సెమీస్‌లో విష్ణు-ప్రణవ్ జోడి
జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్
సాక్షి, హైదరాబాద్: ఛోటాభీమ్ ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బాలుర డబుల్స్ (అండర్-13) విభాగంలో పుల్లెల విష్ణు-ప్రణవ్ రావు జోడి సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో ఈ టోర్నీ జరుగుతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విష్ణు-ప్రణవ్ (ఆంధ్రప్రదేశ్) 21-18, 21-18 స్కోరుతో హరి ఓం (ఢిల్లీ)-అన్మోల్ జూన్ (హర్యానా)పై విజయం సాధించారు.
అండర్-15 బాలికల విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పుల్లెల గాయత్రి, జక్కా వైష్ణవి రెడ్డి సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్స్‌లో గాయత్రి 9-21, 21-17, 21-12 స్కోరుతో చిమ్రాన్ కలీటా (అస్సాం)పై గెలుపొందగా, హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో వైష్ణవి 21-23, 21-19, 21-18తో రితిక థాకర్ (మహారాష్ట్ర)ను ఓడించింది.
ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో బాలికల అండర్-13 విభాగంలో రూహి రాజు- కైవల్యలక్ష్మి (ఏపీ) 21-23, 21-5, 21-16తో శ్రీయ చిత్తూర్-శ్వేత (ఏపీ)పై, సమియా ఫారుఖీ ఇమాద్ (తెలంగాణ)-కవిప్రియ (పాండిచ్చేరి) ద్వయం 21-19, 21-18తో అదితి-ఆషి రావత్ (ఢిల్లీ)పై విజయం సాధించి సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టారు.