awerness
-
కరోనాపై వరలక్ష్మి శరత్‌కుమార్ అవగాహన
సాక్షి, చెన్నై: ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి గురించి ఇప్పటికే పలు అవగాహన కార్యక్రమాలు, వీడియోలు విడుదలయ్యాయి. తాజాగా సంచలన నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కరోనాపై అవగాహన కలిగించే విధంగా ద్విపాత్రాభినయం చేసిన వీడియో విడుదలైంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కరోనాపై పోరాటానికి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి వివరించారు. కరోనాను అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ వేసుకోవడమే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. చదవండి: సోనూసూద్ సాయం: కరోనా బాధితుడికి కాన్సన్ట్రేటర్ -
ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్
ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్. ముంబైలో క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటూ కూడా డ్రెస్ డిజైనర్‌గా కొనసాగింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తూ, అవార్డులూ పొందుతోంది. ‘సంతోషంగా ఉండటం వల్లే వ్యాధిని ఓడించగలుగుతున్నాను’ అంటోంది మనాలి. ముంబయికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ మనాలి కిందటి సంవత్సరం క్యాన్సర్ చికిత్సలో భాగంగా 12 కెమోథెరపీలు చేయించుకున్నది. ఇప్పుడు ఆమె మరోసారి తన డిజైనింగ్ నైపుణ్యంతో ప్రజలను ప్రభావితం చేస్తోంది. క్యాన్సర్ రోగులందరికీ జీవితాన్ని వదులుకోకుండా ముందుకు సాగాలని మనాలి తన జీవితం ద్వారా నిరూపిస్తోంది. 2018 ఏప్రిల్‌లో తన గర్భాశయంలో ఏదో తేడా ఉందని మనాలికి అర్ధమైంది. ఈ కారణంగానే ప్రతి నెలా భారీగా రక్తస్రావం జరిగేది. ఆపరేషన్ చేసి, తన గర్భాశయాన్ని తొలగించాలని ఆమె డాక్టర్ని కోరింది. దీంట్లో భాగంగా బయాప్సీ టెస్ట్ చేయడంతో ఆమెకు క్యాన్సర్ ఉందని తేలింది. క్లినికల్ భాషలో, దీనిని ఎండోమెట్రియల్ స్ట్రోమల్ సార్కోమా అంటారు. ప్రతిరోజూ సంతోషంగా.. మనాలికి క్యాన్సర్ ఉందని కుటుంబంలో అందరూ భయపడ్డారు. అదే సమయంలో, ఆమె ఫ్యాషన్ షో కోసం దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ఆమె తల్లిదండ్రులు మనాలికి క్యాన్సర్ అనే విషయం ఆమెకు చెప్పకుండా దాచారు. కాని, వారి విచారకరమైన ముఖాలను చూడటంతో ఆమెకు తన స్థితిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. గతంలో మనాలి కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేదు. అందుకే, అది క్యాన్సర్‌కు దారి తీస్తుందని వారూ గుర్తించలేదు. తన చావో బతుకో ఏదైనా జరగవచ్చని మనాలికి తెలుసు. దీంతో బతికి ఉన్నన్నాళ్లూ తన కుటుంబంతో సంతోషంగా ఉంటూ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా, ప్రతిరోజూ సంతోషంగా గడపాలని కోరుకుంది. ఈ అనారోగ్యం సమయంలో కూడా మనాలి తన ఆలోచనను సానుకూలంగా మార్చుకుంది. ముంబయ్‌లోని సహారా స్టార్ హోటల్లో ఇటీవల జరిగిన లోక్మత్ లైఫ్‌స్టైల్ ఐకాన్ 2020 అవార్డు వేడుకలో ఫ్యాషన్ డిజైనర్ ఐకాన్ 2020 అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మనాలి..‘కుటుంబం, స్నేహితులే నా బలం. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా క్యాన్సర్ నెమ్మదిగా చంపేస్తుంది. జుట్టు పోతుంది, అందం తగ్గుతుంది. అన్నీ తెలుసు. కానీ, మన కల మనల్ని బతికించాలి. లక్ష్యం వైపుగా ప్రయత్నించాలి అనుకున్నాను. అప్పుడే నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. విగ్గు పెట్టుకుంటాను, డిజైనర్ డ్రెస్సులు ధరిస్తాను. అలాగే సంతోషంగా నా జీవితాన్ని తిరిగి మొదలుపెట్టాను. ఇప్పుడు సమస్య లేదని అనను. కానీ, డిజైనర్‌గా నా పనిని నేను కొనసాగిస్తూనే ఉంటాను. ఫ్యాషన్ షోలలో పాల్గొంటాను. కెరియర్లో ఎదుగుతాను. మూడేళ్లుగా నా పనుల్లో ఎక్కడా అంతరాయం రాకుండా చూసుకున్నాను. క్యాన్సర్ పేషంట్స్‌కు రోగం పట్ల అవగాహన కల్గిస్తూ మరింత సంతృప్తిగా జీవిస్తాను’ అని తెలిపారు మనాలి. క్యాన్సర్ అనగానే బతుకు భయంతో కుంగిపాటుకు లోనయ్యేవారికి మనాలి చెప్పే మాటలు ఉత్తేజాన్ని నింపుతాయి. ఆమె జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుంది. క్యాన్సర్ చికిత్స సమయంలో..; ఫ్యాషన్ డిజైనర్‌గా అవార్డు అందుకుంటూ.. -
ప్రేమను పంచాలి
‘‘సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దీనిపై మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది’’ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు అనన్య. సోషల్ మీడియా ట్రోలింగ్ మీద అవగాహన తీసుకురావడానికి ప్రముఖ గిటారిస్ట్ మెక్ వీ తో కలసి ఈ శుక్రవారం ఇన్ స్టా గ్రామ్‌లో లైవ్ లోకి రాబోతున్నారామె. ‘‘ప్రస్తుతం ప్రపంచం కష్టంలో ఉంది. ఈ సమయంలో అందరిలో ఉండాల్సింది దయ, ప్రేమ. అంతే కానీ ఇతరులను ట్రోల్ చేయడం కాదు. ప్రేమను, పాజిటివిటీని పంచండి’’ అన్నారు అనన్యా పాండే. -
బాలభారతాన్ని కబళిస్తున్న కేన్సర్
భావిభారత విధాతలైన నేటి బాలలను కేన్సర్ మహమ్మారి కబళిస్తోంది. కేన్సర్ వ్యాధి సోకిన చిన్నారులను కాపాడుకోలేని పరిస్థితి ఆందోళన కరంగా తయారయ్యింది. కేన్సర్ వ్యాధిగ్రస్తులైన ప్రతి ఐదుగురు చిన్నారుల్లో నలుగురు మరణిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సరైన సమయంలో కేన్సర్‌ని గుర్తించకపోవడం, చికిత్సకోసం సుదూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడం, వైద్యం ఖరీదవడం వల్ల కేన్సర్ వ్యాధిగ్రస్తులైన చిన్నపిల్లలు చికిత్సకు దూరమౌతున్నారు. ఉదాహరణకు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ముంబై టాటా మెమోరియల్ కేన్సర్ ఆసుపత్రిలో కేన్సర్ చికిత్సకోసం చేరుతోన్న చిన్నారుల్లో 43.6 శాతం మంది 1,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని తాజా రికార్డులు వెల్లడిస్తున్నాయి. పది శాతం మంది 2,200 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆసుపత్రిలో చేరుతున్నారు. మరో 20 శాతం మంది మాత్రం ఈ ఆసుపత్రిలో చేరడానికి ముందే అసంపూర్తిగా చికిత్స చేయించుకొని వస్తున్నారు. ఆ దేశాల్లో ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం, మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లోని కేన్సర్ బాధిత చిన్నారుల్లో ఎక్కువ మంది చనిపోతున్నట్టు ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. దేశంలో కేన్సర్ సోకిన అత్యధిక మంది బాలలు ఐదేళ్ళకు మించి బతక్కపోవడానికి, కేన్సర్‌ని సరైన సమయంలో గుర్తించకపోవడం, వైద్యం ఖర్చు భరించలేనంతగా ఉండడం, సగంలోనే (అసంపూర్ణం) చికిత్సను ఆపివేయడం కారణాలని ఇండియా స్పెండ్ సంస్థ వెల్లడించింది. సరైన సమయంలో గుర్తిస్తే.. ప్రతియేటా దేశంలో దాదాపు 50,000 మంది 19 ఏళ్ళలోపు వయస్సువారు కేన్సర్‡ బారిన పడుతున్నట్టు ద లాన్సెంట్ అధ్యయనం గుర్తించింది. అయితే ఈ సంఖ్య వాస్తవంలో 75,000కు పైచిలుకే అంటున్నారు టీఎంహెచ్ ఆంకాలజిస్ట్ గిరీష్ చిన్నస్వామి. దాదాపు 20,000 మంది చిన్నారుల్లో కేన్సర్‌ని గుర్తించడం గానీ, దానికి చికిత్స చేయించడం గానీ జరగడంలేదు. కేన్సర్సోకిన 55,000 మందిలో కేవలం 15000 మందికే నైపుణ్యం, అనుభవం కలిగిన వైద్యుల ద్వారా నాణ్యమైన, మంచి చికిత్స లభిస్తోంది. అలాగే వారికి మంచి ఆహారం, వైద్యానికి ఆర్థిక సహకారం లభిస్తోంది. వీరిలో 70 శాతం మంది కేన్సర్‌ని జయిస్తున్నారు. మూడోవంతు మంది మధ్యలోనే.. ► కేన్సర్‌బారిన పడిన చిన్నారుల్లో 3వవంతు మంది అసంపూర్ణ చికిత్సకారణం గా బతికే అవకాశాన్ని కోల్పోతున్నారు. ► దిగువ, మధ్య తరగతి ఆదాయం కలిగిన దేశాల్లో 90 శాతం మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తున్నారు. ► మరింత పేదరికంలో మగ్గుతోన్న దేశాల్లో 99 శాతం మంది చికిత్స చేయించుకోకపోవడమో, లేక చికిత్సను మధ్యలోనే వదిలేయడమో జరుగుతోంది. ఓ అధ్యయనం ప్రకారం ► ప్రత్యామ్నాయ, సాంప్రదాయ చికిత్సావిధానాన్ని అనుసరిస్తున్నవారు 31 శాతం ► ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చికిత్సను మానుకుంటున్న వారు 28 శాతం ► కేన్సర్‌కి చికిత్సలేదనీ, అది నయం కాని వ్యాధి అని భావిస్తున్నవారు 26 శాతం ఇండియా స్పెండ్ ప్రకారం ప్రతి పదిలక్షల మంది జనాభాకి ఆంకాలజిస్ట్‌లు ► ఫిలిప్పైన్స్‌లో 25.63 మంది ► చైనాలో 15.39 ∙ఇరాన్లో 1.14 ► భారత్‌లో 0.98 -
ఓటు మన ఆయుధం
-
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రతీ విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జీవన్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ము ఖ్యం గా విద్యార్థినులు మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చాలా మంది వీటిపై అవగాహన లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు తోటి విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తారని, దీంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా నిలిచే ప్రమాదం ఉందన్నారు. మహిళల పట్ల గౌరవంగా మెలగాల ని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పల్ జాకిర్ హుస్సేన్, వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్, అధ్యాపకులు మంజుల, శ్రావణి, విజయ్‌కుమార్, జగ్రాం, రమేశ్‌రెడ్డి, నర్సింగ్‌రావు, ప్రతాప్‌సింగ్, తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలి జైనథ్: ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సిటిజన్ ఫోరం మండల ఇన్చార్జి కొం గర్ల గణేశ్ అన్నారు. బుధవారం ఆయన మండలకేంద్రంలో సిటిజన్ ఫోరం సభ్యులు, స్థానిక నా యకులతో కలిసి ఏక్‌సాల్ మే పరివర్తన్ గోడ ప్రతులను విడుదల చేశారు. ఆయన మాట్లాడు తూ ప్రజలంతా ఏకమై గ్రామాలను హరితవనా లుగా తీర్చిదిద్దాలన్నారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తి తో పరిశుభ్రమైన గ్రామాలను తయారు చేయాలన్నా రు. చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెం చుకొని, నేరరహిత సమాజ స్థాపనకు నడుం బిగిం చాలన్నారు. కుల,మత, రాజకీయ, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని బలోపేతం చేసి, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. నాయకులు సర్సన్ లింగారెడ్డి, కిష్ఠారెడ్డి, వెంకట్‌రెడ్డి, గణేశ్‌యాదవ్, రమేశ్, గంగన్న పాల్గొన్నారు. -
‘ఓపెన్’ అయ్యారు
వ్యవస్థలో కీలకాంశాలపై అవగాహన కల్పించిన పోలీసు అధికారులు ఆకట్టుకున్న పోలీస్ ఓపెన్ హౌస్ ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు l ఆశ్చర్యపరిచిన జాగిలాల విన్యాసాలు ∙పోలీసులు వాడే తుపాకీలను మన సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే అవి ఎలా పనిచేస్తాయి? ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని గురి చూసికొట్టొచ్చు? తుపాకీల సామర్థ్యం ఎంత? వాటిలో రకాలెన్ని? ఏయే సమయాల్లో ఏయే తుపాకీలను వాడతారు? ∙వైర్లెస్ సెట్లను పోలీసు యంత్రాంగం ఎప్పుడు, ఎలా ఉపయోగిస్తుంది. పోలీసు సమాచార వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ∙పోలీసు జాగిలాలు దొంగలను ఎలా పసిగడతాయి. నేర పరిశోధనలో వీటి పాత్ర ఏంటి? వీటికి ఏ విధంగా ట్రైనప్ చేస్తారు? ∙క్లూస్ టీం విధులు? చోరీల గుట్టు ఎలా రట్టు చేస్తుంది? వేలిముద్ర సేకరణలో ఈ టీం ఎలా వ్యవహరిస్తుంది? ∙డ్రోన్ పరికరం విశిష్టత, అది ఎలా పనిచేస్తుంది? వినియోగం ఎలా? ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసేందుకు కాకినాడలోని జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్’ వేదికైంది. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇక్కడ జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ‘పోలీసుల విధులు –బాధ్యతలు’పై విద్యార్థులతో ఓపెన్ హౌస్ నిర్వహించారు. వేల సంఖ్యలో విద్యార్థులు హాజరై.. పోలీసుల ఆయుధాలు, సమాచార వ్యవస్థ, పోలీసు జాగిలాలు గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. స్వయంగా తుపాకీలను చేతపట్టి ఫొటోలకు ఫోజులిచ్చారు. వీరికి ఎస్పీ రవిప్రకాష్‌తోపాటు, ఏస్పీ దామోదర్, ఏఆర్ డీఎస్పీ వాసన్, పలువురు సీఐలు, ఎస్సైలు విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. – కాకినాడ క్రైం డ్రోన్.. అదిరేన్.. ఓపెన్‌హౌస్‌లో నిఘా, భద్రత కోసం వినియోగించే డ్రోన్ పరికరం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ డ్రోన్ పరికరాన్ని పోలీసులు రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయగానే ఒక్కసారిగా ఆకాశంలోకి రివ్వున ఎగిరి పెరేడ్ గ్రౌండ్ అంతా చక్కర్లు కొట్టడంతో విద్యార్థులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. డ్రోన్ పరికరంతో అనేక ఫలితాలు సాధించామని, గోదావరి, కృష్ణ పుష్కరాల్లో డ్రోన్ పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధించినట్టు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసులదే కీలకపాత్ర ‘ఓపెన్ హౌస్’లో ముందుగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలకపాత్రని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. దేశ భద్రత కోసం త్రివిధ దళాలు, బోర్డర్ సెక్యూరిటీ కోసం బీఎస్ఎఫ్, ఇండో, టిబెట్, సెక్యూరిటీ కోసం సీఐఎస్ఎఫ్ లాంటి అనేక విభాగాలు పనిచేస్తున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా అంతర్గత భద్రత కోసం ఏడాదిలో సుమారు 700 నుంచి 1200 మంది వరకు పోలీసులు ప్రాణత్యాగాలు చేస్తున్నారని చెప్పారు. పోలీసుల సేవలను గుర్తు చేసుకుంటూ ఏటా అక్టోబర్ 21ను పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. జిల్లాలో విద్యార్థులకు పోలీసుల విధులు–బాధ్యతలు, సమాజంలో పోలీసుల పాత్ర వంటి వాటిపై వక్తృత్వ, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియా, వాట్సప్ వంటి వాటి కోసం వెంపర్లాడ వద్దని సూచించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నవీపేట: వాతావరణంలో కలిగే మార్పులతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి లక్ష్మయ్య సూచించారు. మండలంలోని మోకన్‌పల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), అభంగపట్నంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన బుధవారం సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత వాతావరణంలో డెంగీ, మలేరియా, చికున్ గున్యా తదితర రోగాలు వ్యాపిస్తాయన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా మారుమూల గ్రామాల్లో విద్యార్థులు ఇరుగుపొరుగు వారికి అవగాహన కల్పించాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు తిష్టవేసి ఉంటాయని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ముందు జాగ్రత్తగా దోమల నివారణ మందును పిచికారి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీజనల్ వ్యాధులు–నివారణ చర్యలు అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేకాధికారి రమారాణి, ఆస్పత్రి సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వర్రావ్, సూపర్వైజర్ పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.