బ్యాంకాక్ : డిఫెండింగ్ చాంపియన్ శివ థాపా, గతేడాది రజత పతక విజేత దేవేంద్రో సింగ్‌లు... ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. ఆదివారం జరిగిన 56 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్‌లో శివ 3-0తో మహ్మద్ అల్వాది (జోర్డాన్)పై నెగ్గగా, దేవేంద్రో 3-0తో హీ జున్‌జున్ (చైనా)ను చిత్తు చేశాడు. 75 కేజీల విభాగంలో వికాస్ కృషన్ 3-0తో అచిలోవ్ (తుర్క్‌మెనిస్తాన్)పై గెలిచాడు. అయితే 69 కేజీల బౌట్‌లో మన్‌దీప్ జాంగ్రా 1-2తో యుషిరో సుజుకీ (జపాన్) చేతిలో ఓడాడు.
జున్‌జున్‌తో జరిగిన బౌట్‌లో తొలి సెకను నుంచే దేవేంద్రో పంచ్ పవర్ చూపించాడు. తొలి రౌండ్‌లో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన ఈ భారత బాక్సర్... మిగతా రౌండ్లలో ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. లెఫ్ట్ అప్పర్ కట్స్‌తో పాటు రెగ్యులర్ పంచ్‌లతో హడలెత్తించాడు.
క్వార్టర్స్‌లో శివ, దేవేంద్రో
Published Sun, Aug 30 2015 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement
Advertisement