నా తల్లివి నువ్వే | Indian-origin woman meets adoption centre guardian | Sakshi
Sakshi News home page

నా తల్లివి నువ్వే

Jun 23 2024 4:34 AM | Updated on Jun 23 2024 4:34 AM

Indian-origin woman meets adoption centre guardian

వైరల్‌ 

దిల్లీలోని ఒక అనాథాశ్రమంలో పెరిగింది శివాని. చా...లా సంవత్సరాల తరువాత భర్త, కూతురుతో కలిసి ఆ అనాథాశ్రమానికి వచ్చింది. ‘నేను శివానిని. గుర్తున్నానా?’ అన్నది గార్డియన్‌ దగ్గరికి వచ్చి. శివాని చిన్నప్పటి జ్ఞాపకాలు గార్డియన్‌ను చుట్టుముట్టాయి. అంతే....గార్డియన్‌కు ఏడుపు ఆగలేదు. ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ తాను కూడా ఏడ్చేసింది శివాని. చాలాసేపటి వరకు వారి మధ్య ఏడుపు తప్ప మాటలు లేవు. ఈ వైరల్‌ వీడియోలోని భావోద్వేగాలు నెటిజనులను కళ్లనీళ్ల పర్యంతం చేశాయి.

శివాని గతంలోకి వెళితే...ఆమె తండ్రి మద్యానికి బానిస అయ్యాడు. తల్లిని హింసించేవాడు. ఈ హింస తట్టుకోలేక భర్త నుంచి విడాకులు తీసుకుంది. తల్లి ఒకచోట, తండ్రి ఒకచోట. పిల్లల ఆలనా΄ాలనా చూసేవారు లేరు. చివరికి అనాథలుగా మిగిలారు. వీరి దీనస్థితి చూసి ఒక పుణ్యాత్ముడు అనాథాశ్రమంలో చేర్పించాడు. మూడు సంవత్సరాల తరువాత ఆ పిల్లలను ఒక కుటుంబం దత్తత తీసుకుంది. పెరిగి పెద్దయి జీవితంలో స్థిరపడింది. తన కష్టకాలంలో ఆదుకున్న ఆశ్రమాన్ని, తల్లిలా ఆదరించిన గార్డియన్‌ను చూడడానికి వచ్చింది. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడి ‘గార్డియన్‌’ అక్కా, తమ్ముళ్లను సొంతబిడ్డల్లా చూసుకుంది. ‘నా సొంత తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉంది’ అని గార్డియన్‌ గురించి రాసింది శివాని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement