లండన్: బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో లింగ వివక్ష, లైంగిక వేధింపులు, అసభ్యప్రవర్తన వంటివి నిత్యకృత్యాలుగా మారాయని ఓ సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. ప్రముఖ వార్త పత్రిక గార్డియన్‌లో ఒక కథనం ప్రచురితమయింది. యూకేలోని వర్సిటీలకు సమాచార హక్కు చట్టం కింద పంపిన అభ్యర్థనల ద్వారా తాము ఈ సంగతి తెలుసుకున్నట్లు ఆసంస్థ తెలిపింది.
2011-17 మధ్య కాలంలో 169 మంది బాధితులు ఆయా వర్సిటీల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా 127 మంది తోటి ఉద్యోగులపైనా ఫిర్యాదులు చేశారు. వీటిల్లోని చాలా వాటిపై నిందితులు బాధితులతో కోర్టు వెలుపల రాజీకి రావటమో, బాధితులను బెదిరించి ఫిర్యాదులను వాపసు తీసుకునేలా చేయటమో వంటివి జరిగాయి. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ మంది బాధితులు తమ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని బయటపడటం లేదని తేలింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అత్యధికంగా సిబ్బందిపై విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు తెలింది. దీని తర్వాత నాటింగ్‌హామ్, ఎడిన్‌బరో, యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్, ఎసెక్స్, కేంబ్రిడ్జి వర్సిటీలు ఉన్నాయి. బ్రిటన్ మొత్తమ్మీద అయిదు యూనివర్సిటీల్లో మాత్రమే బాధితులకు పరిహారం అందింది.
లైంగిక వేధింపులు అక్కడ సర్వసాధారణం
Published Mon, Mar 6 2017 2:54 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement
Advertisement