Matthew
-
Russia: మా జోక్యం లేదు
వాషింగ్టన్: భారత ఎన్నికల్లో అమెరికా ప్రభుత్వ జోక్యం ఎంతమాత్రం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టంచేశారు. భారత అంశాల్లో అమెరికా ఉద్దేశపూర్వకంగా తలదూర్చుతోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన నేపథ్యంలో అమెరికా అధికార ప్రతినిధి శుక్రవారం స్పందించారు. ‘‘ భారత్‌లోనేకాదు ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియలు, దేశ పాలనా విధానాల్లో అమెరికా కలగజేసుకోదు. ఎన్నికల నిర్ణయాలన్నీ భారతీయ ప్రజలే తీసుకుంటారు’’ అని అన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌సింగ్ పన్నూ గత ఏడాది భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ (రా) అధికారి, మరో భారతీయుడు కలిసి చంపేందుకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసిందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జఖారోవా ఆరోపించారు. ఈ విషయాన్ని మిల్లర్ వద్ద మీడియా ప్రస్తావించగా.. ‘‘ అవన్నీ నిరాధార ఆరోపణలు. ప్రస్తుతం ఆ ఆరోపణలన్నీ జ్యూరీ వద్ద విచారణలో ఉన్నాయి. చట్టసంబంధ ఇలాంటి విషయంపై నేను ఇప్పుడే ఏమీ మాట్లాడలేను. అందుకే ఈ విషయాన్ని నేను ఇక్కడితో వదిలేస్తున్నా’ అని మిల్లర్ వ్యాఖ్యానించారు. రష్యా ఆరోపణలను భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి సైతం ఖండించారు. భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అమెరికాలో ఇటీవల ఒక నివేదిక వెలువడటం, దానిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన తరుణంలో గార్సెట్టి శుక్రవారం భారత్‌ను పొగడ్తల్లో ముంచెత్తడం గమనార్హం. ‘‘ఢిల్లీలో బంధాన్ని అమెరికా వందశాతం విశ్వసిస్తోంది. 21వ శతాబ్దిలో చక్కటి సత్సంబంధాల్లో ఒకటిగా భారత్–అమెరికా బంధం నిలుస్తుంది. అమెరికాలో రెండు కిలోమీటర్లు నడచివెళ్లి ఓటేయడానికి బద్దకిస్తారు. కానీ భారత్‌లో ఎక్కడో కొండల్లో ఉండే మతాధికారి సైతం రెండు రోజులు కాలినడకన వెళ్లి మరీ ఓటు వేస్తారు. ట్రక్కుల్లో అనధికార నగదు తరలింపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. ఇలాంటి అంశాల్లో అమెరికా కంటే భారత్ మెరుగ్గా పనిచేస్తోంది. కేంద్రప్రభుత్వం లాగే అక్కడి విపక్షాల పాలిత రాష్ట్ర ప్రభుత్వాలూ శక్తివంతమైనవే. భారత చరిత్ర చూస్తే అక్కడి అందరి హక్కులకు గౌరవం దక్కుతుంది. మనల్ని మనం ఇష్టపడేకంటే భారతీయులే మనల్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడున్న ప్రపంచంలో ఇది నిజంగా అరుదైన విషయం’ అని భారత్‌ను ప్రశంసించారు. -
భారత వ్యతిరేక కథనంపై స్పందించిన అమెరికా
న్యూయార్క్: పాకిస్తాన్లో వరుస ఉగ్రవాదల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని ఇటీవల యూకేకు చెందిన ఓ వీడియా సంస్థ ఆరోపణలు చేస్తూ కథనం వెల్లడించింది. అయతే తాజాగా ఆ కథనంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇటువంటి ఆరోపణలను తీవ్రతరం చేసుకోకుండా ఇరు దేశాలు.. చర్చల ద్వార సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొంది. భారత్‌పై వచ్చిన ఆరోపణలపై ఆమెరికా వైఖరి ఏంటని అడిగిన ప్రశ్నకు యూఎస్ విదేశి వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. ‘పాకిస్తాన్‌లోని వరుస ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వేనుక భారత్ హస్తం ఉందని వెలువడిన కథనం మా దృష్టికి వచ్చింది. అటువంటి ఆరోపణలపై మేము ఎటువంటి వ్యాఖ్యలు చేయిలేం. మేము ఇరు దేశాలకు సంబంధించి సున్నితమైన విషయంలో జోక్యం చేసుకోలేం. అదే విధంగా ఇటువంటి ఆరోపణలను ఇరు దేశాలు సైతం తీవ్రతరం చేసుకోకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’ అని మాథ్యూ మిల్లర్ అన్నారు. 2019 పుల్వావా దాడుల అనంతరం విదేశాల్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చే విధానాలను భారత్ పాటిస్తోందని యూకేకు చెందిన ‘దీ గార్డియన్’ న్యూస్‌పేపర్ ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత విదేశి ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ సుమారు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపణలు చేసింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారాలు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక వెల్లడించామని గార్డియన్ పత్రిక పేర్కొనటం గమనార్హం. అయితే ‘దీ గార్డియన్’ పేపర్ ఆరోపణలను భారత్ విదేశాంగ శాఖ.. తీవ్రంగా ఖండించింది. ఆ నివేదికలో ఉన్నది తప్పుడు సమాచారమని, ఇదంతా భారత్ వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. ఇతర దేశాల్లో టార్గెట్‌గా హత్యలు చేయటం భారత ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేసింది. -
బోపన్న జోడీకి షాక్
దుబాయ్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో ఈ జోడీ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–3, 3–6, 8–10తో బెహర్ (ఉరుగ్వే)–పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోయింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఆరు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. యూకీ–హాస్ జంట సంచలనం మరోవైపు ఇదే టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జంట సంచలన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో యూకీ–హాస్ జోడీ 6–4, 7–6 (7/1)తో మూడో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను బోల్తా కొట్టించింది. -
సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం
ఆద్యంతం నిలకడగా ఆడిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ బోపన్న–ఎబ్డెన్ జోడీ 6–3, 6–2తో ఐదో సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంటను ఓడించింది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు మూడుసార్లు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేశారు. -
Indian Wells Masters: బోపన్న కొత్త చరిత్ర...
కాలిఫోర్నియా: నాలుగు పదుల వయసు దాటినా తనలో సత్తా తగ్గలేదని భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మరోసారి నిరూపించుకున్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–3, 2–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ వెస్టీ కూల్‌హాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీని ఓడించింది. ఈ గెలుపుతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. డానియల్ నెస్టర్ (కెనడా) పేరిట ఉన్న రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. 2015లో నెస్టర్ 42 ఏళ్ల వయసులో సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 60 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ వెస్లీ కూల్‌హాఫ్–నీల్ స్కప్సీ జంటకు 2,31,660 డాలర్ల (రూ. 1 కోటీ 91 లక్షలు) ప్రైజ్‌మనీ, 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 5: బోపన్న కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. గతంలో అతను మోంటెకార్లో (2017 లో), మాడ్రిడ్ (2015లో), పారిస్ ఓపెన్ (2012, 2011లో) మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ సాధించాడు. మరో ఐదు మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు. 24: బోపన్న కెరీర్లో ఇది 24వ డబుల్స్ టైటిల్. ఈ ఏడాది రెండోది. ఈ సీజన్లో ఎబ్డెన్తోనే కలిసి బోపన్న దోహా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఇండియన్ వెల్స్ టోర్నీకి టెన్నిస్ స్వర్గధామం అని పేరు ఉంది. ఎన్నో ఏళ్లుగా నేను ఈ టోర్నీలో ఆడుతున్నాను. విజేతలెందరినో చూశాను. ఈసారి నేను చాంపియన్‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంది. –రోహన్ బోపన్న విన్నర్స్ ట్రోఫీతో బోపన్న–ఎబ్డెన్ జోడీ -
వారెవ్వా... మెండిస్, మాథ్యూస్
వెల్లింగ్టన్: కివీస్ పర్యటనలో అదరహో అనే బ్యాటింగ్‌తో శ్రీలంక వార్తలకెక్కింది. కుశాల్ మెండిస్ (287 బంతుల్లో 116 బ్యాటింగ్; 12 ఫోర్లు), మాథ్యూస్ (293 బంతుల్లో 117 బ్యాటింగ్; 11 ఫోర్లు) ఔరా అనిపించారు. ఘోరంగా ఓడుతుందనుకున్న టెస్టులో ఇద్దరు అజేయ శతకాలతో వీరోచిత పోరాటం చేశారు. వికెట్ ఇవ్వకుండా నాలుగో రోజంతా బ్యాటింగ్ చేశారు. ఆట నిలిచే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. కేవలం 37 పరుగులే వెనుకబడింది. కివీస్ ఆధిక్యం 296 పరుగులు. దీంతో పొంచి ఉన్న ఇన్నింగ్స్ పరాజయంతో నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 20/3తో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మెండిస్, మాథ్యూస్ క్రీజులో ఉన్నారు. ఏ రకంగా చూసిన నాలుగో రోజే ఆతిథ్య న్యూజిలాండ్ గెలవాల్సిన మ్యాచ్. కానీ ఇద్దరు క్రీజులో పాతుకుపోయారు. సమన్వయంతో మూడు సెషన్లను పూర్తిగా ఆడారు. మూడో సెషన్ మొదలైన తర్వాత ముందుగా మెండిస్ సెంచరీ పూర్తి చేసుకోగా... ఆ తర్వాత మాథ్యూస్ శతక మార్కు అందుకున్నాడు. వీళ్లిద్దరు అబేధ్యమైన నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 246 పరుగులు జోడించడం విశేషం. ►1 సొంత గడ్డపై రోజంతా ఆడినా న్యూజిలాండ్ ఒక్క వికెటైనా తీయలేకపోవడం ఇదే మొదటిసారి. ►10 పదేళ్ల తర్వాత టెస్టుల్లో మళ్లీ ఈ ఘనత సాధ్యమైంది. 2008లో బంగ్లాదేశ్‌లో దక్షిణాఫ్రికా ఒక్క వికెట్ కోల్పోకుండా రోజంతా బ్యాటింగ్ చేసింది. ► 22 ఓవరాల్‌గా టెస్టు చరిత్రలోనే ఇలా వికెట్ లేకుండా రోజు ముగియడం 22వ సారి మాత్రమే. -
900కు చేరిన మృతుల సంఖ్య
కరీబియన్ దీవుల్లో మాథ్యూ తుఫాను సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఒక్క హైతీలోనే 900 మందికి పైగా మృతి చెందారని అధికారులు తాజాగా వెల్లడించారు. హైతీ పశ్చిమ ప్రాంతంలో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలతో మాథ్యూ హరికేన్ సృష్టించిన బీభత్సానికి వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో సుమారు 62,000 మంది తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. 2010లో సంభవించిన భూకంపం నుంచి ఇప్పుడిప్పడే కోలుకుంటున్న హైతీకి మాథ్యూ తుఫాను పెను నష్టం కలిగించింది. కొంతమేర బలహీనపడిన ఈ తుఫాను ఇప్పుడు అమెరికాపై ప్రభావం చూపుతోంది. ఫ్లోరిడాలో దీని దాటికి నలుగురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. ఫ్లోరిడాతో పాటు జార్జియా, సౌత్ కరోలినా ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
క్రియలు లేని విశ్వాసం మృతం
దేవుని ప్రేమను, గొప్పదనాన్ని విశ్వాసి జీవనశైలి ద్వారానే లోకం స్పష్టంగా తెలుసుకుంటుంది. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతప్రాయం అంటుంది బైబిలు (యాకోబు2:17). నీకిష్టమైతే నన్ను బాగుచేయమంటూ ఒక కుష్ఠురోగి యేసుక్రీస్తును ప్రాధేయపడ్డాడు. దానికిష్టమేనంటూ ప్రభువతన్ని బాగుచేశాడు. ఎన్నో ఏళ్ల అతని శాపగ్రస్థమైన జీవితానికి దేవుని కృపవల్ల కొన్ని క్షణాల్లో అలా తెరపడింది. అయితే ఆ వెంటనే అత్యంత ప్రాముఖ్యమైన హెచ్చరికను ప్రభువు జారీ చేశాడు. ‘ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు. కానీ సాక్ష్యార్థమై నీ దేహాన్ని యాజకునికి కనపర్చుకొని మోషే నియమించిన కానుక చెల్లించు’ అన్నాడు యేసుప్రభువు (మత్తయి 8:1-4). దేవుని అద్భుతాన్ని చవిచూసినవాడు ఏం చేయాలో, ఏం చేయకూడదో యేసు తెలిపిన ఉదంతమిది. దేవుడు అద్భుతం చేశాడని చెప్పుకోవాలనుకోవడం సహజమే! కాని ఆ ‘కృతజ్ఞతాభావం’ విశ్వాసి మాటల్లో కాదు చేతల్లో లోకానికి వెల్లడి కావాలన్నది ప్రభువు మాటల తాత్పర్యం. కుష్ఠురోగం అంతకాలంగా అతన్ని లోకానికి, దేవునికి కూడా దూరంగా ఉంచింది. కాబట్టి అతను ముందుగా దేవాలయానికి వెళ్లి, యాజకునికి కనబర్చుకొని దేవుని ఆరాధించాలి. ఆ తర్వాతే సమాజంలోకి వెళ్లాలి. దేవుడు అద్భుతం చేసి గండం గట్టెక్కించే వరకూ దేవుని ప్రాధేయపడటం, ఉపవాస ప్రార్థనలు చేయడం షరా మామూలే! అద్భుతం జరిగి గండం గడిచాక దేవుని మాటల్లో స్తుతించడమే తప్ప దేవునికి మరింత దగ్గరై జీవితాన్ని సరిదిద్దుకోవాలన్న ఆలోచనే లేకపోవడం విషాదకరం. మార్పు లేకుండా జీవించే వాడు ఎంత మాట్లాడినా దేవునికి మహిమ కలగదు. మన పెదాలు దేవుని స్తుతిస్తుంటే, మన జీవితం నిండా దైవవ్యతిరేకత అనే దుర్గంధముంటే, అది దేవునికెంత అవమానకరం? జీవితాన్ని పూర్తిగా మార్చేదే నిజమైన కృతజ్ఞత! మాటల్లో, పాటల్లో, ప్రసంగాల్లో టన్నులకొద్దీ కుమ్మరిస్తున్నాం కానీ చేతల్లో అణుమాత్రం కూడా చూపడం లేదు. దేవుని పట్ల కృతజ్ఞతతో మనం మారితే ఆ మార్పును లోకం స్తుతిస్తుంది. ఆ పెనుమార్పుకు కారణమేమిటో, దేవుడు చేసిన అద్భుతమేంటో దేవుడెవరో అలా మనం చెప్పకుండానే లోకం తెలుసుకుంటుంది. అందుకే ‘ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు’ అన్నది ప్రభువు అతనికిచ్చిన ఆజ్ఞ. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపర్చబడతాడన్నాడొకసారి యేసుప్రభువు (యోహాను 15:8). చెట్టెప్పుడూ తన గొప్పదనాన్ని చెప్పుకోదు, ప్రసంగాలు చేయదు, పాటలు పాడదు. లోకానికి తియ్యటి తన ఫలాలనిస్తుందంతే! దేవునికోసం ఫలించడమంటే లోక కల్యాణార్థం, దీనుల సహాయార్థం మౌనంగా సత్కార్యాలు చేయడమే! తన సమస్యల్లో ఆదుకొని అద్భుతాలు చేసిన దేవుని పట్ల నిజంగానే కృతజ్ఞత కలిగిన విశ్వాసి, తోటి మానవుల సమస్యల పట్ల స్పందించకుండా ఉండలేడు. దేవునికోసం నేనేం మాట్లాడాలి? అని కాక దేవుని పేరిట దీనులకోసం నేనేం చేయాలి? అన్న ధ్యాసతో విశ్వాసి నిరంతరం రగిలిపోవాలి. అయితే దేవునికోసం ఏదైనా చేయమని హృదయం చెబుతుంటే, అది చేయకుండా ఉండేందుకు మెదడు రకరకాల సాకులు చూపెడుతుంటుంది. సాకులు తయారు చేసే మహాయంత్రమైన మన మెదడే మనకు ప్రధానమైన అవరోధమవుతుంది. మండుటెండకు కాగుతున్న వ్యక్తికి గిన్నెడు చల్లటి నీళ్లిచ్చినా అది అద్భుతమైన పరిచర్య అంటాడు ప్రభువు (మత్తయి 10:42). ఎందుకంటే ఆ పరిస్థితుల్లో మనమిచ్చే గిన్నెడు చల్లనీళ్లే, సముద్రమంత దేవుని ప్రేమను పరిచయం చేస్తాయి. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
శంషాబాద్‌కు మాథ్యూ మృతదేహం
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన విద్యార్థి మృతదేహం నగరానికి చేరుకుంది. బుధవారం తెల్లవారుజామున రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన మృతదేహాన్ని విద్యార్థి బంధువులకు అప్పగించారు. వివరాలు..నగరంలోని హబ్సీగూడకు చెందిన జాయ్ మాథ్యూ ఆరు నెలల క్రితం అమెరికాలోని ట్రాయ్ యూనివర్సిటీలో ఎం.ఎస్ చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పిబ్రవరి 20న స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు స్నేహితులు తీవ్రంగ గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. జాయ్ మాథ్యూ మృతిచెందాడు. భారత ప్రభుత్వ సహకారంతో మృతదేహాన్ని హైదరాబాద్ తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.