
‘‘సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దీనిపై మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది’’ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు అనన్య. సోషల్ మీడియా ట్రోలింగ్ మీద అవగాహన తీసుకురావడానికి ప్రముఖ గిటారిస్ట్ మెక్ వీ తో కలసి ఈ శుక్రవారం ఇన్ స్టా గ్రామ్‌లో లైవ్ లోకి రాబోతున్నారామె. ‘‘ప్రస్తుతం ప్రపంచం కష్టంలో ఉంది. ఈ సమయంలో అందరిలో ఉండాల్సింది దయ, ప్రేమ. అంతే కానీ ఇతరులను ట్రోల్ చేయడం కాదు. ప్రేమను, పాజిటివిటీని పంచండి’’ అన్నారు అనన్యా పాండే.