Maya
-
తానొక.. రాక్ 'మాయా'జాలం!
అమెరికాస్ గాట్ టాలెంట్ వేదికపై తన ప్రదర్శనతో ఉర్రూతలూగించిన మాయా నీలకంఠన్‌ను సైమన్ కోవెల్ ‘రాక్ దేవత’ అని ప్రశంసించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను ప్రశంసల్లో ముంచెత్తాడు. ముంబైలోని మహీంద్రా బ్లూస్ ఫెస్టివల్లో మాయ త్వరలో ప్రదర్శన ఇవ్వనుంది. రెండేళ్ల వయసు నుంచే సంగీతంతో స్నేహం మొదలు పెట్టింది మాయ. నాన్న గిటార్ వాయించేవాడు. ఆయన ద్వారా ఎన్నో పాటలు నేర్చుకుంది మాయ.యూట్యూబ్ వీడియోల ద్వారా గిటార్ వాయించడం ఎలాగో తండ్రి నేర్పించాడు. ఆరేళ్ల వయసు నుంచే గిటార్ ప్లే మొదలు పెట్టింది. యాభైమంది ప్రేక్షకులు ఉన్న హాలులో తొలిసారి స్టేజీపై ప్రదర్శన ఇచ్చింది. ఇంటి నాలుగు గోడలౖకే పరిమితమైన తన ప్రతిభ తొలిసారిగా ప్రేక్షకుల్లోకి వచ్చింది.ప్రపంచంలోనే నంబర్ వన్ టాలెంట్ షో అమెరికాస్ గాట్ టాలెంట్(ఏజీటీ)లో వెయ్యిమంది ప్రేక్షకుల మధ్య ప్రదర్శన ఇచ్చింది. తాను స్టేజీ మీదికి వెళుతున్నప్పుడు ప్రేక్షకులు అరవడంతో మాయ కాస్త భయపడింది. అయితే మాయ ప్రదర్శన మొదలు కావడంతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.గిటార్ ప్రసన్న అనే గురువు దగ్గర కర్నాటక సంగీతం నేర్చుకుంది మాయ. ‘ఏజీటీ’ కోసం రెండు మూడు వారాల పాటు శిక్షణ తీసుకుంది. శిక్షణ సమయంలో ప్రసన్నతో పాటు ఎంతోమంది తనకు సలహాలు ఇచ్చారు.‘ఏజీటీ’ వేదికపై మూమెంట్స్‌కు సంబంధించి నెటిఫ్లిక్స్ సిరీస్ ‘ఆరేంజ్ ఈజ్ ది న్యూ బ్లాక్’తో అవార్డ్ గెలుచుకున్న జెస్సికా పిమెంటల్ శిక్షణ ఇచ్చింది. షో కోసం మానసికంగా సిద్ధం కావడానికి అవసరమైన సలహాలు ఇచ్చింది. ‘విభిన్నమైన జానర్స్తో నాదైన సంగీతాన్ని సృష్టించాలనేది నా కల’ అంటుంది మాయా నీలకంఠన్. -
11 ఏళ్లకే గిటార్‌తో ప్రదర్శన.. అమెరికా ప్రముఖ షోని మెస్మరైజ్ చేసింది!
జస్ట్ 11 ఏళ్ల చిన్నారి తన గిటార్ కళా నైపుణ్యంతో అమెరికా గాట్ టాలెంట్‌ని మెస్మరైజ్ చేసింది. ఆ చిన్నారి పేరు మాయ నీలకంఠన్. ఇటీవల అమెరికా గాట్ టాలెంట్ కోసం జరిగిన అడిషన్లో మొత్తం షో దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పాపా రోచ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై తన గిటార్ ప్రదర్శనతో ఆ షో జడ్జిలనే ఆశ్చర్యపరిచింది. మాయ తన అద్భుతమైన గిటార్ ప్రదర్శన ఆ వేదికపై ఉన్న దిగ్గజ జడ్జిలు సైమన్ కోవెల్, సోఫియా వెర్గారా, హెడీ క్లమ్, హౌవీ మాండెల్ల మనసులను గెలుచుకుని ప్రశంసలందుకుంది. మాయ ఆడిషన్ వీడియో నెట్టింట పెను సంచలనంగా మారింది. పైగా ఈ కళా ప్రావిణ్యమే ఆమెకు భారతదేశపు అత్యంత పిన్న వర్దమాన రాక్ స్టార్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. వేలాది మంది ఆమె గిటార్ మ్యూజిక్ ప్రదర్శనకు అభిమానులుగా మారిపోయారు. నెట్టింట యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం ఆమె గిటార్ మ్యూజిక్‌కి ఫిదా అయ్యారు. ఇంత చిన్న వయసులోనే అంత అపారమైన ప్రతిభను సొంత చేసుకోవడం గ్రేట్ అంటూ ప్రశంసించారు. అంతేగాదు ముంబైలో జరిగే మహీంద్రా బ్లూస్ ఫెస్టివల్లో సంగీత ప్రదర్శన ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు కూడా. దేవతల భువి నుంచి వచ్చిన ప్రతిభాశాలి అంటూ మాయపై ప్రశంసలు కురిపించారు. Oh My GodMaya Neelakantan is only 10 years old. 10! Yes, Simon, she’s a Rock Goddess. From the land of Goddesses. We have to get her back here to do her stuff at the @mahindrablues !@jaytweetshah @vgjairam pic.twitter.com/sRNHPBondg— anand mahindra (@anandmahindra) June 29, 2024మాయ నీలకంఠన్ నేపథ్యం.. 11 ఏళ్ల మాయ తమిళనాడులోని చెన్నైకి చెందింది. ఆమెకు సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఈ చిన్న గిటారిస్ట్కి సంబంధించిన పలు ప్రదర్శన వీడియోలు ఉన్నాయి. ఆమె గిటార్‌పై కర్ణాటక సంగీతాన్ని ఆలపిస్తుంది. ఆమె గురువు ఆర్ ప్రసన్న. ఆమె అమెరికాలోని పాపా రోజ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై గిటార్‌తో కర్ణాటక నటభైరవి రాగ ఉపోద్ఘాతాన్ని సోలోగా ప్లే చేసినట్లు తెలిపారు. మెటల్ రాక్ బ్లూస్ పదబంధాల తోపాటు కర్ణాటక గమకాలు చాలా అలవోకగా ప్లే చేసిందని మెచ్చుకున్నారు. ఏళ్ల క్రితమే కర్ణాటక సంగీతాన్ని గిటార్‌పై ప్లే చేయడం ప్రారంభించారు. గానీ ఇలా ఒక 11 ఏళ్ల బాలిక అమెరికాస్ గాట్ టాలెంట్ వంటి ప్రపంచ వేదికపై ప్లే చేయడం అనేది నిజంగా ప్రశంసించదగ్గ విషయం అని అన్నారు. ఇది చాలా గొప్ప ప్రతిభ అని, ఇప్పుడు తానే తన శిష్యురాలికి అభిమానిని అని గర్వంగా చెప్పారు మాయ గురువు ప్రసన్న. (చదవండి: -
ఈ పేదింటి బంగారం.. ఓ అద్భుతం!
అరవై దేశాల విద్యార్థులుపాల్గొనే అంతర్జాతీయ పోటీ అది. గోవా దాటని ఉష తొలిసారిగా దుబాయ్‌కు వెళ్లడానికి రెడీ అవుతోంది. వెళ్లడానికి ముందు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా రకరకాల అడ్డంకులు ఎదురయ్యాయి. ‘సాధించాలని బలంగా అనుకుంటే కచ్చితంగా సాధిస్తాం’ అనే మాటను తారకమంత్రంలా జపించిన పదిహేను సంవత్సరాల ఉష దుబాయ్‌లో జరిగిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’లో కప్పు గెలుచుకుంది.కొన్ని రోజుల క్రితం..పనాజీ(గోవా)లోని ప్రోగ్రెస్ హైస్కూల్లో రోబో సందడి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్కూలు పిల్లలు తమ ప్రపంచం వదిలి రోబో ప్రపంచంలోకి వెళ్లారు. రోబోటిక్స్ పోటీ అయిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’ తాలూకు సందడి అది. ఆ స్కూల్ స్టూడెంట్ ఉషను ఇంటర్నేషనల్ రౌండ్‌కు చేర్చడానికి టీచర్ మాయా కామత్ బాగా శ్రమించింది.దుబాయ్‌లో జరగబోయే అంతర్జాతీయ పోటీని సవాలుగా తీసుకుంది మాయా కామత్. ‘ఎన్నో దేశాలుపాల్గొనే ఈ పోటీలో మనం ఎక్కడ! అక్కడి దాకా వెళితే అదే పదివేలు’ ఇలాంటి మాటలను ఆమె పట్టించుకోలేదు. ఎలాగైనా బంగారు కప్పు గెలుచుకోవాలనే పట్టుదలతో పనిచేసింది.గోవాలో జరిగిన రీజనల్ రౌండ్ కోసం ముగ్గురు స్టూడెంట్స్‌ను ఎంపిక చేసింది మాయ. అందులో ఉషతోపాటు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే మొదట్లో కనిపించిన ఉత్సాహం ఉషలో ఆ తరువాత కనిపించలేదు. ఆత్మవిశ్వాసం తగ్గింది. ఇలాంటి సమయంలోనే మాయ ఉషలో ధైర్యం నింపి ముందుకు నడిపించింది. ఆ ధైర్యమంత్రం ఫలించి గురుగ్రామ్‌లో జరిగిన నేషనల్ రౌండ్లో ఉష అద్భుత పనితీరు ప్రదర్శించింది. రోబోను బాగా హ్యాండిల్ చేసింది. ఆ తరువాత దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్ రౌండ్‌కు ఎంపికైంది.నేషనల్ రౌండ్లో సాధించిన విజయం ఉషకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. భయాలను ఎదుర్కొనేలా చేసింది. ఎట్టకేలకు మాయ కామత్ కలను ఉష సాకారం చేసింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ అంతర్జాతీయ పోటీలో ఉష కప్పును గెలుచుకుంది. ఉష తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. రోబో సిటీ చాలెంజ్ రూపంలో తన ప్రతిభను ప్రదర్శించే అరుదైన అవకాశం ఉషకు లభించింది. ఉష సాధించిన విజయం తల్లిదండ్రులను ఆనందంలో ముంచెత్తింది. ‘సాధించాలని గట్టిగా అనుకున్నాను. సాధించాను’ నవ్వుతూ అంటుంది ఉష.ఛాంపియన్స్ చేంజ్‌మేకర్..‘క్వార్కీ’ అనే రోబోట్‌ను స్టూడెంట్స్‌తో కలిసి తయారు చేసింది మాయా కామత్. నిర్ణీత సమయంలో రకరకాల పనులు చేసేలా ఈ ‘క్వార్కీ’ని రూపొందించారు. పోటీలో ‘క్వార్కీ’ అయిదు నిమిషాల్లో 11 టాస్క్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతిరోజు రెండు గంటలు ప్రాక్టిస్ చేసేది ఉష. రంగులను సరిపోల్చడం, దిశలను అంచనా వేయడం, అడ్డంకులను అధిగమించడం, వస్తువులను వేరు చేయడంలాంటి ‘క్వార్కీ’ నైపుణ్యాలను ఉష అద్భుతంగా ఆపరేట్ చేసింది.‘నేను చెప్పే సలహాలను శ్రద్ధగా విని అందుకు అనుగుణంగా ఉష ప్రాక్టిస్ చేసేది. నేర్చుకోవాలనే తపన ఆమె విజయానికి కారణం. విజయం సాధిస్తామనే గట్టి నమ్మకం ఉన్నప్పటికీ మాకు ఎదురైన అతి పెద్ద సవాలు దుబాయ్ పర్యటనకు నిధులు సమకూర్చుకోవడం. విజయం సంగతి ఎలా ఉన్నా అసలు దుబాయ్‌కు వెళ్లగలమా అనే సందేహాం వచ్చింది.ఈ పరిస్థితులలో ప్రోగ్రామింగ్‌లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సయేష్ గాంధీ అనే టీచర్ క్రౌడ్‌ఫండింగ్‌కు సంబంధించి సలహా ఇచ్చారు. ఉష కుటుంబ నేపథ్యం, రోబోటిక్స్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి, అంతర్జాతీయ పోటీలోపాల్గొనాలనే ఆమె కల, ఆర్థిక ఇబ్బందులు...మొదలైన వాటి గురించి వీడియో చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది’ అంటుంది మాయా కామత్. ఉష విజయం ఒక సంతోషం అయితే ఆమె గురువు మాయా కామత్ ‘చాంపియన్స్ చేంజ్‌మేకర్’ అవార్డ్ అందుకోవడం మరో సంతోషం.ఇవి చదవండి: పారిశ్రామికవేత్తలుగా.. యువకెరటాలు! -
‘మాయ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
గ్రేట్ జర్నీ స్టీరింగ్ ఉమన్
ఆమె ఆటో రిక్షా నడుపుతుంటే ఆ పట్టణంలోని పిల్లలు ఆసక్తిగా చూస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు... ఇలా కూడా ఉంటుందా? అన్నంత విచిత్రంగా చూస్తారు. నిజమే... వాహనం స్టీరింగ్ ఆడవాళ్ల చేతిలో ఉండడం అంటే వాళ్లకు ప్రపంచంలో ఎనిమిదో వింతను చూడడమే. నడివయసు మగవాళ్లైతే ఆ దృశ్యాన్ని కళ్లెర్రచేసి చూస్తారు. ఆమె తల్లిదండ్రులను, భర్తను తలుచుకుని ఆడపిల్లను ఎలా పెంచాలో, స్త్రీ పట్ల ఎంతటి కట్టుబాట్లు పాటించాలో తెలియని మూర్ఖులు అన్నట్లు ఓ చూపు చూసి, తమ ఇంటి ఆడవాళ్లను గూంగట్ చాటున దాచిన తమ ఘనతను తలుచుకుని మీసం మీద చెయ్యేసుకుంటారిప్పటికీ. ఈ సంప్రదాయ సంకెళ్లను ఛేదించింది నలభై ఏళ్ల మాయా రాథోడ్. ఒక్క సంప్రదాయ సంకెళ్లను మాత్రమే కాదు, పోలియో బారిన పడిన అమ్మాయి జీవితం అక్కడితో ఆగిపోదని, సంకల్పం, పట్టుదల, శ్రమ, అకుంఠిత దీక్ష ఉంటే బతుకుపథంలో అడుగులు చక్కగా వేయవచ్చని కూడా నిరూపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం కూడా ప్రముఖం గా గుర్తించాల్సిందే ఉంది. కాలుష్య రహిత సమాజ స్థాపనలో భాగంగా కాలుష్యాన్ని విడుదల చేసే ఆటోరిక్షాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఆటో రిక్షాలను ప్రవేశ పెట్టినప్పుడు మగవాళ్లు ఎలక్ట్రానిక్ స్టీరింగ్ పట్టుకోవడానికి సాహసించలేదు. అలాంటప్పుడు మాయా రాథోడ్ వేసిన ఓ ముందడుగు ఇప్పుడు రాజస్థాన్‌లోని బిల్వారా పట్టణంలో పలువురికి స్ఫూర్తినిస్తోంది. అక్కడి మహిళలకు మాయా రాథోడ్ ఓ రోల్ మోడల్ అయింది. బహుముఖ పోరాటం మాయా రాథోడ్ ఆరేళ్ల వయసులో పోలియో బారిన పడింది. అసలే ఆడపిల్లలు బతికి బట్టకట్టడం కష్టమైన రాజస్థాన్ రాష్ట్రం. ఆడపిల్లలను బడికి పంపించమని ప్రభుత్వాలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిన పరిస్థితిలో ఉన్న రాష్ట్రం. అలాంటి చోట మాయా రాథోడ్ బతుకు పోరాటం చేసింది. ఏకకాలం లో పోలియోతోనూ సమాజంతోనూ పోరాడింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆ జీతంతో బతుకు కుదుట పడడం కుదిరే పని కాదని కూడా త్వరలోనే అర్థమైందామెకు. భర్త సంపాదనకు తన సంపాదన కూడా తోడైతే తప్ప పిల్లల భవిష్యత్తుకు మంచి దారి వేయలేమని కూడా అనుకుంది. అదే సమయంలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఆటో రిక్షాలను సబ్సిడీ ధరలో ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ క్షణంలో మాయా రాథోడ్ తీసుకున్న నిర్ణయమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. బ్యాంకు లోన్ తీసుకుని ఎలక్ట్రానిక్ ఆటో రిక్షా తీసుకున్నది. ఇది జరిగి మూడేళ్లవుతోంది. ఆ క్షణం నుంచి ఆమెను సంప్రదాయ సమాజం విమర్శన దృక్కులతో వేధించింది. అభివృద్ధి పథం లో నడవాలనుకున్న సమాజం ఆమెను ఆదర్శంగా తీసుకుంది. ఆమె మాత్రం... ‘మహిళలు యుద్ధ విమానాలు నడుపుతున్న రోజులివి. ఆటో రిక్షా నడపడాన్ని కూడా ఆక్షేపించే రోజులు కావివి. ఆటో నడపడం నాకు వచ్చో రాదో అనే సందేహాలు వద్దు. నా ఆటోలో ప్రయాణించి చూడండి’ అని సవాల్ విసురుతోంది. ఈ మూడేళ్లలో బిల్వారాలో మంచి మార్పే వచ్చింది. చిల్లర దొంగతనాలు ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో రాత్రిళ్లు మగవాళ్ల ఆటోలో ప్రయాణించడం కంటే మాయ ఆటోలో ప్రయాణించడానికి ఆడవాళ్లతోపాటు మగవాళ్లు కూడా ఇష్టపడుతున్నారు. -
గైనకాలజిస్టు, ఆరంకెల జీతం, అయినా సంతోషం లేదు.. బాడీబిల్డర్‌గా
Bodybuilder Maya Rathod (సాక్షి, వెబ్‌డెస్క్): ‘‘అమ్మాయివి నీకెందుకు ఆటలు.. కరాటేలు, తైక్వాండోలు అంటూ బెట్టు చేస్తే కష్టం.. కాలో.. చెయ్యో విరిగితే నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు.. కావాలంటే డాన్స్ నేర్చుకో.. పద్ధతిగా ఉంటుంది.. అంతేకానీ.. మనకు ఇట్లాంటి ఆటలు వద్దు’’... సగటు మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలకు ఉండే ‘సహజమైన’ ఆంక్షలు ఇవి. ముంబైకి చెందిన మాయా రాథోడ్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాను తైక్వాండో శిక్షణ తీసుకుంటానని చెప్పినపుడు ఆమె తల్లిదండ్రులు కూడా ఇలాగే వారించారు. చక్కగా చదువుకుంటే చాలని, అనవసర ఆలోచనలతో తమను ఇబ్బంది పెట్టవద్దని సున్నితంగా మందలించారు. అమ్మానాన్నల మాట కాదనలేకపోయింది మాయా. తండ్రి కోరుకున్నట్టుగానే డాక్టర్ అయ్యింది. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. ఇద్దరు పిల్లల తల్లిగా, గైనకాలజిస్టుగా అటు వ్యక్తిగత, ఇటు వృత్తిగత జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది. కానీ అథ్లెట్ కావాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది ఆమె మనసులో. ఎక్కడో ఏదో వెలితి. పైగా రోజురోజుకు పెరుగుతున్న బరువు. తీవ్ర ఒత్తిడికి లోనైంది. తనను తాను కనుగొనే మార్గం కోసం అన్వేషించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో బాడీ బిల్డర్‌గా ఎదిగి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీబిల్డింగ్ అండ్ ఫిట్నెస్(ఐఎఫ్‌బీబీ) ఆస్ట్రేలియన్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా నిలిచింది. ఆరంకెల జీతం.. అయినా సంతోషం లేదు ‘‘చిన్నప్పటి నుంచీ నాకు క్రీడలంటే ఆసక్తి. మా కాలేజీ క్యాంపస్‌లో బెస్ట్ అథ్లెట్ నేనే. కానీ నా తల్లిదండ్రులకు ఈ విషయం ఏమాత్రం నచ్చేది కాదు. ఆటలాడేటపుడు ఒకవేళ గాయపడితే.. నన్నెవరూ పెళ్లి చేసుకోరనేది వారి భయం. అయినా, నేను వెనుకడుగు వేయలేదు. భరతనాట్యం క్లాసులు ఎగ్గొట్టి మరీ తైక్వాండో శిక్షణ తీసుకున్నా. అంతేకాదు సాయంకాలం వేళ గ్రౌండ్‌కు వెళ్లి క్రికెట్ కూడా ఆడేదాన్ని!. అథ్లెట్ కావాలన్న ఆశయం గురించి మా నాన్నకు చెప్పినపుడు.. ‘‘నువ్వు అమ్మాయివి. బాగా చదువుకుని గౌరవప్రదమైన వృత్తి చేపట్టినపుడే మనకు మంచి పేరు వస్తుంది’’ అని చెప్పారు. ఆయన చెప్పిన బాటను అనుసరించాను. మెడికల్ కాలేజీలో సీటు సంపాదించి గైనకాలజీ పూర్తిచేశాను. కాలేజీ చదువు అయిపోగానే పెళ్లి చేశారు. సంవత్సరం తిరిగేలోపే తల్లినయ్యాను. మంచి డాక్టర్‌గా పేరు. ఆరంకెల జీతం. అయినా.. నాకు సంతోషం లేదు. స్థూలకాయురాలిలా మారిపోయాను. ఊరికే అలసిపోయేదాన్ని. ఏదో తెలియని భయం ఆవహించింది. నన్ను నేను కోల్పోతున్న భావన. ఆ సమయంలో నా స్నేహితురాలు ఒకరు.. జిమ్‌కు వెళ్లమని సూచించింది. 20 కిలోల బరువు తగ్గాను అలా ఏడాది కాలంలో 20 కిలోల బరువు తగ్గాను. మా కోచ్ ఆశ్చర్యపోయారు. బాడీ బిల్డింగ్ చేయవచ్చు కదా అని సలహా ఇచ్చారు. నాకు మొదటి నుంచి బరువులు ఎత్తడం అంటే ఇష్టం. వెంటనే ఓకే అన్నాను. బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్లిన తొలినాళ్లలో అక్కడ చాలా తక్కువ మంది మహిళలు కనిపించేవారు. కాస్త మొహమాటంగా అనిపించేది. కానీ నా భర్త నన్ను ప్రోత్సహించేవారు. అయితే, మా అమ్మానాన్న, అత్తామామలు మాత్రం.. ‘‘మంచి జాబ్ వదులుకుని... ఇదంతా అవసరమా’’ అని నిట్టూర్చేవారు. నన్ను నేను నిరూపించుకోవాలని ఫిక్స్ అయ్యాను. మళ్లీ శిక్షణ మొదలుపెట్టాను. అప్పటికి మా పాప ఇంకా నా చనుబాలు తాగుతూనే ఉంది. తన ఆలనాపాలన, ఆస్పత్రిలో షిఫ్టుల్లో ఉద్యోగం, జిమ్‌కు వెళ్లడం... అబ్బో.. కాస్త కూడా విశ్రాంతి తీసుకునే సమయం ఉండేది కాదు. అనుకున్నది సాధించడానికి ఇవన్నీ తప్పవు మరి. రెండేళ్ల తర్వాత విజయం నన్ను వరించింది. స్టేట్ లెవల్ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానం. ఈ క్రమంలో.. పీహెచ్డీ పూర్తి చేసేందుకు మూడేళ్ల తర్వాత సిడ్నీకి షిఫ్ట్ అయ్యాం. అప్పుడే రెండో కూతురు జన్మించింది. ఆస్ట్రేలియా గడ్డ మీద తొలి మహిళగా అక్కడికి వెళ్లాకే నాకొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. గత 25 ఏళ్లలో అక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా భారతీయ మహిళా బాడీబిల్డర్ లేరని చెప్పారు. ఒక భారతీయురాలిగా నేను ఈ విజయం సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎనిమిది నెలల పాటు కఠోర శ్రమ... ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల వరకు ట్రెయినింగ్, పెద్దమ్మాయిని స్కూళ్లో దింపడం, వంట చేయడం, ఆస్పత్రికి వెళ్లడం... ఇంటికి వచ్చి మళ్లీ పనులు చేసుకుని పిల్లల్ని నిద్రపుచ్చడం.. తర్వాత రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు ప్రాక్టీస్. ఎట్టకేలకు నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ఐఎఫ్ఎఫ్బీ 2021 ఆస్ట్రేలియన్ చాంపియన్‌షిప్ టైటిల్ రూపంలో విజయం వరించింది. ఆస్ట్రేలియా గడ్డమీద ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా నిలిచాను. ప్రస్తుతం నా వయస్సు 30 ఏళ్లు. ఇప్పటికీ గైనకాలజిస్టుగా పనిచేస్తున్నా. ఎనిమిదేళ్లుగా బాడీబిల్డర్‌గా వివిధ పోటీల్లో రాణిస్తున్నా. పెళ్లై.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇంతదాకా వస్తానని అస్సలు ఊహించలేదు. నాలో ఉన్న నిజాయితే నన్ను ఈరోజు ఈస్థానంలో నిలబెట్టింది. నేను ప్రేమించిన లక్ష్యం కోసం.. ఇతరులు ఏమనుకున్నా లెక్కచేయలేదు. ఉన్నది ఒక్కటే జీవితం.. మనకు నచ్చింది చేయాలి. నేను తల్లిని, వైద్యురాలిని, బాడీ బిల్డర్‌ను అని గర్వంగా చెప్పగలను’’ అని మాయా రాథోడ్ ఇటీవల హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విజయగాథ గురించి పంచుకున్నారు. -
శృంగార నటి కొడుకుపై దాడి
సినిమా: శృంగార నటి మాయ కొడుకుపై కొందరు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చెన్నై విరుగంబాక్కంలో ఉంటున్న మాయ ఇంటికి గురువారం రాత్రి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆమె కొడుకు విక్కీపై కత్తులదో దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా విక్కీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానిక వడపళనిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నారు. కాగా నుంగంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే విక్కీ మద్యం సేవిస్తూ తరచూ స్థానికులతో గొడవ పడుతుంటాడని, అతని బాధితులు పాత కక్ష్యల కారణంగా దాడి చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ప్రేమదేశం ప్రారంభం
‘నను నేనె మరచినా నీ తోడు.. విరహాన వేగుతూ ఈనాడు.. వినిపించదా ప్రియా నా గోడు.. ప్రేమా’ పాట వినగానే టక్కున ‘ప్రేమదేశం’ సినిమా గుర్తుకు రాకమానదు. అబ్బాస్, వినీత్, టబూ ప్రధాన పాత్రల్లో 1996లో వచ్చిన ‘ప్రేమదేశం’ ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ‘ప్రేమదేశం’ పేరుతో మరో సినిమా తెరకెక్కుతోంది. అజయ్, మాయ జంటగా శ్రీకాంత్ శిద్ధం దర్శకత్వంలో సిరి క్రియేషన్స్ వర్క్స్ పతాకంపై శిరీష, నీలిమ తిరుమల్ శెట్టి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటి జీవితా రాజశేఖర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో ఆకాష్ పూరి క్లాప్ ఇచ్చారు. ఆనంద్ రవి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీత దర్శకునిగా, శేఖర్ గంగాణమోని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ల భరణి, ‘వెన్నెల’ కిషోర్, అజయ్ కతుర్వ, మాయ, శివకుమార్ రామచంద్రవరపు, వైశాకి నటిస్తున్నారు. -
ఆ బీచ్ 3 నెలలు మూసేస్తున్నారు!
బ్యాంకాక్ : ‘తెల్ల ఏనుగుల దేశం’గా గుర్తింపు పొందిన థాయ్‌లాండ్ ప్రకృతి అందాలకు నెలవు. మరీ ముఖ్యంగా ఇక్కడి బీచ్‌ల అందాలు వర్ణించడం సాధ్యం కాదు. వాటిలో ప్రధానమైనది ‘మాయ బే’ బీచ్, పగడపు దీవులకు పెట్టింది పేరు. అండమాన్ సముద్రంలో ఫీఫీ లేహ్ ద్వీపంలో ఉన్న ఈ మాయా బే 2000 సంవత్సరంలో లియోనార్డో డి కాప్రియో నటించిన ‘ది బీచ్’ సినిమాతో ప్రపంచానికి పరిచయమైంది. తెల్లని ఇసుకతో, వైఢూర్య వర్ణపు నీటితో అందంగా, ఆహ్లాదంగా ఉండే ఈ బీచ్‌కు ప్రయాణికుల తాకిడి కూడా ఎక్కువే. థాయ్‌లాండ్‌కు ప్రధాన పర్యాటక ఆదాయ వనరుగా బాసిల్లుతున్న ఈ బీచ్‌ను మూడు నెలల పాటు మూసివేయనున్నట్లు థాయ్‌లాండ్ పర్యావరణ శాఖ ప్రకటించింది. పెద్ద ఎత్తున పర్యాటకులు రావడం, ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతుండటంతో కొన్నాళ్ల పాటు ఈ బీచ్‌ను మూసివేయాలని భావిస్తున్నట్లు థాయ్‌లాండ్ పర్యాటక శాఖ డైరెక్టరు కనోక్కిట్టిక క్రిత్వుటికాన్ తెలిపారు. ‘అరుదైన ప్రకృతి సంపదను కాపాడుకోవడం మా బాధ్యత. మాయ బే ప్రకృతి అందానికే కాక స్పీడ్ బోటింగ్, ఫెర్రారి డ్రైవ్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఈ బీచ్‌ను సందర్శించడానికి రోజుకు దాదాపు 5000 మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో విపరీతమైన అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో పగడపు దీవులు దెబ్బతిన్నాయి. అవి మళ్లీ మాములు పరిస్థితికి రావాలనే ఉద్ధేశంతో 2018, జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దాదాపు మూడు నెలల పాటు బీచ్‌ని మూసివేస్తున్నామ’న్నారు. అంతేకాక పడవలు తిరగకూండా నిషేధం విధించినట్టు తెలిపారు. దక్షిణాసియాలో దేశాదాయంలో 12శాతం ఆదాయాన్ని కేవలం పర్యాటకం మీదే పొందుతున్న రెండవ దేశంగా థాయ్‌లాండ్ గుర్తింపు పొందింది. పర్యాటకుల తాకిడి ఎక్కువ కావడం వల్ల ఆ ప్రభావం కాస్తా పర్యావరణం మీద పడింది. 2015లో సైన్స్ మేగజీన్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అధిక మొత్తంలో సముద్ర వ్యర్థాల ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో థాయ్‌లాండ్ కూడా ఉందని, దానివల్ల వన్యప్రాణులకు హానీ వాటిల్లుతుందని హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో పర్యావరాణాన్ని కాపాడుకోవాలనే ఉద్ధేశంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 24 బీచుల్లో పొగ తాగటాన్ని, వ్యర్థాలు పడేయడాన్ని నిషేధించింది. -
అడవుల్లో అద్భుతాన్ని కనిపెట్టిన బాలుడు!
మెక్సికో: శాటిలెట్ ఫొటోల ఆధారంగా ఓ బాలుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. దట్టమైన అడవుల్లో నిక్షిప్తమైన, ఎవ్వరికీ కనపడకుండా మరుగున పడిపోయిన మయన్ నగరాన్ని గుర్తించాడు. మాయ నాగరికతకు చెందిన చరిత్ర ఆధారంగా పరిశోధనలు చేశాడు. సెంట్రల్ అమెరికాకు చెందిన మెక్సికన్ పర్వత ప్రాంతంలో వేల ఏళ్ళనాడు మరుగున పడిపోయిన నగరాన్ని 15ఏళ్ళ విలియమ్స్ గడౌరీ గుర్తించాడు. ఇప్పటివరకూ పరిశోధకుల కంట కూడ పడని దట్టమైన అడవులు, కొండలు, గుట్టల్లో దాగి ఉన్న ఆ అద్భుత 'మాయ' నగరాన్ని శాటిలెట్ చిత్రాల ద్వారా గుర్తించిన బాలుడు... ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ప్రాచీన కళలు, సంస్కృతి ప్రతిబింబించే కట్టడాలు, అద్భుత నిర్మాణాలు ఇప్పుడా నగరంలో బయటపడి, వేల యేళ్ళ చరిత్రకు ఆనవాళ్ళుగా మారాయి. 2014 సంవత్సరంలోనూ పురావస్తు శాఖ వారు రెండు పురాతన పట్టణాలను కనుగొన్నారు. అయితే అప్పట్లో అడవుల్లో దాగి ఉన్న ఈ నగరాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. తాను చదివిన ఓ పుస్తకం ఆధారంగా ఆ అదృశ్య నగరాన్ని గుర్తించినట్లు విలియమ్స్ గడౌరీ చెప్తున్నాడు. మాయ నాగరికత నాటి నిర్మాణాలన్ని మారుమూల ప్రాంతాలు, దట్టమైన అడవులు, పర్వతాల నడుమే ఉన్నట్లు తెలుసుకున్న అతడు... అలా ఎందుకు నిర్మించేవారో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ విషయంపై అధ్యయనాలు ప్రారంభించాడు. ఆ కాలంలో ప్రజలు నక్షత్రాలను ఎక్కువగా పూజించేవారని తెలుసుకుని ఆదిశగా అధ్యయనాలను మొదలు పెట్టాడు. నక్షత్రాల ఆధారంగా నగరాలను గుర్తించవచ్చన్న కోణంలో అడుగులు వేశాడు. గడౌరీ అనుకున్నట్లుగానే ఇప్పటిదాకా గుర్తించిన నగరాలన్నీ 22 నక్షత్ర సమూహాల స్థానంలోనే ఉన్నట్లు గుర్తించాడు. కానీ ఇంతకు ముందు పరిశోధకులు గుర్తించిన వాటిలో ఓ నగరం మిస్ అయినట్లు తెలుసుకున్న అతడు.. గూగుల్ ఎర్త్ ఆధారంగా పరిశోధనలు కొనసాగించి, రాడార్ శాట్-2 ఉపగ్రహ చిత్రాలద్వారా అడవుల్లో దాగిఉన్న అద్భుతాన్ని కనుగొన్నట్లు తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవమాత్రులు అడుగు పెట్టలేని అ మారుమూల యుకాతాన్ అడవుల్లోని నగరానికి తాను.. కాక్ చి అని గాని, మౌత్ ఆఫ్ ఫైర్ అనిగాని కొత్త పేరు పెట్టాలని కూడ భావిస్తున్నాడు. అయితే ఆ నగరం మానవ నిర్మితంగానే కనిపిస్తోందని, అయితే ప్రపంచం ఈ నంగరం ద్వారా కొత్త ఆవిష్కణను చూసే అవకాశం ఉందని న్యూ బ్రున్స్విక్ విశ్వవిద్యాలయం రిమోట్ సెన్సింగ్ లేబొరేటరీకి చెందిన డాక్టర్ ఆర్మాండ్ లా రాక్యూ చెప్తున్నారు. శాటిలెట్ చిత్రాల్లోని ఒక ఫొటో అక్కడి నిర్మాణాలు చతురస్రాకారంలో పిరమిడ్ ను పోలి ఉన్నట్లుగా తెలుస్తోందని చెప్తున్నారు. విలియమ్స్ కనుగొన్న పద్ధతిలో మాయన్ నగరం ఆధారంగా పురాతత్వవేత్తలు మరిన్ని నగరాలను కూడ గర్తించే అవకాశం ఉందన్నారు. తన కొత్త ఆవిష్కరణలను సైంటిఫిక్ జనరల్ లో ప్రచురించిన విలియమ్స్... 2017 లో జరిగే బ్రెజిల్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించనున్నట్లు కూడ తెలుస్తోంది. -
లారెన్స్ సరసన?
కథ, పాత్ర నచ్చితే స్టార్ హీరో కాకపోయినా నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అందుకు ఉదాహరణ తమిళ చిత్రం ‘మాయ’. అందులో ఆరి అనే నూతన హీరో సరసన జతకట్టారు నయనతార. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అగ్రహీరోల సరసన నటిస్తున్న ఈ బ్యూటీ ఓ తమిళ చిత్రంలో లారెన్స్ సరసన నటించడానికి అంగీకరించారట. ‘కాంచన’ సీక్వెల్స్‌తో హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న లారెన్స్ ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపిస్తారట. ఇప్పటికే రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తూ, బిజీగా ఉన్నారాయన. -
ఇప్పుడే వివాహం చేసుకునే ఆలోచన లేదు
చెన్నై : మలయాళ నటీమణులకు సొంత గడ్డపై అవకాశాలు ఇవ్వడం లేదని నటి మాయ కొత్త వివాదానికి తెర లేపారు. తమిళంలో ఎల్లా అవళ్ సెయల్, రామానుజన్ తదితర చిత్రాల్లో నటించిన నటి మాయకి ప్రస్తుతం అంతగా అవకాశాలు లేవు. ఈ విషయమై స్పందించిన ఆమె తానే చిత్రాలను తగ్గించుకున్నానని చెప్పారు. షూటింగ్‌లతోనే అధిక భాగం గడిచిపోతోందని, దీంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను చాలా మిస్ అవ్వాల్సి వస్తోందని అన్నారు. అందువల్ల స్లో అండ్ స్టడీ పాలసీని అవలంభిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే మలయాళ హీరోయిన్లకు తమిళం, తెలుగు భాషల్లో ఎక్కువ ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోందని, అయితే అక్కడ వారికి సొంత గడ్డపైన అవకాశాలు రాకపోవడంతోనే ఇతర భాషల్లో అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మరో విషయం తన వివాహం గురించి వదంతులు ప్రచారమవుతున్నాయని, ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. -
రెండోసారి కాదందట?
ప్రస్తుతం నయనతార ఫుల్ బిజీ. ఆమె చేతిలో నాలుగైదు తమిళ సినిమాలున్నాయి. మరి కొన్ని అవకాశాలు కూడా వరిస్తున్నాయట. కథాకథనాలు బాగుంటే చాలు...ఎంత చిన్నహీరో సరసన నటించడానికి సై అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ ‘మాయ’ అనే చిత్రం. ఇందులో ఓ నూతన హీరో సరసన ఆమె నటిస్తున్నారు. ఈ చిత్ర దర్శకునికి ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే..ప్రస్తుతం నయనతారకు వచ్చిన అవకాశాల్లో విక్రమ్ సినిమా ఒకటి. ఇందులో నయనతారను కథానాయికగా తీసుకోవాలనుకున్నారట. కానీ దర్శక, నిర్మాతలు అడిగితే నయనతార తిరస్కరించడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే గతంలో విక్రమ్ సరసన ఓ సినిమాకు అవకాశం వస్తే నయనతార గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. మళ్లీ విక్రమ్ సినిమా ఆఫర్‌ను ఆమె తిరస్కరించడంతో ఈ హీరోగారి సరసన నటించడం ఇష్టం లేకే ఇలా చేస్తున్నారా..లేక డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కాదంటున్నారా అని కోలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. మరి అసలు రీజన్ ఏంటో నయనతారకే తెలియాలి! -
మాయలో ఇద్దరిగా...
నయన సంచలన తారే కాదు...క్రేజీ బిజీ తార కూడా. రెండు సార్లు ప్రేమ బెడిసి కొట్టినా... రెండేళ్లు నటనకు దూరంగా ఉన్నా ...తాజాగా మళ్లీ పూర్వ వైభవం సాధించుకున్న నాయకి నయనతార. తమిళంలో నెంబర్ ఒన్ హీరోయిన్గా వెలుగొందుతున్న ఈ భామ చాలా గ్యాప్ తర్వాత సొంత గడ్డపై మోహన్‌లాల్‌తో జతకడుతున్నారు. కాగా, టాలీవుడ్‌లోని ఒక భారీ అవకాశం ఈ బ్యూటీ కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం తమిళంలో సూర్యతో మాస్, ఉదయనిధి స్టాలిన్ సరసన నన్బెండా... విజయ్ సేతుపతితో నానుం..రౌడీదాన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా, మాజీ ప్రియుడు శింబుతో లవ్ పెయిల్యూర్ తర్వాత నటిస్తున్న ఇదు నమ్మ ఆలు చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. వీటితో పాటుగా నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మాయ. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అంతే కాదు, ఓ పాత్రలో తల్లిగా నటిస్తున్నారు. ఇది హర్రర్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈమె హర్రర్ చిత్రంలో నటించడం, ద్విపాత్రాభినయం చేయడం ఇదే తొలి సారి అన్నది గమనార్హం. కాగా, ఈ చిత్రం తమిళంతో పాటుగా తెలుగు, మలయాళంలో మయూర్పేరుతో ఏక కాలంలో సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో తెరమీదకు రానున్నది. -
‘వన్ నైట్ షో’ కాదు!
‘బిల్లా’ అనే తమిళ చిత్రంలో బికినీ ధరించి నటించిన నయనతార... అందుకు పూర్తి భిన్నంగా ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో మహాపతివ్రత సీతగా నిండైన చీరకట్టులో కనిపించి, ఆకట్టుకున్నారు. దీన్నిబట్టి నయనతార ఏ తరహా పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలుగుతారని అర్థమవుతుంది. ఇప్పుడామె నటిస్తున్న చిత్రాల్లో ‘మాయ’ అనే తమిళ చిత్రం ఒకటి. ఇది హారర్ మూవీ. ఇప్పటివరకూ ఏ చిత్రంలోనూ కనిపించనంత భిన్నంగా నయనతార ఇందులో కనిపిస్తారట. కొన్ని సన్నివేశాల్లో దెయ్యంలా కనిపించి, భయపెడతారని తమిళ పరిశ్రమలో ఓ వార్త ప్రచారమవుతోంది. ఆ వార్తలకు ఊతం ఇస్తూ, ఓ ఫొటో కూడా బయటికొచ్చింది. ఎరుపు రంగు చీర, అదే రంగు జాకెట్టు, గాజులు, నుదుట రూపాయి కాసంత బొట్టు, కళ్లు పెద్దవి చేసి, కాళికా మాతలా నాలుక బయటపెట్టిన గెటప్ అది. ఆ ఫొటో చూసినవాళ్లు.. నయనతార ఓ రేంజ్లో భయపెట్టడం ఖాయం అంటున్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఈ చిత్రంలో నయనతార ఒక బిడ్డకు తల్లిగా నటిస్తున్నారు. అలాగే, నూతన దర్శకుడు అశ్విన్ దర్శకత్వంలో ఆమె ఈ చిత్రం చేయడం ఓ విశేషం అయితే, ఇందులో ఆరి అనే వర్థమాన నటునితో నటించడం మరో విశేషం. వాస్తవానికి ఈ చిత్రానికి ‘వన్ నైట్ షో’ అనే టైటిల్‌ని అనుకున్నారు. కానీ, ఇది అభ్యంతరకరమైన చిత్రం అయ్యుంటుందనే ఫీల్‌ని ఆ టైటిల్ కలగజేసే విధంగా ఉందని ‘మాయ’ అని మార్చారు. ఈ మార్పు వెనకాల నయనతార హస్తం ఉందని సమాచారం. -
అప్పుడే హిందీలోతీయాలనుకున్నా: నీలకంఠ
‘‘నా అభిమాన దర్శకుల్లో మహేష్ భట్ ఒకరు. ఆయన ‘మాయ’ చిత్రం చూసి, హిందీలో నిర్మించాలనుకుంటున్నాననడంతో పాటు నన్నే డెరైక్షన్ చేయమన్నారు. వాస్తవానికి ‘మాయ’ పాయింట్ అనుకున్నప్పుడే తెలుగు, హిందీ భాషల్లో చేయాలనుకున్నాను. కానీ, బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని విరమించుకున్నాను. ఇప్పుడు హిందీలో చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు నీలకంఠ చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాతలు మహేష్ భట్, విక్రమ్ భట్ ‘మాయ’ చిత్రాన్ని హిందీలో ‘మర్డర్ 4’గా పునర్నిర్మించనున్నారు. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘జోష్ మీడియా ప్రతినిధులు వీరేన్, వందనలకు మహేష్ భట్‌గారితో మంచి అనుబంధం ఉంది. వాళ్ల ద్వారానే ‘మాయ’ చిత్రం మహేష్‌భట్ దృష్టికెళ్లింది. తెలుగువారికి నచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ స్థాయికి వెళ్లడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ‘మర్డర్ 4’ నిలుస్తుందనే నమ్మకాన్ని వీరేన్ వెలిబుచ్చారు. ఈ చిత్రంతో దర్శకుడిగా నీలకంఠ బాలీవుడ్లో స్థిరపడతారని నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
'నీలకంఠ' మాయా ప్రోమోసాంగ్ స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్
-
‘షో’ సినిమాలా అవార్డులు, ‘మిస్సమ్మ’లా డబ్బులు రావాలి
‘‘నీలకంఠ సినిమాలు కొత్త తరహాలో ఉంటాయి. ఈ సినిమా కథాంశం కూడా కొత్తగానే ఉంటుందని చెప్పొచ్చు. నీలకంఠ దర్శకత్వం వహించిన ‘షో’ సినిమాలా అవార్డులు, ‘మిస్సమ్మ’లా డబ్బులు ఈ చిత్రం తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న సినిమా ఆడియోలకు అండగా నిలబడుతున్న ‘మధుర’ సంస్థ అధినేత శ్రీధర్ అంటే నాకు అభిమానం’’ అని దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు. నీలకంఠ దర్శకత్వంలో షిర్డిసాయి కంబైన్స్ పతాకంపై డా. ఏమ్వీకే రెడ్డి, ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘మాయ’. శేఖర్‌చంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను హీరో ‘అల్లరి’ నరేశ్ ఆవిష్కరించి, మల్టీ డైమన్షన్ సంస్థకు చెందిన వాసుకు ఇచ్చారు. మరో అతిథి తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘నీలకంఠలానే ఆయన సినిమాలు కొద్దిగా స్లోగా ఉంటాయి. కానీ, ఈ చిత్రం ట్రైలర్ స్పీడ్‌గా ఉంది కాబట్టి, ట్రెండ్ మార్చాడనిపిస్తోంది. ఎప్పుడూ కొత్త కథలతోనే ఆయన సినిమాలు చేస్తాడు’’ అన్నారు. ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. నేను ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ తీసిన తర్వాత, మంచి కాన్సెప్ట్‌తో సినిమా తీయాలనుకుంటున్న తరుణంలో నీలకంఠ ‘మాయ’ కథ చెప్పారు. నా బలం, నీలకంఠ దర్శకత్వం తోడైతే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లొచ్చనే నమ్మకంతో చేశాం’’ అని చెప్పారు. వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇదని, ఇది కొత్త తరహా సినిమా అని, అనుకున్నట్లుగా సినిమా బాగా రావడానికి చిత్రబృందం అందించిన సహకారమేనని చెప్పారు నీలకంఠ. ఇంకా ఈ వేడుకలో లగడపాటి శ్రీధర్, బెక్కం వేణుగోపాల్, సిరాశ్రీ, సందీప్ కిషన్, రఘు కుంచె, శేఖర్‌చంద్ర, హర్షవర్ధన్ రాణె, అవంతిక తదితరులు పాల్గొన్నారు. -
'నీలకంఠ' మాయ మూవీ న్యూ స్టిల్స్, వర్కింగి స్టిల్స్
-
కొత్త ప్రయోగం
నీలకంఠ దర్శకత్వంలో ఎం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ కలిసి నిర్మించిన చిత్రం ‘మాయ’. హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ప్రచార చిత్రాల ఆవిష్కరణ ఇన్ఫోసిస్ నరసింహారావు, పాలెం శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో జరిగింది. వీరితో పాటు మల్టీడైమన్షన్ వాసు, కళామందిర్ కల్యాణ్ అతిథులుగా హాజరై యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ‘‘మనుషుల్లో ఉండే అతీంద్రియ దృష్టి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చినా, తెలుగు తెరపై ఈ కాన్సెప్ట్‌తో సినిమా రావడం ఇదే ప్రథమం. భిన్నమైన కథనంతో సాగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇది’’ అని నీలకంఠ చెప్పారు. ఈ నెల 22న పాటల్ని, జూలై 4న సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, కూర్పు: నవీన్ నూలి. -
‘మాయ’ సినిమా స్టిల్స్
-
అతీంద్రియ శక్తులతో...
మనుషుల్లో ఉండే అతీంద్రియ శక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాయ’. నీలకంఠ దర్శకుడు. హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు. ఎంవీకే రెడ్డి, మధురా శ్రీధర్ ఈ చిత్రానికి నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నీలకంఠ మాట్లాడుతూ- ‘‘ఇది నా కలల చిత్రం. వైవిధ్యమైన కథనంతో సాగే థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. కథ, కథనాలు కొత్త అనుభూతికి లోను చేస్తాయి. కొత్త దనాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘నీలకంఠ సినీ వ్యవసాయదారుడు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. తెలుగు సినీచరిత్రలోనే ‘యామ’ బెస్ట్ థ్రిల్లర్. సాంకేతికంగా అద్భుతం ఈ సినిమా. మేలో పాటలను, జూన్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని మధుర శ్రీధర్ తెలిపారు. ఇంకా చిత్ర తారాగణంతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, కె.ఎల్.దామోదరప్రసాద్ కూడా మాట్లాడారు. -
‘మాయ’ చేయబోతున్న నీలకంఠ
ఏ సినిమా చేసినా కొత్తగా చేయాలని తపించే నీలకంఠ ఈ సారి ఓ ‘మాయ’ చేయబోతున్నారు. ‘మాయ’ అంటే వేరే అనుకునేరు. అది ఆయన చేయబోయే సినిమా పేరు. అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో ఈ చిత్రం చేయబోతున్నారు. ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి సమర్పణలో షిరిడీసాయి కంబైన్స్ పతాకంపై డా.ఎం.వి.కె. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సెప్టెంబర్‌లో చిత్రీకరణ మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘షో, మిస్సమ్మ, మిస్టర్ మేధావి, విరోధి లాంటి వైవిధ్యభరితమైన సినిమాలు చేసిన నీలకంఠ మరో విభిన్న నేపథ్యంతో ఈ సినిమా చేస్తున్నారు’’ అని తెలిపారు. ‘మాయ’లో నీలకంఠ స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుందని ‘మధుర’శ్రీధర్‌రెడ్డి చెప్పారు.