
ముంబై: భారత టీనేజ్ టెన్నిస్ స్టార్ మాయ రాజేశ్వరన్ రేవతి సంచలన ప్రదర్శన సెమీ ఫైనల్లో ముగిసింది. ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టోర్నీలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన ఆమె అద్భుత ప్రదర్శనతో పలువురు అంతర్జాతీయ క్రీడాకారిణులను కంగుతినిపించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. కానీ ఆమె జోరుకు సెమీస్‌లో చుక్కెదురైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల భారత ప్లేయర్ 3–6, 1–6తో స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ 117వ ర్యాంకర్ జిల్ టెచ్‌మన్ చేతిలో పరాజయం చవిచూసింది.
మొత్తానికి బరిలోకి దిగిన తొలి సీనియర్ స్థాయి టోరీ్నలో మాయ చేసిన పోరాటం అందర్ని ఆకట్టుకుంది. రెండో సెమీస్‌లో ఎనిమిదో సీడ్ మనంచయ సవంగ్‌కావ్ (థాయ్‌లాండ్) 6–2, 6–2తో రెండో సీడ్ రెబెక్కా మరినో (కెనడా)పై గెలిచి ఫైనల్ చేరింది. టెచ్‌మన్, రెబెక్కాల మధ్య నేడు టైటిల్ పోరు జరుగనుంది. డబుల్స్‌లో డచ్ ప్లేయర్ అరియనె హర్తొనొతో కలిసి బరిలోకి దిగిన భారత స్టార్ ప్రార్థన తోంబరే తుదిపోరుకు అర్హత సాధించింది.