Miller
-
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం: అమెరికా
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కలిగిన ఉన్న దేశం భారత్ అని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. భారత్ ఎల్లప్పుడు తమకు ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మక భాగస్వామి అని తెలిపింది. భారత్-అమెరికా సంబంధాలపై యూఎస్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ అమెరికా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా మిల్లర్ చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లో ప్రజాస్వామ్యం వెనకబాటు తనం, ప్రతిపక్షాలపై అణిచివేత దోరణీకి సంబంధించి అమెరికా కీలక వ్యాఖ్యలను ప్రస్తావిస్త్ను మీడియా అడిగిన ప్రశ్నకు మిల్లర్ సమాధానం చెప్పారు. ‘భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికాకు భారత్ చాలా ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మకమైన భాగస్వామి. ఇరు దేశాల బంధం సత్యమని నేను ఆశిస్తున్నా’అని మిల్లర్ పేర్కొన్నారు. ఇటీవల కూడా భారత సంబంధాలపై మిల్లర్ స్పందిస్తూ.. భారత్ తమకు(అమెరికా) చాలా ముఖ్యమైన భాగస్వామని పేర్కొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా భారత్, అమెరికాల సంబంధాలు ఎప్పడూ వృద్ధి చెందాలని కోరుకుంటున్నామని తెలిపింది. ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు నిష్పక్షపాతంగా ఓటు వేయడానికి భారత్‌లో సరైన పరిస్థితులు ఉంటాయని ఆశిస్తున్నామని అమెరికా వ్యాఖానించిన విషయం తెలిసిందే. అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించిన సంగతి విదితమే. -
భారత వ్యతిరేక కథనంపై స్పందించిన అమెరికా
న్యూయార్క్: పాకిస్తాన్లో వరుస ఉగ్రవాదల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని ఇటీవల యూకేకు చెందిన ఓ వీడియా సంస్థ ఆరోపణలు చేస్తూ కథనం వెల్లడించింది. అయతే తాజాగా ఆ కథనంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇటువంటి ఆరోపణలను తీవ్రతరం చేసుకోకుండా ఇరు దేశాలు.. చర్చల ద్వార సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొంది. భారత్‌పై వచ్చిన ఆరోపణలపై ఆమెరికా వైఖరి ఏంటని అడిగిన ప్రశ్నకు యూఎస్ విదేశి వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. ‘పాకిస్తాన్‌లోని వరుస ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వేనుక భారత్ హస్తం ఉందని వెలువడిన కథనం మా దృష్టికి వచ్చింది. అటువంటి ఆరోపణలపై మేము ఎటువంటి వ్యాఖ్యలు చేయిలేం. మేము ఇరు దేశాలకు సంబంధించి సున్నితమైన విషయంలో జోక్యం చేసుకోలేం. అదే విధంగా ఇటువంటి ఆరోపణలను ఇరు దేశాలు సైతం తీవ్రతరం చేసుకోకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’ అని మాథ్యూ మిల్లర్ అన్నారు. 2019 పుల్వావా దాడుల అనంతరం విదేశాల్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చే విధానాలను భారత్ పాటిస్తోందని యూకేకు చెందిన ‘దీ గార్డియన్’ న్యూస్‌పేపర్ ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత విదేశి ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ సుమారు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపణలు చేసింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారాలు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక వెల్లడించామని గార్డియన్ పత్రిక పేర్కొనటం గమనార్హం. అయితే ‘దీ గార్డియన్’ పేపర్ ఆరోపణలను భారత్ విదేశాంగ శాఖ.. తీవ్రంగా ఖండించింది. ఆ నివేదికలో ఉన్నది తప్పుడు సమాచారమని, ఇదంతా భారత్ వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. ఇతర దేశాల్లో టార్గెట్‌గా హత్యలు చేయటం భారత ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేసింది. -
గోనె సంచుల సమస్యకు చెక్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ 2023–24 ధాన్యం సేకరణకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల ద్వారా 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సమాయత్తం అవుతోంది. ఇందులో 5 లక్షల టన్నుల వరకు బాయిల్డ్ రకాలను కొనుగోలు చేసేలా లక్ష్యం నిర్దేశించింది. ముఖ్యంగా ధాన్యం తరలింపులో గోనె సంచుల సమస్యను అధిగమించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌక దుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులను సేకరించి.. ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు తరలిస్తోంది. ఇక్కడ మిల్లులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చేసిన ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూరకంగా మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. వినియోగ చార్జీలు చెల్లింపు కేంద్ర ప్రభుత్వ నిబంధల ప్రకారం గోనె సంచుల (ఇప్పటికే ఒకసారి వినియోగించినవి) వినియోగానికి అయ్యే చార్జీలను సైతం మిల్లర్లకు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిల్లర్లు ఇచ్చే గోనె సంచుల నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వాటిని ధాన్యం నింపడానికి వినియోగించనున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సబ్ కలెక్టర్/ఆర్డీవోలు తమ పరిధిలోని మొత్తం కొనుగోళ్ల ప్రక్రియ, రైస్ మిల్లర్ల నుంచి గోనె సంచుల సేకరణను పర్యవేక్షించనున్నారు. ఆయా సీజన్లలో కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మిల్లర్లు సరఫరా చేసిన గోనె సంచులను తిరిగి అప్పగించనున్నారు. -
కొత్త అవతారం లో హీరో ధనుష్ దాని కొససామేనా..!
-
అపురూప కల్పన
ముంబైకి చెందిన ఆష్తి మిల్లర్‌ను ‘ఆర్కిటెక్ట్’ అంటే మాత్రమే సరిపోదు. అలా అని ‘ఆర్ట్’కు మాత్రమే పరిమితం చేయలేము. ఇలస్ట్రేషన్, గ్రాఫిక్ డిజైన్లతో తనప్రోఫెషనల్ కెరీర్‌కు కొత్త మెరుపు తీసుకువచ్చింది. అదే తన ప్రత్యేకశైలిగా మారింది... నేను చేసే వర్క్స్‌లో వీలైనన్ని వివరాలు ఉండేలా జాగ్రత్త పడతాను. దీంతో వీక్షకులు అందులో కొత్తదనాన్ని చూస్తారు. నా ఆలోచన విధానం ఏమిటో తెలిసిపోతుంది. నా మది ఎప్పుడూ రకరకాల ఐడియాలతో నిండిపోయి ఉంటుంది. వాటిలో నుంచి కొన్ని ఐడియాలను తీసుకొని పనిచేస్తాను. – మిల్లర్ ముంబైలోని ఆష్తి మిల్లర్ ఇల్లు క్రియేటివిటీకి సంబంధించిన విషయాలకు కేంద్రంగా ఉండేది. తల్లి ఫైన్ ఆర్టిస్ట్. తండ్రి ఆర్కిటెక్ట్. ఇంటినిండా ఆర్ట్‌కు సంబంధించిన ముచ్చట్లే! చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతోపాటు రకరకాల మ్యూజియమ్లు, ఆర్ట్గ్యాలరీలకు వెళుతుండేది మిల్లర్. అవి ఊరకే ఉండనిస్తాయా! తనలో సృజనాత్మకమైన ఆలోచనలను పెంపొందించాయి. సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్‌గా తండ్రికి మంచి పేరు ఉంది. అయితే అది రాత్రికి రాత్రి వచ్చేందేమీ కాదు. ఎంతో కష్టపడ్డాడు. తండ్రి కష్టం తనకు ఆదర్శం అయింది. తండ్రి బాటలోనే ఆర్కిటెక్చర్ కోర్సు చదువుకుంది. ‘మిల్లర్ ఇంక్ స్టూడియో’ మొదలు పెట్టింది. ఈ స్టూడియో ద్వారా ప్రోఫెషనల్ కెరీర్ ‘ఆర్కిటెక్ట్’ను తన క్రియేటివిటీకి సంబంధించిన ఇలస్ట్రేషన్ అండ్ గ్రాఫిక్ డిజైన్లతో మిళితం చేసి యూనిక్ స్టైల్‌తో తిరుగులేని విజయం సాధించింది మిల్లర్. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధ బ్రాండ్లతో కలిసి పనిచేస్తోంది. మారథాన్లకు సంబంధించిన మెడల్స్‌ను యూనిక్ స్టైల్లో డిజైన్ చేయడంలో తనదైన ప్రత్యేకత సాధించుకుంది. ఒక ఫిన్‌టెక్ కంపెనీ బ్రాండ్‌కు సంబంధించి మనీఆర్ట్ సిరీస్ కోసం మిల్లర్ సృష్టించిన 14 లేయర్లతో కూడిన ఆర్ట్ వర్క్‌కు మంచి పేరు వచ్చింది. ప్రతి లేయర్లో వివిధ దేశాలకు చెంది కరెన్సీ, వివిధ భౌగోళిక ప్రాoతాలకు సంబంధించిన ఎలిమెంట్స్ ప్రతిఫలిస్తాయి. మిల్లర్ ఆర్ట్‌వర్క్స్ దేశవిదేశాల్లోని ప్రసిద్ధ గ్యాలరీలలో ప్రదర్శించబడ్డాయి. ‘మిల్లర్ ఆర్ట్‌వర్క్‌లో తాజాదనం కనిపిస్తుంది. సూటిగా మనసును తాకే ఆకర్షణీయత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నగరాలలో ఎన్నో కట్టడాలు ఉన్నాయి. వాటి వైవిధ్యాన్ని తన కళలోకి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉంది’ అంటుంది క్యూరెటర్ అమ్బ్రోగి. ‘మిల్లర్లోని ప్రత్యేకత ఏమిటంటే ఒకే సమయంలో భిన్నమైన విషయాల గురించి ఆలోచించడం. వాటిని సృజనాత్మకంగా సమన్వయం చేసుకోవడం. ఆమె ఆర్ట్వర్క్స్లో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, శిల్పం, చిత్రం మిళితమై కనిపిస్తాయి’ అంటున్నాడు ఆర్కిటెక్చరల్ సంస్థ పికార్ట్‌కు చెందిన ఆంథోనీ మార్కెస్.ఆంథోనితో కలిసి అర్బన్ మాస్టర్ ప్లాన్స్ నుంచి పర్సనల్ స్పేసెస్ వరకు ఎన్నోప్రాజెక్ట్లలో పనిచేసింది ఆష్తి మిల్లర్.‘మోర్ ఈజ్ బెటర్’ అనే ఫిలాసఫీని నమ్ముతున్న ఆష్తి మిల్లర్ తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్ 30’లో చోటు సంపాదించింది. -
అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ
వాషింగ్టన్: తెలుగు మహిళ కాట్రగడ్డ అరుణ మిల్లర్ (58) అమెరికాలో చరిత్ర సృష్టించారు. దేశంలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డుకెక్కారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అరుణ రికార్డు మెజార్టీతో గెలిచారు. రిపబ్లికన్ పార్టీ అనుకూల వర్గాలూ ఆమెకే మద్దతివ్వడంతో గెలుపు సులభమైంది. అమెరికాలో రాష్ట్రస్థాయిలో గవర్నర్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ పదవి అత్యంత కీలకం. రవాణా ఇంజనీర్‌గా సేవలు కాట్రగడ్డ అరుణ మిల్లర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం. ఆమె 1964 నవంబర్ 6న జన్మించారు. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి 1972లో అమెరికా చేరుకున్నారు. తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు ఐబీఎం సంస్థలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లో ప్రాథమిక విద్య అనంతరం అరుణ ‘మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు. 1990లో మేరీల్యాండ్‌లోని మాంట్గొమెరీ కౌంటీకి మారారు. అక్కడే తన కళాశాల మిత్రుడు డేవిడ్ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు మీనా, క్లోయి, సాషా ఉన్నారు. అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2000లో అమెరికా పౌరసత్వం లభించింది. 2010 నుంచి 2018 దాకా మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో డిస్ట్రిక్ట్ 15కి ప్రాతినిధ్యం వహించారు. 2018లో అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు పోటీపడి ఓడారు. ‘‘మేరీల్యాండ్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి నావంతు కృషి చేస్తా. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ నన్ను గెలిపించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో చిన్న రాష్ట్రం కూడా అద్భుతం సృష్టిస్తుందని ఈ ఎన్నికతో ప్రజలు నిరూపించారు’’ అని అరుణ మిల్లర్ చెప్పారు. రిపబ్లికన్ల ఆధిక్యం మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్లు స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో కడపలి వార్తలు అందే సమయానికి 202 స్థానాలు గెలుచుకున్నారు. అధికార డెమొక్రటిక్ పార్టీకి 184 స్థానాలు దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ 218 సీట్లు. సెనేట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు జరగ్గా రిపబ్లికన్లు 19 , డెమొక్రాట్లు 12 సీట్లు నెగ్గారు. కడపటి వార్తలందేసరికి ఈ రెండు పార్టీలకూ సెనేట్‌లో చెరో 48 సీట్లున్నాయి. 36 గవర్నర్ పదవుల్లో రిపబ్లికన్లకు 16, డెమొక్రాట్లకు 15 దక్కాయి. ఐదింటి ఫలితాలు రావాల్సి ఉంది. ఐదుగురు భారత అమెరికన్ల విజయం వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఐదుగురు భారత–అమెరికన్లు ఎన్నికయ్యారు. వీరంతా అధికార డెమొక్రాటిక్ పార్టీ తరఫున నెగ్గడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెషనల్ జిల్లాల నుంచి రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీ బేరా, ప్రమీలా జయపాల్, థానేదార్ ప్రతినిధుల సభలో అడుగు పెట్టనున్నారు. -
దక్షిణాఫ్రికాదే టి20 సిరీస్
జొహన్నెస్‌బర్గ్: కీలకదశలో వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్... దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నెగ్గిన దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (29 బంతుల్లో 65 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), డసెన్ (27 బంతుల్లో 45; ఫోర్, 4 సిక్స్‌లు) మెరిశారు. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ బాబర్ ఆజమ్ (58 బంతుల్లో 90; 13 ఫోర్లు, సిక్స్), హుస్సేన్ తలత్ (55; 7 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడారు. ఒకదశలో 16 ఓవర్లలో 147/1తో పటిష్టంగా కనిపించిన పాక్ తొమ్మిది బంతుల తేడాతో ఆజమ్, తలత్ వికెట్లను కోల్పోవడంతో విజయంపై ఆశలు వదులుకుంది. మూడో టి20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. -
తల్లిగా లాలించింది... ప్లేయర్‌గా గెలిచింది
గోల్డ్‌కోస్ట్: ఎక్కడైనా ప్రతిష్టాత్మక గేమ్స్ జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చే అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటారు... ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తారు. మరికొందరు పట్టుదలగా ఆడతారు. పతకాల్ని పట్టుకెళ్తారు. కానీ ‘వనుతు’ దేశానికి చెందిన బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి మిల్లర్ పటా ఏడు నెలల పసివాడితో గోల్డ్‌కోస్ట్‌కు వచ్చింది. గురువారం లిన్లైన్ మటౌటుతో కలిసి కాంస్యం గెలిచిన మిల్లర్ పటా... ఈ పతకం వేటలో అందరికంటే ఎక్కువే కష్టపడింది. సాధారణంగా క్రీడాగ్రామంలో చిన్నపిల్లల్ని అనుమతించరు. దీంతో మిల్లర్ తన చిన్నారి కోసం క్రీడాగ్రామంలోని వసతుల్ని కాదని బయట వేరే చోటు చూసుకుంది. తన చిన్నారికి పాలిచ్చి, లాలించిన తర్వాత ఆమె ప్రాక్టీసులో చెమటోడ్చేది. ఇలా తల్లిగా, పతకం గెలిచాక అథ్లెట్‌గా ఆమె రెండు పాత్రలకు న్యాయం చేసింది. పతకాన్ని తన కుమారుడి సాక్షిగా అందుకొని తెగ మురిసిపోయింది -
వియ్ కెన్ డు ఇట్
ఏళ్లుగా చూస్తోంది ప్రపంచం ఈ పోస్టర్ని. హోవర్ట్ మిల్లర్ అనే ఆర్టిస్టు ఈ పెయింటింగ్‌ని వేశాడు. ఎప్పుడూ.. 1940లలో! రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైమ్‌లో! తలకు ఎరుపు, తెలుపు పోల్కా చుక్కల ‘బందన’ కట్టుకుని వర్కింగ్ కోట్తో కాలిఫోర్నియాలోని నేవల్ ఎయిర్ స్టేషన్లో పని చేస్తూ ఉన్న ఓ ఇరవై ఏళ్ల యువతి ఫోటోను న్యూస్పేపర్లలో, మ్యాగజీన్స్‌లో చూసి, ఇన్స్పైర్ అయ్యి, ఈ చిత్రాన్ని గీశాడు హోవర్ట్. ఒక ఆడపిల్ల.. మగ ప్రపంచంలోకి వచ్చి జాబ్ చెయ్యడం ఎంత పెద్ద అమెరికాలో అయినా అప్పట్లో అపురూపమే. ఆమె ఫొటోను ఎవరు తీసి, ఎవరు పత్రికలకు ఇచ్చారో తెలీదు. ఆ ఫొటోలోని పోలికల్ని తీసుకుని, పిడికిలి బిగించి చెయ్యెత్తి బలాన్ని చూపిస్తున్న బొమ్మను గీశాడు హోవర్ట్. ఒరిజినల్ ఫొటో కన్నా కూడా, (అందులో ఆ యువతి తన పనిలో లీనమై ఉంటుంది) ఆ ఫొటోను చూసి గీసిన ‘పిడికిలి’ బొమ్మ అమెరికా అంతటా బాగా పాపురల్ అయింది. దాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకుంది! ఫ్యాక్టరీల్లోకి, షిప్యార్డుల్లోకి, ఇంకా కష్టమైన పనుల్లోకి మహిళల్ని రప్పించేందుకు దానినొక ఇన్స్పైరింగ్ పోస్టర్‌గా వాడుకుంది. పోస్టర్‌లోని అమ్మాయికి ‘రోజీ ది రివెటర్’ అనే పేరు పెట్టి, ‘వియ్ కెన్ డు ఇట్’ అనే క్యాప్షన్ టైటిల్‌తో పోస్టర్లు ప్రింట్ చేయించి, గోడలపై అంటించి, యుద్ధ విధుల్లోకి కూడా అమ్మాయిల్ని ఆహ్వానించింది! అమెరికన్ జానపద గాథల్లోని వర్కింగ్ క్లాస్ విమనే రోజీ! ప్రపంచ యుద్ధం ముగిశాక కూడా ఆ పోస్టర్ ప్రాధాన్యం తగ్గలేదు. అమ్మాయిల మనోబలానికి ‘వియ్ ఎన్ డు ఇట్’ పోస్టర్ ఒక ప్రతీకగా నిలిచిపోయింది. కాలం గడిచింది. ఇంతకీ పోల్కా చుక్కల ఆ అమ్మాయి ఎవరు అన్న ప్రశ్న వచ్చింది. 1980లో గెరాల్డిన్ హోఫ్ డోయల్ అనే మహిళ అది తన ఫొటోనేనని ప్రకటించింది. ప్రపంచం కూడా అది గెరాల్డిన్ ఫోటోనేనని నమ్ముతూ వచ్చింది. అయితే 2009తో సడెన్‌గా నవోమీ పార్కర్ ఫ్రేలే సీన్లోకి వచ్చారు! ‘వరల్డ్ వార్ 2 హోమ్ ఫ్రంట్ నేషనల్ హిస్టారిక్ పార్క్’లో ఒరిజినల్ ఫొటో చూసి, ఆనందంతో కెవ్వున అరిచినంత పనిచేశారు నవోమీ. అది తన ఫొటోనే! అయితే ఫొటో కింద గెరాల్డిన్ డోయల్ అనే పేరు ఉండడం చూసి షాక్ తిన్నారు. అది నా ఫొటోనే.. నా ఫొటోనే అన్నారు కానీ ఎవరు నమ్ముతారు? రుజువేమిటి? రుజువు చెయ్యడానికి 2016 వరకు నవోమీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో జేమ్స్ కింబ్లే అనే యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆమెకు సహాయం చేస్తూ వచ్చారు. చివరికి నవోమీనే ‘రోజీ ది రివెటర్’ అని రూడీ అయింది. ‘రెటోరిక్ అండ్ పబ్లిక్ ఎఫైర్స్’ మ్యాగజీన్లో జ్ఞాపకాలు, గుర్తులు, ఆనవాళ్లతో సహా నవోమీ కథ వచ్చింది. నవోమీ ఎంతో సంతోషించారు. వాషింగ్టన్లో ఉంటున్న 97 ఏళ్ల నవోమీ పార్కర్ ఫ్రేలే మొన్న జనవరి 20న కన్ను మూసేవరకు ఆ సంతోషం ఆమె వెంటే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిమా మూర్తులైన స్త్రీలు కొందరు ప్రతి దేశానికీ కావాలి. అమెరికన్లు నన్ను ఒక ప్రతిమగా భావించడం నాకు సంతోషంగా ఉంది. – నవోమీ పార్కర్ ఫ్రేలే (1916) -
పెళ్లింట విషాదం
రెండు ప్రాణాలను బలిగొన్న మిల్లర్ రోడ్డు ప్రమాదంలో మేనమామ, మేనల్లుడు మృతి తుని రూరల్ : తుని మండలం తేటగుంట శివారు రాజుల కొత్తూరు వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న మిల్లరు ఆటోను మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం జరిగిన ప్రమాదంలో సీలి వెంకటరమణ (22) అక్కడికక్కడే మృతి చెందగా ఎస్కే అమర్ (అమర్నాథ్) (4) తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు రూరల్ ఎస్సై ఎం.అశోక్ తెలిపారు. వీరిద్దరూ శంఖవరం మండలం కత్తిపూడి గ్రామం ఒకే కుటుంబానికి చెందిన మేనమామ, మేనల్లుడన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్ ఎస్సై అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జూన్ ఐదున జరగనున్న తన సోదరుడి వివాహానికి బంధువులను పిలిచేందుకు కత్తిపూడికి చెందిన వెంకటరమణ మేనల్లుడు అమర్‌తో కలసి మోటార్ సైకిల్‌పై తుని వచ్చారు. శుభలేఖలు పంపిణీ చేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో రాజులు కొత్తూరు వద్ద ప్రమాదానికి గురయ్యారు. వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన అమర్‌ను ప్రత్యేక వాహనంలో తుని ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. కొద్దిసేపు చికిత్స పొందుతూ అమర్ మృతి చెందినట్టు ఆయన వివరించారు. కేసు నమోదు చేసి దర్వాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రూరల్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అలముకున్న విషాదం జూన్ ఐదున జరగనున్న వివాహ వేడుకలతో ఆనందంగా ఉండాల్సిన ఆ ఇంట విషాదమే మిగిలింది. తన సోదరుడు చంద్రరావు వివాహం దగ్గరుండి చేసేందుకు హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వెంకటరమణ ఇటీవల స్వగ్రామం కత్తిపూడి వచ్చాడు. పది రోజులు గడువు ఉండడంతో బంధువులను స్వయంగా ఆహ్వానించేందుకు మేనల్లుడు అమర్‌ను తీసుకుని మోటార్ సైకిల్‌పై బయలుదేరాడు. తుని ప్రాంతంలో బంధువులకు శుభలేఖలు ఇచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. రాజులు కొత్తూరు వద్ద ఆగి ఉన్న మిల్లరు ఆటోను ఢీకొని మృత్యువాత పడ్డారు. చేతికి అందివచ్చిన చిన్న కొడుకు వెంకటరమణ, అల్లారు ముద్దుగా చూసుకుంటున్న పెద్ద మనమడు అమర్ మృతి చెందడంతో సీలి మరియరాణి, సీలి ముసలియ్య దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు తన వివాహం జరిపించేందుకు వచ్చిన సోదరుడు మృతి చెందాడని పెళ్లి పీటలు ఎక్కాల్సిన చంద్రరావు, పెద్ద కుమారుడిని కోల్పోయామని అమర్ తల్లిదండ్రులు ఎస్కే దుర్గ, నాగలక్ష్మి బోరున విలపిస్తున్నారు. పెళ్లింట విషాదం నెలకొనడంతో స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. విషయం తెలియడంతో ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకుని విలపిస్తున్నారు. -
ఢిల్లీ ఘనవిజయం
-
ఢిల్లీ ధమాకా...
-
ఢిల్లీ ధమాకా...
♦ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం ♦ రాణించిన బిల్లింగ్స్, మోరిస్ మ్యాక్స్‌వెల్, మిల్లర్, మోర్గాన్ ఇలా మ్యాచ్‌ను మలుపుతిప్పే సూపర్ బ్యాట్స్‌మెన్ ఉన్న కింగ్స్ ఎలెవన్... ఢిల్లీ బౌలర్ల ధాటికి తల్లడిల్లింది. అతి పేలవమైన ప్రదర్శనతో పరాభవాన్ని మూటగట్టుకుంది. న్యూఢిల్లీ: ఐపీఎల్–10లో ఢిల్లీ డేర్డెవిల్స్మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 51 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై గెలుపొందింది. ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. బిల్లింగ్స్ (40 బంతుల్లో 55; 9 ఫోర్లు) ధాటిగా ఆడగా... చివర్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోరె అండర్సన్ (22 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వరుణ్ అరోన్‌కు 2 వికెట్లు దక్కగా, సందీప్, మోహిత్, అక్షర్ పటేల్‌లు తలా ఒక వికెట్ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (29 బంతుల్లో 44; 1 ఫోర్, 3 సిక్సర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. మిల్లర్ (24), మోర్గాన్ (22) ఢిల్లీ బౌలర్లకు తలవంచారు. మోరిస్ 3, నదీమ్, కమిన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: సంజూ సామ్సన్ (సి) మోర్గాన్ (బి) కరియప్ప 19; బిల్లింగ్స్ (సి) మిల్లర్ (బి) అక్షర్ 55; కరుణ్ (సి) సాహా (బి) అరోన్ 0; శ్రేయస్ (సి) మోర్గాన్ (బి) మోహిత్ 22; రిషభ్ పంత్ (సి) మోర్గాన్ (బి) ఆరోన్ 15; అండర్సన్ నాటౌట్ 39; మోరిస్ (సి) మోహిత్ (బి) సందీప్ 16; కమిన్స్ నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–53, 2–55, 3–96, 4–103, 5–120, 6–151. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–41–1, మోహిత్ శర్మ 4–0–37–1, అక్షర్ 4–0–33–1, వరుణ్ ఆరోన్ 4–0–45–2, కరియప్ప 3–0–23–1, మ్యాక్స్‌వెల్ 1–0–7–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: వోహ్రా (ఎల్బీడబ్ల్యూ) నదీమ్ 3; ఆమ్లా (సి) బిల్లింగ్స్ (బి) మోరిస్ 19; సాహా (సి) జహీర్ (బి) నదీమ్ 7; మోర్గాన్ (సి) నాయర్ (బి) కమిన్స్ 22; మిల్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అండర్సన్ 24; మ్యాక్స్‌వెల్ (సి) బిల్లింగ్స్ (బి) అమిత్ మిశ్రా 0; అక్షర్ పటేల్ (బి) మోరిస్ 44; మోహిత్ శర్మ (బి) కమిన్స్ 13; కేసీ కరియప్ప (బి) మోరిస్ 1; సందీప్ శర్మ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–5, 2–21, 3–31, 4–64, 5–65, 6–88, 7–133, 8–134, 9–137. బౌలింగ్: జహీర్ 4–0–38–0, నదీమ్ 2–0–13–2, మోరిస్ 4–0–23–3, కమిన్స్ 4–0–23–2, అమిత్ మిశ్రా 3–0–16–1, అండర్సన్ 3–0–23–1. -
పంజాబ్ కింగ్స్ బోణీ
-
పంజాబ్ కింగ్స్ బోణీ
► రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై విజయం ► రాణించిన మ్యాక్స్‌వెల్, మిల్లర్ ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు బోణీ చేసింది. కీలక సమయంలో కొత్త కెప్టెన్ మ్యాక్స్‌వెల్ (20 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (27 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) సమయోచితంగా రాణించారు. దాంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. లీగ్‌లో ఇప్పటిదాకా ఎనిమిది సార్లు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే అన్నింటిలోనూ పరాజయం పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, మనోజ్ తివారి (23 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. సందీప్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు 19 ఓవర్లలో నాలుగు వికెట్లకు 164 పరుగులు చేసింది. ఆమ్లా (27 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (22 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) పర్వాలేదనిపించారు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆదుకున్న స్టోక్స్, తివారి: పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించకపోవడంతో పుణే బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడారు. తొలి ఓవర్లోనే మయాంక్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. నాలుగో ఓవర్లో రహానే (15 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) ఇచ్చిన క్యాచ్‌ను వోహ్రా వదిలేయగా... అదే ఓవర్లో అతను వరుసగా 6,4 బాది స్కోరులో వేగం తెచ్చాడు. ఆ తర్వాత ఓవర్లో కెప్టెన్ స్మిత్ (27 బంతుల్లో 26; 3 ఫోర్లు) వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న నటరాజన్ తన తొలి ఓవర్లోనే రహానే వికెట్ తీసి పంజాబ్ జట్టులో సంతోషం నింపాడు. మరో ఓవర్ వ్యవధిలో స్మిత్ వికెట్‌ను స్టొయినిస్ తీయడంతో పుణే 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు ధోని (5) కూడా విఫలం కావడంతో భారమంతా స్టోక్స్, తివారిలపై పడింది. వీరిద్దరి జోరుకు తోడు చివర్లో క్రిస్టియాన్ 4,4,6 బాదడంతో జట్టు మంచి స్కోరు సాధించగలిగింది. మ్యాక్స్‌వెల్ బాదుడు: లక్ష్యం కోసం బరిలోకి దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభించింది. క్రీజులో ఉన్నంతసేపు స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించిన వోహ్రా (9 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) మూడో ఓవర్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుస ఫోర్లతో జోరు చూపించిన సాహా (14; 3 ఫోర్లు)ను తాహిర్ తన తొలి ఓవర్లోనే బౌల్డ్ చేశాడు. పవర్‌ప్లేలో పంజాబ్ 56 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత 4 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా పుణే బౌలర్లు కట్టడి చేయగలిగారు. దీంతో ఒత్తిడికి లోనైన అక్షర్, ఆమ్లా వరుస ఓవర్లలో వికెట్లను చేజార్చుకున్నారు. అయితే మ్యాక్స్‌వెల్, మిల్లర్ ధాటిగా ఆడి పంజాబ్‌కు విజయాన్ని అందించారు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) స్టొయినిస్ (బి) నటరాజన్ 19; మయాంక్ అగర్వాల్ (బి) సందీప్ శర్మ 0; స్మిత్ (సి) వోహ్రా (బి) స్టొయినిస్ 26; స్టోక్స్ (సి అండ్ బి) అక్షర్ 50; ధోని (సి అండ్ బి) స్వప్నిల్ సింగ్ 5; మనోజ్ తివారి నాటౌట్ 40; క్రిస్టియాన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ శర్మ 17; రజత్ భాటియా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–1, 2–36, 3–49, 4–71, 5–132, 6–162. బౌలింగ్: సందీప్ 4–0–33–2; మోహిత్ 4–0–34–0; అక్షర్ 4–0–27–1; నటరాజన్ 3–0–26–1; స్టొయినిస్ 3–0–28–1; స్వప్నిల్ సింగ్ 2–0–14–1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) స్టోక్స్ (బి) చహర్ 28; వోహ్రా (సి) తివారి (బి) దిండా 14; సాహా (బి) తాహిర్ 14; అక్షర్ (సి అండ్ బి) తాహిర్ 24; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 44; మిల్లర్ నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–27, 2–49, 3–83, 4–85. బౌలింగ్: దిండా 3–0–26–1; క్రిస్టియాన్ 2–0–24–0; స్టోక్స్ 4–0–32–0; తాహిర్ 4–0–29–2; చహర్ 4–0–32–1; భాటియా 2–0–20–0. -
శతక్కొట్టిన మిల్లర్, డు ప్లెసిస్
దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక చిత్తు డర్బన్: డు ప్లెసిస్, మిల్లర్ సెంచరీలతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికా 121 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 307 పరుగులు చేసింది. మిల్లర్ (98 బంతుల్లో 117 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), డు ప్లెసిస్ (120 బంతుల్లో 105; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. ఇద్దరు ఐదో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. అనంతరం మిల్లర్... మోరిస్ (26)తో కలిసి ఆరో వికెట్‌కు 65 పరుగులు జతచేశాడు. లక్మాల్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత శ్రీలంక 37.5 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. లంక బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేకపోయారు. చండిమాల్ 36 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో పార్నెల్, ఇమ్రాన్ తాహిర్, డుమిని తలా 2 వికెట్లు తీశారు. ఐదు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2–0తో ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే శనివారం జొహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. సెంచరీతో చెలరేగిన మిల్లర్ గాయం కారణంగా తదుపరి మూడు వన్డేలకు దూరమయ్యాడు. -
కుమ్మేసి.. కూల్చేశారు!
డర్బన్: ఇటీవల శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన దక్షిణాఫ్రికా.. వన్డే సిరీస్ లో మాత్రం చెలరేగిపోతోంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో సైతం సఫారీలు ఏకపక్ష విజయం సాధించారు. లంకేయుల్ని 37.5 ఓవర్లలో186 పరుగులకే కూల్చిసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సఫారీలు సత్తాచాటుకుని 121 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఇరు జట్ల మధ్య జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో టాస్ ఓడిన తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్(105), మిల్లర్(117) శతకాలతో మెరిశారు. ఈ జోడి ఐదో వికెట్ కు 117 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. తొలుత లంకేయుల్ని కుమ్మేసిన సఫారీలు.. ఆ తరువాత పేకమేడలా కూల్చేశారు. దక్షిణాఫ్రికా విసిరిన 308 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ ఒక్కరూ లంక క్రికెటర్ కనీసం హాఫ్ సెంచరీ మార్కును చేరకపోవడంతో వారికి ఘోర ఓటమి ఎదురైంది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఐదు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-0 తో ఆధిక్యంలో నిలిచింది. -
‘సన్నా’లపై సన్నాయి రాగం
సన్న బియ్యం సరఫరాలో బడా మిల్లర్ల జిమ్మిక్కులు మార్కెట్లో సన్న ధాన్యం ధర తక్కువ ఉన్నప్పుడు సరఫరా.. ఇప్పుడు ఈ ధర పెరగ్గానే.. ఇతర మిల్లర్లపై ఒత్తిడి.. వ్యతిరేకించిన చిన్నా, చితక మిల్లర్లు.. ప్రశ్నార్థకంగా 5,800 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ నిజామాబాద్ :సర్కారుకు సన్న (బీపీటీ) బియ్యం సరఫరాలో మిల్లర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. అత్యధిక లాభాల పంట పండించే స్టీమ్ రైస్‌ను రాజకీయ పలుకుబడి కలిగిన కొద్ది మంది మిల్లర్లు సరఫరా చేయగా.. ఇప్పుడు రాౖ రెస్ విషయానికి వచ్చే సరికి చిన్న, చితక మిల్లర్లపై కూడా ఒత్తిడి తెస్తున్నారని ఒకవర్గం మిల్లర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సర్కారు సన్న బియ్యం సేకరణ ప్రశ్నార్థకంగా తయారైంది. మధ్యాహ్న భోజన పథకం, వివిధ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన భోజనం వడ్డించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇందుకోసం అవసరమైన సన్న బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ సేకరిస్తోంది. క్వింటాలలుకు రూ.మూడు వేల చొప్పున మిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతోపాటు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అవసరాలకు కూడా ఇక్కడి నుంచే సన్న బియ్యం సేకరణ ప్రక్రియ చేపట్టారు. స్టీమ్ రైస్ సరఫరాలో లాభాల పంట పౌర సరఫరాల సంస్థ ఇప్పటి వరకు 4,900 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం స్టీమ్ రైస్ సేకరించింది. గత నెల రోజులుగా మార్కెట్లో సన్న రకాల ధాన్యం తక్కువ ధరకు లభించింది. జైశ్రీరాం వంటి రకాలు కూడా రూ.1,700 వరకు తగ్గింది. ఇలా సన్న రకం ధాన్యం మార్కెట్లో తక్కువ ధరకు లభించినప్పుడు రాజకీయ అండదండలున్న మిల్లర్లు పెద్ద మొత్తంలో సన్న బియ్యాన్ని సర్కారుకు అంటగట్టి లాభాలను ఆర్జించారు. కేవలం తొమ్మిది మంది బడా మిల్లర్లు ఒక్కొక్కరు 20 నుంచి 45 ఏసీకేలు స్టీమ్ రైస్ సరఫరా చేశారు. తీరా ఇప్పుడు రా రైస్ విషయానికి వస్తే మాత్రం జిల్లాలో ఉన్న అందరు మిల్లర్లు సరఫరా చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చిన్నా, చితక మిల్లర్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. స్టీమ్ రైస్ సరఫరా చేసి లాభాలను ఆర్జిన మిల్లర్లే ఇప్పుడు రా రైస్ కూడా సరఫరా చేయాలని ఇటీవల జరిగిన మిల్లర్ల సమావేశంలో డిమాండ్ చేసినట్లు సమాచారం. 5,800 మెట్రిక్ టన్నుల రా రైస్ రానున్న తొమ్మిది నెలల అవసరాల కోసం అదనంగా 5,800 మెట్రిక్ టన్నుల రా రైస్ కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ సన్నద్ధమవుతోంది. సరఫరా చేసే మిల్లర్ల జాబితా ఇవ్వాలని సంస్థ అధికారులు మిల్లర్స్ అసోసియేషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో మిల్లర్లు సమావేశమయ్యారు. రారైస్ జిల్లాలోని అందరు మిల్లర్లు సరఫరా చేయాలని బడా మిల్లర్లు ఒత్తిడి తెచ్చారు. ప్రస్తుతం సన్న రకం ధాన్యానికి ధర పెరిగింది. క్వింటాలుకు రూ.రెండు వేల వరకు పలుకుతోంది. ఈ తరుణంలో రా రైస్ సరఫరా చేస్తే పెద్ద ఒరిగేదేమీ ఉండదని భావించిన బడా మిల్లర్లు ఇప్పుడు ఈ బాధ్యతను అందరు మిల్లర్లపై ఒత్తిడి తెచ్చారు. -
సఫారీల సూపర్ ఛేజ్
372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కైవసం మిల్లర్ సంచలన సెంచరీ సరిగ్గా పదేళ్ల క్రితం... 2006లో ఆస్ట్రేలియా జట్టు 434 పరుగులు చేస్తే... దక్షిణాఫ్రికా 438 పరుగులతో దానిని ఛేదించి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ వన్డేల్లో ఏ జటై్టనా భారీ స్కోరు చేస్తే ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటారు. పదేళ్లరుునా ఆ రికార్డు చెక్కుచెదరలేదు. మళ్లీ ఇన్నాళ్లకు 2016లో... ఆస్ట్రేలియా జట్టు 371 పరుగులు చేస్తే... దక్షిణాఫ్రికా జట్టు అలవోకగా 372 పరుగులు బాది మళ్లీ గెలిచింది. నాటి 435 పరుగుల లక్ష్యం తర్వాత... రెండో అతిపెద్ద లక్ష్య ఛేదన (372)తో రికార్డుల పుస్తకంలో రెండో స్థానంలోకి వచ్చేసింది. 2013లో ఆస్ట్రేలియాపై భారత్ 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ రికార్డు ఇంతకాలం రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా ఉంది. దీనిని కూడా సఫారీలు ఊదేశారు. డర్బన్: కలయా... మాయా...! ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఆటతీరు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఎదురుగా భారీ లక్ష్యం... 265 పరుగుల దగ్గర మిల్లర్ మినహా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అంతా అవుటయ్యారు. ఈ దశలో కిల్లర్ మిల్లర్ సంచలన ఇన్నింగ్స (79 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడాడు. బౌలర్‌ను అండగా పెట్టుకుని దక్షిణాఫ్రికాను గెలిపించాడు. కింగ్సమీడ్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 371 పరుగుల భారీస్కోరు చేసింది. వార్నర్ (107 బంతుల్లో 117; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (107 బంతుల్లో 108; 9 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీలు చేశారు. దక్షిణాఫ్రికా జట్టు 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 372 పరుగులు చేసి గెలిచింది. చివర్లో మిల్లర్‌కు తోడుగా ఫెలుక్వాయో (39 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా ఆడాడు. డికాక్ (49 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మిల్లర్, ఫెలుక్వాయో ఏడో వికెట్‌కు అజేయంగా 70 బంతుల్లో 107 పరుగులు జోడించడం విశేషం. ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కై వసం చేసుకుంది. నాలుగో వన్డే ఆదివారం జరుగుతుంది. 7 దక్షిణాఫ్రికా జట్టు ఏడు సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచింది. 743 ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి చేసిన పరుగులు. గతంలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా (872 పరుగులు; 2006), భారత్-శ్రీలంక (825 పరుగులు, 2009), ఇంగ్లండ్-శ్రీలంక (763 పరుగులు, 2015) మ్యాచ్‌లలో మాత్రమే ఇంతకంటే ఎక్కువ పరుగులు వచ్చారుు. 69 మిల్లర్ 69 బంతుల్లో సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున ఇది ఏడో వేగవంతమైన సెంచరీ. అరుుతే మిల్లర్‌కు ముందు ఉన్న ఆరు ఫాస్టెస్ట్ సెంచరీలన్నీ డివిలియర్స్ ఒక్కడే చేశాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స: వార్నర్ (సి) డుమిని (బి) తాహిర్ 117; ఫించ్ (సి) రబడ (బి) తాహిర్ 53; స్టీవ్ స్మిత్ (బి) స్టెరుున్ 108; బెరుులీ (సి) డుప్లెసిస్ (బి) ఫెలుక్వాయో 28; మిషెల్ మార్ష్ (సి) మిల్లర్ (బి) స్టెరుున్ 2; హెడ్ (సి) అండ్ (బి) రబడ 35; వేడ్ నాటౌట్ 17; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 371. వికెట్ల పతనం: 1-110; 2-234; 3-280; 4-300; 5-325; 6-371. బౌలింగ్: స్టెరుున్ 10-0-96-2; రబడ 10-0-86-1; ప్రెటోరియస్ 6-0-42-0; తాహిర్ 10-0-54-2; ఫెలుక్వాయో 8-0-58-1; డుమిని 6-0-32-0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స: డికాక్ (సి) వోరల్ (బి) ట్రైమెన్ 70; ఆమ్లా ఎల్బీడబ్ల్యు (బి) హాస్టింగ్‌స 45; డు ఫ్లెసిస్ (సి) వార్నర్ (బి) హెడ్ 33; రోసో ఎల్బీడబ్ల్యు (బి) జంపా 18; డుమిని (సి) ఫించ్ (బి) హాస్టింగ్‌స 20; మిల్లర్ నాటౌట్ 118; ప్రెటోరియస్ (సి) వార్నర్ (బి) మార్ష్ 15; ఫెలుక్వాయో నాటౌట్ 42; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.2 ఓవర్లలో 6 వికెట్లకు) 372. వికెట్ల పతనం: 1-66; 2-140; 3-164; 4-179; 5-217; 6-265. బౌలింగ్: ట్రైమెన్ 10-0-65-1; వోరల్ 9-0-78-0; హాస్టింగ్‌స 10-0-79-2; మార్ష్ 10-0-61-1; జంపా 7.2-1-55-1; హెడ్ 3-0-31-1. -
అన్నదాతను అక్కడా ముంచేశారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :అకాలవర్షాలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే దశలోనూ అన్నదాత నిలువునా మునిగిపోయాడు. మిల్లర్లు, దళారుల మాయాజాలం, అధికారుల అవినీతి వెరసి ఖరీఫ్‌లో కష్టపడి పండించిన పంటను రైతు అయినకాడికి తక్కువ ధరకు అమ్మేసుకున్నాడు. 75 కేజీల బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.1087.50 కాగా, అధిక శాతం మంది రైతులు బస్తాను రూ.600 నుంచి గరిష్టంగా రూ.850కే అమ్మేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం లెవీ సేకరణను పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి కొనుగోళ్లు జరిపి మిల్లింగ్ కోసం మిల్లర్లకు పంపాలి. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 305 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందిరాక్రాంతి పథకం ద్వారా 150, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 150 కేంద్రాలను, మరో ఐదు కేంద్రాలను మార్కెటింగ్ సొసైటీల ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో దాదాపు 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రాథమిక అంచనా వేశారు. అయితే సరిగ్గా దిగుబడి చేతికొచ్చే దశలో గత నవంబర్‌లో కురిసిన అకాలవర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడులపై ప్రభావం చూపించింది. భారీవర్షాలకు వరిపంట తడిసి ముద్దవడంతో సుమారు రెండున్నర లక్షల మెట్రిక్ ధాన్యం రంగు మారిందని అధికారులే ప్రకటించారు. పంట నీటిలో నానడంతో ధాన్యం మొలకలు రావడం, రంగు మారే పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో 17శాతం లోపు తేమ ఉంటేనే కొనుగోలు చేయాలనే నిబంధనలను విధించారు. ఇక రంగు మారిన ధాన్యంపై ప్రభుత్వం చివరి వరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో ప్రభుత్వ కేంద్రాల్లో పెద్దగా కొనుగోళ్లు జరగలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు అయినకాడికి దళారులకు, మిల్లర్లకు అమ్మేసుకున్నారు.75 కేజీల బస్తాను రూ.1087.50కు అమ్ముకోవాల్సిన రైతులు రూ.600 నుంచి రూ.850కే దళారులకు అమ్మేసుకున్నారు. మొత్తంగా బస్తాకు రూ.300 నుంచి రూ.500 వరకు నష్టాన్ని చవిచూశారు. ఇదే సందర్భంలో మిల్లర్లు, దళారులు, కొనుగోళ్ల కేంద్రాల నిర్వాహకులు మాత్రం కుమ్మక్కై అందినకాడికి దోచేసుకున్నారు. లెక్కలు తారుమారు రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నేరుగా కొనుగోలు చేయకపోవడంతో దళారులు, మిల్లర్లే రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొన్నారు. కానీ ఆ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు. రూ.600కు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రూ.1087కి కొన్నట్టు లెక్కలు తారుమారు చేసి రూ.కోట్లు నొక్కేశారు. చివరికి తడిసిన ధాన్యాన్ని కూడా నిబంధనల మేరకు తేమ శాతం తక్కువగానే ఉందని చూపించి కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు జరిపారు. వాస్తవానికి జిల్లావ్యాప్తంగా 80 శాతం మంది రైతులు నేరుగా దళారులు, మిల్లర్లకే ధాన్యం అమ్మేసుకోగా, అధికారులు మాత్రం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 10లక్షల97వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. సుమారు ఒక్కో రైతు.. బస్తాకు సగటున రూ.250 చొప్పున నష్టపోయారని లెక్కగట్టినా.. మిల్లర్లు, దళారులు, ఐకేపీ నిర్వాహకులు మింగేసింది రూ.200 కోట్లపైనే ఉంటుందని అంచనా. జిల్లాలో అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిన ఈ ధాన్యం కొను‘గోల్మాల్’పై అధికారులు మాత్రం అటువంటిదేమీ జరగలేదని వాదిస్తున్నారు. ఆగని మిల్లర్ల మాయాజాలం లెవీ ఎత్తివేయడంతో మిల్లర్ల నుంచి ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేసే అవకాశం లేదు. దాంతో మిల్లర్లు.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై అక్రమ పద్ధతులకు తెరతీశారు. గతంలో మాదిరిగానే రైతుల నుంచి మిల్లర్లే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరిపినట్టు లెక్కలు చూపించారు. ఫలితంగా గతంలో ఏరకంగా అయితే మిల్లర్ల మాయాజాలంలో చిక్కుకుని అయినకాడికి అమ్ముకుని రైతులు నష్టపోయారో ఇప్పుడు కూడా అదే మిల్లర్లకు దెబ్బతిన్నారు. లెవీ సేకరణ ఎత్తివేయడంతో రైతు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. -
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు
కివీస్‌పై 2-1తో సిరీస్ సొంతం డర్బన్ : కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (48 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులకు తోడు బౌలర్లు సమయోచితంగా రాణించడంతో బుధవారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సఫారీ జట్టు 2-1తో సొంతం చేసుకుంది. కింగ్స్మీడ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 283 పరుగులు చేసింది. వాన్ విక్ (58), ఆమ్లా (44) తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. మిల్లర్ (36), బెహర్డిన్ (40)లు మెరుగ్గా ఆడారు. వీలర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం వీస్ (3/58), రబడ (2/33), తాహిర్ (2/36)ల బౌలింగ్ ధాటికి న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 221 పరుగులకే కుప్పకూలింది. లాథమ్ (54) టాప్ స్కోరర్. విలియమ్సన్ (39), మున్రో (35) మోస్తరుగా ఆడారు. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; ఆమ్లాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. -
ఎకరాకు 1200 బస్తాల ధాన్యం!
ఎక్కడయినా ఎకరా పొలం ఉన్న రైతు 1200 బస్తాలు పండించగలరా?, పోనీ 20 టన్నుల సామర్థ్యమున్న లారీలో 120 టన్నుల ధాన్యాన్ని ఒకేసారి తరలించగలరా..?, తోటలు, మెట్టు భూమిలో ధాన్యం పండించగలరా..? సాధారణంగా అసాధ్యమైనా... మిల్లర్లు, ప్రభుత్వ సిబ్బంది కలిసి కాగితాలపై సాధ్యం చేశారు. దీంతో అధికారులు నోళ్లు వెళ్లబెట్టవలసి వచ్చింది. విజయనగరం కంటోన్మెంట్: కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి, దళారుల వ్యవస్థను రూపుమాపుతామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని గొప్పగా ప్రకటించిన అధికారులు ఏకంగా మిల్లర్లతో కలిసిపోయారు. దీంతో మిల్లర్లు ఆడింది ఆట, పాడింది పాటగా తయారైంది. తమ్ముడు, భార్య, అత్త, మామ ఇలా అందరి పేరుమీద బిల్లులు రాసేసుకున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళితే ఇచ్చే ట్రక్షీట్లు, గోనెలు, వీఆర్వో ఇచ్చే సాగు ధ్రువీకరణ పత్రాలను తమకు అనుకూలంగా మార్చేసుకుని కోట్లాది రూపాయలను తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయించుకున్నారు. ఇంతకీ ఎన్ని క్వింటాళ్ల ధాన్యం మిల్లులకు తరలించారు. ఏ మిల్లు వద్ద ఎంత ధాన్యముంది అన్న విషయం అధికారులకు తెలియకపోవడం విశేషం. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు. నిగ్గుతేల్చేందుకు 22 బృందాలను నియమించారు. ఆ బృందాలు మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నాయి. ఈ తనిఖీల్లో మిల్లర్ల మాయాజాలం బయటపడుతున్నట్టు సమాచారం. మిల్లర్ల చేతికి ట్రక్షీట్లు, సాగు ధ్రువీకరణ పత్రాలను అధికారులు ఇచ్చేయడంతో వాటిని జిరాక్సు తీసి నచ్చినట్టు మిల్లర్లు బిల్లులు చేసుకున్నారని తెలుస్తోంది. పెద్ద కమతాలున్న రైతులు జిల్లాలో తక్కువ సంఖ్యలో ఉన్నారు. రెండు వందల బస్తాల ధాన్యం పండించిన రైతులను వేళ్లపై లెక్కించవచ్చు. అయితే చాలా మంది రెండు వేల బస్తాలు పైనే పండించినట్టు, అది కూడా తక్కువ విస్తీర్ణంలోనే పండినట్టు పత్రాలు చూపించి, మిల్లర్లు బిల్లులు చేసుకున్నారు. 20 టన్నుల సామర్థ్యమున్న లారీ నంబర్లను ట్రక్‌షీట్‌లో పొందుపరిచి 120 టన్నుల ధాన్యాన్ని ఒకే సారి తరలించినట్టు గంట్యాడలో నాలుగు మిల్లులు వారు పేర్కొన్నప్పటికీ అధికారులు బిల్లులు పాస్‌చేశారు. 1700, 1550, 1725 కింటాళ్ల చొప్పున ఒక ఎకరా భూమి ఉన్న వారి పేరున కూడా బిల్లుల చెల్లింపులు చేయడం, బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేయడం జరిగిపోయాయి. ఒకే సర్వే నంబర్, ఒకే బ్యాంకు అకౌంటు నంబరున్న వారికి కూడా రెండు మూడు బిల్లులు చెల్లించేశారు. అయితే ఆ స్థాయిలో మిల్లుల్లో ధాన్యం నిల్వలు మాత్రం లేవు. ఒకే కుటుంబానికి చెందిన వారికి వరుస నంబర్లున్న ట్రక్ షీట్లు, సాగు ధ్రువీకరణ పత్రాలుండటం విశేషం. జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లర్లు తాము కొనుగోలు చేసిన ధాన్యానికి తమ బంధువుల పేర్లపై బిల్లులు పెట్టారు. బిల్లులకు జతపరచిన పట్టా దారు పాసుపుస్తకాలు ఇతరుల పేరున ఉన్నాయని తెలిసింది. తోటలు, మెట్టు భూమిలో వరిపంట! జిల్లాలో ధాన్యం విక్రయించినపుడు వాటికి సాగు ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తే మెట్టు భూమి, తోటల్లోనే పండించినట్టు ఆయా పత్రాల్లో పేర్కొన్నారు. వాస్తవానికి మెట్టు భూమిలోనూ, మామిడి తోటల్లోనూ వరి పండదనే విషయాన్ని కూడా అధికారులు గుర్తించకుండా బిల్లులు ఎలా చేశారో వారికే తెలియాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలనుంచి వచ్చిన బిల్లుల్లో సెంటర్ పేరు, వాహనం నంబర్, బస్తాల సంఖ్య వంటి వివరాల్లో తమకు నచ్చినవి పేర్కొని బిల్లులు చేసుకున్నారు. ఓ వైపు మిల్లర్లు- మరో వైపు దళారులు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు రెండు రకాలుగా జరిగాయి. ఓ వైపు మిల్లర్లు తమ వద్దకు వచ్చిన రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకుని జిరాక్సులు తమ వద్ద ఉంచుకుని తమ బంధువులను కౌలు రైతులుగా చూపించి ఈ జిరాక్సులను జత చేసి బిల్లులు చేసుకున్నారు. అదేవిధంగా దళారుల చేత చేయించిన బిల్లులు మరికొన్ని ఉన్నాయి. మిల్లర్లు సొంత పేరున పెట్టుకుంటున్న బిల్లులను కూడా అధికారులు పాస్ చేసేశారు. గంట్యాడ మండలం రావి వలసకు చెందిన కనకదుర్గ రైస్ అండ్ ఫ్లోర్ మిల్లు యజమాని కె. ముత్యాలయ్య తన ఒక్కరి పేరునే 2,190 బస్తాల ధాన్యం విక్రయించిన రైతుగా నమోదు చేసుకోవడం విశేషం. అదేవిధంగా ఇతని కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరి పేరున 1700 బస్తాల నుంచి రెండు వేల బస్తాల వరకూ విక్రయించినట్టు నమోదు చేసుకుని బిల్లులు చేసుకున్నారు. 12536 ట్రక్ షీట్ నంబర్ నుంచి 12541 నంబర్ వరకూ వరుస క్రమంలో ఉన్న ట్రక్ షీట్లతో బిల్లుల చేసుకున్నట్టు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. ఇలాగే ప్రమీల, ఎం విమల, ఎం కనకయ్య శెట్టి, టి ప్రశాంత్ తదితరుల పేరున బిల్లులు చేశారనీ, ఇలా మిల్లర్కే ఇన్ని ధాన్యం పండాయా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ ఒక్క కుటుంబమే దాదాపు 11వేల బస్తాల ధాన్యం పండించిన రైతులుగా నమోదు చేసుకుని విక్రయించినట్టు రికార్డులు చూపించారు. వీరు సుమారు రూ.60 లక్షల పైచిలుకు బిల్లులు చేసుకున్నారు. ఈ లెక్కన ఇతర మిల్లుల్లో అయిన బిల్లులు దాదాపు రూ.65 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే కౌలు రైతుల పేరుమీద కూడా వేరేవారి ఖాతాలో సొమ్ము జమఅయింది. సివిల్‌సప్లైస్ సహాయ మేనేజర్‌ను సలవుపై వెళ్లిపోమన్న జేసీ జిల్లాలో ధాన్యం అక్రమాలపై జాయింట్ కలెక్టర్ స్పందించారు. ధాన్యం అక్రమాలకు నీవే బాధ్యుడవంటూ సివిల్‌సప్లైస్ శాఖలో టెక్నికల్ సహాయ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న వలసయ్యపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవుపెట్టి వెళ్లి పొమ్మని ఆదేశించారు. వాస్తవానికి ఇటీవలే వలసయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇతరుల సహాయంతో ఇప్పుడిప్పుడే మిల్లర్లతో పరిచయాలు పెంచుకుంటున్న ఇతనిని బాధ్యుడిగా చేశారని, అసలు దొంగలను వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లెవీ తరలింపులో లేజీ!
పాలకొండ:వేల టన్నుల బియ్యాన్ని లెవీగా సేకరిస్తున్న అధికారులు.. వాటిని సకాలంలో తరలించి, సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేయడంపై శ్రద్ధ చూపడంలేదు. అధికారుల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాది బస్తాల బియ్యం నిల్వలను ఆరు బయలు ప్రాంతాల్లోనే వదిలేయడంతో మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. తమపై ఒత్తిడి చేసి కొనుగోలు చేయించిన అధికారులు.. బియ్యం తరలించేందుకు మాత్రం చొరవ చూపడం లేదని వారు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 114 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు ఆరు లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటా ధాన్యానికి 67 కేజీలు చొప్పున బియ్యం లెవీగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. మిల్లుల్లో స్థలాభావం ఉండటంతో బియ్యం ఆడించిన వెంటనే ఎఫ్‌సీఐ గోదాములకు తరలిస్తున్నారు. అయితే గత పది రోజులుగా మిల్లుల నుంచి బియ్యం తరలింపు పూర్తి నిలిచిపోయింది. ఎఫ్‌సీఐ గోదాములు పూర్తిగా నిండిపోవడమే దీనికి కారణం. రణస్థలం మండలం పైడి భీమవరం, రాజాం ప్రాంతాల్లోని గోదాములు ఇప్పటికే బియ్యంతో నిండిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పలు వ్యవసాయ మార్కెట్ కమిటీల గోదాములు ఖాళీగా ఉన్నప్పటికీ అధికారులు దృష్టి సారించకపోవడంతో అవి నిరుపయోగంగానే ఉన్నాయి. లెవీ బియ్యాన్ని వీటిలో నిల్వ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మిల్లర్లు కోరుతున్నారు. వర్షం వస్తే... జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాలు దాదాపు పూర్తి కావచ్చాయి. మిల్లులకు పూర్తిస్థాయిలో ధాన్యం చేరాయి. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని మిల్లుల వద్ద ఆరుబయట స్థలాల్లోనే నిల్వ చేస్తున్నారు. వందల టన్నుల బస్తాల బియ్యం ఇలా ఆరుబయటే ఉండిపోయాయి. కాగా గత రెండు రోజులుగా గాలులు వీస్తుండడం, సాయంత్రమైతే ఆకాశం మేఘావృతం అవుతుండడంతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. కొద్దిపాటి వర్షం పడినా కోట్లాది రూపాయల విలువ చేసే బియ్యం పాడవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం బియ్యం నిల్వలను గోదాములకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీవో కె.సాల్మన్‌రాజ్ తెలిపారు. గోదాములు నిండిపోయిన విషయం ఆయన వద్ద ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. మార్కెట్ కమిటీల్లో ఉన్న గోదాములను వినియోగించుకునేలా చర్యలు చేపడతామన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చించి మిల్లర్లకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. -
కొనుగోల్ మాల్!
పాలకొండ:జిల్లాలో ధాన్యం పండించిన రైతులకు ఎదురవుతున్న సమస్యల్లో ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఇటు మిల్లర్లు.. అటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల తిరస్కరణతో కష్టనష్టాలకోర్చి పండించిన ధాన్యం రాసులను కళ్లాల్లోనే పెట్టుకొని దిక్కులు చూడాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం రైతులకు శాపంగా మారింది. లెవీ తగ్గించడంతో రైతులు ధాన్యం అమ్ముకొనేందకు ఆపసోపాలు పడుతున్నారు. మార్కెట్లో పూర్తిగా డిమాండ్ లేకపోవడంతో ధాన్యానికి మద్దతు ధర లేక రైతుకు పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదు. సంక్రాంతి ముందునాటికే ధాన్యం అమ్మకాలు పూర్తి కావాల్సి ఉండగా పండుగా వెళ్లిపోయిన తర్వాత కూడా కళ్లాల్లో ధాన్యం కుప్పలు వెక్కిరిస్తున్నాయి. లెవీ తగ్గింపుతో.. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. గత ఏడాది ప్రభుత్వ మద్దతు ధర కంటే బయట మార్కెట్లో ఎక్కువ ధర పలికింది. దీనికి కారణం ఉత్పత్తిలో 75 శాతం వరకు లెవీగా సేకరించాలన్న లక్ష్యం ఉండటంతో దాన్ని చేరుకొనేందుకు మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేసి కేంద్రాలకు విక్రయించేవారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం లెవీని 25 శాతానికి కుదించడంతో మిల్లర్లకు ధాన్యంతో సంబంధం లేని పరిస్థితి నెలకొంది. దీంతో పలుకుబడి ఉండి నాణ్యమైన ధాన్యం పండించిన రైతుల వద్దే కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు గత ఏడాది బయట జిల్లాల నుంచి వర్తకులు రావడంతో మిల్లర్లు లెవీ లక్ష్యాల కోసం ధర పెంచి రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈ ఏడాది బయట వర్తకులను రాకుండా అడ్డుకోవడంతో క్వింటాకు రూ.900 ధర లభించడమే గగనంగా మారింది. దీనిపై ఓ మిల్లరు మాట్లాడుతూ గోనె సంచులు, కొనుగోలు కేంద్రాల సిబ్బందికి కమీషన్ల కోసమే ప్రభుత్వం క్వింటాకు రూ.170 వరకు ఖర్చు చేస్తోంది. అందులో కనీసం వంద రూపాయలు మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం కొనుగోలుకు ముందుకు వచ్చేవారన్నారు. ప్రభుత్వం నిర్ణయం డబ్బులు వృథా కావడానికి తప్ప కొనుగోళ్లకు దోహదపడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రంగుమారిన ధాన్యం పరిస్థితి ఏమిటి... తుపాను కారణంగా రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం పదే పదే ప్రకటించినా అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. కొనుగోలు కేంద్రాలకు దీనిపై ఎటువంటి ఆదేశాలు అందలేదు. జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు రంగుమారిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించి నెల రోజులు కావస్తున్నా నేటికీ అమలు కాలేదు. కేంద్రాల్లో వీటికి ధర నిర్ణయించి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేయగా, హుద్‌హుద్ తుపాను కారణంగా సుమారు లక్ష హెక్టార్లలో పండిన ధాన్యం రంగుమారింది. ఈ ధాన్యాన్ని కొనేవారు లేకపోవడంతో రైతులు నూర్పులు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. కొనుగోలు కేంద్రాలు వెలవెల జిల్లాలో మొత్తం 115 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. వీటిలో ఐకేపీ పరిధిలో 83, పీఏసీఎస్‌ల పరిధిలో 51, డీసీఎంఎస్ ద్వారా 5, జీసీసీ ద్వారా 6 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా 3 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే రెండు నెలలు కావస్తున్నా జిల్లా వ్యాప్తంగా 64,349 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఈ నెల పదో తేదీ నాటికి 7,345 మంది రైతుల నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత సంక్రాంతి కారణంగా నాలుగైదు రోజులు కేంద్రాలకు సెలవు ప్రకటించడంతో కొనుగోళ్లు జరగలేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మే రైతులకు ఒక్కరోజులోనే డబ్బులు చెల్లిస్తామని ప్రకటించినా నెల రోజుల్లోపు అందించే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికే రైతులకు రూ.15 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బు కోసం రైతులు కొనుగోలు కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రవాణా చార్జీల కుంభకోణం రైతులకు చె ల్లించాల్సిన రవాణా చార్జీల్లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తే క్వింటాకు రూ.32 చొప్పున రవాణా చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రతి ఏటా సీజన్ ముగిశాక ఈ సొమ్మును రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు. ఆ క్రమంలో గత ఏడాది రవాణా చార్జీలను ప్రస్తుతం రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది రవాణా చార్జీల్లో అధికార పార్టీ నాయకులు చేతివాటం చూపారు. జిల్లాకు చెందిన ఓ నాయకుని అనుచరులకు ఈ నిధులు మళ్లించేలా పథకం వేశారు. రవాణా చార్జీలను రైతులకు నేరుగా చెల్లించకుండా ఆ బాధ్యతను డివిజన్‌కు ఒకరు చొప్పున ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీరు రైతు కళ్లాల నుంచి ధాన్యాన్ని ఉచితంగా మిల్లుకు తరలించాలి. అందుకు ప్రతిఫలంగా రవాణా చార్జీలను వీరి ఖాతాకు మళ్లిస్తారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లు వరకు వీరు ధాన్యాన్ని తరలిస్తారని చెబుతున్నారు. వాస్తవానికి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు. శ్యాంపిల్‌ను మాత్రమే తీసుకెళతారు. దాన్ని కొనుగోలు కేంద్రం సిబ్బంది పరిశీలించి కొనుగోలు అంగీకరించిన తర్వాత కళ్లాల్లో తూకం వేయించి నేరుగా మిల్లుకు అప్పజెబుతారు. కానీ ధాన్యాన్ని కాంట్రాక్టర్లే తరలిస్తున్నట్లు కేంద్రాల్లో నమోదు చేసుకుంటున్నారు. ఈ విధంగా సుమారు కోటి రూపాయల వరకు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు అవకాశం కల్పించారు. అధికారులు ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నా జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నాయకుడి హస్తం ఉండడంతో ఏమీ చేయలేక రైతులే పోరాడాలని సూచిస్తున్నారని జిల్లా ఏరువాక సభ్యుడు ఖండాపు ప్రసాదరావు చెప్పారు. మిల్లరు తిరస్కారం అంపిలి గ్రామానికి చెందిన ఇనుముల అప్పారావు ఇటీవల పంట నూర్పులు పూర్తి చేసి ధాన్యం అమ్మేందుకు శ్యాంపిల్‌తో మిల్లరు వద్దకు వెళ్లాడు. ‘ఈ ధాన్యాన్ని మేము కొనలేం, తేవాల్సిన అవసరం లేద ని’ మిల్లరు స్పష్టం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తామని రైతు చెప్పగా జిల్లా కలెక్టర్‌తో సహా ఎవరికి చెప్పుకోమంటావో చెప్పుకో అంటూ సమాధానమిచ్చారు. కొనుగోలు కేంద్రం నిస్సహాయత మరో రైతు కాయల సత్యనారాయణ ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లాడు. మా వద్దకు వస్తే చేసేది ఏమీ లేదు. మిల్లర్‌కు తీసుకెళ్లండి. కొనుగోలుకు వారు ఇష్టపడితే మేం గోనె సంచులు ఇస్తామని అక్కడి సిబ్బంది ఉచిత సలహా ఇచ్చారు. -
ఇక్కడ గిట్టుబాటు కాకే..ఈ పాట్లు!
ఎచ్చెర్ల:ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు విఫలం కావడం, మిల్లర్లు సరైన ధర ఇవ్వకపోవడం వల్లే ఇతర జిల్లాల వర్తకులకు ధాన్యం అమ్మడానికే ఇష్టపడుతున్నారు. దాని పర్యవసానంగానే తూర్పు గోదావరి జిల్లాకు పెద్ద ఎత్తున ధాన్యం లోడ్లు తరలిపోతున్నాయి. అలా వెళుతున్న 30 లారీలను ఆదివారం అర్ధరాత్రి చిలకపాలెం వద్ద పౌరసరఫరా, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు పట్టుకోవడం చర్చనీయాంశమైంది. జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. ఆ మేరకు ఈ ఖరీఫ్‌లో లెవీ సేకరణ లక్ష్యాన్ని రెండు లక్షల క్వింటాళ్లుగా ప్రభుత్వం నిర్దేశించింది. కొండంత లక్ష్యం ముందున్నా వేరే జిల్లాకు పెద్ద ఎత్తున ధాన్యం తరలిపోవడం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో రైతుల వాదన వాస్తవ పరిస్థితులను కళ్లకు కడుతోంది. వారి వాదన ప్రకారం.. ధాన్యం కొనుగోలుకు వంద కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించినా .. ఆ స్థాయిలో కేంద్రాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమన కేంద్రాల్లోనూ ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. దళారులే నేరుగా కళ్లాల్లోకి వచ్చి ధాన్యం కొని ఇతర జిల్లాల మిల్లర్లకు అమ్ముతున్నారు. రైతులు కూడా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లే కంటే దళారులకు అమ్మడానికే ప్రాధాన్యమిస్తున్నారు. తక్కువపరిమాణంలో ధాన్యం పండించే రైతులు దాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించలేకపోవడమే దీనికి కారణం. కొనుగోలు కేంద్రాల్లోగానీ, జిల్లాలోని మిల్లర్లు గానీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకపోవడం మరో కారణం. మద్దతు ధర కావాలా.. ముదరా ఇవ్వండి ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలు రూ.1400, సాధారణ రకం రూ.1360 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ రేటు ఇవ్వాలంటే క్వింటాలుకు ఆరు కిలోలు ఎక్కువ ధాన్యం ఇవ్వాలని జిల్లాలోని పలువురు మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారన్నది రైతుల ఆరోపణ. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో విఫలమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో స్థానిక మిల్లర్ల కంటే ఇతర జిల్లాల మిల్లర్లే మంచి ధర ఇస్తున్నారని, రవాణా ఖర్చులు సైతం చెల్లిస్తున్నారని నరసన్నపేట మండలం బద్రి గ్రామానికి చెందిన రైతులు చెప్పారు. అందువల్లే వరి ఎక్కువగా సాగు చేసే పోలాకి, గార, నరసన్నపేట, జలుమూరు, శ్రీకాకుళం రూరల్ మండలాల నుంచి ధాన్యం నిల్వలు తూర్పుగోదావరి జిల్లాకు తరలిపోతున్నాయంటున్నారు. మద్దతు ధర విషయంలో విఫలమైన అధికారులు ఇతర జిల్లాలకు తరలివెళుతున్న ధాన్యాన్ని పట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే అధికారుల దాడుల్లో రైస్ మిల్లర్లు పాల్గొనడమేమిటని నిలదీస్తున్నారు. దళారీ వ్యవస్థను, ఇతర జిల్లాలకు ధాన్యం రవాణాను అరికట్టాలనుకుంటే ముందు మద్దతు ధర ఖచ్చితంగా అమలు చేయడంతోపాటు గ్రామం యూనిట్‌గా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారుల వాదన మరోలా ఉంది. ఇప్పటికే తుపాను కారణంగా దిగుబడి తగ్గిందని, ఈ పరిస్థితుల్లో ధాన్యం ఇతర జిల్లాలకు తరలిపోతే, ముందు ముందు జిల్లా బియ్యం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడిన ధాన్యంపై విచారణ ఇదిలా ఉండగా జాతీయ రహదారిపై చిలకపాలెం టోల్‌ప్లాజా సమీపంలోఆదివారం ఆర్ధరాత్రి వరకు పట్టుకున్న 30 ధాన్యం లారీలను ఎచ్చెర్ల పోలీస్ సే ్టషన్కు తరలించి, విచారణ జరుపుతున్నారు. సోమవారం ఉదయం శ్రీకాకుళం ఆర్డీవో దయానిధి, జిల్లా పౌరసర ఫరాల అధికారి ఆనందరావు, పౌరసరఫరాల సంస్థ ఏఎస్వో తిలగ, ఎచ్చెర్ల తహశీల్దార్ బి.వెంకటరావు తదితరలు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా మిల్లర్లకు ధాన్యం అమ్మిన రైతులు కొందరు కూడా స్టేషన్‌కు వచ్చి తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ధాన్యం కొనుగోలు ర సీదులు, ఆధార్ కార్డులు చూపించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ అన్ని ఆధారాలు ఉన్న ధాన్యం లారీలను విడిచిపెడతామని, ఆధారాలు చూపని లారీలపై 6(ఎ) కేసులు నమోదు చేసి జేసీ కోర్టుకు సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు పూర్తి రికార్డులు ఉన్న రెండు లారీలను విడిచి పెట్టాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. మరోపక్క పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన నరసన్నపేట మండలానికి చెందిన కొందరు రైతులు తూర్పుగోదావరి జిల్లా మిల్లర్లకు ధాన్యం అమ్మితే తప్పేమిటని అధికారులను ప్రశ్నించారు. కాగా గతంలో ఎప్పుడూ ఇటువంటి అభ్యంతరాలు రాలేదని కొందరు లారీ డ్రైవర్లు చెప్పారు. -
మిల్లర్లకు గేట్లు బార్లా..!
శ్రీకాకుళం అగ్రికల్చర్, వీరఘట్టం:ఎఫ్‌సీఐ(భారత ఆహార సంస్థ) గేట్లు బార్లా తెరిచేసింది. బియ్యాన్ని ఎక్కడికైనా.. ఎప్పుడైనా రవాణా చేసుకొని నచ్చిన రేటుకు అమ్ముకునే స్వేచ్ఛ మిల్లర్లకు కల్పించింది. ఈ కొత్త నిర్ణయం కారణంగా మిల్లర్ల ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు గండి పడనుం ది. వినియోగదారులపైనా భారం పడుతుంది. భారత ఆహార సంస్థ గతంలో మిల్లర్ల నుంచి 75 శాతం లేవీ సేకరించేది. మిగిలిన 25 శాతం బియ్యాన్ని రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు వీలుగా పర్మిట్లు మంజూరు చేసేది. దీని వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించేది. అయితే, ఈ ఏడాది లేవీ నిబంధనలను మార్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం మిల్లర్ల నుంచి 25 శాతం బియ్యాన్నే లేవీగా తీసుకుంటుంది. మిగిలిన 75 శాతం బియ్యాన్ని మిల్ల ర్లు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాల్సి ఉంటుం ది. ఇంత బియ్యం తామెక్కడ అమ్ముకోగలమని మిల్లర్లు గగ్గోలు పెట్టారు. దీంతో ఎఫ్‌సీఐ వెసులుబాటు పేరుతో వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. లెవీ చెల్లించగా మిగిలిన 75 శాతం బియ్యాన్ని రాష్ట్రం లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్ముకోవచ్చని, ఇందుకు పర్మిట్లు అవసరం లేదని స్పష్టం చేసింది. ఏ రైతు వద్ద ఎంత కొనుగోలు చేశారు, ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి తరలిస్తున్నారన్నది మాత్రం తెలియజేసి రికార్డుల్లో పొందుపరిస్తే చాలనేది కొత్త నిబంధనల సారాంశం. పూర్తి స్వేచ్ఛ లభించడంతో మిల్లర్లు నాణ్యమైన బియ్యమే ఇతర రాష్ట్రాలకు తరలించడానికి ప్రయత్నిస్తారని, దీనివల్ల జిల్లాలో డిమాండ్ ఏర్పడి బియ్యం ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌వర్గాలు పేర్కొంటున్నాయి. నాణ్యమైన బియ్యానికి గిరాకీ తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో నాణ్యమైన బియ్యానికి గిరాకీ ఉంది. దీంతో ఇక్కడ పండే నాణ్యమైన బియ్యం గతంలో 25 శాతం మాత్రమే అధికారికంగా వెళుతున్నా.. అనధికారికంగా మరెంతో వెళుతుండేది. ఇప్పుడు కేంద్రం బియ్యం స్వేచ్ఛ కల్పించడంతో నాణ్యమైన బియ్యం భారీగా తరలిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఈ రకం బియ్యం కిలో ధర రూ. 40కి మించి ఉంది. అదే సమయంలో సాధారణ రకాలకు డిమాండ్ తగ్గి రైతులకు గిట్టుబాబు ధర దక్కె అవకాశాలు తగ్గుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రైతులకు మద్దతు కరువు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతులకు మద్దతు ధర లభించడం గగనమవుతోంది. ఎఫ్‌సీఐ 25 శాతమే తీసుకుంటే మిగిలిన 75 శాతం బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం కష్టమని, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇస్తే తాము నష్టపోతామని మిల్లర్లు బహిరంగంగానే చెబుతున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా వరి పంట బాగా పండుతోందని, అక్కడ మన బియ్యానికి అంత డిమాండ్ లేదని మిల్లర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో వరి రైతులకు సాగు ఖర్చులు కూ డా రాని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ.1,400 మద్దతు ధర ప్రకటించగా.. ఆ ధాన్యం ఉత్పత్తికి రైతులకు రూ.1700 వరకు వ్యయమవుతోంది. ఇది ప్రభుత్వం వేసిన లెక్కే. దీని ప్రకారం చూస్తే రైతులు ఒక్కో క్విం టాలు వద్ద రూ.300 నష్టపోతున్నారు. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 3.5 కోట్ల క్వింటాళ్ల ధాన్యం పండిస్తున్నారు. దీని ప్రకారం రైతులు రూ.630 కోట్ల పెట్టుబడిని నష్టపోతున్నారు.ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మిల్లర్లు ధాన్యం కొన్నప్పుడే ఇంత నష్టం వాటిల్లితే.. ఇక మద్దతు ధర ఇవ్వని పరిస్థితుల్లో ఇంకెంత నష్టం వాటిల్లుతుందో తలచుకుంటనే భయమేస్తోందని రైతు లు అంటున్నారు. తుపానుతో కుదేల య్యామని, ఇప్పుడు ప్రభుత్వ విధానం తో నష్టం తప్పదని వాపోతున్నారు. -
బియ్యం ‘మార్కెట్' ఫ్రీ
నెల్లూరు (రెవెన్యూ) : కేంద్ర ప్రభుత్వం బియ్యం మార్కెట్‌కు స్వేచ్ఛ కల్పించింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) లెవీ సేకరణలో మార్పులు చేపట్టిన కేంద్రం తాజాగా మరో జీఓ ద్వారా పర్మిట్లు లేకుండా ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికైనా నేరుగా తీసుకెళ్లి విక్రయించుకునేందుకు మిల్లర్లకు ద్వారాలు తెరిచింది. కేంద్రం తీసుకున్న నూతన విధానం మిల్లర్లకు ఆదాయం పెరుగుతుండగా, ప్రభుత్వ ఖజానాకు మాత్రం గండి పడనుంది. కేంద్రం లెవీ సేకరణ తగ్గించడంతో మిగులు బియ్యం అమ్ముకునేందుకు మిల్లర్లు సైతం నానా పాట్లు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. నాణ్యమైన బియ్యా నికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉండటంతో జిల్లాలో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. భారత ఆహార సంస్థ గతంలో మిల్లర్ల నుంచి 75 శాతం లెవీగా కొనుగోలు చేసేది. మిగిలిన 25 శాతం బియ్యాన్ని రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు వీలుగా పర్మిట్లు మంజూరు చేసేది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేది. ప్రస్తుతం పర్మిట్ విధానం రద్దు చేయడంతో రాబడికి గండిపడే అవకాశం ఉంది. ఇటీవల కేంద్రం లెవీ నిబంధనల్లో మార్పులు చేసి మిల్లర్ల నుంచి 25 శాతం లెవీగా తీసుకోవాలని నిర్ణయించింది. మిగిలిన 75 శాతం బియ్యం మిల్లర్లు అమ్ముకునే వీలు కల్పించింది. ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేందుకు పర్మిట్ల నిబంధనలు అలాగే ఉంచింది. దీంతో మిల్లర్లు 75 శాతం బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో ఎలా అమ్ముకోవడమని తలలు పట్టుకున్నారు. అయితే తాజాగా కేంద్రం ఈనెల 27న మరో జీఓ జారీ చేసింది. మిల్లర్లు 75 శాతం బియ్యాన్ని రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్ముకోవచ్చని, ఇందుకు పర్మిట్లు అవసరం లేదని స్పష్టం చేసింది. ఏ రైతు వద్ద ఎంత కొనుగోలు చేశారు.. ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి తరలిస్తున్నారో మాత్రం తెలియజేసి రికార్డుల్లో పొందుపరిస్తే చాలనేది కొత్త జీఓ సారాంశం. కొత్త నిబంధనలతో జిల్లాలో బియ్యానికి రెక్కలొస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో 25 శాతం బియ్యం పేరుతో మిల్లర్లు నాణ్యమైన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు నానా అడ్డదార్లు తొక్కేవారు. ఇప్పుడు స్వేచ్ఛ ఉండటంతో పూర్తిస్థాయిలో నాణ్యమైన బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతే జిల్లాలో డిమాండ్ ఏర్పడి బియ్యం ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రైతులకు ‘మద్దతు' కరువు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతులకు మద్దతు ధర కరువయ్యే పరిస్థితి పొంచి ఉంది. ఎఫ్‌సీఐ 25 శాతమే తీసుకుని మిగిలిని 75 శాతం బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం కష్టమని, రైతుల వద్ద మద్దతు ధరకు కొనుగొలు చేస్తే తాము నష్టపోతామని మిల్లర్లు బహిరంగంగానే చెబుతున్నారు. సమీప రాష్ట్రాల్లో కూడా వరి పంటలు బాగా పండుతున్నాయని, అక్కడ మన బియ్యంకు అంత డిమాండ్ లేదని మిల్లర్లు చెబుతున్నారు. పక్క రాష్ట్రాల్లో నాణ్యమైన బియ్యానికి గిరాకీ : తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో నాణ్యమైన బియ్యానికి గిరాకీ ఉంది. దీంతో ఇక్కడ పండే నాణ్యమైన బియ్యం గతంలో 25 శాతం మాత్రమే అధికారికంగా వెళుతున్నా.. అనధికారికంగా మరెంతో వెళుతుండేది. ఇప్పుడు కేంద్రం బియ్యం మార్కెట్‌కు స్వేచ్ఛ కల్పించడంతో నాణ్యమైన బియ్యం భారీగా తరలిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యమైన బియ్యం కిలో రూ.40లకు మించి ఉంది. నూతన విధానం వల్ల బియ్యం ధరలు అకాశాన్నంటే అవకాశం ఉంది. అదే సమయంలో సాధారణ రకాలకు డిమాండ్ తగ్గి రైతులకు గిట్టుబాటు ధర దక్కే అవకాశాలు తగ్గుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నూతన విధానంలో ధాన్యం కొనుగోలు : సంధ్యారాణి, డీఎస్ఓ నూతన విధానంలో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు అనుగుణంగా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేపట్టాలి. 25 శాతం లెవీ కింద ప్రభుత్వానికి ఇచ్చి మిగిలిన 75 శాతం బహిరంగా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు రవాణా చేయడానికి ప్రత్యేక పర్మిట్లు అవసరం లేదు. ఎక్కడ కొనుగోలు చేశారు. ఎక్కడికి తీసుకుపోతున్నారో తదితర వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. రైతులు, మిల్లర్లు ఇద్దరికి నష్టం - సుబ్రహ్మణ్యంరెడ్డి,రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతు, మిల్లర్లు ఇద్దరు నష్టపోతారు. పాత విధానంలో ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రైతులు, మిల్లర్లు ఇద్దరికి నష్టం ఉండదు. నూతన విధానంతో 25 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలి. 75 శాతం ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకోవచ్చు. నూతన విధానం వల్ల ధాన్యం ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు పర్మిట్లు అవసరం లేదు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ధాన్యం అధికంగా పండిస్తున్నారు. దాని వల్ల బియ్యానికి డిమాండ్ లేదు. రైతుల నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలించలేక నిల్వ చేయడానికి స్థలం లేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. -
సంపద ఒకరిది.. సోకు మరొకరిది!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియలో మిల్లర్లు కొత్త రకం అక్రమాలకు తెర తీశారు. ఇప్పటి వరకు ఒకటి, రెండేళ్లు ఆలస్యంగా ఇస్తూ లాభాలు ఆర్జించిన మిల్లర్లు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. నేరుగా స్వాహా చేయకుండా... ప్రభుత్వం ధాన్యాన్ని బగడువు ముగిసిన తర్వాత అధికారులు బియ్యం ఇవ్వాలని అడిగితే... మిల్లర్లకు బదులుగా బ్యాంకులే అడ్డం పడుతున్నాయి. ఇలా ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని జిల్లాలోని పలువురు మిల్లర్లు, బ్యాంకులతో కలిసి ప్రభుత్వ ధాన్యాన్ని స్వాహా చేసే పనులకు దిగారు. కొడకండ్ల మండలం పెద్దవంగరలో ఉన్న చిల్లంచెర్ల ఆగ్రోటెక్ ఇండస్ట్రీ ఇదే పని చేసింది. గత ఖరీఫ్, రబీలో ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ), వ్యవసాయ సహకార సంఘాలు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే రైస్ మిల్లర్లకు ఇచ్చింది. రెండు సీజన్లలోని ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు ఈ నెల 30లోపు బియ్యం అప్పగించాల్సి ఉంటుంది. ఇలా 6236 టన్నుల ధాన్యం తీసుకున్న చిల్లంచెర్ల ఆగ్రోటెక్ ఇండస్ట్రీ మళ్లీ బియ్యం ఇచ్చే విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించింది. గడువు ముగుస్తున్నా ఇవ్వాల్సిన బియ్యంలో 70 శాతమే ఇచ్చింది. మిగిలిన బియ్యం విషయంలో అధికారులు వాస్తవ పరిస్థితిని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ఈ మిల్లర్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో తనఖా పెట్టి కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు అధికారులు గుర్తిం చారు. మిల్లులో ఉన్న సరుకును వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేయగా, రుణం తీరే వరకు కుదరదంటూ బ్యాంకు అధికారులు జిల్లా యంత్రాంగానికి తెలిపారు. ఈ మేరకు కోర్టు నుంచి ఆదేశాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ విధానాల్లోని లోపాలే వల్లే ఇలా జరిగిందని గుర్తించిన పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ జి.కిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై కలెక్టర్ వద్ద ఇటీవల ప్రత్యేకంగా విచారణ జరిగినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి ఉషారాణి ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. తనఖా పెట్టిన సరుకుతో సంబంధం లేకుండా బియ్యాన్ని గడువులోపు ఇచ్చేందుకు మిల్లర్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా 84 శాతమే.. గత ఖరీఫ్, రబీలో ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి 1.88 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. పౌర సరఫరాల శాఖ ఈ ధాన్యాన్ని జిల్లాలోని 89 రైస్ మిల్లులకు ఇచ్చింది. 2013-2014 లెవీ సీజన్ ముగిసే సెప్టెంబర్ 30 లోపు ఈ ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మిల్లర్లు భారత ఆహార సంస్థ, పౌర సరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉంది. తుది గడువుకు ఇంకా రెం డు రోజులే ఉంది. జిల్లాలో మాత్రం ఇప్పటికి 86 శాతం బియ్య మే పౌర సరఫరాల సంస్థకు చేరింది. మొత్తం 89 మిల్లుల్లో వంద శాతం బియ్యం ఇచ్చినవి 19 మాత్రమే. 99 శాతం లెవీ పూర్తి చేసిన మిల్లులు 36, యాభై శాతంలోపు బియ్యం కోటా అప్పగించిన మిల్లులు నాలుగు ఉన్నాయి. ప్రభుత్వం ప్రమాణాల ప్రకారం క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 68 కిలోల బియ్యం వస్తాయి. ఈ లెక్కన ధాన్యం తీసుకున్న మిల్లర్లు ఇంకా 17,360 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. -
పూర్తికాని లెవీ సేకరణ
మిర్యాలగూడ : ప్రజావసరాల కోసం ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) ప్రతిఏటా మిల్లర్ల నుంచి సేకరించే లెవీబియ్యం లక్ష్యం నెరవేరలేదు. సేకరణకు గడువు ఇంకా 20 రోజులే ఉన్నా, మొత్తంగా 77శాతం లక్ష్యమే పూర్తయ్యింది. 2013-14వ సంవత్సరానికి గాను గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి లెవీబియ్యం సేకరణ ప్రారంభించారు. జిల్లాలో వరిసాగు గణనీయంగా ఉన్నప్పటికీ, మిల్లర్ల పట్ల అధికారులు మెతకవైఖరి అవలంబించడం వల్ల లెవీ సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2012-13లో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం, 8.09 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించారు. కాగా పచ్చిబియ్యం నూరుశాతం లక్ష్యం పూర్తి చేసినా, బాయిల్డ్ బియ్యం మాత్రం కేవలం 5.86 లక్షలు మెట్రిక్‌టన్నులు మాత్రమే సేకరించి లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయారు. అయినా లెవీబియ్యం ఇవ్వని మిల్లర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. డీఎస్ఓ నాగేశ్వర్రావు మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు గడువు ఉందని, సాధ్యమైనంత త్వరగా టార్గెట్ రీచ్ కావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది నుంచి నూతన లెవీ విధానం? ఈ ఏడాది నుంచి కేంద్రప్రభుత్వం నూతన లెవీవిధానం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో మిల్లర్లు రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యంలో 75 శాతం లెవీబియ్యం ప్రభుత్వానికి ఇచ్చి, 25 శాతం బయట మార్కెట్లో విక్రయించుకునేవారు. కానీ నూతనవిధానం ద్వారా 25 శాతం లెవీబియ్యం ప్రభుత్వానికి ఇచ్చి, 75 శాతం బయట మార్కెట్లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కాగా 2014-15లో లెవీబియ్యం సేకరణ లక్ష్యం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. -
మిల్లర్ల సంచిలో సర్కారు వడ్లు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ‘కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ’ (సీఎం పీ) కింద కేటాయించిన ప్రభుత్వ ధాన్యాన్ని కొందరు రైస్ మిల్లర్లు సొంత ఆస్తిగానే భావిస్తున్నారు. ధాన్యం తీసుకుని గడువులోగా బియ్యం అప్పగించాలనే నిబంధనలను తుంగలో తొకుతున్నారు. లాబీయింగ్‌కు అలవాటు పడి న ఓ మిల్లర్ల సంఘం నేత ఒత్తిళ్లు, పౌరసరఫరాల శాఖలో ఏళ్ల తరబడిగా పాతుకుపోయిన ఓ ద్వితీయశ్రేణి అధికారి మూలంగా రూ. 251 కోట్ల విలు వ చేసే ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్లు కొందరు వ్యాపారం చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ప్రతి ఏటా ప్రభుత్వం ఖరీఫ్ మార్కెట్ సీజనుగా భావిస్తుంది. ఖరీఫ్, రబీల్లో వచ్చే ఉత్పత్తులను కలిపి మార్కెటింగ్ పరంగా ఖరీఫ్ సీజనుగానే పేర్కొంటుంది. గతేడాది అక్టోబరు ఆరంభం నుంచి ఈ ఏడాది సెప్టెం బరు వరకు ఈ సీజను ఉంటుంది. 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజను మరో నెల రోజుల్లో ముగియనుంది. జిల్లాలోని మిల్లర్లు మాత్రం ధాన్యం స్వాధీనం చేసుకుని మూడు నెలలు గడుస్తున్నా కేవలం 23 శాతం బియ్యం మాత్రమే అందజేశారు. ఇంకా 77 శాతం (98,355 మెట్రిక్ టన్నుల) బియ్యాన్ని అప్పగిం చకుండా తమ వద్దే పెట్టుకున్నారు. కొందరు రైసుమిల్లర్ల సంఘం నేతల అండదండలు, పౌరసరఫరాల శాఖలోని ఓ సహాయ అధికారి సహకారంతో వీరు నిబంధనలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. రైసుమిల్లర్లకు చేరింది ఇలా.. వరి సాగు విస్తీర్ణం జిల్లాలో ఎక్కువగా ఉం టుంది. ధాన్యం ఉత్పత్తి ఇదే తీరుగా ఉం టుంది. అన్నదాతలు పండించే ధాన్యం ఆధారంగా అభివృద్ధి చెందాల్సిన రైస్ మిల్లింగ్ పరిశ్రమ కొందరి లాభాపేక్షతో పక్కదారిపడుతోంది. రెండుమూడేళ్లుగా జిల్లాలో ప్రభుత్వ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు స్వాహా చేయడం రివాజుగా మారుతోంది. 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజనులోనూ ఇదే జరిగింది. మరి కొద్ది రోజు ల్లో గడువు ముగియనుండగా ఇప్పటికీ ఇంకా 98,355 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు తమ వద్దే పెట్టుకున్నారు. 2013-14 ఖరీఫ్, రబీల్లో కలిపి ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్), గిరిజన సహకార సంఘాలు(జీసీసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 1,87,028 మెట్రిక్ టన్నుల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ఖరీఫ్‌లో 88 మంది మిల్లర్లకు ఇచ్చింది. ఈ మేరకు ధాన్యం తీసుకున్న మిల్లర్లు 1,28,101 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి. ఇదంతా గడువు ముగిసేలోపే జరగాలి. ప్రభుత్వ ధాన్యాన్ని సొంత ఆస్తిగా భావించే ధోరణి జిల్లాలోని మిల్లర్లలో ఉండడంతో ఇప్పటి వరకు కేవలం 29,746 మె.టన్నుల బియ్యం చెల్లిం చారు. ఇంకా 98,355 టన్నుల బియ్యం వీరి వద్దే ఉండిపోయింది. ఇలా ప్రభుత్వ బియ్యం ఇవ్వని మిల్లర్లు గత ఖరీఫ్‌లో 10 మంది ఉన్నారు. అయినా పౌరసరఫరాల శాఖలోని ఓ ద్వితీయశ్రేణి అధికారి ఈ ఖరీఫ్ సీజన్లోను భారీగా ధాన్యం కేటాయించడం వివాదాస్పదం అవుతోంది. ఎందుకు ఉదాసీనత.. కస్టం మిల్లింగ్ ప్యాడీ కింద ధాన్యం కేటాయించే విషయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ఒక సీజన్లో కస్టమ్ మిల్లింగ్‌కు సహకరించని రైసుమిల్లర్లకు మరో సీజన్లోను అధికారులు ఎందుకు ధాన్యం కేటాయిస్తున్నారో అర్థం కావడం లేదని ఆ శాఖలోని అధికారులే అంటున్నారు. ఈ ఏడాదిలో కస్టమ్ మిల్లింగ్ కోసం నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లోని 51 మంది మిల్లర్లకు 80,488 మె.టన్నుల ధాన్యం కేటాయించారు. ఈ మేరకు 54,669 మె.టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 11,944 మె.టన్నులు మాత్రమే ఇచ్చారు. 42,725 మె.టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉన్నాయి. ఇందులో సారంగపూర్‌కు చెందిన శ్రీసిద్దివినాయక అండ్ కంపెనీ, శ్రీ ఆర్కె ఎంఆర్ఎం, శేషాద్రి ఆగ్రో ఇండస్ట్రీస్‌లు 100 శాతం చెల్లించగా... ఖానాపూర్లోని శ్రీవంశీకృష్ట 98 శాతం, శ్రీరామ మోడ్రన్ పారాబాయిల్డ్ (సారంగపూర్), లక్ష్మీబాలాజీ ఇండస్ట్రీస్ (ఖానాపూర్)లు 95 శాతం బియ్యం చెల్లించాయి. కామారెడ్డి రెవెన్యూ డివిజన్లో 32,426 మెట్రిక్ టన్నుల ధాన్యంకు 22,047 మె.టన్నుల బియ్యం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 14 శాతం మాత్రమే ఇచ్చారు. బోధన్ డివిజన్లోని 26 మిల్లర్లకు 75,753 మె.టన్నుల ధాన్యం ఇచ్చిన పౌరసరఫరాలశాఖ 51,384 మె.టన్నుల బియ్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టింది. అయితే ఇప్పటి వరకు కేవలం 14,674 మె.టన్నులు బియ్యం చెల్లించిన మిల్లర్లు 36,710 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. మిగతా రైసుమిల్లర్లు నిర్దేశించిన సమయంలో బియ్యం ప్రభుత్వానికి చెల్లించే అవకాశం ఉన్నా... కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యంతో వ్యాపారం చేస్తూ రూ.లక్షలు గడించాలని చూస్తున్నారు. ఇందుకు ఆ శాఖలోని డీఎస్వో తర్వాత స్థానం లో ఓ అధికారే ఊతం ఇస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి పౌరసరఫరాల శాఖ తీరుపై నిరంతరం పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధిం చిన కేటాయింపులపై విచారణ జరిపి... గడువులోగా బియ్యం వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
సొమ్మొకరిది.. సోకొకరిది!
మిర్యాలగూడ : సొమ్మొకరిది..సోకొకరిది అన్న చందంగా ఉంది జిల్లాలోని మిల్లర్ల తీరు. ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు ఇచ్చిన బియ్యాన్ని తిరిగి ఇవ్వడం లేదు. సామాన్యుడు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఓ పక్క బియ్యం ధరలు ఆకాశాన్నంటుతుండగా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంతో మిల్లర్లు బియ్యం వ్యాపారం చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. తిరిగి రాబట్టుకోవడంలో విఫలం.. రైతులనుంచి సివిల్ సప్లయీస్ కేంద్రాలతోపాటు ఐకేపీ కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ కోసం ఇస్తున్నా అధికారులు సకాలంలో రాబట్టుకోలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని మిల్లర్లు బయటి మార్కెట్లో విక్రయించుకుంటూ వ్యాపారం సాగిస్తున్నారు. 2012-13కు సంబంధించి 8830 టన్నుల బియ్యం ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఇవ్వలేదు. 2012-13వ సంవత్సరంలో మిల్లర్ల నుంచి 30,952 టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉండగా 22,122 టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇంకా 8,830 టన్నులు ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది మాట ఇలా ఉంటే ఈ ఏడాది 2013-14లో రబీలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఒక్క క్వింటాకు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. రబీ సీజన్లో రైతులనుంచి 3,67,466 టన్నుల ధాన్యం సివిల్ సప్లయీస్ అధికారులు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం 220మంది మిల్లర్లకు ఇచ్చారు. కాగా మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి 2,49,876 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్క క్వింటా బియ్యం కూడా ఇవ్వలేదు. సెప్టెంబర్ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. మిల్లర్ల వ్యాపారం.. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యంతో మిల్లర్లు వ్యాపారం సాగిస్తున్నారు. ఖరీఫ్ పచ్చిబియ్యం మిల్లర్ల వద్ద 8830 టన్నులు ఉంచుకొని వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మిల్లర్లు ఎఫ్‌సీఐకి లేవీ ద్వారా ఇచ్చే బియ్యానికి క్వింటాకు 2100 రూపాయలు చెల్లిస్తారు. అదే లెక్కన మిల్లర్ల వద్ద ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం విలువ రూ.18.54 కోట్లు ఉంటుంది. బహిరంగ మార్కెట్లో కిలోబియ్యం రూ.40 చొప్పున విక్రయిస్తున్నారని అనుకుంటే రూ.35.32 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల వద్ద ఉన్నట్టే. అంతేకాకుండా రబీలో ఇవ్వాల్సిన బియ్యం ఇప్పటికీ ఒక్క క్వింటాకు కూడా ఇవ్వలేదు. రబీలో ఉన్న బియ్యాన్ని లెవీకి ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. సెప్టెంబర్ నెలాఖరులోగా సేకరిస్తాం : నాగేశ్వర్రావు, డీఎస్ఓ, నల్లగొండ మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని సెప్టెంబర్ నెలాఖరులోగా సేకరిస్తాం. ఖరీఫ్ సీజన్లో ఉన్న బియ్యాన్ని వెంటనే ఇవ్వాలని మిల్లర్లకు ఆదేశాలు ఇచ్చాం. గడువులోగా కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని పూర్తిస్థాయిలో సేకరించడానికి చర్యలు తీసుకుంటాం. -
ఫైన్‌గా దోపిడీ!
అనంతపురానికి చెందిన నిరంజన్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. మధ్యాహ్నం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం వడ్డించమన్నాడు భార్య లక్ష్మిని. ప్లేట్లో అన్నం పెట్టగానే నిరంజన్ చేత్తో కలపగా ముద్దముద్దగా అనిపించింది. ‘ఇదేంటి.. అన్నం ఇలా ఉంది.. ఇలా వండావేంటి’ అంటూ భార్యపై చిందులేశాడు. ‘అరే నాపై చిందులేస్తారేంటండీ.. పాత బియ్యమంటూ తెచ్చింది మీరే కదా? అప్పటికీ నీళ్లు తక్కువగా పోసి వండాను.. అయినా ఇలా అయ్యింది.. దానికి నన్నేమి చేయమంటారు’ అంటూ నిట్టూర్చింది లక్ష్మి. జిల్లాలో పలువురు వ్యాపారులు ఈ తరహా బియ్యం అంటగడుతుండటం వల్ల నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు మోసపోతున్నారు. అనంతపురం : కొందరు వ్యాపారులు-మిల్లర్లు ధనార్జనే ధ్యేయంగా కొత్త ధాన్యాన్ని ఆవిరిపట్టి (స్టీమ్) సోనామసూరి పాత బియ్యంగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ బియ్యంలో కొంత పాత బియ్యం కూడా కల్తీ చేయడంతో అన్నం ముద్దముద్దగా అవుతోంది. ఇదంతా తెలీని వినియోగదారులు గృహిణులపై చిర్రుబుర్రులాడుతున్నారు. మరోవైపు భోజన హోటళ్లన్నీ ఈ బియ్యం కోసం ఎగబడుతుండడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా బోరు, బావుల కింద రబీలో 15,124 హెక్టార్లు, ఖరీఫ్‌లో 30వేల హెక్టార్లలో వరి సాగు చేస్తారు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సాగైన వరిని ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో కోత కోశారు. అయితే తీవ్రవర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి దిగుబడి దారుణంగా పడిపోయింది. సాధారణంగా ఎకరాకు 35 బస్తాల ధాన్యం రావాల్సి ఉండగా 20 బస్తాలకే పరిమితమైంది. పంట దిగుబడులు పెద్దగా లేకపోవడంతో జిల్లాలో 90 రైస్ మిల్లుల్లో దాదాపు 60 మూతపడ్డాయి. జిల్లాలో సన్నబియ్యం వాడకం దారులు దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల మంది ఉన్నారు. రేషన్‌షాపుల నుంచి తీసుకుంటున్న బియ్యాన్ని అల్పాహారాల (ఇడ్లీ, దోసె, పొంగల్, వడియాలు ఇతరత్రా) తయారీకి వాడుకుంటున్నారు. అన్నం కోసం సన్నబియ్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. సన్న బియ్యం వాడకం దారులు ఎక్కువ కావడం, జిల్లాలో పంట సరిగా లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మద్దతు ధర లేక కర్ణాటకలో విక్రయం గత రబీలో జిల్లాలో కల్లూరు, డీ హీరే హాళ్, మడకశిర, ధర్మవరం, కణేకల్లు, పామిడి, గుత్తి, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో రైతులు పండించిన వరి ఈ ఏడాది జనవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో కోత కోశారు. అయితే రైతులు వరిని తూర్పువేసి ధాన్యం బస్తాలను విక్రయాలకు సిద్ధం చేసుకోగా మద్దతు ధర లభించక పోవడంతో చేసేది లేక 70 శాతం మంది పొరుగునే ఉన్న కర్ణాటక ప్రాంతానికి తరలించారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఐకేపీ ఆధ్వర్యంలో కణేకల్లు, కల్లూరు, ధర్మవరం, కళ్యాణదుర్గం, వేములపర్తి (బ్రహ్మసముద్రం మండలం), నీలకంఠాపురంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటాలు ధాన్యం (సన్నరకం)కు రూ.1310 మద్దతు ధరగా నిర్ణయించారు. ఈ ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. కేవలం కణేకల్లులో మాత్రమే గడిచిన నెల రోజుల్లో 1020 క్వింటాళ్లు మాత్రమే రైతులు విక్రయించారు. మిగిలిన కేంద్రాలు రైతులు లేక వెలవెలబోయాయి. ధాన్యం సన్న రకానికి బహిరంగ మార్కెట్లో మిల్లర్లు, వ్యాపారులు రూ.1500 చెల్లిస్తున్నారు. అయితే కర్ణాటకలోని బళ్లారిలో క్వింటాలుకు రూ.1900 వరకు చెల్లిస్తుండడంతో కణేకల్లు, డీ హీరేహాళ్, మడకశిర, కళ్యాణదుర్గం ప్రాంతాలకు చెందిన రైతులు ఎక్కువగా బళ్లారికి వెళ్లి ధాన్యాన్ని విక్రయించారు. పామిడి, కల్లూరు, ధర్మవరం, గుత్తి తదితర ప్రాంతాల రైతులు మాత్రం స్థానికంగానే క్వింటాలు రూ.1500 చొప్పున వ్యాపారులు, మిల్లర్లకు విక్రయిస్తున్నారు. స్టీమ్ బియ్యం దిగుమతి ఇలా రైతుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని వ్యాపారులు, మిల్లర్లు కలసి పాతబియ్యంలాగా మార్చేస్తున్నారు. గార్లదిన్నెలోని ఓ రైస్‌మిల్లులో స్టీమ్ బియ్యం (ధాన్యాన్ని ఆవిరి ద్వారా బియ్యంగా మార్చడం) సిద్ధం చేస్తున్నారు. అయితే జిల్లా ప్రజలు, హోటళ్ల అవసరాలకు ఈ బియ్యం సరిపోకపోవడంతో కర్నూలు జిల్లా కర్నూలు, నంద్యాల, ఆదోనితో పాటు గుంటూరు, వరంగల్, మిర్యాలగూడ, పొద్దుటూరు, తాడేపల్లి గూడెం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాకు బియ్యం డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అక్కడి మిల్లర్లు సైతం స్టీం బియ్యాన్నే జిల్లాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లు, వ్యాపారులు కిలో రూ.25 నుంచి రూ.30 మధ్య కొనుగోలు చేస్తున్నారు. బియ్యం కొనుగోలు, రవాణా, ఇతరత్రా ఖర్చులు కలుపుకుని ఫైన్ బియ్యం అంటూ కిలో రూ.34 నుంచి 35 వరకు విక్రయిస్తున్నారు. మరి కొందరు ఈ స్టీమ్ బియ్యంలోకి కొద్ది మోతాదులో ఏడాది క్రితం పాత బియ్యాన్ని కలుపుతూ మొదటి రకం (పాత) అంటూ కిలో రూ.44-45 మధ్య విక్రయిస్తున్నారు. దీనిపై అధికారుల నిఘా లేకపోవడంతో వ్యాపారులు చెలరేగిపోతున్నారు. -
మిల్లర్లతో మిలాఖత్?
తనిఖీలు చాలు.. వచ్చేయండి! అధికారులకు బాస్‌ల ఫోన్? రైస్‌మిల్లుల్లో ఆగిన తనిఖీలు మధ్యలోనే వెళ్లిపోయిన వైనం ఇక నోటీసులిచ్చి ఏం ప్రయోజనం? జమ్మికుంట :ధాన్యం రైతులకు మద్దతు ధర చెల్లించని మిల్లర్లకు నోటీసులిచ్చి.. తనిఖీలు మొదలుపెట్టిన విజిలెన్స్ అధికారులకు ఏమైందో ఏమో గానీ... కాసేపటికే ఆపేశారు. అధికారుల నోటీసులతో తమకు మద్దతు ధర దక్కుతుందని ఆశించిన రైతన్నలకు దీంతో నిరాశే మిగిలింది. ఉన్నతాధికారుల ఫోన్‌తో అధికారులు ఆగమేఘాలమీద వెనుదిరగగా నోటీసులు ఇక చెత్తబుట్టలకే పరిమితం కానున్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వరంగ సంస్థలతోపాటు మిల్లర్లు కూడా కొనుగోలు చేశారు. మద్దతు ధర గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,345 ఉండగా వ్యాపారులు రూ.1,150 నుంచి రూ.1,200 దాకా, మగ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,310 ఉండగా మిల్లర్లు రూ.850 నుంచి రూ.950 మాత్రమే చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్లో సివిల్ సప్లయ్స్, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టగా... తమకు మద్దతు ధర దక్కడం లేదని చాలా మంది రైతులు వెల్లడించారు. రైతులు చెప్పిన వివరాల మేరకు రూపొందించిన నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు జమ్మికుంటలోని ఏడు మిల్లులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జిల్లా విజిలెన్స్ అధికారులు మూడు మిల్లుల్లో సోదాలు మొదలుపెట్టారు. ఒక్కో మిల్లులో వేలాది క్వింటాళ్ల నిల్వలుండగా తనిఖీ చేసేందుకు ఒక రోజు సమయం పట్టే అవకాశముంది. కానీ, అధికారులు కేవలం రెండు గంటల్లోనే మూడు మిల్లులు తనిఖీ చేసి అర్ధంతరంగా వెనుదిరిగారు. తనిఖీలు మొదలుపెట్టగానే మిల్లుల్లో ఉన్న అక్రమ నిల్వలు, నేరుగా కొనుగోళ్లు చేపట్టిన వివరాలు, రికార్డుల్లోకి ఎక్కని ధాన్యం, రైతుల వద్ద తక్కువ ధరతో సేకరించిన ధాన్యం గుట్టు బయటపడుతుందనే భయంతో కొందరు వ్యాపారులు ఓ ముఖ్యనాయకుడితో తనిఖీలు ఆపేలా ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సదరు నాయకుడినుంచి ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లగా.. మిల్లుల్లో అన్నీ సక్రమంగానే ఉన్నట్లు నివేదికలు తయారు చేయాలని వారు తనిఖీ అధికారులకు ఫోన్లోనే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కేవలం మూడు మిల్లుల్లోనే రెండు గంటల్లో తనిఖీలు చేపట్టి వెనుదిరిగారనే ప్రచారం జరుగుతోంది. అధికారుల తనిఖీలతో తమకు మద్దతు ధర చెల్లిస్తారని ఆశించిన రైతులు తీవ్ర నిరాశ చెందారు. అసలు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మిల్లర్లకు నోటీసులు ఎందుకు జారీ చేశారు? వీటి వెనుక మర్మమేమిటి? తనిఖీలు లేకుండా అక్రమ నిల్వలను ఎలా గుర్తిస్తారు? తనిఖీలు అర్ధంతరంగా నిలిపేసి ఎందుకు వెనుదిరిగినట్లు? అనేది అంతుచిక్కడం లేదు. -
లెవీపై సమ్మెట
కోటబొమ్మాళి, జలుమూరు, న్యూస్‌లైన్: భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ఉద్యోగుల సమ్మె కారణంగా లెవీ సేకరణకు జిల్లాలో బ్రేకు పడింది. గోదాముల వద్ద వందలాది వాహనాలు అన్లోడ్ కాకుండా నిలిచిపోయాయి. జిల్లాలో సుమారు 130 మంది ఉద్యోగులు నిమ్మాడ, రావిపాడు, నైర, పలాస, ఆమదాలవలస ఎఫ్‌సీఐ గోదాముల్లో పనిచేస్తున్నారు. వీరంతా సమ్మెలో ఉండటంతో ప్లాట్‌ఫారంపై నంబర్లు ఇచ్చే వీలులేక లారీలు బియ్యం లోడులతో నిలిచిపోయాయి. హమాలీలు, కలాసీలు ఇతర సిబ్బందికి కూడా పనిలేకుండా పోయింది. పింఛను సదుపాయం, ఖాళీ పోస్టుల భర్తీ, 3, 4 తరగతుల ఉద్యోగులకు మూలవేతనం, అలవెన్సులు కల్పించాలన్న డిమాండ్లతో శుక్రవారం సిబ్బంది సమ్మె చే శారని నిమ్మాడ ఎఫ్‌సీఐ గోదాముల టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ ఇ.వి. కృష్ణారావు శనివారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం కూడా సెలవులే కావడంతో ఉద్యోగులు విధుల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఫలితంగా నిమ్మాడలోని గోదాముల వద్ద శనివారం నాటికే పెద్ద సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. గోదాములు నిండిపోయాయి. స్థలం లేక చాలా లారీలను బయట రోడ్డు పక్కన కూడా నిలిపివేశారు. రావిపాడు గోదాముల వద్ద కూడా 150 వరకు లోడ్ లారీలు నిలిచిపోయాయి. పదివేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ గోదాముల్లో ప్రస్తుతం 5400 టన్నులు మాత్రమే దించారు. ఎఫ్‌సీఐ క్వాలిటీ ఇన్చార్జి బియ్యం పరిశీలించి నిల్వకు అనుమతి ఇస్తే తప్ప బియ్యం అన్లోడ్ చేయించలేమని ఇక్కడి వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ అధికారి వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జిల్లాలో 3.8 లక్షల టన్నుల బియ్యం లెవీగా సేకరిం చాలని లక్ష్యం నిర్ణయించగా ఇప్పటివరకు 30 వేల టన్నులే సేకరించారు. ఈ తరుణంలో ఉద్యోగుల సమ్మె, సెలవులతో లెవీకి భారీగా గండి పడింది. మిల్లర్లకూ ఈ సమ్మెతో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. లారీలు రోజుల తరబడి నిలిచిపోవడం వల్ల డెమరేజ్ చార్జీలు కూడా పెరుగుతాయని అంటున్నారు. లారీల సిబ్బంది కూడా నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని మిల్లుల నుంచి ప్రతిరోజు 500 ఏసీ కేజీల(13500 టన్నులు) బియ్యం లెవీకి వెళుతోంది. అయితే ఎఫ్‌సీఐ మాత్రం 300 ఏసీ కేజీలు(8100 టన్నులు) మాత్రమే తీసుకుంటోంది. దీంతో లెవీ సేకరణ కుం టుపడుతోందని రైస్‌మిల్లర్ల సంఘం రాష్ట్ర సం యుక్త కార్యదర్శి బోయిన రమేష్ చెప్పారు. అంతేకాకుండా ఇటీవల 1001 రకం బియ్యం లో నలుపుగింజ వస్తున్నదని లెవీకి నిరాకరించడంతో మరింత ఇబ్బంది ఏర్పడిందన్నారు. రైతులపై తీవ్ర ప్రభావం సమ్మె రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్ద పండుగ సం క్రాంతి ముందు సిబ్బంది సమ్మెతో లెవీ నిలిచిపోయి సమయానికి డబ్బులు అందకపోతే పండుగ ఖర్చులు ఎలాగని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు తాము పండించిన ధాన్యా న్ని మిల్లర్లకు విక్రయిస్తారు. మిల్లర్లు లెవీ, ఇతర అమ్మకాల తర్వాత వచ్చే సొమ్మునే వారికి చెల్లిస్తారు. ఇప్పుడు లెవీ నిలిచిపోవడం, సోమవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే సూచనలు కని పిస్తుండటంతో సుమారు రూ. 40 కోట్ల మేరకు రైతులకు చెల్లిం పులు జరిగే అవకాశం లేదు. రైతులకు ప్రధానమైన సంక్రాంతికి పంట అమ్మగా వచ్చిన డబ్బులతో అన్నీ కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో వారు దిగాలు చెందుతున్నారు. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి శుక్రవారం ఒక్కరోజే సమ్మె అయినా నాలుగు రోజులుగా అవస్థలు పడుతున్నాం. టెక్కలి నుంచి బియ్యం లోడు తెచ్చాను. అన్లోడ్ కాక రాత్రీపగలు ఇక్కడే పడిగాపులు పడాల్సి వస్తోంది. మా లారీ అన్లోడ్ కావడానికి మరో వారం పడుతుందని ఆందోళనగా ఉంది. -కె.శ్రీను. లారీ డ్రైవర్, టెక్కలి సంక్రాంతి ఇక్కడే మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. భోజనం, ఇతర అవసరాలకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. పరిస్థితి చూస్తుంటే మాకు సంక్రాంతి ఇక్కడే అయ్యేటట్లుంది. అధికారులు స్పందించకపోతే సమస్య పరిష్కారం కాదు. -జి.కోటిబాబు, లారీ డ్రైవర్, జమ్ము గ్రామం