జస్ట్ 11 ఏళ్ల చిన్నారి తన గిటార్ కళా నైపుణ్యంతో అమెరికా గాట్ టాలెంట్‌ని మెస్మరైజ్ చేసింది. ఆ చిన్నారి పేరు మాయ నీలకంఠన్. ఇటీవల అమెరికా గాట్ టాలెంట్ కోసం జరిగిన అడిషన్‌లో మొత్తం షో దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పాపా రోచ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై తన గిటార్ ప్రదర్శనతో ఆ షో జడ్జిలనే ఆశ్చర్యపరిచింది. మాయ తన అద్భుతమైన గిటార్ ప్రదర్శన ఆ వేదికపై ఉన్న దిగ్గజ జడ్జిలు సైమన్ కోవెల్, సోఫియా వెర్గారా, హెడీ క్లమ్, హౌవీ మాండెల్‌ల మనసులను గెలుచుకుని ప్రశంసలందుకుంది.
మాయ ఆడిషన్ వీడియో నెట్టింట పెను సంచలనంగా మారింది. పైగా ఈ కళా ప్రావిణ్యమే ఆమెకు భారతదేశపు అత్యంత పిన్న వర్దమాన రాక్ స్టార్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. వేలాది మంది ఆమె గిటార్ మ్యూజిక్ ప్రదర్శనకు అభిమానులుగా మారిపోయారు. నెట్టింట యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం ఆమె గిటార్ మ్యూజిక్‌కి ఫిదా అయ్యారు. ఇంత చిన్న వయసులోనే అంత అపారమైన ప్రతిభను సొంత చేసుకోవడం గ్రేట్ అంటూ ప్రశంసించారు. అంతేగాదు ముంబైలో జరిగే మహీంద్రా బ్లూస్ ఫెస్టివల్‌లో సంగీత ప్రదర్శన ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు కూడా. దేవతల భువి నుంచి వచ్చిన ప్రతిభాశాలి అంటూ మాయపై ప్రశంసలు కురిపించారు.
Oh My God
Maya Neelakantan is only 10 years old. 10!
Yes, Simon, she’s a Rock Goddess.
From the land of Goddesses.
We have to get her back here to do her stuff at the @mahindrablues !@jaytweetshah @vgjairam pic.twitter.com/sRNHPBondg— anand mahindra (@anandmahindra) June 29, 2024
మాయ నీలకంఠన్ నేపథ్యం..
11 ఏళ్ల మాయ తమిళనాడులోని చెన్నైకి చెందింది. ఆమెకు సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఈ చిన్న గిటారిస్ట్‌కి సంబంధించిన పలు ప్రదర్శన వీడియోలు ఉన్నాయి. ఆమె గిటార్‌పై కర్ణాటక సంగీతాన్ని ఆలపిస్తుంది. ఆమె గురువు ఆర్ ప్రసన్న. ఆమె అమెరికాలోని పాపా రోజ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై గిటార్‌తో కర్ణాటక నటభైరవి రాగ ఉపోద్ఘాతాన్ని సోలోగా ప్లే చేసినట్లు తెలిపారు. మెటల్ రాక్ బ్లూస్ పదబంధాల తోపాటు కర్ణాటక గమకాలు చాలా అలవోకగా ప్లే చేసిందని మెచ్చుకున్నారు.
ఏళ్ల క్రితమే కర్ణాటక సంగీతాన్ని గిటార్‌పై ప్లే చేయడం ప్రారంభించారు. గానీ ఇలా ఒక 11 ఏళ్ల బాలిక అమెరికాస్ గాట్ టాలెంట్ వంటి ప్రపంచ వేదికపై ప్లే చేయడం అనేది నిజంగా ప్రశంసించదగ్గ విషయం అని అన్నారు. ఇది చాలా గొప్ప ప్రతిభ అని, ఇప్పుడు తానే తన శిష్యురాలికి అభిమానిని అని గర్వంగా చెప్పారు మాయ గురువు ప్రసన్న.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment