అమిత్ పంఘాల్, శివ థాపా
దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ అమిత్ పంఘాల్ (52 కేజీలు), మాజీ విజేత శివ థాపా (64 కేజీలు) ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో అమిత్ 5–0తో బిబోసినోవ్ (కజకిస్తాన్)పై... శివ 4–0తో బఖోదుర్ ఉస్మనోవ్ (తజికిస్తాన్)పై ఘనవిజయం సాధించారు. అమిత్ 2019లో స్వర్ణం నెగ్గగా... శివ థాపా 2013లో పసిడి పతకం సాధించి, ఆ తర్వాత 2017లో రజతం... 2015, 2019లో కాంస్యాలు గెలిచాడు.
మరోవైపు భారత్‌కే చెందిన వరీందర్ (60 కేజీలు), వికాస్ కృషన్ (69 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. వరీందర్ 2–3తో షాబ„Š (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. బతురోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన బౌట్‌లో వికాస్ కంటి గాయం తిరగబెట్టడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి బతురోవ్‌ను విజేతగా ప్రకటించారు.
మహిళల విభాగంలో సాక్షి (54 కేజీలు)–దీనా (కజకిస్తాన్) సెమీఫైనల్ బౌట్ ఫలితాన్ని మార్చారు. గురువారం రాత్రి జరిగిన బౌట్‌లో సాక్షి 3–2తో దీనాను ఓడించింది. అయితే ఈ ఫలితంపై కజకిస్తాన్ బాక్సర్ సమీక్ష కోరగా... రీప్లేలు పరిశీలించిన జ్యూరీ కజకిస్తాన్ బాక్సర్ గెలిచినట్లు ప్రకటించింది. దాంతో సాక్షికి కాంస్యం ఖాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment