devendro singh
-
Boxing Championship: కోచ్‌లుగా దేవేంద్రో సింగ్, సురంజయ్ సింగ్
Boxing Championship: భారత మాజీ బాక్సర్లు దేవేంద్రో సింగ్, సురంజయ్ సింగ్ కోచ్‌లుగా మారారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బాక్సర్లకు నిర్వహించే శిక్షణ శిబిరం కోసం ఎంపిక చేసిన 14 మంది కోచ్‌లలో దేవేంద్రో, సురంజయ్లకు స్థానం లభించింది. 35 ఏళ్ల సురంజయ్ 2009 ఆసియా చాంపియన్షిష్, 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు నెగ్గాడు. 29 ఏళ్ల దేవేంద్రో 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచాడు. టీమిండియా కోచ్ రేసులో టామ్ మూడీ! భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించేందుకు ఆ్రస్టేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ ఆసక్తి కనబరుస్తున్నాడు. . ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు డైరెక్టర్‌గా మూడీ ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీ కాలం వచ్చే నెలలో ముగిసే టి20 ప్రపంచకప్ అనంతరం ముగుస్తుంది. దాంతో కోచ్ పదవి కోసం మూడీ దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం. చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా ముగిసిన కథ -
శివ థాపాకు రజతం
కియానన్ (చైనా): రియో ఒలింపిక్స్‌కు బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత యువ బాక్సర్ శివ థాపా ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌ను రజతంతో ముగించాడు. శుక్రవారం జరిగిన పురుషుల 56 కేజీల విభాగం ఫైనల్లో శివ థాపా 0-3తో (27-30, 27-30, 27-30) చాట్‌చాయ్ బుట్డీ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు పురుషుల 49 కేజీల విభాగంలో దేవేంద్రో సింగ్ ‘బాక్స్ ఆఫ్’ బౌట్లో ఓటమి చవిచూశాడు. దేవేంద్రో 0-3తో (28-29, 27-30, 27-30) గాన్ ఎర్డెన్ గాన్ఖుయాగ్ (మంగోలియా) చేతిలో పరాజయం పాల య్యాడు. దాంతో ఈ టోర్నీ ద్వారా దేవేంద్రో రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయాడు. ఇప్పటివరకు భారత్ నుంచి శివ థాపా ఒక్కడే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఒలింపిక్స్‌కు అర్హత పొందేందుకు భారత పురుషుల బాక్సర్లకు మరో రెండు అవకాశాలు ఉన్నాయి. మహిళా బాక్సర్లకు మాత్రం ఏకైక అవకాశం ఉంది. మే 19 నుంచి 27 వరకు కజకిస్తాన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు కేటగిరిల్లో సెమీఫైనల్‌కు చేరిన నలుగురు బాక్సర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. -
క్వార్టర్స్‌లో శివ థాపా, దేవేంద్రో
కియానన్ (చైనా): ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు శివ థాపా (56 కేజీలు), దేవేంద్రో సింగ్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన బౌట్లలో శివ థాపా 3-0తో మైయోంగ్‌క్వాన్ లీ (కొరియా)పై గెలుపొందగా... దేవేంద్రో 3-0తో మొహమ్మద్ ఫువాద్ (మలేసియా)ను ఓడించాడు. అయితే భారత్‌కే చెందిన గౌరవ్ బిధురి (52 కేజీలు), మన్దీప్ జాంగ్రా (69 కేజీలు) మాత్రం ఓడిపోయారు. -
సెమీస్‌లో దేవేంద్రో, శివ, వికాస్
బ్యాంకాక్ : ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత బాక్సర్లు దేవేంద్రో సింగ్ (49 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. దీంతో కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకోవడంతోపాటు వచ్చే నెలలో దోహాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కూ అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో దేవేంద్రో 3-0తో కార్నెలిస్ లాంగూ (ఇండోనేసియా)పై, శివ థాపా 2-1తో మాలాబెకోవ్ (కిర్గిజిస్తాన్)పై, వికాస్ 3-0తో దిన్ హోంగ్ త్రువోంగ్ (వియత్నాం)పై గెలిచారు. అయితే కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ మనోజ్ కుమార్ (64 కేజీలు), మన్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు) మాత్రం క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. మనోజ్ 0-3తో ఫజ్లిద్దిన్ గైబనజరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో; మన్‌ప్రీత్ 0-3తో తులగనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
సెమీస్ లో దేవేంద్రో...
కామన్ వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్, ఇండియన్ బాక్సర్ దేవేంద్రో సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ కి అర్హత సాధించాడు. ఇక్కడ జరుగుతున్న ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 49 కేజీల విభాగంలో సెమీస్ లో ప్రవేశపెట్టాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇండోనేషియాకు చెందిన కార్నెలిస్ క్వాంగు ను 3-0 తేడాతో ఓడించాడు. సెమీస్ లో టాప్ సీడ్ ఉబ్జెకిస్తాన్ కు చెందిన దుస్మతోవ్ తో తలపడనున్నాడు. ఈ విజయం గురించి బాక్సింగ్ కోచ్ గురుబక్ష్ సింగ్ సంధూ మాట్లాడుతూ.. క్వార్టర్స్ లో దేవేంద్రో అద్బుతంగా ఆడాడని కితాబిచ్చాడు. ఇక సెమీస్ ప్రత్యర్ధి మెరుగైన ఆటగాడేనని ఒప్పుకున్న ఆయన.. తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థినైనా మట్టికరిపించగలడని తెలిపాడు. ఇదిలా ఉంటే అక్టోబర్ లో జరిగే ప్రపంచ ఛాపింయన్ షిప్ రియో ఒలింపిక్స్ కి క్వాలిఫైయింగ్ ఈవెంట్. -
క్వార్టర్స్‌లో శివ, దేవేంద్రో
బ్యాంకాక్ : డిఫెండింగ్ చాంపియన్ శివ థాపా, గతేడాది రజత పతక విజేత దేవేంద్రో సింగ్‌లు... ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. ఆదివారం జరిగిన 56 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో శివ 3-0తో మహ్మద్ అల్‌వాది (జోర్డాన్)పై నెగ్గగా, దేవేంద్రో 3-0తో హీ జున్జున్ (చైనా)ను చిత్తు చేశాడు. 75 కేజీల విభాగంలో వికాస్ కృషన్ 3-0తో అచిలోవ్ (తుర్క్మెనిస్తాన్)పై గెలిచాడు. అయితే 69 కేజీల బౌట్లో మన్దీప్ జాంగ్రా 1-2తో యుషిరో సుజుకీ (జపాన్) చేతిలో ఓడాడు. జున్జున్తో జరిగిన బౌట్లో తొలి సెకను నుంచే దేవేంద్రో పంచ్ పవర్ చూపించాడు. తొలి రౌండ్లో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన ఈ భారత బాక్సర్... మిగతా రౌండ్లలో ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. లెఫ్ట్ అప్పర్ కట్స్‌తో పాటు రెగ్యులర్ పంచ్‌లతో హడలెత్తించాడు. -
బాక్సింగ్‌లో భారత్‌కు రెండు రజతాలు
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు స్వర్ణ పతకాలు సాధించడంలో మరోసారి నిరాశపరిచారు. శనివారం జరిగిన ఫైనల్స్‌లో మణిపూర్ బాక్సర్లు సరితా దేవి, దేవేంద్రో సింగ్ ఓటమి చవిచూసి రజత పతకాలక పరిమితమయ్యారు. మహిళల 57-60 కిలోల విభాగంలో సరితా దేవి 1-3 తో ఆస్ట్రేలియా బాక్సర్ షెల్లీ వాట్స్ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల విభాగంలో దేవేంద్రో 1-2తో ఉత్తర ఐర్లాండ్ బాక్సర్ పాడీ బార్నెస్ చేతిలో ఓడాడు. దీంతో వీరిద్దరూ రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఇదే రోజు భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ఫైనల్ బౌట్ జరగనుంది. -
దేవేంద్రో పసిడి పంచ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత బాక్సర్లు మరోసారి సత్తా చాటుకున్నారు. హంగేరిలో జరిగిన బోస్కాయ్ ఇన్విటేషన్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు మొత్తం నాలుగు పతకాలు నెగ్గారు. ఒలింపియన్ దేవేంద్రో సింగ్ 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో ఈ మణిపూర్ బాక్సర్ 3-0తో సోమర్ట్ ఎర్సాన్ (కజకిస్థాన్)పై విజయం సాధించాడు. 64 కేజీల విభాగం ఫైనల్లో మనోజ్ కుమార్ 0-3తో సింబర్జనోవ్ (కజకిస్థాన్) చేతిలో ఓడిపోయి రజతంతో సంతృప్తి పడ్డాడు.