దక్షిణాఫ్రికా జోరు | Sri Lanka fought loss | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా జోరు

Published Thu, Feb 9 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

దక్షిణాఫ్రికా జోరు

దక్షిణాఫ్రికా జోరు

సెంచరీతో చెలరేగిన డు ప్లెసిస్‌
పోరాడి ఓడిన శ్రీలంక  


కేప్‌టౌన్‌: డు ప్లెసిస్‌ (141 బంతుల్లో 185; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరవిహారం చేయడంతో.... శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలోనూ దక్షిణాఫ్రికానే విజయం వరించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 40 పరుగుల ఆధిక్యంతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోరు చేసింది.

డు ప్లెసిస్‌ సెంచరీతో అదరగొట్టగా... కెప్టెన్‌ డివిలియర్స్‌ (64; 4 ఫోర్లు), డి కాక్‌ (55; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.1 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ (119; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ఓ దశలో 307/5 పరుగులతో గెలిచే స్థితిలో నిలిచిన లంక... చివర్లో అనూహ్యంగా కుప్పకూలింది. 20 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement