సెమీస్ లో దేవేంద్రో... | Devendro Singh enters Asian Boxing Championships semis, qualifies for World Championships | Sakshi
Sakshi News home page

సెమీస్ లో దేవేంద్రో...

Published Tue, Sep 1 2015 7:16 PM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

Devendro Singh enters Asian Boxing Championships semis, qualifies for World Championships

కామన్ వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్, ఇండియన్ బాక్సర్ దేవేంద్రో సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ కి అర్హత సాధించాడు. ఇక్కడ జరుగుతున్న ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 49 కేజీల విభాగంలో  సెమీస్ లో ప్రవేశపెట్టాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇండోనేషియాకు చెందిన కార్నెలిస్ క్వాంగు ను 3-0 తేడాతో ఓడించాడు. సెమీస్ లో టాప్ సీడ్ ఉబ్జెకిస్తాన్ కు చెందిన దుస్మతోవ్ తో తలపడనున్నాడు.

ఈ విజయం గురించి బాక్సింగ్ కోచ్ గురుబక్ష్ సింగ్ సంధూ మాట్లాడుతూ.. క్వార్టర్స్ లో దేవేంద్రో అద్బుతంగా ఆడాడని కితాబిచ్చాడు. ఇక సెమీస్ ప్రత్యర్ధి మెరుగైన ఆటగాడేనని ఒప్పుకున్న ఆయన.. తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థినైనా మట్టికరిపించగలడని తెలిపాడు. ఇదిలా ఉంటే అక్టోబర్ లో జరిగే ప్రపంచ ఛాపింయన్ షిప్ రియో ఒలింపిక్స్ కి క్వాలిఫైయింగ్ ఈవెంట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement