న్యూయార్క్: పాకిస్తాన్‌లో వరుస ఉగ్రవాదల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని ఇటీవల యూకేకు చెందిన ఓ వీడియా సంస్థ ఆరోపణలు చేస్తూ కథనం వెల్లడించింది. అయతే తాజాగా ఆ కథనంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇటువంటి ఆరోపణలను తీవ్రతరం చేసుకోకుండా ఇరు దేశాలు.. చర్చల ద్వార సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొంది.
భారత్‌పై వచ్చిన ఆరోపణలపై ఆమెరికా వైఖరి ఏంటని అడిగిన ప్రశ్నకు యూఎస్ విదేశి వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. ‘పాకిస్తాన్‌లోని వరుస ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వేనుక భారత్ హస్తం ఉందని వెలువడిన కథనం మా దృష్టికి వచ్చింది. అటువంటి ఆరోపణలపై మేము ఎటువంటి వ్యాఖ్యలు చేయిలేం. మేము ఇరు దేశాలకు సంబంధించి సున్నితమైన విషయంలో జోక్యం చేసుకోలేం. అదే విధంగా ఇటువంటి ఆరోపణలను ఇరు దేశాలు సైతం తీవ్రతరం చేసుకోకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’ అని మాథ్యూ మిల్లర్ అన్నారు.
2019 పుల్వావా దాడుల అనంతరం విదేశాల్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చే విధానాలను భారత్ పాటిస్తోందని యూకేకు చెందిన ‘దీ గార్డియన్’ న్యూస్‌పేపర్ ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత విదేశి ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ సుమారు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపణలు చేసింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారాలు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక వెల్లడించామని గార్డియన్ పత్రిక పేర్కొనటం గమనార్హం.
అయితే ‘దీ గార్డియన్’ పేపర్ ఆరోపణలను భారత్ విదేశాంగ శాఖ.. తీవ్రంగా ఖండించింది. ఆ నివేదికలో ఉన్నది తప్పుడు సమాచారమని, ఇదంతా భారత్ వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. ఇతర దేశాల్లో టార్గెట్‌గా హత్యలు చేయటం భారత ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment