
ఆద్యంతం నిలకడగా ఆడిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ బోపన్న–ఎబ్డెన్ జోడీ 6–3, 6–2తో ఐదో సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంటను ఓడించింది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు మూడుసార్లు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment