
Courtesy: BFI
దుబాయ్: భారత బాక్సర్ శివ థాపా వరుసగా ఐదోసారి ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పతకం సాధించాడు. దుబాయ్‌లో జరుగుతున్న ఈ టోర్నీ లో శివ థాపా 64 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అస్సాంకు చెందిన శివ 5–0తో నాదిర్ (కువైట్)పై గెలిచాడు.
కాగా ఆసియా చాంపియన్‌షిప్ పోటీల్లో శివ థాపా 2013లో స్వర్ణం, 2015లో కాంస్యం, 2017లో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. మరోవైపు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో 1–4తో ప్రస్తుత ప్రపంచ, ఆసియా చాంపియన్ మిరాజిజ్‌బెక్ మిర్జాహలిలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు.