Guitar music
-
తండ్రి గిటార్‌పై పడుకుని బుడ్డోడి తన్మయత్వం..! క్యూట్ వీడియో
-
ట్రెండింగ్ : తెగ వాయించేసాడుగా గిటార్..!
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరి టాలెంట్ బయటి ప్రపంచానికి తెలిసిపోతుంది. అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా ఏ పని చేసినా అది వైరల్ అయిపోతుంది. తాజాగా ఓ ముగ్గరు బుడతలు చేసిన పని సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. నెటిజన్ల మనసును గెలుచుకుంది. ఇంతకీ ఆ బుడతలు చేసిన పని ఏమంటారా? గిటార్ వాయించారు అంతే. అందుతో ప్రత్యేకం ఏముందంటారా? గిటార్‌తో వాయిస్తే మాములే.. కానీ గిటార్ లేకున్నా గిటార్ వాయిస్తే అది వెరైటే అవుతుంది. ఆ ముగ్గురు బుడతలు కూడా అదే చేశారు. వాళ్ల దగ్గర గిటార్ లేకపోయినా.. రాక్‌స్టార్‌లా గిటార్ వాయించారు. ఓ కర్రను పట్టుకొని గిటార్‌లా ఊహించి... వాయించేశారు. స్టేజ్‌పై రాక్‌స్టార్ ఏవిధంగా డ్యాన్స్ చేస్తూ గిటార్ వాయిస్తాడో.. అచ్చం అలాగే చేశాడు ఓ కుర్రాడు. ఇక పక్కనే ఉన్న మరో ఇద్దరు బుడతలు కూడా గిటార్ వాయిస్తున్నట్లుగా చేతులు కదిపారు. నిజమైన గిటారిస్ట్ల్లా ఫీల్ అవుతూ.. వారంతా పాట పాడారు. ‘ ఈ రాక్‌స్టార్స్ ఈ శనివారం రాత్రి ఏ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు? నేను కూడా వచ్చి వారితో జాయిన్ అవుతా’ అని ఓ నెటిజన్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ మనస్ఫూర్తిగా పాడుతున్నారు’., ‘ వారి ప్యాషన్‌కు హాట్యాఫ్, టీమ్‌వర్క్ బాగుంది’ , ‘ సో క్యూట్’, ‘ యూత్‌పుల్ ఎనర్జీ, సో క్యూట్’ అంటూ బుడతలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
తెగ వాయించేసాడుగా గిటార్..!
-
సంగీత ప్రియులకు ఫ్లామెన్కో గిటార్ మ్యూజిక్
సంగీత ప్రియులను ఫ్లామెన్కో గిటార్ మ్యూజిక్ మైమరిపించింది. లాడ్ దెబస్సీ క్లాసిక్స్‌తో మాదాపూర్‌లోని ద వెస్టిన్ ఓలలాడింది. ఫ్రెంచ్ మ్యుజీషియన్స్ సెర్జ్ లోపేజ్, నథాలి మారిన్‌లు బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘డియో- ఫ్లామెన్కో కన్సర్ట్ (గిటార్ అండ్ పియానో)’ ఆద్యంతం ఆహూతులను అలరించింది. హైదరాబాద్‌కు మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ గాయనీ గాయకులు తమ నేపథ్యాన్ని సిటీప్లస్‌తో పంచుకున్నారు. ..:: వీఎస్ ‘నాన్న మార్సెజ్ లోపేజ్ కార్లు రిపేర్ చేసేవారు. అమ్మ హుగువిటి లోపేజ్ ఓ బేకరిలో పనిచేశారు. చిన్నప్పటి నుంచి నా చుట్టూ పరిస్థితులే ఏదో ఒకటి చేయాలన్న ధృడ సంకల్పానికి బాటలు వేశాయి. 16వ ఏట మా పేరేంట్స్ స్వస్థలం స్పెయిన్‌లో జరిగిన ఓ లైవ్ కన్సర్ట్కు వెళ్లా. అక్కడి గిటార్ మ్యూజిక్ ఫ్లామెన్కో నన్ను ఆకట్టుకుంది. ఫలితం... నేను ఫ్లామెన్కో గిటారిస్ట్‌గా మారిన. ఇది స్పెయిన్‌లోని అండ లూసియా ప్రాంత మ్యూజిక్. ఇష్టంతో నాకు నేనుగా నేర్చుకున్నా. ఫ్రాన్స్, స్పెయిన్, యూకేతో పాటు వివిధ దేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చాను’ అని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు సెర్జ్ లోపేజ్. మంచి స్పందన.. అర్కెస్ట్రా నిర్వాహకురాలిగా అంతర్జాతీయ కీర్తి తెచ్చుకున్న నథాలి మారిన్ చిన్ననాటి నుంచే మ్యూజిక్‌ను ఆస్వాదిస్తోంది. ‘నాకు మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి. ఫ్యాబ్రిక్ మేనేజరైన నాన్న జియాన్ మారిన్, ఉపాధ్యాయురాలైన అమ్మ క్రిస్టియన్ మారిన్ నన్ను ఎంకరేజ్ చేశారు. వారి ప్రోత్సాహం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ తర్వాతే మ్యూజికే నా ప్రాణమైంది. మా బ్రదర్ గిల్టియో మారిన్ ఫ్లూట్ వాయిస్తాడు. ఇక నేను ఇప్పటివరకు ఫ్రాన్స్‌తో పాటు అనేక దేశాల్లో ప్రదర్శనలిచ్చా. సెర్జ్ లోపేజ్తో కలసి భారత్‌లో కన్సర్ట్లివ్వడం ఆనందంగా ఉంది. ఇక్కడ అభిమానుల నుంచి మాకు అద్వితీయ స్పందన లభిస్తోంది. ఇప్పటికే అలయన్స్ ఫ్రాంచైజ్ భాగస్వామ్యంతో గోవా, తిరువనంతపురం, బెంగళూరులలో ప్రదర్శనలిచ్చాం. హైదరాబాద్‌లో అయితే ఇదే తొలిసారి. ఇక్కడి వంటకాలు బాగున్నాయి. మరిన్ని ప్రదర్శనలకు హైదరాబాద్ మాకు ఆహ్వానం పలుకుతుందని ఆశిస్తున్నాం’ అని అంటోంది నథాలి మారిన్. -
‘గిటార్’ మ్యూజిక్
భక్తి లేని సంగీతం జ్ఞానం, ముక్తినొసగదని వాగ్గేయకారుడు త్యాగరాజు చెప్పారు. ఇదే సూత్రాన్ని కాస్త మార్చి మానవ సేవకు సంగీతాన్ని ఎంచుకుంటున్నాయి బడా ఆస్పత్రులు. రోగులకు, వారి బంధువులకు వీనుల విందైన సంగీతాన్ని అందిస్తూ వాళ్లను టెన్షన్ ఫ్రీ చేస్తున్నాయి. వైద్యంతో పాటు సరిగమలు వినిపిస్తూ రోగులకు స్వస్తత చేకూరుస్తున్నాయి. గిటార్ మ్యూజిక్ థెరపీ ద్వారా ఆస్పత్రిపాలైన వారికి కాస్తంత రిలీఫ్ అందిస్తున్నాయి. - వాంకె శ్రీనివాస్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి డబుల్ హ్యాపీని అందించే ‘గిటార్’ మ్యూజిక్.. ఇప్పుడు ఆస్పత్రుల్లో కూడా వినిపిస్తోంది. బడా హోటళ్లు, రెస్టారెంట్లు, పెళ్లిళ్లు, ప్రత్యేక విందుల్లో మాత్రమే వినిపించే ఈ సాఫ్ట్ మ్యూజిక్.. బాధతో ఆస్పత్రికి వచ్చేవారికి ఉపశమనం కలిగిస్తోంది. రోగులతో పాటు వారి వెంట వచ్చిన వారికి కూడా గిటార్ మ్యూజిక్ వినిపిస్తున్నారు. తమవారికి ఏమవుతుందోనన్న బాధ, టెన్షన్‌ను తగ్గించడానికి గిటార్ ప్లే చేస్తున్నందుకు సంతోషంగా ఉందని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో గిటార్ మ్యుజీషియన్ విజయ్ రాజ్ అంటున్నారు. అందుకే లైవ్ మ్యూజిక్... విదేశాల్లో ఆస్పత్రుల్లో గిటార్ మ్యూజిక్ సాధారణం. కొన్ని ఆస్పత్రుల్లోనైతే రోగుల వద్దకు వెళ్లి వారికి నచ్చిన మ్యూజిక్ వినిపిస్తుంటారు. అదే ట్రెండ్ ఇప్పుడు సిటీలో మొదలైంది. నెలన్నర కిందట అపోలో ఆస్పత్రి గిటార్ ప్లేకు శ్రీకారం చుట్టింది. ‘మొదట్లో లైట్ మ్యూజిక్‌ను స్పీకర్ల ద్వారా వినిపించినా రోగుల వెంట వచ్చినవారి నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయకుండా ఎవరి బిజీలో వారు ఉండటం కనిపించింది. దీంతో లైవ్ మ్యూజిక్ వినిపించాలని నిర్ణయించాం. దీని కోసం ‘బ్లూ కీ ప్రొడక్షన్’ మ్యుజీషియన్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. వాళ్లు రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య గిటార్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు’ అని అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. లైవ్ మ్యూజిక్ స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితిలో మార్పు కనిపించింది. మ్యుజీషియన్ కళ్లెదుటే గిటార్ ప్లే చేస్తుండటంతో అందరూ ఆసక్తిగా వింటున్నారు. మనసుకు ఆహ్లాదం కలిగించే మ్యూజిక్‌తో.. ఒత్తిడిలో ఉన్న వారి మూడ్‌ను మారుస్తూ బాధతో భారంగా ఉన్న హృదయాలను తేలికపరుస్తున్నారు.