శంషాబాద్‌కు మాథ్యూ మృతదేహం | Matthew 's body reached to Shamshabad from the US | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌కు మాథ్యూ మృతదేహం

Published Wed, Mar 9 2016 8:41 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Matthew 's body reached to Shamshabad  from the US

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన విద్యార్థి మృతదేహం నగరానికి చేరుకుంది. బుధవారం తెల్లవారుజామున రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన మృతదేహాన్ని విద్యార్థి బంధువులకు అప్పగించారు. వివరాలు..నగరంలోని హబ్సీగూడకు చెందిన జాయ్ మాథ్యూ ఆరు నెలల క్రితం అమెరికాలోని ట్రాయ్ యూనివర్సిటీలో ఎం.ఎస్ చేయడానికి వెళ్లాడు.

ఈ క్రమంలో పిబ్రవరి 20న స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు స్నేహితులు తీవ్రంగ గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. జాయ్ మాథ్యూ మృతిచెందాడు. భారత ప్రభుత్వ సహకారంతో మృతదేహాన్ని హైదరాబాద్ తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement