న్యూఢిల్లీ : ఆసియా - పసిఫిక్ రీజియన్‌లో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా.. చైనాతో ఢీకొట్టేందుకు అనువైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. తాజాగా అమెరికా నుంచి 22 గార్డియన్ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది.
అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ భారత్‌కు వస్తున్న సందర్భంగా వీటి అమ్మకం-కొనుగోలుపై ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య బలమైన రక్షణ సంబంధాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగా ఈ ఒప్పందాలు జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గార్డియణ విమానాల కొనుగోలుకు భారత్ 2 బిలియన్ డాలర్లను వెచ్చించనుంది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో రూపొందిన గార్డియన్ విమానాలు.. నేవీలో చేరడం వల్ల మన శక్తి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా సముద్ర పర్యవేక్షణలో గార్డియన్ విమానాలను మించినవి లేవు. హిందూమహాసముద్రంలో చైనా దుందుడుకు చర్యలను అడ్డుకోవడంలో భాగంగా అమెరికా-భారత్‌లు ఈ ఒప్పందం చేసుకుంటున్నాయి.
భారత్ అమ్ముల పొదిలో.. డార్డియన్ డ్రోన్స్
Published Mon, Sep 25 2017 10:02 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement