పైగానే చేతులు మారినట్లు ప్రచారం ♦ గెలుపు భారత్‌దేనంటూ బెట్టింగ్ ఆశలు రేకెత్తించిన క్రికెట్ ♦ బెట్టింగ్రాయునికి ఓ మాజీ ఎమ్మెల్యే అండదండలు? గిద్దలూరు: భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం రాత్రి జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ గిద్దలూరు బెట్టింగ్‌రాయుళ్ల జీవితాలతో చెలగాటమాడినట్లయింది. భారత క్రికెటర్లు భారీ స్కోరు నెలకొల్పారు. ఇక భారత్‌కు గెలుపు తధ్యమని భావించిన బెట్టింగ్‌రాయుళ్లు ఇష్టారాజ్యంగా బెట్టింగ్‌కు పాల్పడ్డారు. వారితోపాటు ఎన్నడూ బెట్టింగ్ జోలికెళ్లని వారిని కూడా ఈ కూపంలో ఇరుక్కున్నారు. గిద్దలూరు పట్టణంతోపాటు ముండ్లపాడు, కె.ఎస్. పల్లె గ్రామాలు, కొమరోలు, రాచర్ల, కంభం మండలాల్లో సుమారు రూ.5 కోట్లకు పైగానే బెట్టింగ్‌కు జరిగినట్లు సమాచారం. బెట్టింగ్‌రాయుళ్ల ఆశలపై నీళ్లు చల్లిన సిమన్స్... గిద్దలూరు బెట్టింగ్ రాయుళ్ల ఆశలపై వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ సిమన్స్ నీళ్లు చల్లారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 192 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో వెస్టిండీస్ ఓడటం ఖాయమైందంటూ బెట్టింగులు పెద్దమొత్తంలో పెట్టారు. దీనికితోడు భారత్ వరుస మ్యాచ్‌లలో విజయాలను నమోదు చేస్తుండటంతో భారత్ గెలుస్తుందని లక్షల్లో బెట్టింగ్‌కు పాల్పడ్డారు. తక్కువ పరుగుల్లోనే విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గేల్ అవుట్ కావడంతో ఆట మధ్యలోనూ బెట్టింగ్‌కు ఊతం పోసింది. ఇలా బెట్టింగ్ రాయుళ్ల ఆశలకు అవధుల్లేనట్లుగా నగదును ఫణంగా పెట్టారు. చివరకు సిమన్స్, చార్లెస్, రసెల్ వంటి బ్యాట్స్మెన్లు అద్భుతంగా రాణించడం, భారత్ బౌలర్లు విఫలమవడంతో బెట్టింగ్‌రాయుళ్ల ఆశలు అడియాశలుగా మారాయి. చిరు వ్యాపారులు, చిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు సైతం బెట్టింగ్‌లో నగదు పోగొట్టుకున్న వారిలో ఉన్నట్లు సమాచారం. బెట్టింగ్ నిర్వాహకుడిగా ఓ ప్రజాప్రతినిధి? పట్టణంలో బెట్టింగ్‌కు ఆతిధ్యం వహించింది ఓ ప్రజా ప్రతినిధి అనే విమర్శ గుప్పుమంటోంది. అతనితోపాటు మరో బట్టల వ్యాపారి, బంగారు వ్యాపారి కలిసి బెట్టింగ్ మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వీరు రహస్య ప్రదేశాల్లో ఉంటూ ఫోన్ల ద్వారా బెట్టింగ్ రాయుళ్లను సేకరించి ప్రధాన బెట్టింగ్ కేంద్రానికి దేనికి ఎంత మొత్తంలో అనేది సమాచారమిస్తారు. వీరితో పరిచయాలున్న వారితోనూ, వారికి పరిచయాలున్న వారితో బెట్టింగ్‌లో పాల్గొనేలా చేస్తారు. బెట్టింగ్‌కు పాల్పడే వారు ప్రత్యేక సెల్ఫోన్లు వాడటంతో ఎవరూ గురుపట్టలేరు. భారత్ పాల్గొనే మ్యాచ్‌లే కాకుండా ఇతర దేశాల మ్యాచ్‌లకు కూడా బెట్టింగ్ సాగుతోంది. పోలీస్ స్టేషన్లో ప్రధాన భూమిక పోషిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు ఖరీదైన సెల్ఫోన్లు, నెలసరి మామూళ్లు ముట్టజెబుతున్నారని, దీంతో ఎస్సై, సీఐ, పై స్థాయి అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నారుు. 11 మంది బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు గిద్దలూరు రూరల్: పట్టణంలోని నరవ రోడ్డులో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 11 మంది యువకులను గురువారం అర్థరాత్రి స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందిన సమాచారం మేరకు కొందరు యువకులు క్రికెట్ క్రీడపై బెట్టింగులకు పాల్పడుతూ ఘర్షణలకు దిగుతున్నారని తెలియడంతో ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించిన పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి ఐదు వేల రూపాయలను స్వాధీనపరచుకున్నట్లు సిఐ ఫిరోజ్ తెలిపారు.