‘ఏర్ గిటార్ కాంపిటేషన్’ పేరు వింటేనే అర్థం అవుతుంది గాలిలో గిటార్ వాయించడమని. బ్యాక్ గ్రౌండ్‌లో మెటాలిక్ గిటార్ సంగీతం హోరెత్తుతుంటే దానికి అనుగుణంగా ‘ఏర్ గిటార్ కాంపిటేటర్’ తానే నిజంగా గిటార్ వాయిస్తున్నట్లు గాలిలో చేతులు, వేళ్లూ కదుపుతూ, అనుగుణంగా అడుగులేస్తూ రెచ్చిపోవాలి. ప్రేక్షకులను ఉర్రూతలూగించాలి. అదెంత పని అని అనుకోవద్దు! గాలిలో గిటార్ వాయించడానికి కూడా ఎంతో అనుభవం కావాలి.