ట్రెండింగ్‌ : తెగ వాయించేసాడుగా గిటార్‌..! | Three Little Boys Give A Great Performance with their Made UP Guitars | Sakshi
Sakshi News home page

నటించమంటే.. జీవించేశారు

Published Sat, Dec 21 2019 5:51 PM | Last Updated on Sat, Dec 21 2019 5:55 PM

Three Little Boys Give A Great Performance with their Made UP Guitars - Sakshi

సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరి టాలెంట్‌ బయటి ప్రపంచానికి తెలిసిపోతుంది. అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా ఏ పని చేసినా అది వైరల్‌ అయిపోతుంది.  తాజాగా ఓ ముగ్గరు బుడతలు చేసిన పని సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. నెటిజన్ల మనసును గెలుచుకుంది. ఇంతకీ ఆ బుడతలు చేసిన పని ఏమంటారా? గిటార్‌ వాయించారు అంతే. అందుతో ప్రత్యేకం ఏముందంటారా? గిటార్‌తో వాయిస్తే మాములే.. కానీ గిటార్‌ లేకున్నా గిటార్‌ వాయిస్తే అది వెరైటే అవుతుంది. ఆ ముగ్గురు బుడతలు కూడా అదే చేశారు. వాళ్ల దగ్గర గిటార్‌ లేకపోయినా.. రాక్‌స్టార్‌లా గిటార్‌ వాయించారు.

ఓ కర్రను పట్టుకొని గిటార్‌లా ఊహించి... వాయించేశారు. స్టేజ్‌పై రాక్‌స్టార్‌ ఏవిధంగా డ్యాన్స్‌ చేస్తూ గిటార్‌ వాయిస్తాడో.. అచ్చం అలాగే చేశాడు ఓ కుర్రాడు. ఇక పక్కనే ఉన్న మరో ఇద్దరు బుడతలు కూడా గిటార్‌ వాయిస్తున్నట్లుగా చేతులు కదిపారు. నిజమైన గిటారిస్ట్‌ల్లా ఫీల్‌ అవుతూ.. వారంతా పాట పాడారు. ‘ ఈ రాక్‌స్టార్స్‌ ఈ శనివారం రాత్రి ఏ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు? నేను కూడా వచ్చి వారితో జాయిన్‌ అవుతా’  అని ఓ నెటిజన్‌ ఈ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ‘ మనస్ఫూర్తిగా పాడుతున్నారు’., ‘ వారి ప్యాషన్‌కు హాట్యాఫ్‌, టీమ్‌వర్క్‌ బాగుంది’ , ‘ సో క్యూట్‌’, ‘ యూత్‌పుల్‌ ఎనర్జీ, సో క్యూట్‌’  అంటూ బుడతలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement