కుమ్మేసి.. కూల్చేశారు! | Miller, du Plessis tons set up crushing win | Sakshi
Sakshi News home page

కుమ్మేసి.. కూల్చేశారు!

Published Thu, Feb 2 2017 11:17 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

కుమ్మేసి.. కూల్చేశారు! - Sakshi

కుమ్మేసి.. కూల్చేశారు!

డర్బన్: ఇటీవల శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన దక్షిణాఫ్రికా.. వన్డే సిరీస్ లో మాత్రం చెలరేగిపోతోంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో సైతం సఫారీలు ఏకపక్ష విజయం సాధించారు. లంకేయుల్ని 37.5 ఓవర్లలో186 పరుగులకే కూల్చిసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అటు  బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ  సఫారీలు సత్తాచాటుకుని 121 పరుగుల తేడాతో విజయం సాధించారు.


ఇరు జట్ల మధ్య జరిగిన  డే అండ్ నైట్  మ్యాచ్ లో టాస్ ఓడిన తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్(105), మిల్లర్(117) శతకాలతో మెరిశారు. ఈ జోడి ఐదో వికెట్ కు 117 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. తొలుత లంకేయుల్ని కుమ్మేసిన సఫారీలు.. ఆ తరువాత పేకమేడలా కూల్చేశారు. దక్షిణాఫ్రికా విసిరిన 308 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ ఒక్కరూ లంక క్రికెటర్ కనీసం హాఫ్ సెంచరీ మార్కును చేరకపోవడంతో వారికి ఘోర ఓటమి ఎదురైంది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఐదు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా 2-0 తో ఆధిక్యంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement