హిస్సార్: జాతీయ సీనియర్ బాక్సింగ్ (ఎలైట్) చాంపియన్‌షిప్‌లో స్టార్ ఆటగాడు శివ థాపా ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అస్సాంకు ప్రాతినిధ్యం వహిస్తున్న థాపా (63.5 కేజీల విభాగం) సెమీ ఫైనల్లో 5–0తో మనీశ్ కౌశిక్ (సర్వీసెస్)ను చిత్తు చేశాడు. ఫైనల్లో అంకిత్ నర్వాల్ (రైల్వేస్)తో థాపా తలపడతాడు.
తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ కూడా 57 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరాడు. సర్వీసెస్ తరఫున బరిలోకి దిగిన హుసాముద్దీన్ సెమీస్‌లో 5–0తో ఆశిష్ కుమార్ (హిమాచల్ ప్రదేశ్)పై ఘన విజయం సాధించాడు. ఇతర కేటగిరీల్లో సంజీత్, నరేందర్, సాగర్ కూడా తుది పోరుకు అర్హత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment