
Boxing Championship: భారత మాజీ బాక్సర్లు దేవేంద్రో సింగ్, సురంజయ్ సింగ్ కోచ్‌లుగా మారారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బాక్సర్లకు నిర్వహించే శిక్షణ శిబిరం కోసం ఎంపిక చేసిన 14 మంది కోచ్‌లలో దేవేంద్రో, సురంజయ్‌లకు స్థానం లభించింది. 35 ఏళ్ల సురంజయ్ 2009 ఆసియా చాంపియన్‌షిష్, 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు నెగ్గాడు. 29 ఏళ్ల దేవేంద్రో 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచాడు.
టీమిండియా కోచ్ రేసులో టామ్ మూడీ!
భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించేందుకు ఆ్రస్టేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ ఆసక్తి కనబరుస్తున్నాడు. . ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు డైరెక్టర్‌గా మూడీ ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీ కాలం వచ్చే నెలలో ముగిసే టి20 ప్రపంచకప్ అనంతరం ముగుస్తుంది. దాంతో కోచ్ పదవి కోసం మూడీ దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం.