నవ్వితే చాలు.. బాలకృష్ణకు కోపం వస్తుంది | KS Ravikumar Speech at Guardian Press Meet | Sakshi
Sakshi News home page

నవ్వితే చాలు.. బాలకృష్ణకు కోపం వస్తుంది

Published Thu, Mar 7 2024 4:47 AM | Last Updated on Thu, Mar 7 2024 12:31 PM

KS Ravikumar Speech at Guardian Press Meet - Sakshi

– దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌

‘‘తెలుగులో బాలకృష్ణతో సినిమాలు చేశాను. ఎవరైనా బాలకృష్ణని చూసి నవ్వితే చాలు. ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది’’ అంటూ చెన్నైలో జరిగిన తమిళ చిత్రం ‘గార్డియన్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ అనడం వైరల్‌గా మారింది. బాలకృష్ణతో వరుసగా ‘జైసింహా’ (2018), ‘రూలర్‌’ (2019) చిత్రాలకు దర్శకత్వం వహించారు కేఎస్‌ రవికుమార్‌. ఆ చిత్రాల షూటింగ్‌ లొకేషన్‌లో జరిగిన సంఘటనలనే ‘గార్డియన్‌’ వేదికపై పంచుకున్నట్లున్నారు. ఇంకా ఆ ప్రీ రిలీజ్‌ వేడుకలో మాట్లాడుతూ–  

‘‘ఒకరోజు లొకేషన్‌లో ఒక వ్యక్తి నవ్వితే.. ‘ఎందుకు నవ్వుతున్నావ్‌... రేయ్‌ ఎందుకురా నవ్వావ్‌.. నన్ను చూసి ఎందుకు నవ్వావ్‌’’ అని బాలకృష్ణ కొట్టడానికి ముందుకు వెళ్లినట్లుగా చేతులతో చూపించారు కేఎస్‌ రవికుమార్‌. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఇంకోసారి నా అసిస్టెంట్‌ని ‘ఆ ఫ్యాన్‌ని ఇలా తిప్పు’ అంటే.. అతను ఫ్యాన్‌ తి΄్పాడు. ఆ గాలికి బాలకృష్ణ విగ్‌ కాస్త చెదిరినట్లయితే అతను నవ్వాడు.

‘ఏయ్‌ ఎందుకు నవ్వుతున్నావ్‌’ అని బాలకృష్ణ అడుగుతుంటే అసలే తను నా అసిస్టెంట్‌.. ఎక్కడ కొట్టేస్తారేమోనని, ‘సార్‌ సార్‌.. అతను మన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శరవణన్‌ సార్‌..’ అన్నాను. ‘లేదు లేదు.. ఆ΄ోజిట్‌ గ్యాంగ్‌.. ఆ΄ోజిట్‌ గ్యాంగ్‌.. చూడు ఇప్పుడు కూడా నవ్వుతున్నాడు’ అని ఆయన అన్నారు. ఇక అప్పుడు ‘రేయ్‌.. వెళ్లరా ఇక్కణ్ణుంఛి’ అని అతన్ని పంపించేశాను’’ అని కూడా చె΄్పారు రవికుమార్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement