
జాతీయ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ బంగారు పతకం సాధించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అతను సర్వీసెస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు ప్రాతినిధ్యం వహించాడు. 57 కేజీల ఫైనల్లో హుసాముద్దీన్ 4–1తో సచిన్ (రైల్వేస్)ను ఓడించాడు. హిస్సార్‌లో శుక్రవారం ముగిసిన ఈ పోటీల్లో సర్వీసెస్ జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంది.
ఈ జట్టుకు చెందిన బాక్సర్లు మొత్తం 10 పతకాలు సాధించారు. ఇందులో ఆరు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలున్నాయి. భారత మేటి బాక్సర్ శివ థాపా (అస్సామ్) స్వర్ణం సాధించాడు. 63.5 కేజీల ఫైనల్లో అతను అంకిత్ నర్వాల్ (రైల్వేస్)పై గెలుపొందాడు. సర్వీసెస్ బాక్సర్లలో విశ్వామిత్ర చాంగ్తామ్ (51 కేజీలు), సచిన్ (51 కేజీలు), ఆకాశ్ (67 కేజీలు), సుమిత్ (75 కేజీలు), వాకోవర్‌తో నరేందర్ (ప్లస్ 92 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment