ఢిల్లీ ధమాకా...
♦ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం
♦ రాణించిన బిల్లింగ్స్, మోరిస్
మ్యాక్స్‌వెల్, మిల్లర్, మోర్గాన్ ఇలా మ్యాచ్‌ను మలుపుతిప్పే సూపర్ బ్యాట్స్‌మెన్ ఉన్న కింగ్స్ ఎలెవన్... ఢిల్లీ బౌలర్ల ధాటికి తల్లడిల్లింది. అతి పేలవమైన ప్రదర్శనతో పరాభవాన్ని మూటగట్టుకుంది.
న్యూఢిల్లీ: ఐపీఎల్–10లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 51 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై గెలుపొందింది. ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
బిల్లింగ్స్ (40 బంతుల్లో 55; 9 ఫోర్లు) ధాటిగా ఆడగా... చివర్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోరె అండర్సన్ (22 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వరుణ్ అరోన్‌కు 2 వికెట్లు దక్కగా, సందీప్, మోహిత్, అక్షర్ పటేల్‌లు తలా ఒక వికెట్ తీశారు.
తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (29 బంతుల్లో 44; 1 ఫోర్, 3 సిక్సర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. మిల్లర్ (24), మోర్గాన్ (22) ఢిల్లీ బౌలర్లకు తలవంచారు. మోరిస్ 3, నదీమ్, కమిన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: సంజూ సామ్సన్ (సి) మోర్గాన్ (బి) కరియప్ప 19; బిల్లింగ్స్ (సి) మిల్లర్ (బి) అక్షర్ 55; కరుణ్ (సి) సాహా (బి) అరోన్ 0; శ్రేయస్ (సి) మోర్గాన్ (బి) మోహిత్ 22; రిషభ్ పంత్ (సి) మోర్గాన్ (బి) ఆరోన్ 15; అండర్సన్ నాటౌట్ 39; మోరిస్ (సి) మోహిత్ (బి) సందీప్ 16; కమిన్స్ నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 188.
వికెట్ల పతనం: 1–53, 2–55, 3–96, 4–103, 5–120, 6–151.
బౌలింగ్: సందీప్ శర్మ 4–0–41–1, మోహిత్ శర్మ 4–0–37–1, అక్షర్ 4–0–33–1, వరుణ్ ఆరోన్ 4–0–45–2, కరియప్ప 3–0–23–1, మ్యాక్స్‌వెల్ 1–0–7–0.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: వోహ్రా (ఎల్బీడబ్ల్యూ) నదీమ్ 3; ఆమ్లా (సి) బిల్లింగ్స్ (బి) మోరిస్ 19; సాహా (సి) జహీర్ (బి) నదీమ్ 7; మోర్గాన్ (సి) నాయర్ (బి) కమిన్స్ 22; మిల్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అండర్సన్ 24; మ్యాక్స్‌వెల్ (సి) బిల్లింగ్స్ (బి) అమిత్ మిశ్రా 0; అక్షర్ పటేల్ (బి) మోరిస్ 44; మోహిత్ శర్మ (బి) కమిన్స్ 13; కేసీ కరియప్ప (బి) మోరిస్ 1; సందీప్ శర్మ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137.
వికెట్ల పతనం: 1–5, 2–21, 3–31, 4–64, 5–65, 6–88, 7–133, 8–134, 9–137.
బౌలింగ్: జహీర్ 4–0–38–0, నదీమ్ 2–0–13–2, మోరిస్ 4–0–23–3, కమిన్స్ 4–0–23–2, అమిత్ మిశ్రా 3–0–16–1, అండర్సన్ 3–0–23–1.