శతక్కొట్టిన మిల్లర్, డు ప్లెసిస్‌ | miller and duplaces centuries | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన మిల్లర్, డు ప్లెసిస్‌

Published Fri, Feb 3 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

శతక్కొట్టిన మిల్లర్, డు ప్లెసిస్‌

శతక్కొట్టిన మిల్లర్, డు ప్లెసిస్‌

దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక చిత్తు

డర్బన్‌: డు ప్లెసిస్, మిల్లర్‌ సెంచరీలతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికా 121 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 307 పరుగులు చేసింది. మిల్లర్‌ (98 బంతుల్లో 117 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), డు ప్లెసిస్‌ (120 బంతుల్లో 105; 7 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగారు. ఇద్దరు ఐదో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. అనంతరం మిల్లర్‌... మోరిస్‌ (26)తో కలిసి ఆరో వికెట్‌కు 65 పరుగులు జతచేశాడు.

లక్మాల్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత శ్రీలంక 37.5 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. లంక బ్యాట్స్‌మెన్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేకపోయారు. చండిమాల్‌ 36 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో పార్నెల్, ఇమ్రాన్‌ తాహిర్, డుమిని తలా 2 వికెట్లు తీశారు. ఐదు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2–0తో ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే శనివారం జొహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. సెంచరీతో చెలరేగిన మిల్లర్‌ గాయం కారణంగా తదుపరి మూడు వన్డేలకు దూరమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement