మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జీవన్‌కుమార్
ఆదిలాబాద్‌టౌన్: ప్రతీ విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జీవన్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ము ఖ్యం గా విద్యార్థినులు మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చాలా మంది వీటిపై అవగాహన లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు.
విద్యార్థులు తోటి విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తారని, దీంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా నిలిచే ప్రమాదం ఉందన్నారు. మహిళల పట్ల గౌరవంగా మెలగాల ని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పల్ జాకిర్ హుస్సేన్, వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్, అధ్యాపకులు మంజుల, శ్రావణి, విజయ్‌కుమార్, జగ్‌రాం, రమేశ్‌రెడ్డి, నర్సింగ్‌రావు, ప్రతాప్‌సింగ్, తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
జైనథ్: ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సిటిజన్ ఫోరం మండల ఇన్‌చార్జి కొం గర్ల గణేశ్ అన్నారు. బుధవారం ఆయన మండలకేంద్రంలో సిటిజన్ ఫోరం సభ్యులు, స్థానిక నా యకులతో కలిసి ఏక్‌సాల్ మే పరివర్తన్ గోడ ప్రతులను విడుదల చేశారు. ఆయన మాట్లాడు తూ ప్రజలంతా ఏకమై గ్రామాలను హరితవనా లుగా తీర్చిదిద్దాలన్నారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తి తో పరిశుభ్రమైన గ్రామాలను తయారు చేయాలన్నా రు.
చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెం చుకొని, నేరరహిత సమాజ స్థాపనకు నడుం బిగిం చాలన్నారు. కుల,మత, రాజకీయ, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని బలోపేతం చేసి, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. నాయకులు సర్సన్ లింగారెడ్డి, కిష్ఠారెడ్డి, వెంకట్‌రెడ్డి, గణేశ్‌యాదవ్, రమేశ్, గంగన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment