మూడో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు | South Africa win the third ODI | Sakshi
Sakshi News home page

మూడో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు

Published Thu, Aug 27 2015 11:56 PM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

మూడో వన్డేలో  దక్షిణాఫ్రికా గెలుపు

మూడో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు

కివీస్‌పై 2-1తో సిరీస్ సొంతం

 డర్బన్ : కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (48 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులకు తోడు బౌలర్లు సమయోచితంగా రాణించడంతో బుధవారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సఫారీ జట్టు 2-1తో సొంతం చేసుకుంది. కింగ్స్‌మీడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 283 పరుగులు చేసింది. వాన్ విక్ (58), ఆమ్లా (44) తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.

  మిల్లర్ (36), బెహర్డిన్ (40)లు మెరుగ్గా ఆడారు. వీలర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం వీస్ (3/58), రబడ (2/33), తాహిర్ (2/36)ల బౌలింగ్ ధాటికి న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 221 పరుగులకే కుప్పకూలింది. లాథమ్ (54) టాప్ స్కోరర్. విలియమ్సన్ (39), మున్రో (35) మోస్తరుగా ఆడారు. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; ఆమ్లాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement