Guitar
-
11 ఏళ్లకే గిటార్‌తో ప్రదర్శన.. అమెరికా ప్రముఖ షోని మెస్మరైజ్ చేసింది!
జస్ట్ 11 ఏళ్ల చిన్నారి తన గిటార్ కళా నైపుణ్యంతో అమెరికా గాట్ టాలెంట్‌ని మెస్మరైజ్ చేసింది. ఆ చిన్నారి పేరు మాయ నీలకంఠన్. ఇటీవల అమెరికా గాట్ టాలెంట్ కోసం జరిగిన అడిషన్లో మొత్తం షో దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పాపా రోచ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై తన గిటార్ ప్రదర్శనతో ఆ షో జడ్జిలనే ఆశ్చర్యపరిచింది. మాయ తన అద్భుతమైన గిటార్ ప్రదర్శన ఆ వేదికపై ఉన్న దిగ్గజ జడ్జిలు సైమన్ కోవెల్, సోఫియా వెర్గారా, హెడీ క్లమ్, హౌవీ మాండెల్ల మనసులను గెలుచుకుని ప్రశంసలందుకుంది. మాయ ఆడిషన్ వీడియో నెట్టింట పెను సంచలనంగా మారింది. పైగా ఈ కళా ప్రావిణ్యమే ఆమెకు భారతదేశపు అత్యంత పిన్న వర్దమాన రాక్ స్టార్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. వేలాది మంది ఆమె గిటార్ మ్యూజిక్ ప్రదర్శనకు అభిమానులుగా మారిపోయారు. నెట్టింట యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం ఆమె గిటార్ మ్యూజిక్‌కి ఫిదా అయ్యారు. ఇంత చిన్న వయసులోనే అంత అపారమైన ప్రతిభను సొంత చేసుకోవడం గ్రేట్ అంటూ ప్రశంసించారు. అంతేగాదు ముంబైలో జరిగే మహీంద్రా బ్లూస్ ఫెస్టివల్లో సంగీత ప్రదర్శన ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు కూడా. దేవతల భువి నుంచి వచ్చిన ప్రతిభాశాలి అంటూ మాయపై ప్రశంసలు కురిపించారు. Oh My GodMaya Neelakantan is only 10 years old. 10! Yes, Simon, she’s a Rock Goddess. From the land of Goddesses. We have to get her back here to do her stuff at the @mahindrablues !@jaytweetshah @vgjairam pic.twitter.com/sRNHPBondg— anand mahindra (@anandmahindra) June 29, 2024మాయ నీలకంఠన్ నేపథ్యం.. 11 ఏళ్ల మాయ తమిళనాడులోని చెన్నైకి చెందింది. ఆమెకు సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఈ చిన్న గిటారిస్ట్కి సంబంధించిన పలు ప్రదర్శన వీడియోలు ఉన్నాయి. ఆమె గిటార్‌పై కర్ణాటక సంగీతాన్ని ఆలపిస్తుంది. ఆమె గురువు ఆర్ ప్రసన్న. ఆమె అమెరికాలోని పాపా రోజ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై గిటార్‌తో కర్ణాటక నటభైరవి రాగ ఉపోద్ఘాతాన్ని సోలోగా ప్లే చేసినట్లు తెలిపారు. మెటల్ రాక్ బ్లూస్ పదబంధాల తోపాటు కర్ణాటక గమకాలు చాలా అలవోకగా ప్లే చేసిందని మెచ్చుకున్నారు. ఏళ్ల క్రితమే కర్ణాటక సంగీతాన్ని గిటార్‌పై ప్లే చేయడం ప్రారంభించారు. గానీ ఇలా ఒక 11 ఏళ్ల బాలిక అమెరికాస్ గాట్ టాలెంట్ వంటి ప్రపంచ వేదికపై ప్లే చేయడం అనేది నిజంగా ప్రశంసించదగ్గ విషయం అని అన్నారు. ఇది చాలా గొప్ప ప్రతిభ అని, ఇప్పుడు తానే తన శిష్యురాలికి అభిమానిని అని గర్వంగా చెప్పారు మాయ గురువు ప్రసన్న. (చదవండి: -
Mohini Dey: మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్ గిటార్‌తో..
పదకొండు సంవత్సరాల వయసులోనే బాస్ గిటారిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది మోహిని డే. మోహిని మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి సుజయ్ డే బాస్ గిటార్ చేతికి అందించాడు. అలా మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్ గిటార్‌తో మోహిని ఫ్రెండ్షిప్ మొదలైంది. జాజ్ ఫ్యూజన్ గిటారిస్ట్‌గా సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టిన సుజయ్ ఆ తరువాత జాజ్‌కు దూరమై కుటుంబ పోషణ కోసం కోల్కత్తా నుంచి ముంబైకి వచ్చాడు. సెషన్స్ ఆర్టిస్ట్‌గా మారాడు. మోహిని విషయానికి వస్తే తండ్రి సుజయ్ తొలి మ్యూజిక్ టీచర్. తండ్రి సహకారంతో చిన్న వయసులోనే పేరున్న పెద్ద కళాకారులతో కలిసి సంగీత కచేరీలు చేసింది మోహిని. పదమూడు సంవత్సరాల వయసులో ప్రసిద్ధ పృథ్వీ థియేటర్ నుంచి మోహినికి ఆహ్వానం అందింది. ‘మ్యూజిక్ ప్రాక్టిస్ చేస్తున్న నా దగ్గరకు నాన్న వచ్చి రంజిత్ అంకుల్ నుంచి కాల్ వచ్చింది, బ్యాగ్ సర్దుకో అని చెప్పారు. పృథ్వీ థియేటర్‌కు వెళ్లిన తరువాత అక్కడ జాకీర్ హుస్సేన్‌ను, ఫిల్మ్స్టార్స్ను చూశాను. రంజిత్ అంకుల్ నన్ను జాకీర్ అంకుల్‌కు పరిచయం చేశారు. ఆ తరువాత స్టేజీ మీద బాస్ గిటార్ ప్లే చేశాను. మంచి స్పందన వచ్చింది’ అంటూ తన మ్యూజికల్ మెమోరీలోకి వెళుతుంది మోహిని. తండ్రి సుజయ్ బాస్ గిటారిస్ట్. ఎంత బిజీగా ఉన్నా కూతురికి సంగీత పాఠాలు నేర్పడానికి అధికప్రాధాన్యత ఇచ్చేవాడు. విక్టర్ వుటెన్ నుంచి మార్కస్ మిల్లర్ వరకు ఎంతో మంది గిటారిస్ట్ల ప్రభావం మోహినిపై ఉంది. ఒకే స్టైల్‌కి పరిమితం కాకుండా రకరకాల స్టైల్స్‌ను ప్లే చేయడంలోప్రావీణ్యం సంపాదించింది. ‘రకరకాల స్టైల్స్నుప్రాక్టిస్ చేస్తున్న క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లను అధిగమించగలిగినప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. స్కూల్, కాలేజి రోజుల్లో నా ఆలోచనలు స్నేహితులకు వింతగా అనిపించేవి. నా ఆలోచనలు, ఐడియాలు ఎప్పుడు నా వయసు వారి కంటే చాలా భిన్నంగా ఉండేవి’ అంటుంది మోహిని. ‘ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు మోహిని ఇచ్చే జవాబు ఇది.. ‘సొంతంగా మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయాలనేది నా కల. జంతుసంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనాలనుకుంటున్నాను. వోన్ మ్యూజిక్ షోతో ప్రేక్షకులకు నచ్చే మ్యూజిక్ అందించాలనుకుంటున్నాను’ తల్లిదండ్రులే నా సంగీత పాఠశాల.. తల్లిదండ్రులే నాకు వరం. వారు నాకు సంగీత పాఠశాలలాంటి వారు. ప్రశంస ఎవరికైనా సరే ఉత్సాహాన్ని ఇస్తుంది. నాకు ఎన్నో ప్రశంసలు వచ్చినప్పటికీ అహం ప్రదర్శించలేదు. ఇది కూడా నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నదే. బాస్ గిటార్‌తో జీవనోపాధికి ఇబ్బంది అని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం అనుకునే సమయంలో యువతకు బాస్ గిటార్‌పై ఆసక్తి పెరిగేలా చేశాను. – మోహిని డే ఇవి చదవండి: Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్‌ను కోడింగ్ చేసింది! -
మీటింగ్ అయ్యాక గిటార్ వాయించే సీఎం! ఆయనో డిఫరెంట్ ‘ట్యూన్’
నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపుతుంటారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే కొందరు సీఎంలు మాత్రం ఏదో ఒక వ్యాపకంతో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. అలాంటి వారిలో మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా (Meghalaya Chief Minister Conrad Sangma) ఒకరు. ఐరన్ మైడెన్ పాటకు ఆయన ఎలక్ట్రిక్ గిటార్‌పై వాయిస్తున్న వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా తన సంగీత అభిరుచి గురించి మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా పలు ఆసక్తి వివరాలను ‘హిందూస్తాన్ టైమ్స్’తో పంచుకున్నారు. సంగీతం తనకు అంతులేని ఉత్సాహాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడూ సంగీతంలోనే ఉంటానని, అవకాశం దొరికినప్పుడల్లా ఎలక్ట్రిక్ గిటార్ ప్లే చేస్తానని చెప్పారు. క్యాబినెట్ సహచరులతో ఉన్నప్పుడు, ముఖ్యమైన సమావేశాలు, కార్యక్రమాల అనంతరం లైవ్ ప్రదర్శన ఇవ్వడానికి ఇష్టపడుతుంటానని తెలిపారు. జీ20 సమావేశాల్లో ప్రదర్శన తన సహచరులతో డిన్నర్లో కలిసినప్పుడు తప్పకుండా గిటార్ వాయిస్తానని, సంగీతం తన సంస్కృతిలో అంతర్భాగమని చెప్పుకొచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైనా విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పుడు, తన సంగీతాన్ని విని ఆ అసంతృప్తిని మరచిపోతారని వెల్లడించారు. ఇటీవల జీ20 సమావేశాల్లో తన ప్రదర్శను రాయబారులు, సహచరులందరూ ఆనందించారని పేర్కొన్నారు. యువతకు ప్రోత్సాహం తాను యువకుడిగా ఉన్నప్పుడు తన బ్యాండ్‌కి సంగీతాన్ని రికార్డ్ చేయడానికి స్టూడియో ఉండేది కాదని చెప్పుకొచ్చిన ఆయన రాష్ట్రంలో సంగీత కళాకారుల కోసం మరిన్ని స్టూడియోలను తీసుకురావలనుకుంటున్నట్లు తెలిపారు. సంగీత అవకాశాలతో పాటు, సినిమాలకు లొకేషన్‌గా మేఘాలయ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మేఘాలయ యువత సినిమా నిర్మాణంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇందు కోసం సినిమా థియేటర్ల ఏర్పాటును ప్రోత్సహించడానికి భారీ రాయితీలు అందిస్తున్నామన్నారు. యువ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి రాష్ట్రం తరఫున సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రయాణాల్లో సులువుగా..ఈ గిటార్‌ను మడిచేసుకోవచ్చు...
గిటార్ సంగీతాన్ని ఇష్టపడనివారు ఉండరు. గిటార్ వాద్యంలో విద్వత్తును సాధించిన వారు కొద్దిమంది ఉంటే, కాలక్షేపంగా గిటార్ వాద్యాన్ని సాధన చేసేవారు ఎందరో ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు గిటార్‌ను తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న పనే! పొడవాటి గిటార్‌ను జాగ్రత్తగా బాక్స్‌లో భద్రపరచి తీసుకుపోవాల్సి ఉంటుంది. లగేజీలో ఇది చాలా చోటును ఆక్రమిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, గిటార్ ధ్వంసమయ్యే ప్రమాదాలూ లేకపోలేదు. ఈ సమస్యకు పరిష్కారంగానే అమెరికన్ సంగీత పరికరాల తయారీ కంపెనీ ‘కియరీ గిటార్స్’ సులువుగా మడిచేసుకునే గిటార్‌ను ‘ఎసెండర్ పీ90 సోలో’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణాలకు వెళ్లేటప్పుడు దీన్ని తేలికగా మడిచి, ప్యాక్ చేసుకోవచ్చు. దీని ధర 1599 డాలర్లు (రూ.1.32 లక్షలు) మాత్రమే! -
మీకు తెలుసా.. ఈ గిటార్ మడతపెట్టుకోవచ్చు
గిటార్ సంగీతాన్ని ఇష్టపడనివారు ఉండరు. గిటార్ వాద్యంలో విద్వత్తును సాధించిన వారు కొద్ది మంది ఉంటే, కాలక్షేపంగా గిటార్ వాద్యాన్ని సాధన చేసేవారు ఎందరో ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు గిటార్‌ను తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న పనే! పొడవాటి గిటార్‌ను జాగ్రత్తగా బాక్స్‌లో భద్రపరచి తీసుకుపోవాల్సి ఉంటుంది. లగేజీలో ఇది చాలా చోటును ఆక్రమిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, గిటార్ ధ్వంసమయ్యే ప్రమాదాలూ లేకపోలేదు. ఈ సమస్యకు పరిష్కారంగానే అమెరికన్ సంగీత పరికరాల తయారీ కంపెనీ ‘కియరీ గిటార్స్’ సులువుగా మడిచేసుకునే గిటార్‌ను ‘ఎసెండర్ పీ90 సోలో’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణాలకు వెళ్లేటప్పుడు దీన్ని తేలికగా మడిచి, ప్యాక్ చేసుకోవచ్చు. దీని ధర 1599 డాలర్లు (రూ.1.32 లక్షలు) మాత్రమే! -
ఈ గిటార్ చాలా స్మార్ట్ గురూ..!.. ధర ఎంతంటే?
ఫొటోలో కనిపిస్తున్న గిటార్ సాదాసీదా గిటార్ కాదు. ఇది చాలా స్మార్ట్ గిటార్. చైనాకు చెందిన బహుళజాతి సంస్థ ‘ఎన్యా ఇంటర్నేషనల్’ ఇటీవల ఈ ఆల్ ఇన్ వన్ స్మార్ట్ గిటార్‌ను మార్కెట్లోకి తెచ్చింది. బిల్టిన్ ప్రీయాంప్, 50 వాట్ల బ్లూటూత్ స్పీకర్ ఈ గిటార్ ప్రత్యేకతలు. ఈ గిటార్ వాయిస్తున్నప్పుడు బ్లూటూత్ స్పీకర్ ద్వారా ఇతర సంగీత పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిని స్మార్ట్‌ఫోన్ యాప్‌కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సోలో కచేరీలకు, గ్రూప్ బ్యాండ్ కార్యక్రమాలకు కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది నాలుగు రంగుల్లో దొరుకుతోంది. దీని ధర 900 డాలర్లు (రూ.74,007) మాత్రమే చదవండి👉 రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కేంద్రం ఆమోదిస్తే.. త్వరలో -
తండ్రి గిటార్‌పై పడుకుని బుడ్డోడి తన్మయత్వం..! క్యూట్ వీడియో
-
రాక్‌స్టార్‌గా మారిన మేఘాలయ సీఎం
అల్వాల్: ఓ రాష్ట్రానికి సీఎం అనగానే... సీరియస్ చిత్రాన్ని ఊహించుకుంటాం. కానీ... సంగీత ప్రియుడైన మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కొంగల్ సంగ్మా రాక్‌స్టార్‌గా మారిపోయారు. హైదరాబాద్, అల్వాల్‌లోని లయోలా కళాశాలలో శుక్రవారం జరిగిన వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన... సభలో గిటార్ వాయిస్తూ పాటపాడి విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సందర్భంగా సంగ్మా మాట్లాడుతూ... సంగీతం మనసుని తేలిక పరుస్తుందన్నారు. ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. దేశం ఉన్నతి అయినా, తిరోగమనం అయినా విద్యార్థుల చేతిలోనే ఉందని, అందుకే భవిష్యత్ పట్ల స్పష్టమైన అవగాహనతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. యువతను సన్మాన మార్గంలో నడిపించే భాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యా రంగానికి విశేష సేవలు అందించిన అధ్యాపకులు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన 73 మంది విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామక్రిష్ణారావు, లయోలా ప్రిన్సిపాల్ ఫాదర్ జోజిరెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు వందలాదిగా పాల్గొన్నారు. ప్రగతిభవన్‌కు మేఘాలయ సీఎం దంపతులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. సంగ్మా దంపతులను మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్ దంపతులతో భేటీ అయిన ఫొటోలను సంగ్మా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. -
గిటారులో డ్రగ్స్.. అంతా బాగానే కవర్ చేశాడు.. కానీ..
దొడ్డబళ్లాపురం( బెంగళూరు): కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ దాచిన ఎలక్ట్రిక్ గిటార్‌ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. చెన్నైకి చెందిన వ్యక్తి ఎలక్ట్రిక్ గిటార్లోపల స్యూడో ఎఫెడ్రిన్ అనే మత్తుమందును ప్యాక్ చేసి తమిళనాడు తిరుచ్చిలోని కొరియర్ ఏజెన్సీలో కొరియర్ చేశాడు. అది ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. కెంపేగౌడ విమానాశ్రయంలో అధికారులు అనుమానంతో చెక్ చేయగా అందులో మత్తుమందు బయటపడింది. ఈ మత్తుమందు విలువ సుమారు రూ.50 లక్షలని అంచనా. మరో ఘటనలో... లారీ ఢీకొని బైకిస్టు మృతి తుమకూరు: లారీ ఢీ కొట్టడంతో బైకిస్టు మరణించాడు. ఈ ఘటన నగర శివార్లలో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగింది. గుబ్బి నుంచి తుమకూరు వైపు వస్తున్న బైక్‌ను ఎదురుగా మితిమీరిన వేగంతో వెళ్లిన లారీ ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరొకరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. చదవండి: స్నేహితురాలితో పెళ్లి.. 7 నెలలు గడిచిన తర్వాత.. -
ఆనంద్ మహీంద్ర వైరల్ ట్వీట్: మామూలుగా లేదుగా!
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నిత్యం వార్తల్లో ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా ఆనంద్ మహీంద్రా పాఠశాల రోజులనాటి పాత చిత్రాన్ని పంచుకున్నారు. తద్వారా తనలోని మరో ప్రత్యేక టాలెంట్‌ను కూడా బైటపెట్టారు. స్కూల్ బ్యాండ్‌లో భాగంగా గిటారు వాయిస్తున్న ఒక ఫోటోను షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవ్వడమేకాదు..ఆయన గిటారు వాయిస్తున్న వీడియోను షేర్ చేయాలని కోరుతున్నారు. అసలు విషయం ఏమిటంటే 1973 నాటి మళయాల చిత్రం మారం మూవీలోని ‘పాతినాలాం రావుదిత్తురు’ పాటను అద్భుతంగా ఆలపించిన పాట ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్తా ఆనంద్ మహీంద్ర దాకా చేరింది. ఆనంద్ మహీంద్ర బాల్యమిత్రుడు నిక్దే ఈ వీడియో. దీంతో తన పాఠశాల రోజుల నాటి తీపిగుర్తులను ఆనంద్ ట్విటర్లో షేర్ చేశారు. ఊటీలో ఉండగా నిక్‌తో తన చిన్ననాటి అనుభవాల్లోకి జారుకున్నారు. అంతేకాదు నిక్ పాట పాడిన తీరు, ఆయన డిక్షన్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో చూసే దాకా నిక్ మలయాళంలో ఇంత స్పష్టంగా పాడతాడని ఊహించలేదని వ్యాఖ్యానించారు. ఇండియాలో ఊటీలో స్థిరపడిన బ్రిటిష్ కుటుంబానికి చెందిన తన చిన్ననాటి స్నేహితులు నాగు అండ్ ముత్తు, (నికోలస్ హార్స్‌బర్గ్, అతని సోదరుడు మైఖేల్) గుర్తు చేసుకున్నారు. తాను జూనియర్ అయినప్పటికీ తన ది బ్లాక్ జాక్స్ బృందంలో చేర్చుకున్నాడు నిక్ (నికోలస్ హార్స్‌బర్గ్) అని ఆయన ట్వీట్ చేశారు. అది ఏ పాటకో నిక్ గుర్తు చేస్తే బావుంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో మైక్ దగ్గర ఉన్నది నిక్. నిక్కు ఎడమవైపున తనకిష్టమైన బీటిల్ బూట్స్ ధరించి ఉన్నదే ఆనంద్ మహీంద. అలా తన స్కూల్ బ్యాండ్ ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకోవడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గిటారు వాయిస్తున్న వీడియోను షేర్ చేయమని కోరుతున్నారు. In my school in Ooty, we had two kids from a British family settled in India. Nicholas Horsburgh & his brother Michael had local nicknames: ‘Nagu & Muthu.’ I had no idea HOW native Nick had become until a video of him singing a Malayalam song recently surfaced in social media! pic.twitter.com/VGgPApdq3m — anand mahindra (@anandmahindra) July 22, 2021 Do u still find the time to strum the guitar. Then look forward to a video of the same. 😀 — Vishwanathan Iyer (@vishiyer1963) July 23, 2021 -
వైరల్: వృద్ధుడి స్టెప్పులకు..నెటిజన్ల కళ్లు జిగేల్
ఆమ్స్టర్డామ్: మనిషికి అన్నింటికన్నా ముఖ్యమైనది తన ఉనికి. బతికినంత కాలం ఆరోగ్యంతో జీవించడం ప్రధానం. కానీ, ఆరోగ్యాన్ని ఎంతగా కాపాడుకున్నా ముసలితనం మాత్రం రాకమానదు. వయసుతోబాటు శరీరం పటుత్వం కోల్పోతుంది. ఎముకలు పలచబడతాయి. చర్మానికి సాగే గుణం తగ్గుతుంది. సహజంగా కృష్ణా!రామా! అంటూ కాలం వెళ్లదీస్తారు. అయితే తాజాగా నెదర్లాండ్స్‌లోని హేగ్ వీధుల్లో ఓ వృద్ధుడు వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 2.52 లక్షల నెటిజన్లు వీక్షించారు. 10 వేల మంది నెటిజన్లు లైక్ కొట్టారు. ఈ వీడియోలో నల్లని రంగు గల పొడవాటి కోటు, బూడిద రంగు చొక్కా, టై, ప్యాంటు, టాన్ టోపీ ధరించిన వృద్ధుడు చేతిలో కర్రతో వీధిలోని సంగీతకారుడి ట్యూన్లకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. గిటారిస్ట్ కూడా ఆ వృద్ధుడితో కలిసి స్టెప్పులేస్తాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది హృదయాలను గెలుచుకుంటోంది. దీనిపై ఓ నెటిన్ స్పందిస్తూ..‘‘దీన్ని ప్రేమించండి’’ అని కామెంట్ చేశారు. ‘‘ఇలా డ్యాన్స్ చేయడం మరొకరికి సాధ్యం కాదు. ఈ వ్యక్తి నిజంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు’’ అంటూ రాసుకొచ్చారు. (చదవండి: Corona: ‘ముందస్తు ప్రణాళిక లేకుంటే.. థర్డ్ వేవ్ ఆపటం కష్టం’) This guy is truly living his best life pic.twitter.com/SQHnWoQMwk — Giles Paley-Phillips (@eliistender10) May 21, 2021 -
షాకింగ్.. అంకుల్ అస్థిపంజరాన్నే గిటార్‌గా చేసి..
ఓ వ్యక్తి గిటారు వాయించడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఆయన గిటార్ వాయించడంలో దిట్ట కాదు, లేదా మైమరిపించే సంగీతాన్ని అందించి రికార్డులు సృష్టించిన వ్యక్తి కాదు. మరి ఎందుకు అంత వైరల్ అయిందనే కదా మీ డౌటనుమానం? ఆయన సంగీత విద్యలో వైవిధ్యం లేదు కానీ.. ఆయన వాయించే గిటారు పరికరంలో మాత్రం ఉంది. ఆ గిటారు చెక్కతోనో, తేలికైన లోహాలతోనో తయారు చేసిందో కాదు..మనిషి అస్థిపంజరంతో తయారు చేసింది. ఏంటి షాకవుతున్నారా? నిజమండి బాబు.. తన అంకుల్ అస్థిపంజరంతో గిటారు తయారు చేసి.. దానితో మ్యూజిక్ వాయిస్తున్నాడు నార్వేకు చెందిన ప్రిన్స్ మిడ్నైట్ అనే యువకుడు. తన అంకుల్ మరణించాక తన అస్థిపంజరంలోని చాతి నుంచి నడుము భాగం వరకు ఉండే ఎముకల గూడును ఉపయోగించి ఆరు ఎలక్ట్రిక్ స్ట్రింగ్స్ గల గిటారు తయారు చేశాడు. దాన్ని లయబద్ధంగా వాయిస్తూ ఆ వీడియోలను యూట్యూబ్‌లోనూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తన అంకుల్ ఫిలిప్ గౌరవార్థం ఈ గిటారు తయారు చేశానని తెలిపాడు. ‘కొన్నేళ్ల కిందట మా అంకుల్ ఫిలిప్ చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరపకుండా.. భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజ్‌కు దానమిచ్చారు. ఇటీవల మెడికల్ కాలేజ్ ఆయన అస్థిపంజరాన్ని ఖననం చేయాలని నిర్ణయించుకొని ఆ విషయాన్ని మా అంకుల్ కుటుంబానికి తెలియజేశారు. కానీ వారి తిరస్కరించారు. దీంతో ఆ అస్థిపంజరాన్ని నేను తీసుకొని గిటారు తయారు చేశాను. నా నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. ప్రస్తుతం ఈ గిటారు చక్కగా పని చేస్తుంది’అని ప్రిన్స్ మిడ్నైట్ తెలిపాడు. -
మరోసారి తన టాలెంట్‌తో అదరగొట్టిన నటి
సినిమాల్లో తన అద్బుత అభినయంతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీఖన్నా తాజాగా గిటార్‌తో అద్భుత నైపుణ్యం కనబరిచింది. లాక్డౌన్ వేళ ఈ పంజాబీ సొగసరి గిటార్ వాయించడంలో మెళుకువలు నేర్చుకుంటుంది. కరోనా నేపథ్యంలో షూటింగ్స్‌కు విరామం దొరకడంతో రాశీఖన్నా ఇన్‌స్టా వేదికగా గిటార్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. తనకు ఎంతో ఇష్టమైన 'గెట్ యూ ద మూన్' అనే సాంగ్‌ను గిటార్ ప్లే చేస్తూ పాడింది. ' గెట్ యూ ద మూన్ సాంగ్ నాకు చాలా ఇష్టం. అయితే గిటార్ ప్లే చేయడం నేను చాలా ఇంట్రస్ట్‌గా భావిస్తాను. ఇప్పుడిప్పుడే గిటార్ వాయించడంలో మెళుకువలు నేర్చుకుంటున్నాను. నాకున్న ఈ అభిరుచి నన్ను మరింత పాజిటివ్‌గా మార్చింది. నేను ఎప్పుడు గిటార్ పట్టుకున్నా.. నా ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. నేను చేసిన ఈ వీడియో మీఅందరికి నచ్చుతుందనే అనుకుంటున్నా' అంటూ పేర్కొన్నారు. దీంతో పాట లిరిక్స్‌ను క్యాప్షన్‌లో జత చేశారు. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియో ఇప్పటికే 98వేల లైకులను సాధించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాశిఖన్నా సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే, బెంగాల్ టైగర్, జై లవకుశ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రాశీఖన్నా హరి దర్శకత్వంలో తమిళ హీరో సూర్య అప్‌కమింగ్ సినిమా అరువా చిత్రంతో పాటు, అర్జున్ ముఖ్య పాత్రలో జీవా హీరోగా పీఏ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సైన్ చేసింది. కరోనా : భయం పుట్టిస్తున్న వర్మ సినిమా టీవీ నటి ఆత్మహత్య View this post on Instagram I always wanted to learn how to play a guitar & I am still at the very beginning learning my way through.. Inculcating this habit has really helped me stay positive.. 😇 Every time I hold a guitar. It brings a smile to my face! Hope this video brightens your day in whatever little way possible.. and here are the lyrics of this song that I love! You gave me a shoulder, when I needed it.. You showed me love, when I wasn't feeling it.. You helped me fight, when I was giving in.. You made me laugh, when I was losing it.. 'Cause you are, you are The reason why I'm still hanging on 'Cause you are, you are The reason why my head is still above water.. And if I could get you the moon I’d give it to you.. And if death was coming for you I'd give my life for you.. Video editing credit @nawinvijayakrishna 🤗 A post shared by Raashi (@raashikhannaoffl) on May 24, 2020 at 5:05am PDT -
ప్రేమను పంచాలి
‘‘సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దీనిపై మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది’’ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు అనన్య. సోషల్ మీడియా ట్రోలింగ్ మీద అవగాహన తీసుకురావడానికి ప్రముఖ గిటారిస్ట్ మెక్ వీ తో కలసి ఈ శుక్రవారం ఇన్ స్టా గ్రామ్‌లో లైవ్ లోకి రాబోతున్నారామె. ‘‘ప్రస్తుతం ప్రపంచం కష్టంలో ఉంది. ఈ సమయంలో అందరిలో ఉండాల్సింది దయ, ప్రేమ. అంతే కానీ ఇతరులను ట్రోల్ చేయడం కాదు. ప్రేమను, పాజిటివిటీని పంచండి’’ అన్నారు అనన్యా పాండే. -
ట్రెండింగ్ : తెగ వాయించేసాడుగా గిటార్..!
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరి టాలెంట్ బయటి ప్రపంచానికి తెలిసిపోతుంది. అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా ఏ పని చేసినా అది వైరల్ అయిపోతుంది. తాజాగా ఓ ముగ్గరు బుడతలు చేసిన పని సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. నెటిజన్ల మనసును గెలుచుకుంది. ఇంతకీ ఆ బుడతలు చేసిన పని ఏమంటారా? గిటార్ వాయించారు అంతే. అందుతో ప్రత్యేకం ఏముందంటారా? గిటార్‌తో వాయిస్తే మాములే.. కానీ గిటార్ లేకున్నా గిటార్ వాయిస్తే అది వెరైటే అవుతుంది. ఆ ముగ్గురు బుడతలు కూడా అదే చేశారు. వాళ్ల దగ్గర గిటార్ లేకపోయినా.. రాక్‌స్టార్‌లా గిటార్ వాయించారు. ఓ కర్రను పట్టుకొని గిటార్‌లా ఊహించి... వాయించేశారు. స్టేజ్‌పై రాక్‌స్టార్ ఏవిధంగా డ్యాన్స్ చేస్తూ గిటార్ వాయిస్తాడో.. అచ్చం అలాగే చేశాడు ఓ కుర్రాడు. ఇక పక్కనే ఉన్న మరో ఇద్దరు బుడతలు కూడా గిటార్ వాయిస్తున్నట్లుగా చేతులు కదిపారు. నిజమైన గిటారిస్ట్ల్లా ఫీల్ అవుతూ.. వారంతా పాట పాడారు. ‘ ఈ రాక్‌స్టార్స్ ఈ శనివారం రాత్రి ఏ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు? నేను కూడా వచ్చి వారితో జాయిన్ అవుతా’ అని ఓ నెటిజన్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ మనస్ఫూర్తిగా పాడుతున్నారు’., ‘ వారి ప్యాషన్‌కు హాట్యాఫ్, టీమ్‌వర్క్ బాగుంది’ , ‘ సో క్యూట్’, ‘ యూత్‌పుల్ ఎనర్జీ, సో క్యూట్’ అంటూ బుడతలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
తెగ వాయించేసాడుగా గిటార్..!
-
ఉర్రూతలూగించే ‘ఏర్ గిటార్’
-
ఉర్రూతలూగించే ‘ఏర్ గిటార్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఏర్ గిటార్ కాంపిటేషన్’ పేరు వింటేనే అర్థం అవుతుంది గాలిలో గిటార్ వాయించడమని. బ్యాక్ గ్రౌండ్లో మెటాలిక్ గిటార్ సంగీతం హోరెత్తుతుంటే దానికి అనుగుణంగా ‘ఏర్ గిటార్ కాంపిటేటర్’ తానే నిజంగా గిటార్ వాయిస్తున్నట్లు గాలిలో చేతులు, వేళ్లూ కదుపుతూ, అనుగుణంగా అడుగులేస్తూ రెచ్చిపోవాలి. ప్రేక్షకులను ఉర్రూతలూగించాలి. అదెంత పని అని అనుకోవద్దు! గాలిలో గిటార్ వాయించడానికి కూడా ఎంతో అనుభవం కావాలి. అలాంటి వారి కోసం ప్రతియేటా ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు కూడా జరుగుతున్నాయని తెలిస్తే కించిత్తైన ఆశ్చర్యం కలగకమానదు. ఫిన్లాండ్లోని ఒవులూ నగరంలో ప్రతిఏటా ఆగస్టు నెలలో ‘గాలిలో గిటారు ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. వీటికి ప్రపంచంలోని 20 దేశాల నుంచి ఛాంపియన్లు హాజరవుతున్నారు. వాటిలో భారత్ కూడా ఉండడం విశేషం. ముంబైలోని ‘ఏర్ గిటార్ ఇండియా’ సంస్థ ప్రతి ఏటా జాతీయ ఏర్ గిటార్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించి అందులో గిలిచిన వారిని ఫిన్లాండ్ పోటీలకు పంపిస్తోంది. వారి ఖర్చులను పూర్తిగా భరిస్తుంది. దేశంలోని పలు నగరాల్లో ఎంపిక ప్రక్రియను సాధారణంగా జూన్, జూలై నెలల్లో నిర్వహిస్తుంది. తుది పోటీలు ముంబైలోనే జరుగుతాయి. ఫిన్లాండ్లో మొదటిసారి 1996లో ఏర్ గిటార్ పోటీలు నిర్వహించారు. అప్పుడు ‘ఒవులూ మ్యూజిక్ వీడియో ఫెస్టివల్’లో భాగంగా దీన్ని నిర్వహించారు. నాటి నిర్వాహకులు సరదాగా ఆ పోటీలను ‘ఏర్ గిటార్ వరల్డ్ ఛాంపియన్షిప్’ అని అభివర్ణించారు. ఈ పోటీల గురించి విన్న అమెరికాలోని ఔత్సాహికులు 2003లో ఓ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఫిన్లాండ్, అమెరికా బృందాల సంయుక్త కృషితో ఆ సంవత్సరం నుంచే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈసారి జరగబోతున్నది 17వ ఛాంపియన్షిప్ పోటీలు. 2006లో అమెరికాలో విడుదలైన ‘ఏర్ గిటార్ నేషన్’ డాక్యుమెంటరీ, ‘టూ ఏర్ ఈజ్ హ్యూమన్’ అనే చిత్రం ద్వారా ఈ పోటీలకు ప్రాముఖ్యత పెరిగింది. ఏర్ గిటార్ ఛాంపియన్షిప్ కోసం తపించిపోయే జర్నలిస్ట్ డాన్క్రేన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘టూ ఏర్ ఈజ్ హ్యూమన్’ చిత్రాన్ని నిర్మించారు. అప్పటి నుంచి కుర్రకారులో క్రేజీ పెరిగిపోవడంతో అమెరికాలో కూడా జాతీయ ఏర్ గిటార్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆదరణ పెరిగింది. ఫోనోగ్రామ్తోనే పుట్టుక పాశ్చాత్య దేశాల్లో 1950లోనే ఈ కళ పుట్టగా 1980 ప్రాంతంలో బాగా రాణించింది. నాటి గ్రామ్‌ఫోన్, నేటి ఫోనోగ్రామ్ రాజ్యమేలుతున్న కాలంలో సంగీతానికి అనుగుణంగా పెదాలు ఆడించడం, చేతులు కలపడం, అడుగులు వేస్తూ చిందులు తొక్కడం నుంచి ఈ కళ పుట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. 1980 ప్రాంతంలో ప్రేక్షకులను మరింత అలరించడం కోసం పాశ్చాత్య సంగీత కచేరీల్లో కూడా ఈ కళను ప్రవేశపెట్టారు. ఓ పక్క కచేరీ కళాకారులు నిజమైన గిటార్ వాయిస్తూ, పాడుతూ ఉంటే పక్కనే ఉండే పెదవులు ఆడించే కళాకారులు, గాలి గిటారిస్టులు సంగీతానికి అనుగుణంగా చిందులేస్తూ రెచ్చిపోయేవారు. గొంతుతో పాడేవారు, నిజమైన గిటారుతో వాయించేవారు అంతగా ఎగరలేరు, దూకలేరు కనుక వీరి అవసరం పడింది. ఒకసారి గాలిలో గిటారు వాయిస్తే, మరోసారి పియానో, వాయించడం, మరో సారి డ్రమ్స్ కొట్టినట్లు నటించడం, అన్నీ కలిపి ఒక్కరే నటించడం లాంటి ప్రయోగాలు కూడా వచ్చాయి. నిజమైన కచేరీల్లోనూ నటన 1957లో అమెరికాలో జరిగిన స్టీవ్ అలెన్ షో, 1969లో వుడ్‌స్టాక్‌లో జో కాకర్ కచేరీలో వీరి ప్రదర్శన కనిపిస్తుంది. 20వ శతాబ్దంలో జిమ్మీ హెడ్రిక్స్, జిమ్మీ పేజ్, ఎడ్డీవాన్ హాలెన్, రిక్ నీల్సన్, లీటా ఫోర్డ్ లాంటి రాక్, పాప్ స్టార్లు ఈ గాలి గిటారిస్టులతో కలిసి కచేరీలు నిర్వహించారు. ‘సిండర్ఫెల్లా, బిల్ అండ్ టెడ్స్ ఎక్సలెంట్ అడ్వెంచర్, రిస్కీ బిజినెస్’ లాంటి హాలివుడ్ చిత్రాల్లో కామిక్ పాత్రల్లో గాలి గిటారిస్టులు కనిపిస్తారు. అమెరికాలోని జాన్ మ్యాకెన్నా, మైఖేల్ మోఫిట్ 1983లో రాసిన ‘ది కంప్లీట్ ఏర్ గిటార్ హ్యాండ్‌బుక్’లో కొంత చరిత్ర ఉంది. ఫిన్లాండ్లో 2018లో జరిగిన 16వ ప్రపంచషిప్ పోటీల్లో జార్జియా లంచ్ అనే అమెరికా ఏర్ గిటారిస్ట్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈసారి ఆమెతో సహా పోటీదారులందరిని ఓడించిన వారే విజేత. జార్జియా లంచ్ లావు దక్కడం కోసం గాలి గిటార్‌ను ప్రాక్టీస్ చేసిందట. అయినా ఆమె లావు తగ్గలేదు. ఆమె పేరులోనే లంచ్ ఉంది మరి. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న వారు ప్రపంచ శాంతికి సందేశం ఇస్తూ తిరగాలట! -
అమెరికాలో సత్తా చాటుతున్న తెలుగు తేజం
-
బ్రెయిన్ సర్జరీ మధ్యలో అలవోకగా..
-
ఓ వైపు సర్జరీ.. మరో వైపు గిటార్..!!
బెంగళూరు : నగరానికి చెందిన భగవాన్ మహవీర్ జైన్ ఆసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటున్న పేషెంట్‌తో సర్జరీ మధ్యలో గిటార్ ప్లే చేయించారు. అంతేకాదు స్మార్ట్ ఫోన్‌ను కూడా వినియోగించమని పేషెంట్‌కు సూచించడంతో అతను అలవోకగా ఫోన్‌ను వినియోగించాడు. బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందిన మ్యూజిషియన్, ఇంజినీర్ టస్కిన్ ఇబ్నా అలీ(31) న్యూరలాజికల్ సమస్య(వేళ్లు పని చేయడం మానేశాయి)తో మహవీర్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సర్జరీ నిర్వహిస్తూ చేతి వేళ్ల ఎలా పని చేస్తున్నాయో పరీక్షించేందుకు అలీతో గిటార్, స్మార్ట్‌ఫోన్‌ను వినియోగింపజేశారు. సర్జరీపై మీడియాతో మాట్లాడిన న్యూరాలిజిస్టు డా. సంజీవ్.. గిటారిస్టుల్లో ఎక్కువగా వేళ్ల కదలికల సమస్య తలెత్తుతుంటుందని చెప్పారు. ఉద్యోగ రీత్యా ఇంజినీర్ అయిన అలీకి గిటారప్లే చేయడం అంటే ఇష్టమని చెప్పారు. ఇలాంటి సమస్యలకు వైద్యం చేయడం కన్నా, సర్జరీయే మేలని తెలిపారు. సర్జరీ విజయవంతమైందని అలీ వేళ్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో పని చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఇది గిటార్ థెరపీ!
ఫిజియోథెరపీ, సెల్ థెరపీ, హార్మోన్ థెరపీ... ఇలా రకరకాల థెరపీలు విన్నాం కానీ.. ఈ గిటార్ థెరపీ ఏంటి? అని ఆలోచిస్తున్నారా? ఇది పూజా హెగ్డే కనిపెట్టిన కొత్త థెరపీ. విషయం ఏంటంటే... ఈ బ్యూటీకి ఈ మధ్య గిటార్ నేర్చుకోవాలనిపించిందట. అనిపించాలే కానీ, నేర్చుకోవడం ఎంతసేపు. ఓ గిటార్ కొనుక్కున్నారు. తనతో పాటే షూటింగ్ లొకేషన్‌కి తీసుకెళుతున్నారు. షాట్ గ్యాప్‌లో గిటార్ నేర్చుకుంటున్నారు. ‘‘మ్యూజిక్ ఈజ్ నాట్ మ్యూజిక్.. ఇట్స్ ఎ థెరపీ’’ అని కూడా అన్నారు. కరెక్టే.. సంగీతం మనసుకు స్వాంతన చేకూర్చుతుంది. మైండ్‌ని రిలాక్స్ చేస్తుంది. అందుకే పూజా హెగ్డే ‘గిటార్ థెరపీ’ అని అన్నారు. తాను ప్లే చేస్తున్న మ్యూజిక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. ‘‘మీరు ట్రై చేస్తున్న మ్యూజిక్ వినడానికి బాగుంది. మ్యూజిక్ మీ లైఫ్‌ని మోర్ బ్యూటిఫుల్‌గా ఛేంజ్ చేస్తుంది. త్వరలోనే గిటార్‌ను ఫుల్‌గా ప్లే చేస్తావని ఆశిస్తున్నాను’’ అని దేవీశ్రీ ప్రసాద్ రెస్పాండ్ అయ్యారు. ‘‘నేను గిటారు నేర్చుకోవాలని ట్రై చేస్తున్నప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ల పట్ల గౌరవం మరింత పెరిగింది. చాలెంజింగ్‌గా స్టార్ట్ చేశాను. గిటారు నేర్చుకోవడం చాలా ఫన్‌గా ఉంది’’ అని ఆమె బుదులిచ్చారు. -
మెదడును తొలిచేస్తుంటే... గిటార్‌తో సరిగమలు
బెంగళూరులో అరుదైన సర్జరీ కోలుకున్న గిటారిస్టు సాక్షి, బెంగళూరు : సంగీతంతో రోగాలను నయం చేయొచ్చన్న సంగతి పాతదే. చేతివేళ్లు మొద్దుబారిపోవడంతో ఓ వైపు మెదడుకు క్లిష్టమైన శస్త్రచికిత్స జరుగుతుండగా గిటార్ వాయిస్తూ తిరిగి కోలుకున్నాడు ఓ గిటారిస్టు. ఈ అరుదైన ఘటనకు బెంగళూరులోని భగవాన్ మహావీర్ జైన్ ఆసుపత్రి వేదికైంది. ఇలాంటి శస్త్రచికిత్స భారతదేశంలో ఇదే మొదటిసారి. స్టిరియోస్టాటిక్ అండ్ ఫంక్షనల్ న్యూరోసర్జన్ శరన్ శ్రీనివాసన్ సహచర వైద్యుడు సంజీవ్‌తో కలిసి శస్త్రచికిత్స నిర్వహించిన తీరును గురువారం మీడియాకు వివరించారు. బిహార్‌కు చెందిన 37 ఏళ్ల అభిషేక్ ప్రసాద్ చాలా కాలంగా బెంగళూరులో ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 2012 నుంచి గిటారిస్ట్ కావాలనే లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలి గిటార్ నేర్చుకుని చిన్నచిన్న ప్రదర్శనలు కూడా ఇచ్చారు. గత ఇరవై నెలలుగా ఆయన ఎడమ చేతి చూపుడు, ఉంగరపు, చిటికెన వేళ్లు క్రమంగా మొద్దుబారిపోయాయి. గిటారిస్టుల కు ఈ చేతివేళ్లే ఆధారం. మొదట్లో వైద్యులను సంప్రదించి మందులు తీసుకున్నారు. అయినా ప్రయోజనం లేకపోగా సమస్య మరింత తీవ్రమైంది. వైద్య పరిభాషలో దీన్ని ఫోకల్ (గిటార్) డిస్టోనియా అంటారు. అటు ఆపరేషన్, ఇటు గిటార్ ప్లే ప్రసాద్‌కు ఎం.ఆర్.ఐ, సీటీ స్కాన్ తదితర పరీక్షల అనంతరం సమస్య పరిష్కారం కోసం బ్రెయిన్ సర్క్యూట్ సర్జరీ (స్టిరియోస్టాటిక్, ఎంఆర్ఐ గైడ్రైట్ థలమోటోపీ)ని చేయాలని వైద్యులు నిర్ణయించారు. మొదట రోగికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తరువాత ఈ నెల 11న శస్త్రచికిత్స చేశారు. తల, మెదడులో సర్జరీ చేయాల్సిన చోట మాత్రమే లోకల్ అనస్థిషీయా ఇచ్చారు. పుర్రెకు 14 మిల్లీమీటర్ల రంధ్రం చేశారు. 4 మిల్లీమీటర్ల వ్యాసం, ఏడు సెంటీమీటర్ల పొడవున్న సూదిని పుర్రె, మెదడు లోపలికి 8 నుంచి తొమ్మిది సెంటీమీటర్లమేర చొప్పించారు. ఈ సమయంలో రోగి వేళ్లను కదిలించడానికి ప్రయత్నించమని చెబుతూ రేడియో ఫ్రీక్వెన్సీ అబాలిషన్ మిషన్ ద్వారా 60–70 సెల్సియస్ డిగ్రీల వేడిని 30–40 సెకన్ల పాటు మెదడులోని నిర్ధారిత ప్రాంతంలోకి ప్రసరింపచేశారు. వేడి తగిలినప్పుడు ఏ వేలు పనిచేయడం ప్రారంభించిందో రోగి, వైద్యునికి చెప్పాలి. అందువల్ల శస్త్రచికిత్స జరుగుతు న్నంత సేపూ అభిషేక్ ప్రసాద్ మెలకువలోనే ఉండి గిటార్‌ను వాయిస్తూ తన అనుభూతు లను డాక్టర్లకు చెబుతూనే ఉన్నారు. దాదాపు గంటన్నర శస్త్రచికిత్స తరువాత అతని మూడువేళ్లు మామూలుగా పనిచేయడం ఆరంభించాయి. ఈ చికిత్సకు పరికరాలను ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా తెప్పించామని వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను ఈ వ్యాధిని జయించానని అభిషేక్ ప్రసాద్ అన్నారు. -
బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే.. గిటార్ వాయించాడు
షెన్జన్: ఆపరేషన్ థియేటర్లో వైద్యులు సీరియస్‌గా ఓ వ్యక్తి బ్రెయిన్‌కు సర్జరీ చేస్తున్నారు. అయితే సర్జరీ చేయించుకుంటున్న వ్యక్తి మాత్రం తాపీగా గిటారు వాయిస్తూ పడుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన దక్షిణ చైనాలోని షెన్జెన్లో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే.. లీ జియాంగ్(57) అనే వ్యక్తి మెదడు సమస్యతో బాధపడుతున్నాడు. దీనివల్ల అతని చేతివేళ్లపై మెదడు నియంత్రణను కోల్పోయాడు. అతని మెదడులో బ్యాటరీతో కూడిన ఎలక్ట్రోడులను అమర్చడం ద్వారా అతన్ని తిరిగి మామూలుగా మార్చొచ్చని భావించిన వైద్యులు సోమవారం అపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సమయంలో జియాంగ్ గిటార్ వాయించడానికి ప్రయత్నిస్తుండగా వైద్యులు ఎలక్ట్రోడుల పనితీరును నిర్థారించుకుంటూ అపరేషన్ పూర్తిచేశారు. కొత్తగా అమర్చిన ఎలక్ట్రోడ్లతో పదేళ్లపాటు జియాంగ్ తన వేళ్లపై నియంత్రణ కలిగి ఉంటాడని వైద్యులు వెల్లడించారు. గతంలో స్పెయిన్‌లో ఓ వ్యక్తి సాక్సాఫోన్ వాయిస్తుండగా వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే. -
పొడవాటి గిటార్
తిక్క లెక్క గిటార్లో నానా రకాలు ఉన్న సంగతి తెలిసిందే. ఏ రకమైన గిటారైతేనేం, రెండు చేతుల మధ్య ఇమిడిపోయి, వాయించడానికి అనువుగానే ఉంటుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఎలక్ట్రిక్ గిటార్ తీరే వేరు. ఇది అలాంటిలాంటి గిటార్ కాదు. ప్రపంచంలోనే అతి పొడవైన గిటార్‌గా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. దీని పొడవు ఎంతో కాదు... కేవలం 43 అడుగుల 7.5 అంగుళాలు మాత్రమే. ఇక దీని వెడల్పు 16 అడుగుల 5.5 అంగుళాలు. దీనిని పెకైత్తడం మానవమాత్రుల వల్ల కాదు. ఎందుకంటే, దీని బరువు 907 కిలోలు. దీనినెలా వాయిస్తారో మరి అని సందేహిస్తున్నారా? వాయించడానికి కాదు, కేవలం రికార్డు కోసమే టెక్సాస్ విద్యార్థులు కొందరు దీనిని తయారు చేశారు.