World Championships
-
నిరాశ పరిచిన ఎల్డోజ్ పాల్.. తొమ్మిదో స్థానంలో నిలిచి..
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆదివారమే జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో భారత ప్లేయర్ ఎల్డోజ్ పాల్ నిరాశపరిచాడు. కేరళకు చెందిన పాల్ 16.79 మీటర్ల దూరం గెంతి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల రిలే హీట్స్‌ను మొహమ్మద్ అనస్ యాహియా, మొహమ్మద్ అజ్మల్, నాగనాథన్ పాండి, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం 3ని:07.29 సెకన్లలో పూర్తి చేసి ఆరో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందలేకపోయింది. చదవండి: వచ్చేసారి మరింత మెరుగ్గా రాణిస్తా.. బంగారు పతకమే నా టార్గెట్: నీరజ్ చోప్రా -
బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన నిర్ణయం
Mary Kom To Skip World Championships And Asian Games: ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. యువ తరానికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌తో పాటు ఆసియా క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరగబోయే కామన్వెల్త్ గేమ్స్‌పై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ మేరకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ)కి లేఖ ద్వారా తెలియజేసింది. మేరీ కోమ్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ తెలిపారు. కాగా, ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ ఈ ఏడాది మే 6 నుంచి 21 వరకు టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరగనున్నాయి. అలాగే, జులై 28 నుంచి కామన్వెల్త్ క్రీడలు, సెప్టెంబరు 10 నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. చదవండి: IPL2022: సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. రాజస్థాన్ రాయల్స్‌తో మొదలై..! -
కిడాంబి శ్రీకాంత్‌కు ప్రధాని అభినందన
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో రజతం నెగ్గిన స్టార్ షట్లర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘శ్రీకాంత్‌కు అభినందనలు. రజతంతో చరిత్రకెక్కావు. నీ విజయం మరెంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Congratulations to @srikidambi for winning a historic Silver Medal. This win will inspire several sportspersons and further interest in badminton. https://t.co/rxxkBDAwkP— Narendra Modi (@narendramodi) December 20, 2021 కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను నెగ్గే సువర్ణావకాశాన్ని తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో 15వ సీడ్ శ్రీకాంత్ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్ కెరీర్లో తొలి టైటిల్ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు రజతాలు గెలిచిన సింధు.. 2019లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. -
BWF World Championships 2021 Finals: పోరాడి ఓడిన శ్రీకాంత్..
హుఎల్వా (స్పెయిన్): వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను నెగ్గే సువర్ణావకాశాన్ని తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 15వ సీడ్ శ్రీకాంత్ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్ కెరీర్లో తొలి టైటిల్ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు రజతాలు గెలిచిన సింధు.. 2019లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా యశ్ దుల్, ఆంధ్రా కుర్రాడికి వైస్ కెప్టెన్సీ -
వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నీలో దూసుకుపోతున్న సింధు..
PV Sindhu: స్పెయిన్‌లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021లో తెలుగు తేజం, డిఫెండింగ్ ఛాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన పాన్పావీ చోచువాంగ్‌తో గురువారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 21-14, 21-18 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సింధు తన తదుపరి మ్యాచ్‌లో(క్వార్టర్స్) చైనీస్ తైపీ క్రీడాకారిణి టైజు యింగ్‌తో తలపడనుంది. చదవండి: విరాట్‌లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
మూడో రౌండ్లోకి దూసుకెళ్లిన సింధు.. 24 నిమిషాల్లో ఖేల్ ఖతం
PV Sindhu: స్పెయిన్‌లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021లో తెలుగు తేజం, డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో స్లోవేకియాకి చెందిన మార్టినా రెపిస్కాను 21-7, 21-9 తేడాతో వరుస సెట్లలో చిత్తుగా ఓడించిన సింధు.. తొలి సెట్‌ను 10 నిమిషాల్లో, మ్యాచ్‌ను 24 నిమిషాల్లో ఖతం చేసింది. ఈ మ్యాచ్‌లో సింధు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించడంతో ప్రత్యర్ధి రెపిస్కా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కాగా, ఈ టోర్నీలో సింధు సహా కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్‌లు కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. చదవండి: లంక ప్రీమియర్ లీగ్‌లో కోహ్లి.. శ్రీలంక క్రికెటర్ మనసులో మాట..! -
కొత్త శిఖరాలకు...
ఒకప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడమే ఘనతగా భావించే భారత క్రీడాకారులు ఇప్పుడు ఏకంగా పతకాలు కొల్లగొడుతున్నారు. క్రీడల్లో అగ్రరాజ్యాల ఆటగాళ్లకు దీటుగా తమ ప్రదర్శన ఇస్తున్నారు. ఆశల పల్లకీని మోస్తూ అసలు సమరంలోనూ ఔరా అనిపిస్తున్నారు. విశ్వ వేదికపై భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది భారత క్రీడారంగం కొత్త శిఖరాలకు చేరింది. బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజం పీవీ సింధు విశ్వవిజేతగా అవతరించి గతంలో ఏ భారత షట్లర్కూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. బాక్సింగ్‌లో అమిత్ పంఘాల్, మనీశ్ కౌశిక్ రజత, కాంస్య పతకాలు గెలిచి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒకేసారి భారత్‌కు రెండు పతకాలు అందించారు. షట్లర్లు, బాక్సర్లకు తోడుగా షూటర్లు, రెజ్లర్లు, ఆర్చర్లు కూడా అత్యున్నత వేదికపై అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఈ సంవత్సరం అదరగొట్టిన భారత క్రీడాకారులు వచ్చే ఏడాది విశ్వ క్రీడా సంరంభం టోక్యో లింపిక్స్లోనూ తమ అది్వతీయ విజయ విన్యాసాలను పునరావృతం చేయాలని ఆకాంక్షిద్దాం... ఆశీర్వదిద్దాం..! సాక్షి క్రీడావిభాగం విజయాల బాటలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ... తమకంటే మెరుగైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ... ఈ ఏడాది భారత క్రీడాకారుల ప్రస్థానం సాగింది. ఈ క్రమంలో మనోళ్లు కొత్త రికార్డులు సృష్టించారు. భవిష్యత్‌పై కొత్త ఆశలు రేకెత్తించారు. మెరుపుల్లేని టెన్నిస్ రాకెట్... ఈ సంవత్సరం భారత టెన్నిస్‌కు గొప్ప ఫలితాలేవీ రాలేదు. పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించినా... ఒక్క దాంట్లోనూ తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. యూఎస్ ఓపెన్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో భారత యువతార సుమీత్ నాగల్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్ ఆడాడు. ఫెడరర్‌పై తొలి సెట్ గెలిచిన సుమీత్ ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు కోల్పోయి ఓడిపోయాడు. డబుల్స్‌లో దివిజ్ శరణ్ రెండు ఏటీపీ టోర్నీ టైటిల్స్ (పుణే ఓపెన్, సెయిట్ పీటర్స్బర్గ్ ఓపెన్) సాధించగా... రోహన్ బోపన్న (పుణే ఓపెన్) ఒక టైటిల్ గెలిచాడు. భారత దిగ్గజం, 46 ఏళ్ల లియాండర్ పేస్ 19 ఏళ్ల తర్వాత ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–100 నుంచి బయటకు వచ్చాడు. తటస్థ వేదిక కజకిస్తాన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా మ్యాచ్‌లో భారత్ 4–0తో గెలిచి వచ్చే ఏడాది వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధించింది. ‘పట్టు’ పెరిగింది... ఈ ఏడాది రెజ్లింగ్‌లో భారత్‌కు మంచి ఫలితాలు లభించాయి. కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు ఏకంగా ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు), రాహుల్ అవారే (61 కేజీలు) కాంస్యాలు గెలుపొందగా... దీపక్ పూనియా (86 కేజీలు) రజతం సాధించాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) కాంస్య పతకం దక్కించుకుంది. ప్రపంచ జూనియర్ చాంపియన్íÙప్లో దీపక్ పూనియా (86 కేజీలు) స్వర్ణం నెగ్గి 18 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌లోని ఓ విభాగంలో భారత్‌కు పసిడి పతకం అందించిన రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. ఈ సంవత్సరం ఉత్తమ ప్రపంచ జూనియర్ రెజ్లర్‌గా కూడా దీపక్ పూనియా ఎంపిక కావడం విశేషం. సస్పెన్షన్ ఉన్నా... భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అంతర్గత రాజకీయాల కారణంగా ప్రపంచ ఆర్చరీ సంఘం భారత్‌పై సస్పెన్షన్ విధించింది. దాంతో భారత ఆర్చర్లు భారత పతాకం కింద కాకుండా ప్రపంచ ఆర్చరీ సంఘం పతాకంపై పోటీ పడాల్సి వచి్చంది. జూన్‌లో నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్ బృందం రికర్వ్ టీమ్ విభాగంలో రజతం నెగ్గడంతోపాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇదే ఈవెంట్ కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్íÙప్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్లో దీపిక కుమారి మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను సంపాదించింది. జగజ్జేత... గత పదేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తమదైన ముద్ర వేస్తున్న భారత షట్లర్లు ఈసారి అద్భుతమే చేశారు. పూసర్ల వెంకట (పీవీ) సింధు రూపంలో భారత బ్యాడ్మింటన్‌కు తొలిసారి ప్రపంచ చాంపియన్ లభించింది. ఆగస్టులో స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు మహిళల సింగిల్స్ విభాగంలో విశ్వవిజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఇక పురుషుల సింగిల్స్‌లో మరో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ప్రకాశ్ పదుకొనే (1983లో) తర్వాత ప్రపంచ చాంపియన్íÙప్ పురుషుల సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన భారత క్రీడాకారుడిగా సాయిప్రణీత్ ఘనత వహించాడు. వీరిద్దరి ప్రతిభ కారణంగా 42 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలిసారి మహిళల, పురుషుల సింగిల్స్ విభాగాల్లో పతకాలు లభించాయి. ప్రపంచ చాంపియన్íÙప్లో ప్రదర్శనను మినహాయిస్తే వరల్డ్ టూర్ సూపర్ టోర్నమెంట్లలో ఈసారి భారత అగ్రశ్రేణి క్రీడాకారులెవరూ ఆకట్టుకోలేకపోయారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట థాయ్‌లాండ్ ఓపెన్‌లో టైటిల్ సాధించి మేటి జోడీకి ఉండాల్సిన లక్షణాలు తమలో ఉన్నాయని చాటిచెప్పింది. సీజన్ చివర్లో యువతార లక్ష్య సేన్ ఐదు సింగిల్స్ టైటిల్స్ సాధించి ఊరటనిచ్చాడు. ఏడాది ఆరంభంలో జరిగిన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో బెంగళూరు రాప్టర్స్ జట్టు టైటిల్ దక్కించుకుంది. ఫైనల్లో బెంగళూరు 4–3తో ముంబై రాకెట్స్‌పై గెలిచింది. మరింత ‘ఎత్తు’కు... భారత చెస్‌కు ఈ ఏడాది కలిసొచ్చింది. ఈ సంవత్సరం ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందారు. ఈ జాబితాలో విశాఖ్ (తమిళనాడు), గుకేశ్ (తమిళనాడు), ఇనియన్ (తమిళనాడు), స్వయమ్స్ మిశ్రా (ఒడిశా), గిరిశ్ కౌశిక్ (కర్ణాటక), ప్రీతూ గుప్తా (ఢిల్లీ) ఉన్నారు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయస్సులో డి.గుకేశ్ గ్రాండ్‌మాస్టర్ హోదా పొంది భారత్ తరఫున ఈ ఘనత సాధించిన పిన్న వయసు్కడిగా... ప్రపంచంలో రెండో పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 2002లో సెర్గీ కర్యాకిన్ (రష్యా) 12 ఏళ్ల 10 నెలల వయస్సులో జీఎం హోదా సాధించాడు. ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టూర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రష్యా గ్రాండ్‌ప్రిలో టైటిల్ సాధించి... మొనాకో గ్రాండ్‌ప్రిలో రన్నరప్‌గా నిలిచింది. ‘పంచ్’ అదిరింది... బాక్సింగ్‌లోనూ ఈ సంవత్సరం భారత క్రీడాకారులు అదరగొట్టారు. రష్యాలో జరిగిన పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్íÙప్లో అమిత్ పంఘాల్ (52 కేజీలు) రజతం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బాక్సర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. మనీశ్ కౌశిక్ (63 కేజీలు) కాంస్యం గెలవడంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కు తొలిసారి ఒకేసారి రెండు పతకాలు లభించాయి. సీనియర్ మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు పతకాలు దక్కాయి. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు)తోపాటు జమునా బోరో (54 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) కాంస్యాలు సాధించగా... మంజు రాణి (48 కేజీలు) రజత పతకం గెల్చుకుంది. సూపర్ ‘గురి’... షూటింగ్లో మనోళ్లు గురి చూసి పతకాల పంట పండించారు. ఫిబ్రవరిలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అపూర్వీ చండేలా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో... సౌరభ్ చౌధరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రపంచ రికార్డులు సృష్టించి పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సౌరభ్–మను భాకర్ జోడీ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఏప్రిల్‌లో చైనాలో జరిగిన రెండో ప్రపంచకప్ టోర్నీలోనూ భారత షూటర్లు మెరిశారు. మూడు స్వర్ణాలు, ఒక రజతం సాధించి ‘టాప్’ ర్యాంక్‌ను సంపాదించారు. ఆసియా చాంపియన్íÙప్లోనూ భారత షూటర్లు అదుర్స్ అనిపించారు. ఓవరాల్‌గా ఈసారి భారత్ నుంచి అత్యధికంగా 15 మంది షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. చలాకీ... హాకీ సొంతగడ్డపై జరిగిన టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తమ ప్రత్యర్థులను ఓడించిన భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్ బెర్త్‌లను సంపాదించాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో రష్యాపై భారత పురుషుల జట్టు... అమెరికాపై భారత మహిళల జట్టు గెలుపొందాయి. అంతకుముందు సీజన్ ఆరంభంలో భారత పురుషుల జట్టు అజ్లాన్ షా హాకీ టోరీ్నలో రన్నరప్‌గా నిలిచింది. అదే మందగమనం... ‘ఆసియా’ స్థాయి మినహాయిస్తే అంతర్జాతీయంగా భారత అథ్లెట్స్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చే సత్తా ఉన్న అథ్లెట్స్‌గా నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), హిమ దాస్ (మహిళల 400 మీటర్లు)లపై భారీ ఆశలు పెట్టుకున్నా వారిద్దరూ గాయాల బారిన పడ్డారు. సెపె్టంబర్లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్‌కు దూరమయ్యారు. ఇటలీలో జూలైలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో ద్యుతీ చంద్ మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. అయితే ప్రపంచ చాంపియన్íÙప్లో ద్యుతీ చంద్ విఫలమైంది. ఆమె హీట్స్ దాటి ముందుకెళ్లలేకపోయింది. ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్ అర్హత సమయాన్ని (11.15 సెకన్లు) ఆమె అందుకోలేకపోయింది. దీటుగా... టీటీ... టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ సత్యన్ జ్ఞానశేఖరన్ అద్భుత పురోగతి సాధించాడు. ఈ ఏడాది అతను ప్రపంచ టాప్–20 ర్యాంకింగ్స్‌లోని పలువురు ఆటగాళ్లను ఓడించాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 24వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ తరఫున పురుషుల సింగిల్స్ ఆటగాడు ఐటీటీఎఫ్ టాప్–25 ర్యాంకింగ్స్‌లో రావడం ఇదే ప్రథమం. సత్యన్, శరత్ కమల్, హర్మీత్ దేశాయ్‌లతో కూడిన భారత జట్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకుంది. -
సెమీస్‌కు చేరిన పీవీ సింధు
బాసెల్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై ఆమె 12-21, 23-21, 21-19 తేడాతో గెలుపొందింది. కాగా నిన్న జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఆమె 21–14, 21–6తో తొమ్మిదో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై అలవోక విజ యాన్ని సాధించిన విషయం తెలిసిందే. -
ఉర్రూతలూగించే ‘ఏర్ గిటార్’
-
ఉర్రూతలూగించే ‘ఏర్ గిటార్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఏర్ గిటార్ కాంపిటేషన్’ పేరు వింటేనే అర్థం అవుతుంది గాలిలో గిటార్ వాయించడమని. బ్యాక్ గ్రౌండ్లో మెటాలిక్ గిటార్ సంగీతం హోరెత్తుతుంటే దానికి అనుగుణంగా ‘ఏర్ గిటార్ కాంపిటేటర్’ తానే నిజంగా గిటార్ వాయిస్తున్నట్లు గాలిలో చేతులు, వేళ్లూ కదుపుతూ, అనుగుణంగా అడుగులేస్తూ రెచ్చిపోవాలి. ప్రేక్షకులను ఉర్రూతలూగించాలి. అదెంత పని అని అనుకోవద్దు! గాలిలో గిటార్ వాయించడానికి కూడా ఎంతో అనుభవం కావాలి. అలాంటి వారి కోసం ప్రతియేటా ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు కూడా జరుగుతున్నాయని తెలిస్తే కించిత్తైన ఆశ్చర్యం కలగకమానదు. ఫిన్లాండ్లోని ఒవులూ నగరంలో ప్రతిఏటా ఆగస్టు నెలలో ‘గాలిలో గిటారు ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. వీటికి ప్రపంచంలోని 20 దేశాల నుంచి ఛాంపియన్లు హాజరవుతున్నారు. వాటిలో భారత్ కూడా ఉండడం విశేషం. ముంబైలోని ‘ఏర్ గిటార్ ఇండియా’ సంస్థ ప్రతి ఏటా జాతీయ ఏర్ గిటార్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించి అందులో గిలిచిన వారిని ఫిన్లాండ్ పోటీలకు పంపిస్తోంది. వారి ఖర్చులను పూర్తిగా భరిస్తుంది. దేశంలోని పలు నగరాల్లో ఎంపిక ప్రక్రియను సాధారణంగా జూన్, జూలై నెలల్లో నిర్వహిస్తుంది. తుది పోటీలు ముంబైలోనే జరుగుతాయి. ఫిన్లాండ్లో మొదటిసారి 1996లో ఏర్ గిటార్ పోటీలు నిర్వహించారు. అప్పుడు ‘ఒవులూ మ్యూజిక్ వీడియో ఫెస్టివల్’లో భాగంగా దీన్ని నిర్వహించారు. నాటి నిర్వాహకులు సరదాగా ఆ పోటీలను ‘ఏర్ గిటార్ వరల్డ్ ఛాంపియన్షిప్’ అని అభివర్ణించారు. ఈ పోటీల గురించి విన్న అమెరికాలోని ఔత్సాహికులు 2003లో ఓ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఫిన్లాండ్, అమెరికా బృందాల సంయుక్త కృషితో ఆ సంవత్సరం నుంచే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈసారి జరగబోతున్నది 17వ ఛాంపియన్షిప్ పోటీలు. 2006లో అమెరికాలో విడుదలైన ‘ఏర్ గిటార్ నేషన్’ డాక్యుమెంటరీ, ‘టూ ఏర్ ఈజ్ హ్యూమన్’ అనే చిత్రం ద్వారా ఈ పోటీలకు ప్రాముఖ్యత పెరిగింది. ఏర్ గిటార్ ఛాంపియన్షిప్ కోసం తపించిపోయే జర్నలిస్ట్ డాన్క్రేన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘టూ ఏర్ ఈజ్ హ్యూమన్’ చిత్రాన్ని నిర్మించారు. అప్పటి నుంచి కుర్రకారులో క్రేజీ పెరిగిపోవడంతో అమెరికాలో కూడా జాతీయ ఏర్ గిటార్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆదరణ పెరిగింది. ఫోనోగ్రామ్తోనే పుట్టుక పాశ్చాత్య దేశాల్లో 1950లోనే ఈ కళ పుట్టగా 1980 ప్రాంతంలో బాగా రాణించింది. నాటి గ్రామ్‌ఫోన్, నేటి ఫోనోగ్రామ్ రాజ్యమేలుతున్న కాలంలో సంగీతానికి అనుగుణంగా పెదాలు ఆడించడం, చేతులు కలపడం, అడుగులు వేస్తూ చిందులు తొక్కడం నుంచి ఈ కళ పుట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. 1980 ప్రాంతంలో ప్రేక్షకులను మరింత అలరించడం కోసం పాశ్చాత్య సంగీత కచేరీల్లో కూడా ఈ కళను ప్రవేశపెట్టారు. ఓ పక్క కచేరీ కళాకారులు నిజమైన గిటార్ వాయిస్తూ, పాడుతూ ఉంటే పక్కనే ఉండే పెదవులు ఆడించే కళాకారులు, గాలి గిటారిస్టులు సంగీతానికి అనుగుణంగా చిందులేస్తూ రెచ్చిపోయేవారు. గొంతుతో పాడేవారు, నిజమైన గిటారుతో వాయించేవారు అంతగా ఎగరలేరు, దూకలేరు కనుక వీరి అవసరం పడింది. ఒకసారి గాలిలో గిటారు వాయిస్తే, మరోసారి పియానో, వాయించడం, మరో సారి డ్రమ్స్ కొట్టినట్లు నటించడం, అన్నీ కలిపి ఒక్కరే నటించడం లాంటి ప్రయోగాలు కూడా వచ్చాయి. నిజమైన కచేరీల్లోనూ నటన 1957లో అమెరికాలో జరిగిన స్టీవ్ అలెన్ షో, 1969లో వుడ్‌స్టాక్‌లో జో కాకర్ కచేరీలో వీరి ప్రదర్శన కనిపిస్తుంది. 20వ శతాబ్దంలో జిమ్మీ హెడ్రిక్స్, జిమ్మీ పేజ్, ఎడ్డీవాన్ హాలెన్, రిక్ నీల్సన్, లీటా ఫోర్డ్ లాంటి రాక్, పాప్ స్టార్లు ఈ గాలి గిటారిస్టులతో కలిసి కచేరీలు నిర్వహించారు. ‘సిండర్ఫెల్లా, బిల్ అండ్ టెడ్స్ ఎక్సలెంట్ అడ్వెంచర్, రిస్కీ బిజినెస్’ లాంటి హాలివుడ్ చిత్రాల్లో కామిక్ పాత్రల్లో గాలి గిటారిస్టులు కనిపిస్తారు. అమెరికాలోని జాన్ మ్యాకెన్నా, మైఖేల్ మోఫిట్ 1983లో రాసిన ‘ది కంప్లీట్ ఏర్ గిటార్ హ్యాండ్‌బుక్’లో కొంత చరిత్ర ఉంది. ఫిన్లాండ్లో 2018లో జరిగిన 16వ ప్రపంచషిప్ పోటీల్లో జార్జియా లంచ్ అనే అమెరికా ఏర్ గిటారిస్ట్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈసారి ఆమెతో సహా పోటీదారులందరిని ఓడించిన వారే విజేత. జార్జియా లంచ్ లావు దక్కడం కోసం గాలి గిటార్‌ను ప్రాక్టీస్ చేసిందట. అయినా ఆమె లావు తగ్గలేదు. ఆమె పేరులోనే లంచ్ ఉంది మరి. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న వారు ప్రపంచ శాంతికి సందేశం ఇస్తూ తిరగాలట! -
సింధును చేరని స్వర్ణం
వేదిక మారింది. ప్రత్యర్థి మారింది. పతకం రంగు మాత్రం మారలేదు. తుది ఫలితంలోనూ తేడా రాలేదు. విశ్వ విజేతగా అవతరించ డానికి అవసరమైన విజయాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు అందుకోలేకపోయింది. ఏడాది కాలంగా వేధిస్తోన్న ‘ఫైనల్ ఫోబియా’ను ఆమె ఈసారీ అధిగమించలేకపోయింది. ఫలితంగా వరుసగా రెండో ఏడాదీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సంతృప్తి పడింది. మరోవైపు అత్యున్నతస్థాయి టోర్నమెంట్లలో ఎలా నెగ్గాలో.. ఎలా ఆడాలో చూపిస్తూ స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ మరోసారి విజయగర్జన చేసింది. ముచ్చటగా మూడోసారి స్వర్ణం సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించింది. నాన్జింగ్ (చైనా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ‘స్వర్ణ స్వప్నం’ సాకారం కాలేదు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాలని ఆశించిన ఈ తెలుగు తేజం ఆశలను స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ వమ్ము చేసింది. ఆదివారం జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో ర్యాంకర్ సింధు 19–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్ మారిన్ చేతిలో ఓటమి పాలైంది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో ఆద్యంతం దూకుడుగా ఆడిన మారిన్దే పైచేయిగా నిలిచింది. ఈ మెగా ఈవెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో మూడు స్వర్ణాలు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా మారిన్ కొత్త చరిత్ర సృష్టించింది. 2014 ఫైనల్లో లీ జురుయ్ (చైనా)పై, 2105 ఫైనల్లో సైనా నెహ్వాల్ (భారత్)పై గెలిచి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మారిన్ 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో సింధునే ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. తాజా విజయంతో మారిన్ ఖాతాలో 13 వేల ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధు ఖాతాలో 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలకు పతకాలు మినహా ఎలాంటి ప్రైజ్‌మనీ దక్కదు. ఆధిక్యం... తడబాటు... తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరిన సింధు తుది పోరులోనూ ఆ జోరు కొనసాగిస్తుందని అనిపించింది. తొలి గేమ్‌లో 1–3తో వెనుకబడిన దశలో ఆమె వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సింధు 15–11తో ముందంజ వేసింది. అయితే ఈ టోర్నీలో అందరికంటే ఎక్కువ దూకుడుగా ఆడుతున్న మారిన్ వెనుకంజలో ఉన్నా ఆందోళన చెందలేదు. గతంలో సింధును ఆరుసార్లు ఓడించిన అనుభవమున్న ఈ స్పెయిన్ స్టార్ ర్యాలీలు ఆడుతూనే, స్మాష్‌లతో వాటిని ముగిస్తూ లయలోకి వచ్చింది. వరుసగా ఐదు పాయింట్లు గెలిచిన మారిన్ 16–15తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం కీలకదశలో పాయింట్లు గెలిచి 25 నిమిషాల్లో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. అదే ఉత్సాహంతో మారిన్ రెండో గేమ్‌లో చెలరేగిపోయింది. గెలవాల్సిన గేమ్‌ను కోల్పోయిన సింధు డీలా పడిపోయింది. మారిన్ దూకుడైన ఆటతీరుకు ఎలా సమాధానమివ్వాలో తెలియక ఒత్తిడికి లోనై అనవసర తప్పిదాలు చేస్తూ 2–11తో వెనుకబడిపోయింది. యామగుచితో జరిగిన సెమీఫైనల్ రెండో గేమ్‌లో 12–19తోవెనుకంజలో ఉండి వరుసగా 8 పాయింట్లు సాధించి 20–19తో ఆధిక్యంలోకి వచ్చిన సింధు ఫైనల్లో మాత్రం అలాంటి అద్భుతమైన పునరాగమనం చేయలేకపోయింది. స్కోరు 20–10 వద్ద మారిన్ సర్వీస్‌లో సింధు రిటర్న్ షాట్ బయటకు వెళ్లడంతో స్పెయిన్ స్టార్ విజయ సంబరాలు చేసుకుంది. ఎదురులేని మొమోటా పురుషుల సింగిల్స్ విభాగంలో కెంటో మొమోటా రూపంలో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించాడు. ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ మొమోటా 21–11, 21–13తో మూడో ర్యాంకర్ షి యుకి (చైనా)పై గెలుపొందాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో జపాన్ ప్లేయర్ టైటిల్ సాధించడం ఇదే ప్రథమం. టైటిల్ గెలిచిన క్రమంలో మొమోటా కేవలం ఒక గేమ్ మాత్రమే కోల్పోవడం విశేషం. సింధుకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపి, రజత పతకం సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ►6 గత ఏడాది కాలంలో పీవీ సింధు తాను చేరుకున్న ఆరు ఫైనల్స్‌లో ఓడిపోయింది. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ (మారిన్ చేతిలో), థాయ్‌లాండ్ ఓపెన్ (ఒకుహారా చేతిలో), కామన్వెల్త్ గేమ్స్ (సైనా నెహ్వాల్ చేతిలో), ఇండియా ఓపెన్ (బీవెన్ జాంగ్ చేతిలో)... గత సంవత్సరం వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో (అకానె యామగుచి చేతిలో), హాంకాంగ్ ఓపెన్ (తై జు యింగ్ చేతిలో)లలో సింధు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మరోసారి ఓడిపోవడం తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. గత ఏడాది కూడా ఇదే తరహాలో జరిగింది. తాజా ఫలితంతో చాలా బాధ పడుతున్నాను. తర్వాతి టోర్నమెంట్‌కు సన్నద్ధం కావాలంటే మళ్లీ మానసికంగా దృఢంగా మారి ప్రాక్టీస్ చేయాలి. ఒక్కో రోజు మనకు కలిసి రాదు. కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమే కాబట్టి బలంగా నిలబడాలి. మెరుగైన ఫలితాన్ని ఆశించాను అందుకే ఈ ఫలితం మరింత నిరాశ కలిగించింది. అయితే ఫైనల్ వరకు రావడంపై సంతోషంగా ఉన్నా. గెలుపోటములు జీవితంలో భాగమని భావించి దీనిని స్వీకరించాలి. మారిన్ ఆటలో వేగం ఉండటమే కాకుండా ఆమె చాలా దూకుడుగా ఆడింది. టోర్నమెంట్ మొత్తం ఆమె ఇదే తరహాలో చెలరేగింది. నిజానికి ఆ వేగాన్ని నిరోధించే లక్ష్యంతోనే నేనూ సాధన చేశాను. కానీ ఆమె ఇంకా మెరుగ్గా ఆడింది. తొలి గేమ్ గెలిచి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో? రెండో గేమ్‌లో చాలా తప్పిదాలు చేశాను. నేను కొట్టిన స్మాష్లన్నీ బయటకు వెళ్లాయి. ఇది నా రోజు కాదని మాత్రమే చెప్పగలను. తొలి గేమ్‌లో ఒక దశలో 14–9తో ఆధిక్యంలో ఉండి కూడా సులువుగా పాయింట్లు ఇచ్చేశాను. నేనూ వేగంగా ఆడే ప్రయత్నంలో పొరపాట్లు జరిగిపోయాయి. 17–17 వద్ద ఆమె అటాకింగ్ చేస్తున్నప్పుడు నేను మరింత ఓపిగ్గా ఆడాల్సింది. - పీవీ సింధు రియో ఒలింపిక్స్ తర్వాత ఫామ్ కోల్పోయాను. సుదీర్ఘ కాలంగా విజయం కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నా ఆనందాన్ని ఎలా వ్యక్తిపరచాలో కూడా అర్థం కావడం లేదు. ఎన్నో రకాల భావోద్వేగాలతో నా శరీరం నిండిపోయింది. గత వారం రోజులగా నాపై నేను ఉంచిన నమ్మకం, ఆత్మవిశ్వాసం నిజమైనందుకు సంతోషంగా ఉంది. – కరోలినా మారిన్ -
'రియోకు వెళ్లకుండా ఉండాల్సింది'
గ్లాస్కో: గతేడాది రియో ఒలింపిక్స్ కు వెళ్లి పెద్ద పొరపాటు చేశానని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తాజాగా స్పష్టం చేశారు. ఆ మెగా ఈవెంట్ కు వెళ్లకుండా ఉండే బాగుండేదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్లాస్కోలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ లో సెమీస్ కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్న నేపథ్యంలో సైనా మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా దాదాపు ఏడాది పాటు ఎదురైన పరాజయాల్ని గుర్తు చేసుకున్నారు. ' నేను రియోకు వెళ్లకుండా ఉండాల్సింది. నాకు గాయం అంత పెద్దదనే విషయం నాకు అప్పుడు తెలియదు. రియో ఒలింపిక్స్ లో ఆదిలోనే నిష్క్రమించడం చాలా బాధించింది. నా తల్లిదండ్రులు, కోచ్ సాయంతో తిరిగి పుంజుకున్నా. ఇంకా కుడి మోకాలు ఇబ్బందిగానే ఉంది'అని సైనా తెలిపింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో సెమీస్ కు చేరడం సంతోషం కల్గించిందని సైనా పేర్కొంది. ఈ చాంపియన్ షిప్ లో తనకు కష్టమైన డ్రా ఎదురుకావడంతో పతకం సాధిస్తానని అనుకోలేదన్న సైనా.. సెమీస్ కు చేరడం ఒక గొప్ప అనుభూతిని తీసుకొచ్చిందని తెలిపింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-19, 18-21, 21-15 తేడాతో స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్‌మార్‌పై గెలుపొంది సెమీస్ బెర్తును పతకాన్ని ఖాయం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో సైనా తన అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించింది. ఈరోజు జరిగే సెమీ ఫైనల్లో సైనా, సింధు విజయం సాధిస్తే.. ఆదివారం జరిగే ఫైనల్లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది. -
సెమీస్ లో దేవేంద్రో...
కామన్ వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్, ఇండియన్ బాక్సర్ దేవేంద్రో సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ కి అర్హత సాధించాడు. ఇక్కడ జరుగుతున్న ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 49 కేజీల విభాగంలో సెమీస్ లో ప్రవేశపెట్టాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇండోనేషియాకు చెందిన కార్నెలిస్ క్వాంగు ను 3-0 తేడాతో ఓడించాడు. సెమీస్ లో టాప్ సీడ్ ఉబ్జెకిస్తాన్ కు చెందిన దుస్మతోవ్ తో తలపడనున్నాడు. ఈ విజయం గురించి బాక్సింగ్ కోచ్ గురుబక్ష్ సింగ్ సంధూ మాట్లాడుతూ.. క్వార్టర్స్ లో దేవేంద్రో అద్బుతంగా ఆడాడని కితాబిచ్చాడు. ఇక సెమీస్ ప్రత్యర్ధి మెరుగైన ఆటగాడేనని ఒప్పుకున్న ఆయన.. తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థినైనా మట్టికరిపించగలడని తెలిపాడు. ఇదిలా ఉంటే అక్టోబర్ లో జరిగే ప్రపంచ ఛాపింయన్ షిప్ రియో ఒలింపిక్స్ కి క్వాలిఫైయింగ్ ఈవెంట్. -
వారెవ్వా... వాలెరి
మాస్కో (రష్యా): నాలుగు కేజీల బరువు ఉన్న ఆ ఇనుప గుండును రబ్బరు బంతి అనుకుందో ఏమోగానీ... న్యూజిలాండ్ విఖ్యాత షాట్‌పుట్ క్రీడాకారిణి వాలెరి ఆడమ్స్ మరోసారి తన అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది. వరుసగా నాలుగోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ క్రమంలో 30 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఒకే క్రీడాంశంలో వరుసగా నాలుగు స్వర్ణాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల షాట్‌పుట్ ఫైనల్లో వాలెరి ఆడమ్స్ ఇనుప గుండును 20.88 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచింది. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 120 కేజీల బరువున్న వాలెరికిది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగో పసిడి పతకం కావడం విశేషం. 2007 (ఒసాకా), 2009 (బెర్లిన్), 2011 (డేగూ) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో... 2008 (బీజింగ్), 2012 (లండన్) ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన ఈ న్యూజిలాండ్ క్రీడాకారిణి అదే ఫలితాన్ని మాస్కోలోనూ పునరావృతం చేసింది. -
అజయ్ సంచలనం
సింగిల్స్‌లో సంతోషం... డబుల్స్‌లో నిరాశ... క్లుప్తంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇదీ తొలిరోజు భారత ప్రదర్శన. ప్రపంచ 13వ ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్‌ను దాటేందుకు తీవ్రంగానే శ్రమించాడు. మరోవైపు భారత్‌కే చెందిన ప్రపంచ 24వ ర్యాంకర్ అజయ్ జయరామ్ పట్టుదలగా పోరాడి ప్రపంచ 12వ ర్యాంకర్ వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్)ను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. మహిళల డబుల్స్‌లో తెలుగు అమ్మాయి సిక్కి రెడ్డి-అపర్ణ బాలన్; అశ్విని పొన్నప్ప-ప్రద్న్యా గాద్రె .. మిక్స్డ్ డబుల్స్‌లో తెలుగు కుర్రాడు కోనా తరుణ్-అశ్విని పొన్నప్ప; అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ జోడిలు తొలి రౌండ్లోనే ఓడిపోయాయి. మంగళవారం పురుషుల డబుల్స్‌లో తొలి రౌండ్ మ్యాచ్ ఆడాల్సిన తరుణ్-అరుణ్ విష్ణు జంటకు ‘వాకోవర్’ లభించగా... గాయం కారణంగా ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ జోడి వైదొలిగింది. వింగ్ కీ వోంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజయ్ 22-20, 17-21, 21-15తో విజయం సాధించాడు. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో అజయ్ 20-16తో ఆధిక్యంలో ఉన్నా వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయాడు. దాంతో స్కోరు 20-20తో సమమైంది. ఈ దశలో అజయ్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో అజయ్ 13-8తో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వెనుకబడిపోయాడు. వరుస పొరపాట్లతో రెండో గేమ్‌ను చేజార్చుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో అజయ్ తేరుకొని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా స్థిరమైన ఆటతీరును ప్రదర్శించి ఆరు పాయింట్ల తేడాతో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ప్రపంచ 98వ ర్యాంకర్ రౌల్ మస్త్ (ఎస్తోనియా)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 19-21, 21-14, 21-9తో గెలిచాడు. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్‌కు తొలి రెండు గేముల్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి గేమ్‌ను కోల్పోయిన ఈ హైదరాబాదీ రెండో గేమ్‌లో తేరుకున్నాడు. మూడో గేమ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 8-9తో వెనుకబడి ఉన్న దశలో కశ్యప్ చెలరేగిపోయాడు. నమ్మశక్యం కాని రీతిలో వరుసగా 13 పాయింట్లు నెగ్గి 21-9తో గేమ్‌ను కైవసం చేసుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. బుధవారం జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పీటర్ కౌకల్ (చెక్ రిపబ్లిక్)తో కశ్యప్; పాబ్లో ఎబియన్ (స్పెయిన్)తో అజయ్ జయరామ్ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తరుణ్-అశ్విని పొన్నప్ప 18-21, 21-12, 19-21తో హషిమోటో-మియూకి మయెదా (జపాన్) చేతిలో; అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ 15-21, 17-21తో మిన్ చున్ లియో-హువాన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-అపర్ణ బాలన్ 15-21, 17-21తో లారెన్ స్మిత్-గాబ్రియెలా వైట్ (ఇంగ్లండ్) చేతిలో; అశ్విని పొన్నప్ప-ప్రద్న్యా గాద్రె 23-21, 18-21, 17-21తో లైన్ క్రుస్-మేరీ రోప్కె (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యారు.