ఒంటరిగా ఉండలేను! | Rakul Preet Singh Can not alone! | Sakshi
Sakshi News home page

ఒంటరిగా ఉండలేను!

Published Fri, Feb 26 2016 10:49 PM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

ఒంటరిగా ఉండలేను!

ఒంటరిగా ఉండలేను!

ఒక మంచి కాఫీ తాగుతున్నప్పుడు పక్కనే నచ్చినవాళ్లు ఉంటే, కాఫీ సిప్ చేస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. అది తియ్యని అనుభూతినిస్తుంది. అలాగే, మనసుకి నచ్చినవాళ్లతో ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది. కానీ, కొంతమంది ఒంటరి ప్రయాణాలను ఇష్టపడతారు. మరి... రకుల్ ప్రీత్‌సింగ్ సోలో జర్నీని ఇష్టపడతారా? లేక సో మెనీ పీపుల్‌తో ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారా? ఇదే విషయం గురించి ఆమె దగ్గర ప్రస్తావిస్తే... ‘‘ఒంటరి ప్రయాణం నా వల్ల కాదండి బాబూ’’ అన్నారు. ఇంకా రకుల్ మాట్లాడుతూ - ‘‘నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం.

షూటింగ్‌ల కోసం రకరకాల ప్రదేశాలకు వెళ్లినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను. కానీ, ఒంటరిగా వెళ్లడం ఇష్టం ఉండదు. ఒకవేళ ఒంటరిగా వెళితే, నేను తిరిగి రానేమో..? అక్కడే చచ్చిపోతానేమో! నాకు జనాల మధ్య ఉండడం ఇష్టం. ఒకే గదిలో ఫ్రెండ్స్ మధ్య ఉండమంటే హ్యాపీగా ఉంటాను. అదే గనక ఒంటరిగా ఎంత అందమైన ప్రదేశానికి పంపించినా హ్యాపీగా ఉండలేను. సోలో జర్నీ సో బోరింగ్’’ అన్నారు. దీన్నిబట్టి రకుల్‌ది నలుగురితో కలిసిపోయే మనస్తత్వం అని అర్థమవుతోంది కదూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement