guardian
-
నా తల్లివి నువ్వే
దిల్లీలోని ఒక అనాథాశ్రమంలో పెరిగింది శివాని. చా...లా సంవత్సరాల తరువాత భర్త, కూతురుతో కలిసి ఆ అనాథాశ్రమానికి వచ్చింది. ‘నేను శివానిని. గుర్తున్నానా?’ అన్నది గార్డియన్ దగ్గరికి వచ్చి. శివాని చిన్నప్పటి జ్ఞాపకాలు గార్డియన్‌ను చుట్టుముట్టాయి. అంతే....గార్డియన్‌కు ఏడుపు ఆగలేదు. ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ తాను కూడా ఏడ్చేసింది శివాని. చాలాసేపటి వరకు వారి మధ్య ఏడుపు తప్ప మాటలు లేవు. ఈ వైరల్ వీడియోలోని భావోద్వేగాలు నెటిజనులను కళ్లనీళ్ల పర్యంతం చేశాయి.శివాని గతంలోకి వెళితే...ఆమె తండ్రి మద్యానికి బానిస అయ్యాడు. తల్లిని హింసించేవాడు. ఈ హింస తట్టుకోలేక భర్త నుంచి విడాకులు తీసుకుంది. తల్లి ఒకచోట, తండ్రి ఒకచోట. పిల్లల ఆలనా΄ాలనా చూసేవారు లేరు. చివరికి అనాథలుగా మిగిలారు. వీరి దీనస్థితి చూసి ఒక పుణ్యాత్ముడు అనాథాశ్రమంలో చేర్పించాడు. మూడు సంవత్సరాల తరువాత ఆ పిల్లలను ఒక కుటుంబం దత్తత తీసుకుంది. పెరిగి పెద్దయి జీవితంలో స్థిరపడింది. తన కష్టకాలంలో ఆదుకున్న ఆశ్రమాన్ని, తల్లిలా ఆదరించిన గార్డియన్‌ను చూడడానికి వచ్చింది. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడి ‘గార్డియన్’ అక్కా, తమ్ముళ్లను సొంతబిడ్డల్లా చూసుకుంది. ‘నా సొంత తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉంది’ అని గార్డియన్ గురించి రాసింది శివాని. -
భారత వ్యతిరేక కథనంపై స్పందించిన అమెరికా
న్యూయార్క్: పాకిస్తాన్లో వరుస ఉగ్రవాదల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని ఇటీవల యూకేకు చెందిన ఓ వీడియా సంస్థ ఆరోపణలు చేస్తూ కథనం వెల్లడించింది. అయతే తాజాగా ఆ కథనంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇటువంటి ఆరోపణలను తీవ్రతరం చేసుకోకుండా ఇరు దేశాలు.. చర్చల ద్వార సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొంది. భారత్‌పై వచ్చిన ఆరోపణలపై ఆమెరికా వైఖరి ఏంటని అడిగిన ప్రశ్నకు యూఎస్ విదేశి వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. ‘పాకిస్తాన్‌లోని వరుస ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వేనుక భారత్ హస్తం ఉందని వెలువడిన కథనం మా దృష్టికి వచ్చింది. అటువంటి ఆరోపణలపై మేము ఎటువంటి వ్యాఖ్యలు చేయిలేం. మేము ఇరు దేశాలకు సంబంధించి సున్నితమైన విషయంలో జోక్యం చేసుకోలేం. అదే విధంగా ఇటువంటి ఆరోపణలను ఇరు దేశాలు సైతం తీవ్రతరం చేసుకోకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’ అని మాథ్యూ మిల్లర్ అన్నారు. 2019 పుల్వావా దాడుల అనంతరం విదేశాల్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చే విధానాలను భారత్ పాటిస్తోందని యూకేకు చెందిన ‘దీ గార్డియన్’ న్యూస్‌పేపర్ ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత విదేశి ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ సుమారు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపణలు చేసింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారాలు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక వెల్లడించామని గార్డియన్ పత్రిక పేర్కొనటం గమనార్హం. అయితే ‘దీ గార్డియన్’ పేపర్ ఆరోపణలను భారత్ విదేశాంగ శాఖ.. తీవ్రంగా ఖండించింది. ఆ నివేదికలో ఉన్నది తప్పుడు సమాచారమని, ఇదంతా భారత్ వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. ఇతర దేశాల్లో టార్గెట్‌గా హత్యలు చేయటం భారత ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేసింది. -
పాక్‌కి వెళ్లి మరీ మట్టుపెడతాం: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని.. అవసరమైతే పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని మట్టుపెడుతుందని దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. బ్రిటన్ పత్రిక గార్డియన్ తాజాగా భారత్‌పై ఆరోపణలతో కూడిన ఓ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ స్పందిస్తూ.. పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపాలనే భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది. కానీ, ఉగ్రవాదుల చర్యలను ప్రతీసారి భారత్ ఉపేక్షించదు. భారత్‌లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం.. ఈ దేశ ఆగ్రహం ఎలా ఉంటుందో వాళ్లు చవిచూడాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్లు(ఉగ్రవాదులు) భారత్‌లో దాడులకు పాల్పడి పాకిస్థాన్‌లోకి గనుక పారిపోతే.. వెంటాడుతాం. ఆ భూభాగంలోకి వెళ్లి మరీ మట్టుపెడతాం. మాకు(భారత సైన్యానికి) ఆ సామర్థ్యం ఉంది. అది చేసి తీరతాం కూడా. పొరుగు దేశం(పాక్) కూడా అది గుర్తిస్తే మంచిది’’ అని కేంద్ర రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో వరుసగా ఉగ్రవాద నేతలు చనిపోతున్నారు. అయితే వాళ్లంతా అనుమానాస్పద రీతిలో.. గుర్తు తెలియని దాడుల్లో మృతి చెందడం గమనార్హం. దీంతో.. ఇందులో ఒక ప్లాన్ ప్రకారమే ఈ హత్యలు జరుగుతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ సైతం నడిచింది. ఈ లోపు గార్డియన్ పత్రిక.. ‘‘విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్ నిఘా ఏజెన్సీ హత్యలు చేస్తోంది. ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకుంది. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్థాన్‌లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైంది. 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలన్నీ భారత గూఢచార సంస్థ ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’ (రా) పర్యవేక్షణలో జరిగాయి. ఈ మేరకు భారత్, పాకిస్థాన్ నిఘా, గూఢచార సంస్థల అధికారులతో మా (గార్డియన్) ప్రతినిధి మాట్లాడి వివరాలు సేకరించారు’’ అని పెద్ద కథనం ప్రచురించింది ది గార్డియన్. అయితే, ఈ హత్యల్లో తమ ప్రమేయం లేదని, ఇది భారత వ్యతిరేక దుష్ప్రచారమని భారత విదేశాంగశాఖ పేర్కొన్నట్లుగా కూడా గార్డియన్ ప్రస్తావించడం గమనార్హం. -
నవ్వితే చాలు.. బాలకృష్ణకు కోపం వస్తుంది
‘‘తెలుగులో బాలకృష్ణతో సినిమాలు చేశాను. ఎవరైనా బాలకృష్ణని చూసి నవ్వితే చాలు. ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది’’ అంటూ చెన్నైలో జరిగిన తమిళ చిత్రం ‘గార్డియన్’ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు కేఎస్ రవికుమార్ అనడం వైరల్‌గా మారింది. బాలకృష్ణతో వరుసగా ‘జైసింహా’ (2018), ‘రూలర్’ (2019) చిత్రాలకు దర్శకత్వం వహించారు కేఎస్ రవికుమార్. ఆ చిత్రాల షూటింగ్ లొకేషన్లో జరిగిన సంఘటనలనే ‘గార్డియన్’ వేదికపై పంచుకున్నట్లున్నారు. ఇంకా ఆ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ– ‘‘ఒకరోజు లొకేషన్లో ఒక వ్యక్తి నవ్వితే.. ‘ఎందుకు నవ్వుతున్నావ్... రేయ్ ఎందుకురా నవ్వావ్.. నన్ను చూసి ఎందుకు నవ్వావ్’’ అని బాలకృష్ణ కొట్టడానికి ముందుకు వెళ్లినట్లుగా చేతులతో చూపించారు కేఎస్ రవికుమార్. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఇంకోసారి నా అసిస్టెంట్‌ని ‘ఆ ఫ్యాన్‌ని ఇలా తిప్పు’ అంటే.. అతను ఫ్యాన్ తి΄్పాడు. ఆ గాలికి బాలకృష్ణ విగ్ కాస్త చెదిరినట్లయితే అతను నవ్వాడు. ‘ఏయ్ ఎందుకు నవ్వుతున్నావ్’ అని బాలకృష్ణ అడుగుతుంటే అసలే తను నా అసిస్టెంట్.. ఎక్కడ కొట్టేస్తారేమోనని, ‘సార్ సార్.. అతను మన అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ సార్..’ అన్నాను. ‘లేదు లేదు.. ఆ΄ోజిట్ గ్యాంగ్.. ఆ΄ోజిట్ గ్యాంగ్.. చూడు ఇప్పుడు కూడా నవ్వుతున్నాడు’ అని ఆయన అన్నారు. ఇక అప్పుడు ‘రేయ్.. వెళ్లరా ఇక్కణ్ణుంఛి’ అని అతన్ని పంపించేశాను’’ అని కూడా చె΄్పారు రవికుమార్. -
Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం
‘‘ఆవు పైన ప్రేమ... లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకునేలా.. నగరం నుంచి పల్లెతల్లికి దగ్గరయ్యేలా కొండకోనల వెంట ప్రయాణించేలా వరదలను తట్టుకొని నిలబడేలా చేసింది’’ అని వివరిస్తుంది డాక్టర్ చెన్నమనేని పద్మ. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా, వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్నా ఊరు ఆమెను ఆకట్టుకుంది. 200 ఆవులకు సంరక్షకురాలిగా మార్చింది. పదేళ్లుగా చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలను, వరించిన జాతీయస్థాయి అవార్డులను వివరించారు పద్మ. ‘‘నా చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఆహారంలోనూ, వాతావరణంలోనూ చాలా తేడా కనిపించేది. తెలుగు లెక్చరర్‌గా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉన్న ఎయిడెడ్ గర్ల్స్ కాలేజీలో ఉద్యోగం చేసేదాన్ని. వ్యవసాయం, ఆహారం ప్రాముఖ్యతను నేను చదువు చెప్పే అమ్మాయిలకు ప్రత్యక్షంగా చూపాలనుకున్నాను. మా నాన్నగారి ఊరు జగిత్యాలకు ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని. ఊరి ప్రయాణం, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేది. ఇదే విషయాన్ని మా క్లాస్ అమ్మాయిలకు చెప్పి, ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇస్తే, తీసుకెళతాను అని చెప్పాను. ఒకేసారి యాభైమంది పేర్లు ఇచ్చారు. వారందరికీ బస్ ఏర్పాటు చేసి, తీసుకెళ్లాను. వ్యవసాయంలో ఏమేం పనులు ఉంటాయో అన్నీ పరిచయం చేశాను. అక్కడి గోశాలకు తీసుకెళితే పిల్లలంతా కలిసి, లక్ష గొబ్బెమ్మలు తయారు చేశారు. ఎరువుగా గొబ్బెమ్మలు కొన్నిరోజుల తర్వాత గోశాల వాళ్లు గొబ్బెమ్మలను తీసుకెళ్లమని చెప్పారు. అప్పటివరకు ఆలోచన చేయలేదు. కానీ, వాటిని హైదరాబాద్ తీసుకొచ్చి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏదైతే అది అయ్యిందని వ్యాన్‌లో లక్షగొబ్బెమ్మలను తీసుకొచ్చి, ఇంట్లో పెట్టించాను. ఎక్కడ చూసినా గొబ్బెమ్మలే. ఇంట్లోవాళ్లు ఏంటిదంతా అన్నారు. కొన్ని రోజులు వాటిని అలాగే చూస్తూ ఉన్నాను. గోమయాన్ని ఎరువుగా వాడితే పంట బాగా వస్తుంది. అయితే, నగరంలో ఇదెలా సాధ్యం అవుతుంది అనుకున్నాను. రూఫ్ గార్డెన్వాళ్లకు ఇస్తే అనే ఆలోచన వచ్చిన వెంటనే వాట్సప్ గ్రూపుల్లో గొబ్బెమ్మలు కావాల్సిన వాళ్లు తీసుకెళ్లచ్చు మొక్కలకు ఎరువుగా అని మెసేజ్ చేశాను. రెండు, మూడు రోజుల్లో మొత్తం గొబ్బెమ్మలు ఖాళీ అయ్యాయి. ఆవుల కొనుగోలు... ఊరు వెళ్లినప్పుడల్లా దారిలో గోవుల గుంపు ఉన్న చోట ఆగి, కాసేపు అక్కడ ఉండి వెళ్లడం ఒక అలవాటుగా ఉండేది. అలా ఒకసారి 80 ఏళ్ల వ్యక్తి నా అడ్రస్ కనుక్కొని వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆవులను బతికించలేకపోతున్నానని, పిల్లలు వాటిని వదిలించుకోమని చెబుతున్నారని ఏడ్చాడు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. అంత పెద్ద వ్యక్తి గోవుల గురించి బాధపడుతుంటే చూడలేకపోయాను. ఏదైతే అది అవుతుందని 55 గోవులను అతను చెప్పిన మొత్తానికి నా పొదుపు మొత్తాల నుంచి తీసి, కొనేశాను. అర్ధం చేసుకుంటూ... కొనడంలో ధైర్యం చేశాను కానీ, ఆ ఆవులను ఎలా సంరక్షించాలో అర్ధం కాలేదు. వర్కర్లను, వాటికి గ్రాసం ఏర్పాటు చేయడం తలకు మించి భారమైంది. వాటిని చూసుకోవడానికి ఉద్యోగం మానేశాను. అయినవాళ్లంతా తప్పు పట్టారు. ‘కాలేజీకి త్వరలో ప్రిన్సిపల్ కాబోతున్నావ్.. ఇలాంటి టైమ్‌లో ఉద్యోగం వదులుకొని ఇదేం పని’ అన్నారు. కానీ, ఆవు లేని వ్యవసాయం లేదు. ఆవు లేకుండా మనిషి జీవనం లేదనిపించేది నాకు. ఇంట్లోవాళ్లకు చెప్పి జగిత్యాలలోనే ఆవులతో ఉండిపోయాను. కానీ, ఊళ్లో అందరినుంచీ కంప్లైంట్లే! ఆవులు మా ఇళ్ల ముందుకు వస్తాయనీ, వాకిళ్లు పాడుచేస్తున్నాయని, పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఆ ఊళ్లో పుట్టిపెరిగిన దాన్ని కాదు కాబట్టి, నాకెవరూ సపోర్ట్ చేసేవాళ్లు లేరు. దీంతో ఆవులను తీసుకొని గోదావరి నదీ తీరానికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పది రోజులు గడిచాయో లేదో విపరీతమైన వానలు, వరదలు. ఆ వరదలకు కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి కూడా. నాకైతే బతుకుతానన్న ఆశ లేదు. ఎటు చూసినా బురద, పాములు.. కృష్ణుడిని వేడుకున్నాను. ‘ఈ ఆవులు నీవి, నీవే కాపాడుకో..’ అని వేడుకున్నాను. అక్కణ్ణుంచి బోర్నపల్లి అటవీ ప్రాంతంలో 15 రోజులు ఆవులతో గుట్టలపైనే ఉన్నాను. మూగజీవాల గురించి, ప్రకృతి గురించి నాకేమీ తెలియదు. ఏం జరిగినా వెనక్కి వెళ్లేది లేదు అనుకున్నాను. నా మొండితనం ప్రకృతిని అర్థం చేసుకునేలా చేసింది. ఎప్పుడో వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేదాన్ని. మా ఇద్దరు అబ్బాయిలు జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఇక నా జీవితం ఆవులతోనే అనుకున్నాను. కరోనా టైమ్‌లో మా కుటుంబం అంతా హైదరాబాద్‌లో ఉంది. నేను గోవులతో అడవుల్లో ఉన్నాను. ఓసారి కుటుంబం అంతా కూర్చుని ఆవులు కావాలా, మేం కావాలో తేల్చుకోమన్నారు. ఆవులే కావాలి అన్నాను. నాకు ఉన్న ఈ ఇష్టాన్ని గమనించిన మా వారు తను చేస్తున్న సెంట్రల్‌గవర్నమెంట్ జాబ్ నుంచి వీఆర్ఎస్ తీసుకొని వచ్చేశారు. తన పొదుపు మొత్తాలను కూడా ఆవుల సంక్షేమానికి వాడాం. మహిళలకు ఉపాధి... ప్రతి యేటా ఆవుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 200 వరకు చేరింది. 50 ఆవులను గుట్టల ప్రాంతాల వారికి ఉచితంగా ఇచ్చేశాను. మిగతా వాటి గోమయంతో పళ్ల పొడి నుంచి వందరకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాను. ఇక్కడి గిరిజన ప్రాంత స్త్రీలు వీటి తయారీలో పాల్గొంటున్నారు. గోమయ ప్రమిదలు, పిడకలు, యజ్ఞసమిధలు.. ఇలా ఎన్నో వీటి నుంచి తయారు చేస్తున్నాం. చిన్నా పెద్ద టౌన్లలో గోమయం ఉత్పత్తుల తయారీలో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, నగర ప్రజలకు చేరువ చేస్తుంటాను. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజన మహిళలకు ఇస్తుంటాను. పట్టణాల్లో ఉన్నవాళ్లు ఎవరైనా వచ్చి ఆవులను చూసుకోవచ్చని ‘స్వధర్మ’ పేరుతో ఆన్లైన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. వీడియోలు చూసి ముందు చాలా మంది ఉత్సాహం చూపారు. కానీ, చివరకు ముగ్గురు మాత్రమే వచ్చారు. వీడియోల్లో ఆవులను, ఇక్కడి వాతావరణం చూడటం వేరు. కానీ, నేరుగా ఈ పరిస్థితులను ఎదుర్కోవడం వేరు. ‘మేమూ వస్తాం, కానీ బెడ్రూమ్ ఉందా, అటాచ్డ్ బాత్రూమ్ ఉందా’ అని అడుగుతుంటారు. కానీ, మేమున్నచోట అలాంటి వసతులేవీ లేవు. దొరికినవి తింటూ, ఆవులతోనే జీవనం సాగిస్తూ ఉంటాం. ఆరు నెలలు గుట్ట ప్రాంతాల్లో, ఆరు నెలలు గోదావరి నదీ తీర ప్రాంతాల వెంబడి తిరుగుతుంటాను. ఈ జీవనంలో ఓ కొత్త వెలుగు, స్వచ్ఛత కనిపిస్తుంటుంది. నేర్చుకున్న వైద్యం.. మనుషుల మాదిరిగానే ఆవులు కూడా ఎంతో ప్రేమను చూపుతాయి. జబ్బు పడతాయి. వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే ‘నన్ను చూడు’ అన్నట్టుగా దగ్గరగా వచ్చి నిలబడతాయి. కనిపించకపోతే బెంగ పెట్టుకుంటాయి. వాటికి జబ్బు చేస్తే సీనియర్ డాక్టర్స్‌ని పిలిíపించి చికిత్స చేయిస్తుంటాను. నేనే వాటి జబ్బుకు తగ్గ చిక్సిత చేయడం కూడా నేర్చుకున్నాను. ఆవులకు సంబంధించి మురళీధర గో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. దీని ద్వారా రేపటి తరం పిల్లలకు మూగజీవాల విలువ... ముఖ్యంగా ఆవు గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు పద్మ. వరించిన అవార్డులు పట్టణప్రాంతాల వారిని పల్లెకు తీసుకెళ్లి చేయిస్తున్న సేవకు 2012లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్‌ను రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నాను. 2013లో చైనాలో జరిగే యూత్ ఎక్సే ్చంజ్ ప్రొగ్రామ్‌కి ప్రభుత్వం టాప్ 100 మెంబర్స్‌ని పంపించారు. వారిలో నేనూ ఒకరిగా ఆ సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం మర్చిపోలేనిది. ఈ యేడాది ఇందిరాగాంధీ అవార్డు సెలక్షన్‌కి కమిటీ మెంబర్‌గా ఆహ్వానం అందుకున్నాను. నిస్వార్థంగా చేసే సేవ ఏ కొద్దిమందికైనా ఉపయోగపడినా చాలు. రైతులు ఎవరైనా ఆవు కావాలని వస్తే వారి వివరాలన్నీ తీసుకొని, ఉచితంగా అందజేస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రాజస్తాన్‌లో కిడ్నాప్.. హరియాణాలో హత్య
జైపూర్: హరియాణాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. గో సంరక్షకులుగా అనుమానిస్తున్న కొందరు రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు ముస్లింలను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరి కాలిన మృతదేహాలు ఒక కారులో లభించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన అరడజను మందికిపైగా బజరంగ్ దళ్ కార్యకర్తల్ని రాజస్తాన్ పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్యలను రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజస్తాన్‌లోని భరత్పూర్ జిల్లా ఘట్‌మీక గ్రామానికి చెందిన నజీర్ (25), జునైద్ అలియాస్ జునా (35)లను బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గురువారం వారిద్దరి మృతదేహాలు హరియాణాలోని భివానిలో లోహారు ప్రాంతంలో ఒక దగ్ధమైన కారులో కనిపించాయి. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ఇద్దరు ముస్లిం యువకుల్ని కిడ్నాప్ చేశారని వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు అరడజనుకుపైగా బజరంగ్దళ్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ‘‘వారికి ఈ నేరంలో ప్రమేయం ఉందో లేదో తేలాల్సి ఉంది’’ అని పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గౌరవ్ శ్రీవాస్తవ చెప్పారు. మృతి చెందిన వారిలో జునైద్‌కి నేరచరిత్ర ఉందని, ఐదుకి పైగా కేసుల్లో అతను నిందితుడని చెప్పారు. రింకూ సైనీ అనే నిందితుడిని అరెస్టు చేశామన్నారు. -
భారత్ అమ్ముల పొదిలో.. డార్డియన్ డ్రోన్స్
న్యూఢిల్లీ : ఆసియా - పసిఫిక్ రీజియన్‌లో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా.. చైనాతో ఢీకొట్టేందుకు అనువైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. తాజాగా అమెరికా నుంచి 22 గార్డియన్ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ భారత్‌కు వస్తున్న సందర్భంగా వీటి అమ్మకం-కొనుగోలుపై ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య బలమైన రక్షణ సంబంధాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగా ఈ ఒప్పందాలు జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గార్డియణ విమానాల కొనుగోలుకు భారత్ 2 బిలియన్ డాలర్లను వెచ్చించనుంది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో రూపొందిన గార్డియన్ విమానాలు.. నేవీలో చేరడం వల్ల మన శక్తి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా సముద్ర పర్యవేక్షణలో గార్డియన్ విమానాలను మించినవి లేవు. హిందూమహాసముద్రంలో చైనా దుందుడుకు చర్యలను అడ్డుకోవడంలో భాగంగా అమెరికా-భారత్‌లు ఈ ఒప్పందం చేసుకుంటున్నాయి. -
లైంగిక వేధింపులు అక్కడ సర్వసాధారణం
లండన్: బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో లింగ వివక్ష, లైంగిక వేధింపులు, అసభ్యప్రవర్తన వంటివి నిత్యకృత్యాలుగా మారాయని ఓ సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. ప్రముఖ వార్త పత్రిక గార్డియన్‌లో ఒక కథనం ప్రచురితమయింది. యూకేలోని వర్సిటీలకు సమాచార హక్కు చట్టం కింద పంపిన అభ్యర్థనల ద్వారా తాము ఈ సంగతి తెలుసుకున్నట్లు ఆసంస్థ తెలిపింది. 2011-17 మధ్య కాలంలో 169 మంది బాధితులు ఆయా వర్సిటీల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా 127 మంది తోటి ఉద్యోగులపైనా ఫిర్యాదులు చేశారు. వీటిల్లోని చాలా వాటిపై నిందితులు బాధితులతో కోర్టు వెలుపల రాజీకి రావటమో, బాధితులను బెదిరించి ఫిర్యాదులను వాపసు తీసుకునేలా చేయటమో వంటివి జరిగాయి. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ మంది బాధితులు తమ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని బయటపడటం లేదని తేలింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అత్యధికంగా సిబ్బందిపై విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు తెలింది. దీని తర్వాత నాటింగ్‌హామ్, ఎడిన్‌బరో, యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్, ఎసెక్స్, కేంబ్రిడ్జి వర్సిటీలు ఉన్నాయి. బ్రిటన్ మొత్తమ్మీద అయిదు యూనివర్సిటీల్లో మాత్రమే బాధితులకు పరిహారం అందింది. -
12 దేశాల్లో రోల్స్ రాయిస్ భారీ అక్రమాలు
లండన్ : బ్రిటన్ ప్రముఖ తయారీ సంస్థ రోల్స్ రాయిస్, ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో భారీ అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడవుతోంది. సీక్రెట్‌గా ఏజెంట్స్‌ను నియమించుకుని లాభాదాయకమైన భూ ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. వారికి లంచాలు కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. గార్డియన్, బీబీసీ విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం బ్రాడ్ కాస్ట్ అయిన పనోరమ ప్రొగ్రామ్‌లో ఈ విషయాలు బీబీసీ పేర్కొంది. లాభాలు పెంచుకోవడానికి అక్రమ చెల్లింపుల పద్ధతిని అనుసరించి రోల్స్ రాయిస్ ప్రయోజనాలు పొందిందని బీబీసీ, గార్డియన్లు తెలిపాయి. ల్యాండ్ కాంట్రాక్టులు పొందడానికి కూడా ఏజెంట్లు అక్రమ చెల్లింపులకు తెరతీశారని సంస్థ అంతర్గత వ్యక్తులు చెబుతున్నారు. ఈ విషయంపై అమెరికా, బ్రిటన్ అవినీతి నిరోధక ఏజెన్సీలు నెట్వర్క్ ఏజెంట్లను విచారించడం ప్రారంభించాయి. 13 బిలియన్ పౌండ్ల(రూ.1,06,125కోట్లకు పైగా) విలువ కలిగిన టర్బైన్లను, ఇంజన్లను ప్యాసెంజర్, మిలటరీ ఎయిర్క్రాప్ట్లకు విక్రయించిన రోల్స్ రాయిస్ వాటిపై మాత్రం పూర్తి వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తోంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న విచారణకు తాము సహకరిస్తామని, కానీ మధ్యవర్తిత్వలు పాల్పడిన అవినీతి, లంచాలకు సంబంధించిన విషయాలు మాత్రం సీరియస్ ఫ్రాడ్ ఆఫీసు, ఇతర అథారిటీలు విచారిస్తాయని దాటవేస్తోంది. బ్రెజిల్, భారత్, చైనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, అంగోలా, ఇరాక్, ఇరాన్, కజాఖ్స్తాన్, అజర్బైజాన్, నైజీరియా, సౌదీ అరేబియాలలో రోల్స్ రాయిస్ ఏజెంట్లను నియమించుకుని ఈ అక్రమాలకు పాల్పడిందని బీబీసీ రిపోర్టు చేసింది. బీబీసీ రిపోర్టులో భారత్‌కు చెందిన తన డిపెన్స్ ఏజెంట్ సుధీర్ చౌదరికి అక్రమంగా 10 మిలియన్ పౌండ్ల(రూ.81కోట్లకు పైగా) ను రోల్స్ రాయిస్ చెల్లించిందని వెల్లడైంది. భారత వైమానిక దళం వాడే హాక్ ఎయిర్క్రాప్ట్ల అతిపెద్ద కాంట్రాక్ట్ రోల్స్ రాయిస్ చేతికి వెళ్లడానికి ఆయన సహకారం అందించినట్టు బీబీసీ తెలిపింది. -
మారణాయుధాలను విక్రయిస్తున్న అమెజాన్!
మారణాయుధాల అమ్మకాలపై ఆంక్షలు ఉండగా.. వాటిని పట్టించుకోకుండా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ విచ్చలవిడిగా కత్తులను అమ్ముతున్నట్టు తేలింది. 18 ఏళ్ల వయస్సు నిండిన వారికి మాత్రమే పలు ఆంక్షలతో కత్తుల వంటి మారణాయుధాలు అమ్మాల్సి ఉంటుంది. కానీ, అమెజాన్ మాత్రం బ్రిటన్‌లో ఓ 16 ఏళ్ల బాలుడికి పెద్ద కత్తిని అమ్మింది. మడుచుకోవడానికి వీలుండి.. 8.5 సెంటీమీటర్ల పొడవు బ్లేడ్ ఉన్న కత్తిని ఆ బాలుడు 40 పౌండ్లకు అమెజాన్‌లో కొనుగోలు చేశాడు. ఆ కత్తితో స్కూలుకు వెళ్లిన అతను సహచర విద్యార్థిని పొడిచి చంపాడు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఈ కేసులో నిందితుడైన బాలుడిపై హత్య అభియోగాలను కోర్టు ఎత్తివేసినప్పటికీ, మృతికి కారణమైన అభియోగాలతో అతన్ని విచారించాలని నిర్ణయించింది. 18 ఏళ్ల లోపు ఉన్నవారికి మూడు అంగుళాల కన్నా పొడవు ఉన్న కత్తిని అమ్మడం బ్రిటన్‌లో చట్టవిరుద్ధం. అయితే ఆ బాలుడు మాత్రం తాను మేజర్ అని పేర్కొంటూ అమెజాన్‌లో కత్తిని కొనుగోలు చేశాడు. అతని వయస్సు నిర్ధారించుకోకుండానే అమెజాన్ అతడికి కత్తిని డెలివరీ చేసింది. తన వయస్సు గురించి ఆరా తీయకుండా ఉండేందుకు ఆ బాలుడు తెలివిగా డెలివరీని ఇక్కడ ఉంచి వెళ్లండి అంటూ తన ఇంటి డోర్‌కు ఓ లేఖను అంటించాడు. డెలవరీ బాయ్ అదేవిధంగా చేయడంతో అక్రమంగా కొనుగోలుచేసిన కత్తితో అతడు ఘాతుకానికి ఒడిగట్టాడు. తాజాగా గార్డియన్ పత్రిక తమ ఆపరేషన్‌లో భాగంగా ఓ ఇంటి చిరునామాతో అమెజాన్‌లో కత్తిని ఆర్డర్ చేసి.. ఆ బాలుడి మాదిరిగా ఆ ఇంటి డోర్‌కు ఓ లేఖను అంటించింది. ఆ లేఖ ప్రకారం కత్తిని డెలివరీ బాయ్ ఆ చిరునామాలో వదిలేసి వెళ్లాడు. దీంతో కత్తుల వంటి మారణాయుధాల అమ్మకాల్లో అమెజాన్ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదని, పిల్లలకు విచ్చలవిడిగా మారణాయుధాలు అమ్ముతున్నదని తాజా ఉదంతం రుజువు చేస్తున్నదని గార్డియన్ పత్రిక వ్యాఖ్యానించింది. -
అమెరికాలో అక్టోబర్ సంక్షోభం
ఈ మొత్తం వ్యవహారం విస్మయం కలిగించేటట్టు ఉంది. నష్టనివారణ చర్యలు కోసం అమెరికా ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ‘ఎడ్వర్డ్ స్నోడెన్‌కు కృతజ్ఞతలు’ రెండురో జుల క్రితం అమెరికా పౌరులు కొందరు కేపిటల్ హిల్ అనేచోట ఊరేగింపుగా వెళుతూ ఇచ్చిన నినాదాలలో ఇదొకటి. ఇప్పుడు స్నోడెన్ అమెరికాకు ప్రథమ శత్రువన్న సం గతి ప్రపంచమంతటికీ తెలుసు. ‘ఈ సామూహిక గూఢచర్యం పనులు ఆపాలి!’ అని కూడా ఆ పౌర బృందం ఆక్రోశించింది. ఒక వ్యవస్థగా అమెరికాను స్వదేశీయులే ఎంత చీదరించుకుంటున్నారో చెప్పడానికి ఇదిచాలు. సందర్భం కూడా తలవంపులు తెచ్చేదే. తనకు అత్యంత ఆప్తమైన యూరప్ ఖండ పాలకుల ఫోన్ల సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ అమెరికా అడ్డంగా దొరికిపోయింది. ఈ అక్టోబర్ 24న లండన్ నుంచి వెలువడే ‘గార్డియన్’ ప్రచురించిన ఒక వార్తా కథనం అగ్రదేశంలో అక్టోబర్ సంక్షోభానికి బీజం వేసింది. ‘2006, అక్టోబర్’కు చెందిన ఒక కీలక పత్రమే ఈ కథనానికి కేంద్రబిందువు. ప్రపంచంలో 200 మంది ప్రముఖుల, ప్రముఖ సంస్థల సెల్‌ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ చిరునామాలను సేకరించి, అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ)వారి సమాచారాన్ని రహస్యంగా తెలుసుకుంటున్న సంగతిని ఆ పత్రం రుజువు చేస్తోంది. ఎన్ఎస్ఏ మాజీ కాంట్రాక్టర్ అయిన స్నోడెన్ విడుదల చేసిన రహస్య పత్రాల గుట్టలలోనిదే ఇది కూడా. ‘గార్డియన్’ దీనిని అదను చూసి ప్రచురించింది. యూరోపియన్ యూనియన్ సమావేశాల కోసం ఆయా దేశాల అధినేతలంతా బ్రస్సె ల్స్‌లో సమావేశమవడానికి కాస్త ముందు ఆ పత్రిక ఈ వార్తను ప్రచురించింది. అమెరికా గూఢచర్యానికి పాల్పడిన సంగతి తిరుగు లేకుండా రుజువు చేసింది. ఈ 200 మంది ఫోన్లు, ఈమెయిల్ చిరునామాలలో జర్మనీ చాన్సలర్ ఏంజెలినా మెర్కెల్ ఉపయోగించే మొబైల్ నెంబరు కూడా ఉంది. ఇది ఆ దేశానికి తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. చరిత్ర సృష్టిస్తూ తను అధ్యక్షునిగా ఎన్నికైనపుడు (2011) ఒబామా పిలిచిన యూరప్ నుంచి ఆహ్వానించిన తొలి అతిథి మెర్కెల్. ఇప్పుడు ఆమె అమెరికాను నిలదీయాలని గట్టిగా కోరు కుంటున్నారు. బ్రస్సెల్స్ ఏర్పాటైన ఈయూ సమావేశం కూడా చర్చనీయాంశాలను పక్కన పెట్టి అమెరికా విపరీత చర్య గురించే ఎక్కు వగా ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారం విస్మయం కలి గించేటట్టు ఉంది. నష్ట నివారణ చర్యలు చేప ట్టాలని అమెరికా ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. మెర్కెల్ మొబైల్ నుం చి ఎన్ఎస్ఏ సమాచారం సేకరిస్తున్న సంగతి తనకు తెలియదని, ఈ విషయం బహిర్గత మైన వెంటనే అధ్యక్షుడు ఒబామా అమాయ కత్వం నటించారు. అయితే గూఢచర్యం సం గతి 2010 సంవత్సరం నుంచి ఒబామాకు తెలుసునని జర్మనీ పత్రిక ‘బిల్డ్ ఏఎం సోన్టా గ్’ ఒక బాంబు పేల్చింది. మెర్కెల్‌కు వస్తున్న ఫోన్‌కాల్స్ వినే పనిలో అమెరికా గూఢచారి శాఖ ఉద్యోగి ఒకరు ఉన్నారని 2010లోనే ఎన్ ఎస్ఏ అధిపతి కీత్ అలెగ్జాండర్ ఒబామాకు నివేదించిన సంగతిని జర్మనీ పత్రిక వెల్ల డించింది. ఈ సంగతి విని ఒబామా ‘ఇంకాస్త సమాచారం కూడా సేకరించండి!’ అని ఆదే శించినట్టు ఆధారాలు బయటపడ్డాయి. మెర్కె ల్ నమ్మదగిన జర్మన్ కాదని ఒబామా నమ్మక మట. అమెరికా గూఢచర్యం గురించి జర్మనీ ఇప్పటికే అక్కడి అమెరికా రాయబారిని పిలిచి చీవాట్లు పెట్టింది. ఈ పరిణామాల మీద శ్వేత సౌధం అధికార ప్రతినిధి కెయిట్లిన్ హేడెన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించినా, ఒక పాత సత్యం కొత్తగా వెల్లడించారు. విదేశాలకు సం బంధించిన సమాచారాన్ని అమెరికా గూఢ చారి సంస్థలు సేకరించడం మామూలేనని ఆయన సెలవిచ్చారు. మెర్కెల్ నుంచి కాదు, ఆమెకు ముందు అధ్యక్ష పదవిలో ఉన్న జెరార్డ్ ష్రోడర్ ఫోను సమాచారం కూడా అమెరికా విన్న సంగతి కూడా బయటపడింది. సెప్టెం బర్ 11,2001 దాడుల తరువాత అమెరికా నిగూఢత, జవాబుదారీతనాలకు సంబంధిం చిన మొత్తం విలువలను విడిచిపెట్టేసిందని స్నోడెన్ పత్రం వ్యాఖ్యానించింది. దీని ఫలి తమే కావచ్చు, అమెరికా ఈయూకు చెందిన కార్యాలయాలు, ప్రముఖులకు చెందిన ఐదు లక్షల ఫోన్ కాల్సును రహస్యంగా సేకరిం చిందని తేలింది. 35 మంది ప్రపంచ ప్రముఖ రాజకీయ ప్రముఖులలో మెర్కెల్‌తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకాయిస్ హోలాండ్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా వాన్ రోసెఫ్, మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో వంటి వారి కాల్స్ ఎన్ఎస్ఏ చాటుగా వింటున్నదని ఆరోపణలు వచ్చాయి. ఇంకా రష్యా, ఇరాన్, రష్యా నాయకుల కాల్స్ కూడా ఆ సంస్థ లక్ష్యంగా ఎంచుకుంది. రష్యా, బ్రెజిల్ ఇప్ప టికే దీని మీది మండిపడుతుండగా, అమెరికా ఇక నమ్మకమైన దేశమేనని రుజువు చేసుకునే పని ఆ దేశానిదేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు వ్యా ఖ్యానించారు. ఈ సంవత్సరాంతంలోగా ఈ అంశం మీద అమెరికాతో చర్చలు జరపాలని మెర్కెల్ అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికాను వెలివేసే ఉద్దేశం వీరికి ఎంతమా త్రమూ లేదు. ఇప్పుడు బహుశా ప్రపంచం అంతా ఎదురు చూసేది ఒక అంశం కోసమే కావచ్చు. అది- కేపిటల్ హిల్ తరహా ఊరేగిం పులు బలపడాలి. తమ ప్రభుత్వం మీద ఆ పౌరులు వినిపిస్తున్న వ్యతిరేక నినాదాలకు పదును రావాలి. - కల్హణ