Solo Journey
-
వయసు@ 70..సోలో ట్రావెలర్
‘‘వయసు కాదు ప్రతి ఒక్కరూ తమ హృదయ లయను అర్ధం చేసుకొని, దానిని అనుసరించాలని నమ్ముతాను. ఇతరుల గుండె చప్పుడులో జీవించాలని ఎప్పుడూ అనుకోవద్దు’’ అంటోంది రిటైర్డ్ ప్రోఫెసర్ జైపూర్‌వాసి నీరూ సలూజా. జీవితం ఎప్పుడూ ఒక కంఫర్ట్ జోన్ బయటే ఉంటుందనే వాస్తవాన్ని గట్టిగా నమ్మే ఈప్రోఫెసర్ డెభ్లై ఏళ్ల వయసులో సోలో ట్రావెలర్‌గా 80 దేశాలు చుట్టొచ్చింది. భిన్న సంస్కృతులను, పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి, ఎంతో మందిని కలుసుకొని కొత్త ఉత్తేజాన్ని ΄పొందడానికి ఈ ప్రయాణం ఎంతగానో తోడ్పడింది అని చెబుతుంది. ‘‘ఫసిపిక్లోని గాలా పాగోస్ దీవుల నుండి అట్లాంటిక్ మంచుతో నిండిన క్షితిజాల వరకు చేసిన పర్యటనల ద్వారా ఎన్నో స్మారక చిహ్నాలను సేకరించాను. వాటితో అలంకరించిన నా ఇంటిని చూసిన వాళ్లు ప్రపంచ మ్యాప్‌లా ఉంటుందని అంటారు. ఈ జ్ఞాపకాలు అన్నీ ఇప్పటి వరకు నేను చేసిన సాహసాలను గుర్తుచేస్తాయి. ఇంకా నా ఇంటి గోడలపై మిగిలిన ఖాళీ స్థలాలు రాబోయే చిహ్నాల కోసం నాతో సవాల్ చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. కల వెనకాల రహస్యం నాకు ప్రయాణాల పట్ల ఆసక్తి కలగడానికి స్కూల్ రోజుల్లోనే బీజం పడింది. స్కూల్‌కి సైకిల్‌పై వెళుతుండగా ప్రమాదానికి గురై ఎడమ కాలు విరిగింది. ఫిజియోథెరపీ సెషన్లతో పాటు నెలల తరబడి బెడ్‌రెస్ట్‌లో ఉండిపోయాను. ఇతర పిల్లలు స్కూల్లో ఉంటే నేను గదికి పరిమితం అయ్యాను. అప్పుట్లో వినోదానికి టీవీ లాంటి ఏ సాధనమూ లేదు. దీంతో పడకగదిలోని కిటికీలోంచి బయటకు చూస్తూ గంటల తరబడి కాలం గడపవలసి వచ్చింది. అక్కడ నుంచి ఆకాశం కేసి చూస్తూ ఉండేదాన్ని. ప్రపంచాన్ని అన్వేషించాలనుకునేదాన్ని. దాదారు ఆరు దశాబ్దాల తరువాత అలా నా కల నిజమైంది. ప్రేమ వారసత్వం కాలేజీలోప్రోఫ్రెసర్గా ఉద్యోగ నిర్వహణ, భార్యగా విధులు, తల్లిగా బాధ్యతలు, ఇంటి నిర్మాణం.. అన్నీ నిర్వర్తించాను. నా పిల్లలు స్థిరపడ్డారు. నా భర్తతో కలిసి చాలా టూర్లకు వెళ్లేవాళ్లం. ఆయన నాకు భర్త మాత్రమే కాదు నా ట్రావెలర్ ఫ్రెండ్ కూడా. 2010లో ఆయన మరణించడంతో మా ప్రేమ వారసత్వాన్ని నేను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురుచూస్తూ ఉండలేను. ఆ విధంగా ఎనభైకి పైగా దేశాలను చుట్టొచ్చాను. ప్రపంచాన్ని అన్వేషించగలగడం ఒక అదృష్టంగా భావించకూడదు. అదొక ప్రయాణం. దృష్టి కోణాన్ని మార్చింది మొదటి ఒంటరి ప్రయాణం మాత్రం నాకు ఒక సాహసమే అని చెప్పగలను. 2014లో యూరప్ క్రిస్మస్కి క్రూయిజ్ ద్వారా వెళ్లాను. ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. ఒంటరిగా ప్రయాణించడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ యాత్రతో నాకు అర్ధమైంది. నిరుత్సాహమైనదని కొందరు అంటుంటారు. కానీ, నేనది అంగీకరించను. ప్రయాణ ప్రణాళికను బాగా ΄్లాన్ చేసుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముందు తెలుసుకున్నాను. మనతో ఒకరు తోడు కావాలనుకుంటే మాత్రం మార్గంలో ఎంతో మంది కొత్త స్నేహితులు కలుస్తారు. కాబట్టి నిజంగా ఒంటరిగా ఉన్నాననే ఆలోచనే రాదు. ఈ యాత్ర నా దృష్టి కోణాన్ని పూర్తిగా మార్చింది. ఒంటరిగా ప్రయాణించడం, గన్యాలను, ప్రయాణ మార్గాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇదే ఒక సమూహం, కుటుంబ పర్యటన అయితే ఒక సమయపాలనకు కట్టుబడి ఉండాలి. ఆ గ్రూప్‌లో ఎవరు ఏం చేస్తారో మీరూ అదే చేయాల్సి ఉంటుంది. కానీ, ఒంటరి యాత్రికుల విషయంలో అలాంటి డిమాండ్స్ ఏవీ ఉండవు. అడుగడుగునా ఉత్సుకత నా జీవితంలో అతి ఎక్కువగా గుర్తుండిపోయేది 2017 చలికాలంలో స్వీడన్ పర్యటన. నార్తర్న్ లైట్స్‌కు ప్రసిద్ధి చెందిన స్టాక్ హోమ్ నుండి అబిస్కోకు రైలు ఎక్కడం ద్వారా ఇది ప్రారంభమైంది. మన దేశం రైళ్లకు, అక్కడి రైళ్లకు ఏ మాత్రం పోలిక లేదు. బోర్డింగ్‌లో ప్రతి వ్యక్తికీ వాష్‌రూమ్‌కి ఒక కీ ఇస్తారు. అదొక ఖరీదైన హోటల్ లాంటిది. అక్కడి బాత్రూమ్లో ఒక గంట సమయం గడపాలనుకున్నాను. తిరిగి కంపార్ట్‌మెంట్‌కు వచ్చినప్పుడు అది లాక్ అయిపోయింది. ఎవరూ సాయం చేసేవాళ్లు లేరు. కంగారు పడ్డాను. కానీ, చివరకు మార్గాన్ని కనుక్కోగలిగాలను. ఇలాంటి ఎన్నో ఉత్కంఠలు, ఉత్సుకతలు, సాహసాలు.. ఒక్కరోజులో చెప్పలేను. అబిస్కోలో ఒక మంచు గదిలో బస. అక్కడ అది ఎంతో అందంగా, సహజంగా ఉంది. కానీ, బాత్రూమ్లు లేవని ఆలశ్యంగా తెలసింది. అక్కడ పడిన పాట్లు ఒక్క మాటలో చెప్పలేను. మాస్కో నుండి బీజింగ్ వరకు ట్రాన్స్ –సైబీరియన్ రైలు ప్రయాణం.. అదొక ప్రపంచం. మెల్బోర్న్లో 12 వేల అడుగుల నుండి స్కై డైవింగ్ చేయడం అత్యంత ఉత్కంఠను కలిగించింది. ఇలా చెబుతూ పోతే ఎన్నో జ్ఞాపకాలు. ఒక స్వేచ్ఛ విహంగమై చేస్తున్న ప్రయాణం నాకు ఎన్నో తీరాలను పరిచయం చేస్తోంది’’ అని వివరిస్తుంది ఈ ట్రావెలర్. -
Sudha Mahalingam: 70 ఏళ్ల డాక్టర్.. ఇప్పటికి 70 దేశాలు చుట్టారు.. ఇంకా
70 ఏళ్లు డాక్టర్ సుధా మహాలింగంకు. ఇప్పటికి దాదాపు 70 దేశాలు చుట్టేసిందామె. భయం లేదు.. గియం లేదు... బ్యాగ్ సర్దుకుని పదండి అంటోందామె. మరి తోడు? ఎవరూ అక్కర్లేదు.. మీరు ఎక్కడకు వెళితే అక్కడి మనుషులే తోడు అంటుంది. నిజానికి మన దేశాన్ని పూర్తిగా చూడటానికే ఒక జీవిత కాలం సరిపోదు. ఉన్న ఆయుష్షులో ఇంత పెద్ద ప్రపంచం చూడాలంటే ఎంత వేగిర పడాలి. అందుకే సుధా మహాలింగం భ్రమణకాంక్ష కొందరికి ఈర్ష్య పుట్టిస్తోంది... కొందరిచే టికెట్లు బుక్ చేయిస్తోంది. ‘వీలున్నప్పుడు మంచి ప్రయాణం చేయాలి అని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. నామాట నమ్మండి. వీలు ఎప్పుడూ ఉండదు. వీలు చేసుకోవాలి’ అంటుంది సుధా మహాలింగం. ఆమె కథ కొంచెం అసూయ పుట్టించేదే. ‘చాలామంది మేగజీన్లలో మంచి మంచి ట్రావెల్ ఫొటోలు చూసి అంతటితో సంతృప్తి పడతారు. నా అదృష్టం... నేను ఆ చోట్లకంతా వెళ్లాను’ అంటుందామె. బెంగళూరుకు చెందిన సుధా మహాలింగంకు చెన్నైతో కూడా అనుబంధం ఉంది. ఆమె భర్త సివిల్ సర్వీసెస్‌లో పని చేసి రిటైర్ అయ్యాడు. 25 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుధ ‘అందరూ చెప్పేటటువంటి తీర్చిదిద్దేటటువంటి’ జీవితాన్నే ఆ తర్వాతి 25 ఏళ్లు జీవించింది. 50వ ఏట వరకూ ఆమె కూడా ట్రావెల్ మేగజీన్లు చూస్తూ గడిపింది. అదనంగా చేసిన పని ఏదైనా ఉంటే భర్త టూర్లు వెళ్లినప్పుడు తోడు వెళ్లడమే. కాని ఒకసారి ఒక విశేషం జరిగింది. భర్తకు ఆఫీస్ పని మీద స్వీడన్లో రెండు నెలలు ఉండాల్సి వచ్చింది. తోడు వెళ్లిన సుధకు అక్కడ ఖాళీగా ఉండటం బోరు కొట్టింది. ‘నేను ఒక్కదాన్నే ఫిన్లాండ్కు ఒక షిప్లో వెళ్లాను. అక్కడి నుంచి నార్వేకు ట్రైన్లో వెళ్లాను. అక్కడి నుంచి డెన్మార్క్, బెర్లిన్ తిరిగి మళ్లీ స్వీడన్ చేరుకున్నాను. భలే అనిపించింది’ అంటుంది సుధ. కాని ఆమె కాలి కింద చక్రాలు ఏర్పడటానికి 2003 రావాల్సి వచ్చింది. అంతకు రెండేళ్ల ముందు ఆమె ఎనర్జీ రంగాన్ని అధ్యయనం చేసి ఎనర్జీ (ఇంధన శక్తి) ఎక్స్‌పర్ట్‌గా మారింది. ‘ఆ సమయంలో ఆ రంగంలో ఎవరూ ఎక్స్‌పర్ట్‌లు లేరు. దాంతో నాకు దేశవిదేశాల నుంచి కాన్ఫరెన్స్‌లకు ఆహ్వానాలు రాసాగాయి. 2003లో కిర్గిస్తాన్ వెళ్లాను ఒక్కదాన్నే. అక్కడి నుంచి ఉజ్బెకిస్తాన్ వెళ్లాను. ఒక్కదాన్నే తిరగడంలో ఆనందం అర్థమైంది. ఇక నేను ఆగలేదు. నా భ్రమణ జీవితం నా 50వ ఏట మొదలైంది’ అంటుంది సుధా నాగలింగం. సుధకు ఇద్దరు కొడుకులు. వాళ్లు ఎప్పుడూ తల్లికి మద్దతే. ‘నీ ఇష్టం వచ్చినట్టు లోకం చూడమ్మా. కాని సేఫ్‌గా ఉండు’ అంటారు. కాని భర్త సంప్రదాయవాది. ‘ఆయన నేను ఎక్కడకు వెళ్లానో తెలిస్తే కంగారు పడతారు. అందుకని ఎక్కడికో చెప్పను. వచ్చాక నా ప్రయాణ అనుభవాలు బ్లాగ్‌లో రాస్తే చదువుకుంటారు. వచ్చేశాక ఏం భయం’ అని నవ్వుతుందామె. స్త్రీగా ఉంటూ ఒంటరిగా తిరుగుతూ 50 ఏళ్లు పైబడ్డాక ఇన్ని పర్యటనలు చేయడం సుధా నాగలింగంకే చెల్లిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె నేపాల్ మీదుగా ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ అధిరోహణ చేసింది. ఆస్ట్రేలియాలో డీప్ సీ డైవింగ్ చేసింది. ఆ దేశంలోని ‘ఉలురు’లో స్కైడైవింగ్ కూడా చేసింది. ఆకాశంలో ఇన్స్ట్రక్టర్ సహాయంతో దూకినప్పుడు ఆమె వయసు 66 సంవత్సరాలు. ‘నా ప్రయాణాల్లో అనుకోనివి ఎన్నో జరిగాయి. నైరోబీ ఎయిర్పోర్ట్ లో ఎల్లో ఫీవర్ వాక్సినేషన్ లేదని నన్ను ఆపేశారు. చైనాలో వెజిటేరియన్ రెస్టరెంట్ వెతకలేక ఆకలి తో నకనకలాడాను. చెక్ రిపబ్లిక్ లో వాలిడ్ వీసా లేదని చాలా హంగామా చేశారు. ఇరాన్లో ఒక చారిత్రక కట్టడం చూస్తుంటే నేను లోపల ఉన్నానన్న సంగతి మరచి సిబ్బంది తాళం వేసుకు వెళ్లిపోయారు. ఇన్ని జరిగినా చివరకు మనుషులు తోడు నిలిచారు. ప్రయాణాలు సాటి మనుషుల మీద విశ్వాసాన్ని పెంచుతాయి అని తెలుసుకున్నాను’ అంటుందామె. ‘నేను తిరిగిన అన్నీ దేశాల్లోకెల్లా ఇరాన్లో స్త్రీలు ఒంటరిగా చాలా సేఫ్‌గా తిరగొచ్చు అని తెలుసుకున్నాను.’ అంటుందామె. ఇరాక్‌ను కూడా చుట్టేసింది. ‘సాధారణంగా కొత్త ప్రాంతాల్లో తిరుగుతుంటే స్థానికులు ఆకర్షణీయంగా ఉండే స్త్రీలను చూస్తారు. గమనిస్తారు. కాని నా వయసు, మామూలు దుస్తులు నా మీద అటెన్షన్ పడేలా చేయవు. అందుకే నేను స్వేచ్ఛగా అన్నీ ఆస్వాదిస్తాను’ అంటుందామె. ‘ఇండోనేషియాలో రెయిన్ ఫారెస్ట్‌లో పది రోజులు ఉన్నాను. అక్కడ మోకాలు లోతున ఆకులు రాలిపడి ఉంటాయి. వాతావరణం అనూహ్యంగా ఉంటుంది. వేరెవరైనా సరే భయపడతారు. కాని నేను మాత్రం ప్రకృతి ఎంత చిక్కగా ఉంటుందో అక్కడే చూడగలిగాను. ఏ మలినం లేని ప్రకృతి అది’ అంటుంది సుధ. ఆమె ఇకపై ఆఫ్రికా ఖండం చుట్టాలనుకుంది. అక్కడ ఏ అనుభవాలు మూటకట్టుకోనుందో. ‘పెళ్లి.. పిల్లలు.. కెరీర్– ఉంటాయి. కాని ఇవి మాత్రమే జీవితం కాదు. మన జీవితంలో ఎన్నో జీవితాలు జీవించాలి. ప్రయాణాలు ఒక అవసరమైన జీవితం. అద్భుత జీవితం. జీవిస్తేనే అందులోని గొప్పతనం తెలుస్తుంది’ అంటుందామె. ఆమె మాటలు విని, కదిలే అదృష్టం ఎందరిదో. -
కరోనా ఎఫెక్ట్: పెళ్లి ఆలోచన పెరిగింది..
కెరీర్‌పై మోజుతో పెళ్లి వాయిదా వేస్తూ చివరకు బ్రహ్మచారులుగా మిగిలిపోయేవారు కొందరైతే.. వివాహం చేసుకుని విడాకులు తీసుకుని ఒంటరిగా మారేవారు మరికొందరు. ఇంకా మరెన్నో కారణాలతో సిటీలైఫ్‌లో ఒంటరి జీవితాలు సర్వసాధారణంగా మారాయి. అయితే.. వీరి ఆలోచనల్లో కరోనాతో మార్పు వచ్చిందా? జంటగా మారడమే మేలు అనే అభిప్రాయం తెచ్చిందా? అంటే అవుననే అంటున్నారు మ్యారేజీ బ్యూరోల ప్రతినిధులు, సైకాలజిస్ట్‌లు. – సాక్షి, సిటీబ్యూరో కరోనా సమయంలో ప్రపంచం అంతా తలుపులు మూసుకున్న పరిస్థితుల్లో అన్ని వేడుకలూ, కార్యక్రమాలూ అర్ధంతరంగా ఆగిపోయాయి. అన్నింటి కన్నా పెళ్లి వేడుకలపై కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. లాక్డౌన్ టైమ్‌లో ముహూర్తాలన్నీ మూలనపడ్డాయి. ఈ ఏడాది అత్యల్ప సంఖ్యలోనే పెళ్లిళ్లు జరిగాయి. ఇది అందరికీ తెలిసిన సంగతే. అయితే.. దీనిలో మరో కొత్త కోణం ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తోంది. ఇప్పటిదాకా ఒంటరి ఉన్న వ్యక్తుల్లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి ఆలోచన పెరిగిందనేదే ఈ కొత్త కోణం. దీనికి కారణాలు చూస్తే.. లాక్డౌన్లో.. లోన్లీనెస్ కరోనా కారణంగా అన్ని కార్యకలాపాలూ స్తంభించడంతో.. అందరూ ఇళ్లలోనే ఎన్నడూ లేనంత ఎక్కువ సమయం గడిపారు. కొన్ని నెలల పాటు ఇంట్లో ఒంటరిగా గడపడంతో సింగిల్స్‌కి అదెంత కష్టమైన పనో అర్థమైంది. కేవలం ఫోన్ల ద్వారా తప్ప స్నేహితులను, బంధువులను నేరుగా కలవడానికి వీలు లేకుండాపోయింది. అప్పటిదాకా తీరికలేని పనులతోనో, ఇష్టమైన వ్యాపకాలతోనో తమలోని ఒంటరితనాన్ని దూరం చేసుకున్న సింగిల్స్.. కరోనా సమయంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ‘ఏ పనీ లేకుండా నాలుగ్గోడల మధ్య చిక్కుకుపోతే గానీ ఒంటరి బతుకెంత కష్టమనేది తెలిసిరాలేదు’ అని గుర్తు చేసుకున్నారు ఖైరతాబాద్‌లోని వెంకటరమణ కాలనీ నివాసి రవి. పోస్టింగ్స్.. టెస్టింగ్స్.. కుటుంబం అంతా ఒక చోట ఉన్నప్పటికీ వ్యక్తిగత వ్యాపకాలు, బిజీబిజీ పనులతో ఎవరికివారే యమునా తీరే అన్నట్టు ఉండటం నగర జీవితంలో సహజమే. వారాంతాల్లోనో మరో హాలీడే రోజునో మాత్రమే ఫ్యామిలీ మొత్తం కలిసి గడపడం జరుగుతుంటుంది. అలా ఉన్నప్పటికీ తమకంటూ మరొకరో, మరికొందరో ఉన్నారనే భరోసా వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ భరోసా లేని సింగిల్స్.. పరిచయస్థులు, స్నేహితుల మధ్య గడపడం లేదా ఇష్టమైన అభిరుచులను ఆస్వాదించడంలో బిజీ అయిపోయి ఆ లోటును మర్చిపోతుంటారు. అది లాక్డౌన్ టైమ్‌లో సాధ్యపడలేదు. మరోవైపు లాక్డౌన్ టైమ్‌లో ఫ్యామిలీస్ అంతా కలిసి గడపడం, అందులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ కలిసి ఆట పాటలు, వంటలు చేసుకోవడం, గార్డెనింగ్ వంటి పనులతో ఎంజాయ్ చేయడం.. పైగా వాటిని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకోవడం.. గమనిస్తూ వచి్చన సింగిల్స్ తాము ఏం కోల్పోతున్నామనేది సోషల్ మీడియా గుర్తు చేసింది. ‘లాక్డౌన్ టైమ్‌లో సిస్టమ్‌కి నన్ను నేను కట్టి పడేసుకున్నా. అయినా ఫ్యామిలీస్ పోస్ట్ చేసే పోస్టులు, ఫొటోలు నేను మిస్సవుతున్న వాటిని పదే పదే గుర్తుచేసి నన్ను కొంత బలహీనంగా మార్చిన మాట వాస్తవమే’నన్నారు బేగంపేట నివాసి దేవి. సీనియర్స్‌లో మరింతగా.. పెద్ద వయసులో ఒంటరిగా ఉండేవాళ్లు ఈ కరోనా టైమ్‌లో చాలా రకాల భయాలకు గురవుతున్నారు. ఒంటరితనంతో పాటు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయేమోననే ఆందోళన వీరిని ఏదో ఒక తోడు వెతుక్కునేందుకు పురిగొల్పుతోంది. కరోనా సమయంలో ఒంటరిగా ఉండటం వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందుల్ని చెబుతూ తోడు కోసం మమ్మల్ని ఈ విషయంలో సంప్రదించేవారి సంఖ్య పెరిగింది. – రాజేశ్వరి, ‘తోడునీడ’ -
ఒంటరిగా ఉండలేను!
ఒక మంచి కాఫీ తాగుతున్నప్పుడు పక్కనే నచ్చినవాళ్లు ఉంటే, కాఫీ సిప్ చేస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. అది తియ్యని అనుభూతినిస్తుంది. అలాగే, మనసుకి నచ్చినవాళ్లతో ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది. కానీ, కొంతమంది ఒంటరి ప్రయాణాలను ఇష్టపడతారు. మరి... రకుల్ ప్రీత్‌సింగ్ సోలో జర్నీని ఇష్టపడతారా? లేక సో మెనీ పీపుల్‌తో ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారా? ఇదే విషయం గురించి ఆమె దగ్గర ప్రస్తావిస్తే... ‘‘ఒంటరి ప్రయాణం నా వల్ల కాదండి బాబూ’’ అన్నారు. ఇంకా రకుల్ మాట్లాడుతూ - ‘‘నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. షూటింగ్‌ల కోసం రకరకాల ప్రదేశాలకు వెళ్లినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను. కానీ, ఒంటరిగా వెళ్లడం ఇష్టం ఉండదు. ఒకవేళ ఒంటరిగా వెళితే, నేను తిరిగి రానేమో..? అక్కడే చచ్చిపోతానేమో! నాకు జనాల మధ్య ఉండడం ఇష్టం. ఒకే గదిలో ఫ్రెండ్స్ మధ్య ఉండమంటే హ్యాపీగా ఉంటాను. అదే గనక ఒంటరిగా ఎంత అందమైన ప్రదేశానికి పంపించినా హ్యాపీగా ఉండలేను. సోలో జర్నీ సో బోరింగ్’’ అన్నారు. దీన్నిబట్టి రకుల్‌ది నలుగురితో కలిసిపోయే మనస్తత్వం అని అర్థమవుతోంది కదూ!