
మహిళలు ఒంటరిగా రైలు ప్రయాణం చేస్తున్నట్టయితే ఈ రైల్వే యాక్ట్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!
ద రైల్వే యాక్ట్ 1989, సెక్షన్ 139 ప్రకారం.. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నా ఆందోళన చెందక్కర్లేదు. టికెట్ లేదని రైల్లోంచి దింపే అధికారం టీటీఈకి లేదు. ఫైన్ కట్టి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఒకవేళ ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేకపోయినా భయపడక్కర్లేదు. లేడీ కానిస్టేబుల్ లేకుండా రైలు దింపడానికి వీల్లేదు.సెక్షన్ 311 ప్రకారం ఎట్టిపరిస్థితుల్లో మహిళల కంపార్ట్‌మెంట్లోకి మిలటరీ సహా పురుషులెవరూ ఎక్కడానికి వీల్లేదు. ఎక్కితే వారు శిక్షార్హులు. సెక్షన్ 162 ప్రకారం.. పన్నెండేళ్ల లోపు మగపిల్లలు మాత్రం తల్లి, సోదరి, అమ్మమ్మ, నానమ్మ లాంటి వాళ్లతో కలసి మహిళల కంపార్ట్‌మెంట్లో ప్రయాణించవచ్చు.
అలాగే ప్రతి స్లీపర్ (మెయిల్, ఎక్స్‌ప్రెస్) క్లాస్‌లో, గరీబ్‌రథ్, రాజధాని, దురంతో లాంటి రైళ్లు లేదా మొత్తం ఎయిర్ కండిషన్డ్ రైళ్లలోని థర్డ్ ఏసీ (3 ఏసీ)లో మహిళలకు 6 బర్త్‌లు రిజర్వ్ అయి ఉంటాయి. గ్రూప్‌గా ప్రయాణిస్తున్న మహిళలూ వీటిని వినియోగించుకోవచ్చు. రైలు ఎక్కినప్పటి నుంచి గమ్యానికి చేరేవరకు మహిళా ప్రయాణికుల భద్రత కోసం ‘మేరీ సహేలీ’ యాప్‌నూ లాంచ్ చేశారు. అంతేకాదు రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమేరాలు, మానిటరింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రైల్వే హెల్ప్‌లైన్ 139 ఉండనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment